• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అభిమానితో డ్యాన్స్ చేసిన విజయ్ దేవరకొండ

  విజయ్ దేవరకొండ తాను నటించిన ‘లైగర్’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్షణం తీరిక లేకుండా దేశం మొత్తం తిరుగుతూ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. అందులో భాగంగానే ఓ భిమానితో ‘ఆ ఫట్’ సాంగ్‌పై డ్యాన్స్ వేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.   View this post on Instagram A post shared by aarohi_ (@shilpiraghwani)

  ఇంట‌ర్వ్యూ మ‌ధ్య‌లో విజ‌య్‌ని ప‌ట్టుకొని ఏడ్చేసిన ఛార్మీ

  విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మూవీ ‘లైగ‌ర్’. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.. పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్‌పై ఛార్మీ దీనికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. అయితే ఫ్యాన్స్ త‌ర‌ఫున ఛార్మీ కొన్ని ప్ర‌శ్న‌ల‌ను పూరీ, విజ‌య్‌ను అడిగింది. ఆ త‌ర్వాత నిర్మాత‌గా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎన్ని ఆర్థిక క‌ష్టాలు అధిగ‌మించారో చెప్పుకొచ్చింది. ఆ స‌మ‌యంలో ఓటీటీ నుంచి మంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ధైర్యం చేసి థియేట‌ర్‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చెప్ప‌డానికి రెండే కార‌ణాలు ఉన్నాయి. అందులో ఒక‌టి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌రోటి సినిమా కంటెంట్ అని చెప్పింది. … Read more

  పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

  విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్ర‌బృందంతో క‌లిసి నేడు బెంగుళూరు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్‌.. బెంగుళూరులోని కంఠీర‌వ స్టేడియంకు వెళ్లి దివంగ‌త న‌టుడు పునీత్ రాజ్‌కుమార్ స‌మాధికి నివాళులు అర్పించారు. విజ‌య్ వెంట అన‌న్య‌, ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూడా ఉన్నారు. పూరీ ద‌ర్శ‌క‌త్వంలో పునీత్ ఇడియ‌ట్ క‌న్న‌డ రీమేక్‌లో న‌టించాడు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది.

  6 మిలియ‌న్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ‘లైగ‌ర్’ సాంగ్‌

  విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ‘లైగ‌ర్’ మూవీ నుంచి నిన్న COKA 2.0 సాంగ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టికే 6 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌, 400K లైక్స్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. అన‌న్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. మూవీ నుంచి వ‌స్తున్న ఒక్కొక్క అప్‌డేట్‌తో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. లైగ‌ర్ ఆగ‌స్ట్ 25న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

  ‘లైగ‌ర్’ Coka 2.0 సాంగ్ అదిరిపోయింది

  ‘లైగ‌ర్’ మూవీ నుంచి Coka 2.0 సాంగ్ రిలీజ్ అయింది. విజ‌య్ అన‌న్య డ్యాన్స్‌తో పాటు క్యూట్ లుక్స్‌తో అల‌రించారు. రామ్ మిరియాలా, గీతా మాదురి క‌లిసి ఈ పాట‌ను ఆల‌పించారు. జానీ, లిజో జార్జ్, డీజే చేటాస్ ఈ పాట‌కు మ్యూజిక్ అందించారు. ఈ పాట కూడా యూట్యూబ్‌లో ర‌చ్చ చేయ‌బోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. లైగ‌ర్ మూవీ ఆగ‌స్ట్ 25న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. నేడు చిత్ర‌బృందం చండీగ‌ఢ్‌లో ప‌ర్య‌టిస్తుంది.

  నెట్టింట్లో ర‌చ్చ‌చేస్తున్న ‘లైగ‌ర్’ ఆంథెమ్

  ప్ర‌ముఖ సింగ‌ర్ నిఖిలేష్ కుమార్ ‘లైగ‌ర్’ టీమ్‌కు అంకితం ఇస్తూ లైగ‌ర్‌ ఆంథెమ్ సాంగ్‌ను రిలీజ్ చేశాడు. ఈ పాట బాలీవుడ్‌లో ర‌చ్చ చేస్ఉంది. ముంబై వీధులలో చాయ్ వాలాగా ఉన్న ఒక చిన్న కుర్రాడు బాక్సార్‏గా ఎలా మారాడు. దానికోసం ఎలాంటి శిక్ష‌ణ తీసుకున్నాడు అని ఈ పాట‌లో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్‌లో బాక్స‌ర్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడ‌దులైన ట్రైల‌ర్‌, పాట‌ల‌కు భారీ స్పంద‌న ల‌భిస్తుంది. లైగ‌ర్ ఆగ‌స్ట్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  నార్త్‌లో విజ‌య్ క్రేజ్ మామూలుగా లేదుగా!

