• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భారతీయుడు-2లో బ్రహ్మానందం

  భారతీయుడు-2లో కామెడీ లెజెండ్ బహ్మానందం నటించడం కన్ఫామ్ అయింది. ప్రస్తుతం కీడా కోలాలో ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్న బ్రహ్మానందం.. ఇండియన్ 2లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు చిత్రబృందం ప్రకటించింది. డైరెక్టర్ శంకర్ పెట్టిన లేటెస్ట్ ట్వీట్‌లో బ్రహ్మానందం పేరుని కూడా మెన్షన్ చేయడంతో ఎలాంటి రోల్‌లో కనిపించనున్నారో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

  నారాయణ మూర్తిని ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం

  ఆర్ నారాయణ మూర్తి ప్రజా దర్శకుడని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. పీపుల్‌ స్టార్ తెరకెక్కించిన యూనివర్సిటీ అనే చిత్రానికి సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో నారాయణ మూర్తిని పొగుడుతూనే ఆయన్ని ఇమిటేట్ చేశారు. “ ఆయన సినిమాలో నటిస్తానని చాలాసార్లు చెప్పాను. ఏదైనా పాత్ర ఉంటే రెండ్రోజులు చేసి వెళతాను అన్నాను. రెమ్యూనరేషన్ అడగలేదు. కానీ, అడిగిన ప్రతిసారి మీరు పెద్ద స్టార్, సూపర్ యాక్టర్ అంటాడు. అంతేకానీ అవకాశం ఇవ్వలేదు” అన్నారు.

  భావోద్వేగంగా ‘బ్రహ్మానందం’ గ్లింప్స్

  క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగమార్తండ’ సినిమా నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలైంది. ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే బ్రహ్మి.. ఈసారి తెరపై ఎమోషనల్‌గా కనిపించారు. భక్తి, బాధ, పశ్చాత్తాపం కలగలిపి భావోద్వేగపూరితమైన డైలాగ్‌తో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేశారు. రంగస్థల నటుల జీవితం ఆధారంగా మరాఠీలో తెరకెక్కిన ‘నటసామ్రాట్’ సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు.

  బ్రహ్మానందంకు పుట్టినరోజు శుభాకాంక్షలు

  హాస్యనట కిరీటీ బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. 1956లో ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. జంధ్యాల ‘ఆహా నా పెళ్లంట’ సినిమాతో ప్రేక్షకులకు బ్రహ్మానందం దగ్గరయ్యారు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ అవార్డూ ఆయనను వరించింది. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించగలరు. ఆయన చేసిన ఓ సినిమాలోని సన్నివేశాన్ని చూసి కాసేపు మీరూ నవ్వుకోండి.

  2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

  2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more

  ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ ట్రైలర్

  బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. ఐదు విభిన్న స్టోరీల సమాహారంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. ప్రేమ, అనుబంధాల కలబోతతో ముడిపడిన జీవితాలను ప్రస్ఫుటం చేసేలా ఉన్న ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రావణ్ భరద్వాజ్, ప్రశాంత్ విహారీ ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టికెట్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది.

  Know All About the ‘Comedy Brahma’ Brahmanandam

  Brahmanandam, if humor had a physical form, would undoubtedly be him. In Telugu cinema, he is the epitome of humor; his comic expressions and acting have kept us delighted for nearly four and a half decades. His name alone is enough to draw audiences to the movies. Brahmanandam can make you laugh in the blink of an eye, no matter … Read more