• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

  2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more

  ఆకట్టుకుంటున్న ‘అన్‌స్టాపబుల్’ టీజర్

  నటుడు సప్తగిరి, బిగ్‌బాస్ విజేత సన్నీ కలిసి నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. ఈ చిత్ర టీజర్‌ని హీరో నాగార్జున విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ సినిమా విజయం సాధించాలని అభిలషించారు. ‘అన్‌లిమిటెడ్ ఫన్’ ఉపశీర్శికతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యకలపాలను జరుపుకుంటోంది. ఇక టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఓటీటీ వేదికల నుంచి ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది. షకలక శంకర్, బిత్తిరి సత్తి, రఘు బాబు.. తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

  నాగార్జున, మాటీవీ ఎండీకి హైకోర్టు నోటీసులు

  “బిగ్‌బాస్‌ షో” కార్యక్రమంలో అశ్లీలత ఎక్కువైందంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ధర్మాసనం స్పందించింది. ఇలాంటి ముఖ్యమైన విషయాలపై స్పందించాల్సిన అవసరముందని హైకోర్టు అభిప్రాయపడింది. బిగ్‌బాస్‌ షో హోస్ట్‌,సినీనటుడు అక్కినేని నాగార్జున, స్టార్‌ మా ఎండీతో సహా సబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. బిగ్‌బాస్‌ను సెన్సార్‌ చేయకుండానే ప్రసారం చేస్తున్నారని పిటిషనర్‌ ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఇలాంటి షోలను రాత్రి 11 తర్వాత మాత్రమే ప్రసారం చేయాలని వివరించారు.

  బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ‘ది ఘోస్ట్’ ?

  అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘ది ఘోస్ట్’. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రెండో రోజు కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ.2 కోట్లే షేర్ సాధించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నెగిటివ్ టాక్ రావడంతో వీకెండ్‌లో కూడా మూవీ పుంజుకునే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు.

  THE GHOST REVIEW: మాస్ యాక్షన్‌తో నాగార్జున దుమ్మురేపాడు

  టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున  విలక్షణమైన పాత్రల్లో నటించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈసారి సరికొత్త యాక్షన్ లుక్‌లో ది ఘోస్ట్ మూవీ ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం దసరా సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కింగ్ నాగార్జున ఈ మూవీలో ఎలా నటించారు? పవాన్ సత్తారు నాగార్జనతో చేసిన యాక్షన్ థ్రిల్లర్ ప్రయోగం ఫలించిందా? వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం కథేంటి..? విక్రమ్ (నాగార్జున) దుబాయ్‌లో ఇంటర్ పోల్ ఆఫీసర్, అతను తన ప్రియురాలు ప్రియ … Read more

  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ

  సినీ నటుడు నాగార్జున వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తానెలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ‘ది ఘోస్ట్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని నాగార్జున చెప్పారు. రాజకీయ నాయకుడిగా కనిపించే మంచి పాత్రలు వస్తే మాత్రం నటిస్తానన్నారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు ఈ తరహాలోనే ప్రచారం జరుగుతోందని కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదని నాగార్జున స్పష్టం … Read more

  దసరాకు చిరు Vs నాగ్

  చాన్నాళ్ల తర్వాత దసరా బరిలో రెండు పెద్ద సినిమాలు నిలిచాయి. గాడ్‌ఫాదర్ సినిమాతో చిరంజీవి, ఘోస్ట్ మూవీతో నాగ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో నాగ్ తన మూవీని పోస్ట్‌పోన్ చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అక్టోబరు 5న ఈ రెండు సినిమాలు వస్తుండటంతో ఇండస్ట్రీలో వాతావరణం వేడెక్కింది. సీనియర్ హీరోలు తలపడుతుండటంతో సినీప్రియుల్లో ఆసక్తి నెలకొంది. మరి మీరు ఏ సినిమాకు వెళ్దామని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

  బాలీవుడ్‌లోకి అఖిల్..?

  అక్కినేని అఖిల్‌ని బాలీవుడ్‌లో పరిచయం చేసేందుకు నాగార్జున ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముంబయిలో కరణ్ జోహార్‌ని నాగ్ కలిసినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. బ్రహ్మాస్త్ర 2లో భాగంగా ఆయన కలిశారని బయటకు చెప్పుకుంటున్నా.. అఖిల్ కోసమేనని అంతర్గతంగా గుసగుస లాడుకుంటున్నారు. గతంలో అఖిల్‌ని హిందీలో పరిచయం చేయడానికి కరణ్ ఆసక్తి చూపారు. అంతా అనుకున్నట్లు జరిగితే.. అఖిల్ ఎంట్రీకి దారులు తెరుచుకున్నట్లే. దీనిపై మీరేమంటారు?

  నాగ్‌తో నటన కష్టమే

  తన భర్త నాగార్జునతో కలసి నటించడం కుదరదని అక్కినేని అమల తెలిపింది. ఇటీవల విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో అమల హీరో మదర్ క్యారెక్టర్ చేసింది. ఆ పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ నటించడంతో అందరూ అమె నటనను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో అమల కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఇంట్లో ఎప్పుడూ ఆయనే కనిపిస్తారు. ఇక సినిమాలో కూడా ఆయనతోనే అంటే కష్టం’’ అంటూ నవ్వేసింది.

  చైతూ హ్యాపీ: నాగార్జున

  నాగచైతన్య-సమంత విడాకుల విషయంపై ఎట్టకేలకు నాగార్జున స్పందించారు. ఈ విషయంపై నాగ్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘నాగచైతన్య ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను ఆయనను గమనిస్తూనే ఉన్నా. ఈ విషయం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. చైతూ-సామ్ విడాకులు తీసుకోవడం దురద‌ృష్టకరమే. కానీ అదొక అనుభవంగా మిగిలిపోతుంది. ప్రజలు కూడా ఈ విషయం మరిచిపోతే మంచిది’ అని పేర్కొన్నాడు. కాగా నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ చిత్రంలో నటించారు. వచ్చే నెల 5న ఈ చిత్రం విడుదల కానుంది.