  ‘లైగ‌ర్’ టీమ్‌కు ఎక్క‌డికి వెళ్లినా భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తుండం విశేషం. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా టీమ్ ప్ర‌ధాన న‌గ‌రాల‌న్నింటినీ చుట్టేస్తుంది. అయితే విజ‌య్‌, అన‌న్య ఎక్క‌డికి వెళ్లినా వేల‌కొద్ది ఫ్యాన్స్ వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు. ఇది ఇండ‌స్ట్రీకి చాలా ఆశ్ఛ‌ర్యం క‌లిగిస్తుంది. ఎందుకంటే లైగ‌ర్ విజ‌య్ చేస్తున్న మొద‌టి పాన్ ఇండియా మూవీ. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ కాక‌ముందే ఇంత‌మంది ఫ్యాన్స్ వారికోసం రావ‌డం విశేషం. నిన్న పుణెలో విజ‌య్‌, అన‌న్య ఒక షాపింగ్ మాల్‌లో సంద‌డి చేశారు. వారిని చూసేందుకు … Read more

  అదిరిన ‘లైగర్’ జంట

  పూరీ,విజయ్ క్రేజీ కాంబినేషన్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘లైగర్’. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ముంబైలో నిన్న సినిమా ప్రచారం చేశారు. అయితే కార్యక్రమానికి ముందు ఆన్ స్క్రీన్ జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో పాటు రమ్యకృష్ణ ఫోటోలకు ఫోజులిచ్చారు. పులి చర్మం లాంటి చొక్కాలో విజయ్, ఎల్లో కలర్ స్కర్ట్ లో అనన్య, చీరలో అలనాటి తార మెరిశారు. ఆగస్ట్ 14న వరంగల్, ఆగస్ట్ 15న హైదరాబాద్లో చిత్రబృందం సందడి చేయనుంది. … Read more

  వడోదరలో లైగర్ టీం సందడి

  లైగర్ మూవీ ప్రమోషన్‌ కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే ఈరోజు గుజరాత్‌లో సందడి చేశారు. వడోదరలో ఓపెన్ టాప్ కారులో షికారు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. పారుల్ యూనివర్సిటీ విద్యార్థులతో విజయ్ , అనన్య ఇంటరాక్ట్ అయ్యారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు.భావోద్వేగానికి లోనైన ఓ యవతిని విజయ్ ఓదార్చాడు. ఇప్పటికే బిహార్‌లో పర్యటించిన లైగర్ టీం త్వరలో చెన్నైకి వెళ్లనుంది. My man…@TheDeverakonda ??❤️???…Wait for the end???#LIGER @PuriConnects pic.twitter.com/I4nhdWCKYG — NaniNaaPeru?????? (@NaniNaaPeru1) August … Read more

  గ్రాడ్యుయేట్ చాయ్‌వాలీతో ‘లైగ‌ర్’ ముచ్చ‌ట్లు

  విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా దేశ‌మంతా చుట్టేస్తున్నాడు. తాజాగా పాట్నాలో ఫేమ‌స్ అయిన ‘గ్రాడ్యుయేట్ చాయ్‌వాలీ’ బండి ద‌గ్గ‌రికి వెళ్లాడు. ఆమెతో కాసేపు మాట్లాడి సినిమా గురించి విశేషాల‌ను పంచుకున్నాడు. ఇటీవ‌ల ముంబ‌యి వీధుల్లో, లోక‌ల్ ట్రైన్స్‌లో తిరుగుతూ ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఎలాగైనా ప్ర‌తి ఒక్క‌రికి సినిమా గురించి తెలియ‌జేయాల‌ని విజ‌య్ సాయ‌శ‌క్తులా క‌ష్ట‌ప‌డుతున్నాడు.