• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చంద్రమోహన్‌ మరణం బాధాకరం: ఎన్టీఆర్

  సీనియర్ నటుడు చంద్రమోహన్‌ మృతిపై సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. తాజాగా హీరో ఎన్టీఆర్ టీట్ చేస్టూ.. ‘‘ఎన్నో దశాబ్దాలుగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్‌ గారి అకాల మరణం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని ఎన్టీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు.

  ‘వార్‌ 2’ సెట్లోకి ఎన్టీఆర్?

  హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్‌ 2’ చిత్రాన్ని అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా.. వచ్చే నెలాఖరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ జనవరి నుంచి డేట్లు కేటాయించారని టాక్. ‘దేవర’ తొలి భాగం చిత్రీకరణ డిసెంబరు చివరి నాటికి పూర్తి కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే తారక్‌ జనవరి నుంచి ‘వార్‌ 2’ సెట్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

  ‘దేవర’ నుంచి తాజా అప్‌డేట్

  ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా నుంచి తాజా అప్‌డేట్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో గోవాలో ప్రస్తుతం ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ ల పై ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ఫుల్ మాస్ బీట్స్ తో సాగుంతుందని సమాచారం. సినిమాలో ఈ మాస్ సాంగ్ చాలా థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుందట. Courtesy Instagram:JanhviKapoor

  ‘అందుకే ఎన్టీఆర్ స్పందించ లేదు’

  చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించక పోవడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై ఎన్టీఆర్ సన్నిహితుడు, నటుడు రాజీయ్ కనకాల స్పందించాడు. ఎన్టీఆర్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారని తెలిపారు. అందుకే ఏపీ రాజకీయాలపై స్పందించక పోయి ఉంటాడని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తున్నారని చెప్పారు. తన పూర్తి సమయాన్నిసినిమాకే కేటాయిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితిల్లో సినిమాపైనే దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ భావించి ఉంటారని అనుకుంటున్నానని రాజీవ్ చెప్పుకొచ్చాడు.

  ‘దేవర’ పార్ట్ 2 ప్రకటించిన దర్శకుడు

  ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రం నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ‘దేవర’ సినిమాలో బలమైన పాత్రలు చాలా ఉన్నాయి. ఏ ఒక్కరి సన్నివేశం, సంభాషణ తొలగించలేం ఒక్క పార్ట్‌తో ఇంత పెద్దకథను ముగించలేమన్న నిర్ణయానికి వచ్చాం. పాత్రలు వాటి భావోద్వేగాలు పూర్తిస్థాయిలో చూపించాలంటే ఒక్క పార్ట్‌తో కుదరదు. అందుకే అందరితో చర్చించి పార్ట్ -2 నిర్ణయం తీసుకున్నా’ అని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

  నాతో పాటు మీరు బాధపడ్డారు: ఎన్టీఆర్

  సైమా అవార్డ్స్ వేడుకల్లో ఎన్టీఆర్ ఉత్తమనటుడిగా ఎన్నికయ్యారు. స్టేజ్ పై అవార్డును అందుకున్న తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఉద్దేశించి మాట్లాడారు. ‘నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడళ్ళా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కనుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధ పడినందుకు, నేను నవ్వినప్పుడళ్ళ నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి పాదాభి వందనాలు’ అని ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రెంట్ చేస్తున్నారు. నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడెళ్ళా … Read more

  ఎన్టీఆర్‌ రూ. 100 స్మారక నాణేం విడుదల

  ఎన్టీఆర్‌ రూ. 100 స్మారక నాణేంను రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా విడుదల చేశారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని.. సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవల గుర్తింపుగా నాణేం విడుదల చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. రామాయణ ,మహాభారతం సినిమాల్లో ఎన్టీఆర్ నటించి మెప్పించారని కొనియాడారు. మనుషులంతా ఒక్కటే అనే సందేశాన్ని తమ సినిమాల్లో చూపించారని తెలిపారు. రాజకీయాలలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. NTR #NandamuriTarakaRamarao … Read more

  WAR 2: ఎన్టీఆర్ సరసన కియారా!

  యంగ్‌టైగన్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లు కలసి ‘వార్ 2’ మూవీలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది ఆరంభంలో కానీ స్టార్ట్ కానుంది. కాగా కియారా అద్వానీ ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్ సరసన ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తోంది.

  అభిమానుల కోసం ఎన్టీఆర్: విశ్వక్‌సేన్

  అభిమానుల కోసం ఎన్టీఆర్ ఏదైనా చేస్తారని నటుడు విశ్వక్‌సేన్ కొనియాడాడు. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌‌ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ‘ఓ రోజు తారక్ అన్న ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు. సొంత తమ్ముడిలాగా చూసుకున్నాడు. కారు దాకా వస్తుంటే చివరగా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావాలని అడిగా. తప్పకుండా అంటూ మాటిచ్చేశాడు. ఇచ్చిన మాట కోసం ఆస్కార్ నుంచి నేరుగా వచ్చేశాడు. నిద్ర లేకున్నా అభిమానుల కోసం రావడం గొప్ప విషయం’ అంటూ విశ్వక్‌సేన్ చెప్పుకొచ్చాడు. మార్చి … Read more

  సుమ ఓవరాక్షన్; ఎన్టీఆర్ ఆగ్రహం!

  యాంకర్ సుమపై జూ.ఎన్టీఆర్ [ఆగ్రహం](url) వ్యక్తం చేశారు. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌కు మైక్ ఇచ్చే ముందు అతడికి కోపం తెప్పించేలా సుమ ఇంట్రడక్షన్ ఇచ్చింది. ‘ఎన్టీఆర్30’ గురించి అప్డేట్ ఇస్తారని చెప్పింది. దీనికి ఎన్టీఆర్ కౌంటర్‌గా ‘‘వాళ్లు అడక్కపోయినా.. మీరే చెప్పేసేలా ఉన్నారే’’ అంటూ సీరీయస్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన స్టేజిపైన కోపంతోనే ఉన్నారు. ఫ్యాన్స్‌పై కూడా అసహనం వ్యక్తం చేశారు. ? pic.twitter.com/CkCJXLmQow — ???????? ????? … Read more