టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున విలక్షణమైన పాత్రల్లో నటించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈసారి సరికొత్త యాక్షన్ లుక్‌లో ది ఘోస్ట్ మూవీ ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం దసరా సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కింగ్ నాగార్జున ఈ మూవీలో ఎలా నటించారు? పవాన్ సత్తారు నాగార్జనతో చేసిన యాక్షన్ థ్రిల్లర్ ప్రయోగం ఫలించిందా? వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం
కథేంటి..?
విక్రమ్ (నాగార్జున) దుబాయ్‌లో ఇంటర్ పోల్ ఆఫీసర్, అతను తన ప్రియురాలు ప్రియ (సోనాల్ చౌహాన్)తో కలిసి పనిచేస్తుంటాడు. తన వృత్తి జీవితంలో అనుకోకుండా ఎదురైన ఓ సంఘటన విక్రమ్‌ని మానసికంగా కలవరపెడుతుంది. తన ప్రియురాలు ప్రియను విడిచిపెట్టేలా చేస్తుంది. ఒక రోజు అను (గుల్ పనాగ్)తన కుమార్తె అదితి, ఆమె జీవితం పట్ల తనకున్న భయాలను విక్రమ్‌కు తెలియజేస్తుంది. ఆ సమస్యను పరిష్కరించమని విక్రమ్‌ని వేడుకుంటుంది. ఇంతకు అను ఎవరు? విక్రమ్‌కు అనుకు మధ్య సంబంధం ఏమిటి? అను, అదితి ఎవరి వల్ల భయపడుతారు? వీరి సమస్యను నాగార్జున ఎలా పరిష్కరించారు అనేది కథ.
ఎవరెలా చేశారు..?
ఈ చిత్రంలో మరోసారి నాగార్జున తన యాక్టింగ్‌తో ఇరగదీశారు. ఒకవిధంగా మొత్తం సినిమాను తన భుజాలపైకి ఎత్తుకున్నారని చెప్పాలి. విక్రమ్‌గా నాగార్జున నటన సూపర్బ్. కొన్ని రిస్కీ సన్నివేశాలను నాగార్జున చాలా కంఫర్ట్‌గా చేశారు.హీరోయిన్ సోనాల్ చౌహాన్ కేవలం గ్లామర్ ఎలిమెంట్‌కే పరిమితం కాకుండా మంచి స్కోప్ ఉన్న పాత్రంలో మెప్పించింది. ఆమె సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ యాక్షన్ పార్ట్‌లో క్లియర్ గా కనిపిస్తాయి. అనికా సురేంద్రన్, గుల్ పనాగ్, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
బలాలు- బలహీనతలు
ది ఘోస్ట్ చిత్రంలో వచ్చిన యాక్షన్ సిక్వెన్సింగ్స్ ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సిక్వెన్స్‌గా చెప్పాలి. యాక్షన్ సీన్లు చాలా స్టైలీష్‌గా కనిపిస్తాయి. కొన్ని సీన్లు గూస్‌బంప్స్ మూమెంట్స్ కలిగి ఉంటాయి. ప్రేక్షకులను స్క్రీన్‌లకు అతుక్కుపోయేలా చేస్తాయి. ఈ సినిమా కథ యాక్షన్ పార్ట్‌తో అలరించినప్పటికీ…కథ అంత డెప్త్‌గా ఉండదు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కేవలం యాక్షన్ పార్ట్ మీదనే దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. ఎమోషనల్ సీన్లు కొన్ని చోట్ల కృత్రిమంగా అనిపిస్తాయి. సినిమాకు ప్రేక్షకులను కనెక్ట్ చేయవు. విలన్ క్యారెక్టరైజేషన్ బలహీనంగా ఉంది. నాగార్జునకు పెద్దగా ప్రతిఘటన లేకుండానే అన్ని పనులు పూర్తవుతుంటాయి. సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే స్లోగా ఉంది. ఎమోషనల్ సీన్లు బ్యాలెన్స్‌గా అనిపించవు.
సాంకేతికంగా..?
సాంకేతికంగా చిత్ర నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.యాక్షన్ సీన్లు స్క్రీన్‌పై చాలా రిచ్‌గా కనిపిస్తాయి. భరత్ – సౌరభ్‌లు అందించిన మ్యూజిగ్ బాగుంది. మార్క్ కె రాబిన్ అందించిన BGM అద్భుతంగా పండింది. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ అల్టిమేట్‌గా ఉంది. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్ స్టోరీని ప్రేక్షకులకు అందించడంలో కొంతవరకు విజయం సాధించాడు. యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినప్పటికీ… ఎమోషనల్ సీన్లు క్యారీ చేయడంలో కాస్త తడబడ్డాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!