• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భగవంత్ కేసరి రికార్డు వసూళ్లు

  బాలయ్య నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు రూ.19 కోట్లు కొల్లగొట్టడంతో ఈ చిత్రం రూ.50 కోట్ల మార్కును దాటేసింది. మొత్తానికి రెండు రోజుల్లోనే రూ.51.12 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక వీకెండ్స్ ఉండటంతో కలెక్షన్లు ఇంకా సాలిడ్‌గా ఉండే అవకాశం ఉంది. అటు అమెరికాలోనూ భగవంత్ కేసరి 8 లక్షల డాలర్స్‌ మార్క్‌ను దాటేసింది.

  శ్రీలీల గ్లిజరిన్ పెట్టకున్నా ఏడ్చేసింది: బాలయ్య

  భగవంత్ కేసరి ప్రెస్‌ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడారు. భగవంత్ కేసరి మహిళా సాధికారతను హైలైట్ చేస్తూ తెరకెక్కిన చిత్రం. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ పరిశీలిస్తే అతడి చిత్రాలు అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి. నా కూతురి పాత్రలో శ్రీలీల అద్భుతంగా నటించారు. ఎమోషనల్ సీన్లలో గ్లిజరిన్ అవసరం లేకుండా జీవించారు అంటూ ప్రశంసలు కురిపించారు. మంచి భవిష్యత్ ఉందంటూ ఆశీర్వదించారు. థమన్ అందించిన సాంగ్స్, బీజీఎం బాగుందని చెప్పుకొచ్చారు.

  బాలయ్యకు అపార అనుభం: శ్రీలీల

  భగవంత్ కేసరి ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన హీరోయిన్ శ్రీలీల బాలయ్యపై ప్రశంసలు కురిపించింది. ‘బాలయ్య కూతురని ఫస్ట్ చెప్పినప్పుడు కొంచెం వెనకడుగు వేశాను. గ్లామర్ రోల్స్ ఎప్పుడైన చేయవచ్చు. కానీ నటనకు అవకాశం ఉన్న విజ్జి పాత్రను చేసేందుకు ఒప్పుకున్నాను. బాలయ్య ఇంక్రిడబుల్ మ్యాన్. ఆయన నుంచి షూటింగ్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కేవలం నటన పరంగానే కాదు. సమాజంలోని ఇతర విషయాలపై ఆయనకు ఆపార అనుభవం ఉంది అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోరిక మేరకు బాలయ్యతో శ్రీలీల డ్యాన్స్ చేసి … Read more

  బాలకృష్ణపై శ్రీలీల ప్రశంసలు

  నట సింహం నందమూరి బాలకృష్ణపై నటి శ్రీలీల ప్రశంసలు కురిపించింది. జీవితంలో మర్చిపోలేని అనుభూతులు బాలయ్య తనకు అందించారని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘నేను బాలకృష్ణ కుమార్తె పాత్రలో నటించాను. కొన్ని సీన్లు చేసేటప్పుడు కట్ చెప్పినప్పటికీ ఎమోషనల్ మూడ్‌ నుంచి బయటకు రాలేకపోయాను’’ అని చెప్పింది. ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కించారు.

  డాడి గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అనిండు: బాలకృష్ణ

  భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల సందర్భంగా బాలకృష్ణ క్రేజీ కామెంట్స్ చేశారు. “హీరోయిన్ శ్రీలీల చిచా, చిచా అని సినిమాలో టార్చర్ పెట్టింది. నాతో సినిమాలో నటించావ్ సరే. వచ్చే సినిమాలో ఇద్దరం హీరో హీరోయిన్లుగా నటిద్దామని చెప్పా. ఇదే విషయం మా ఇంట్లో చెబితే.. మా వాడు మోక్షజ్ఞకు కోపం వచ్చింది. ఏం డాడి నెక్ట్స్‌ నేను కుర్ర హీరోను కాబోతున్నా. నువ్వేమో ఆమెకు ఆఫర్ ఇస్తున్నావ్. ఏం డాడి నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని అనిండు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. … Read more

  భగవంత్ కేసరి నుంచి రెండో సాంగ్

  బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ లిరికల్ సాంగ్ విడుదల తేదీ ఫిక్సైంది. అక్టోబర్ 4న ఉయ్యాలో ఉయ్యాలో అనే సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిల్ రావుపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సన్‌ షైన్ నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.

  స్కంద మూవీ ట్విట్టర్ రివ్యూ

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని, కుర్రహీరోయిన్ శ్రీలీల కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ‘రామ్ ఎంట్రీ సీన్ అదిరిపోయింది. యాక్షన్ లవర్స్‌కు మంచి మసాల ట్రీట్. నీ చుట్టు సాంగ్‌లో శ్రీలీల- రామ్‌తో పోటీపడి స్టెప్పులేసింది. ఆ ఒక్క పాట తప్పా మిగిలిన సాంగ్స్ ఆకట్టుకోవు. తమన్ BGM ఓకే. బోయపాటి తన అన్ని సినిమాలు మిక్స్ చేసినట్లు ఉంది’ అని కామెంట్ చేశారు. … Read more

  ఘనంగా APL ప్రారంభం: శ్రీలీల సందడి

  విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL)-2 ఘనంగా ప్రారంభమైంది. ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ టోర్నీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీలల సందడి చేసింది. ఆటగాళ్లను పరిచయం చేసుకుని మైదానం మొత్తం కలియదిరిగింది. శ్రీలీలను చూడటానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. కాగా ఈ రోజు కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 12 రన్స్ తేడాతో బెజవాడపై కోస్టల్ రైడర్స్ టీమ్ విజయం సాధించింది. Present #Sreeleela is in #Vizag madhuravada stadium#GunturKaaram pic.twitter.com/umx2Uq1oad … Read more

  బాలయ్య సాంగ్‌కు శ్రీలీల, కాజల్ స్టెప్పులు

  నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘భగవంత్ కేసరి’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా వీరిద్దరూ సినిమా షూట్ మధ్యలో బాలయ్య సాంగ్‌కు డ్యాన్స్ వేశారు. ‘‘చిలక పచ్చ కోక’’ పాటకు కాజల్, శ్రీలీల అదిరే స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. https://www.instagram.com/reel/Ctq-oVYAmu-/?utm_source=ig_web_copy_link

  హీరోలను చూసే టికెట్లు కొంటున్నారు: శ్రీలీల

  ఇప్పటికీ హీరోలను చూసే సినిమా టికెట్లు కొంటున్నారని యంగ్ హీరోయిన్ శ్రీలీల అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం 8 సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను. ప్రస్తుతం నా చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండటం లేదు. ఇంట్లో కంటే సెట్స్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నా. కెమెరా ముందు ఉండడం వ్యసనంగా మారింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నా. చదువు, నటన రెండూ బ్యాలెన్స్ చేసుకుంటా.’’ అంటూ చెప్పుకొచ్చింది.