• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదృష్టం కలిసిరాని తెలుగు స్టార్ హీరోయిన్లు… అక్కడ ఎంత తెగించినా పట్టించుకోని నిర్మాతలు

    తెలుగు తెరపై కొన్నేళ్లపాటు వెలుగువెలిగిన కొంతమంది హీరోయిన్లకు ఆఫర్లు తగ్గిపోతున్నాయి. అందం, అభినయంతో ఆకట్టుకున్నా దర్శకులు, నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొత్తదనానికే ఓటేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది పరిస్థితి కాస్త ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లెవరో? ప్రస్తుతం ఏమైనా సినిమాలు చేస్తున్నారా? అనేది చూద్దాం. సమంత అగ్రహీరోల సరసన ఎన్నో సినిమాలు చేసింది సమంత. ఒకప్పుడు ఆమె చిత్రంలో నటిస్తోంది అంటే దాదాపు హిట్ అనేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యశోద సినిమా సమయంలో ఆమెకు మయోసైటిస్ సోకటం తర్వాత చికిత్స పొందుతూనే … Read more

    శ్రీలీల హోయలకు నెటిజన్లు విలవిల!

    ‘పెళ్లీ సందD’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి ‘శ్రీలీల’ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్లున్నారు. ‘ధమాక’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బామ చేతిలో ప్రస్తుతం ఏడు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా శ్రీలీల షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. క్రీమ్‌ కలర్‌ డ్రెస్‌లో అంద, చందాలను ఒలకబోస్తున్న శ్రీలీలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్‌కు మరో అందాల తార దొరికేసిందని కామెంట్లు చేస్తున్నారు.

    Hottest Tollywood Actresses Instagram Pics 2023

    తెలుగు సినిమాలు హిట్ కావాలంటే ఆ చిత్రాల్లో ఎంతో కొంత గ్లామర్ కంటెంట్ ఉండాల్సిందే. సినిమా అంటేనే నవ రసాల కలయిక. అందులోనూ శృంగార రసం చాలా మంది ప్రేక్షకులు కోరుకునే ప్రధానమైన ఎలిమెంట్. అయితే మన తెలుగు హీరోయిన్లు కేవలం సినిమాల్లోనే కాకుండా.. ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులను ఆకర్షిస్తుంటారు. అలాంటి టాప్ 50 గ్లామర్ డాల్స్ తెలుగులో ఎవరో ఓసారి చూద్దాం. కాజల్ అగర్వాల్ పెళ్లి , ప్రెగ్నెన్సీతో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా ఈ ‘చందమామ’ … Read more

    పల్సర్ బైక్ సాంగ్; దుమ్మురేపిన శ్రీలీల

    ‘ధమాకా’ మూవీలోని ‘పల్సర్ బైక్’ ఫుల్ సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరోయిన్ శ్రీలీల ఎనర్జీ అదరహో అనిపిస్తోంది. తన అందం, అభినయంతో దుమ్మురేపింది. గాజువాక కండక్టర్ ఝాన్సీకి ఏమాత్రం తీసిపోకుండా డ్యాన్స్ వేసి ఆకట్టుకుంది.

    ఎల్బీనగర్‌లో శ్రీలీల సందడి

    ‘ధమాకా’ ఫేం శ్రీలీల హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో సందడి చేసింది. వాసవీ ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభోత్సవానికి శ్రీలీల అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా శ్రీలీల ఇటీవల విడుదలైన ధమాకా బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఈ సినిమా విజయంతో ఈ కన్నడ భామకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సరసన ‘అనగనగా ఒక రాజు’, రామ్ పోతినేతితో ఓ సినిమా, పంజా వైష్ణవ్‌తో మరో సినిమా చేస్తోంది. Courtesy Twitter: Sharat Chandra Boggarapu … Read more

    చిరునవ్వుతో మనసు దోచేస్తున్న శ్రీలీల

    రెండు సినిమాలకో స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ను సంపాదించి దూసుకుపోతున్న నటి శ్రీలీల. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తుంది. ఇటీవల విడుదలైన ధమాకా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నేడు ఓటీటీలోనూ విడదలైంది. దీంతో మరోసారి శ్రీలీల పేరు మార్మోగిపోతోంది. ఈ సినిమాలో ఈమె డ్యాన్సులు, యాక్టింగ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. అలాగే చిరునవ్వులు చిందిస్తూ శ్రీలీల తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Courtesy Twitter:sreeleela Courtesy Twitter:sreeleela Courtesy Twitter:sreeleela Courtesy Twitter:sreeleela

    2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 30 తెలుగు హీరోయిన్స్ ఎవరంటే..?

    కేవలం ఒకే సినిమా అది తమిళంలో రిలీజ్‌ అయినా తెలుగులో కాజల్‌ టాప్‌ నటిగానే ఉంది. ఆమె తర్వాతి స్థానంలో రష్మిక మంధాన, సమంత ఉన్నారు. పెళ్లి, ప్రెగ్నన్సీ అంశాల వల్ల కాజల్‌ హెడ్‌లైన్స్‌లో నిలుస్తూనే వచ్చింది. కీర్తి సురేశ్‌ ఆరో స్థానంలో, పూజా హెగ్డే, సాయి పల్లవి ఆమె తర్వాతి స్థానాల్లో నిలిచారు. యువ నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్‌ పదో స్థానంలో చోటు దక్కించుకుంది. రాశి ఖన్నా, నిధి అగర్వాల్, శ్రీ లీల, రెజీనా కసాండ్రా, డింపుల్ హయతి జాబితాలో ఉన్నారు. For … Read more

    రవితేజ ‘ధమాకా’ ట్రైలర్ విడుదల

    రవితేజ డ్యుయల్ రోల్‌లో నటిస్తున్న ‘ధమాకా’ ట్రైలర్ విడుదలైంది. రెండు క్యారెక్టర్లలో రవితేజ ఒదిగిపోయాడు. మాస్ మహారాజ కామెడీ టైమింగ్ నవ్వులు పూయిస్తోంది. ఉద్యోగాలిచ్చే పారిశ్రామికవేత్తగా ఒక పాత్రలో.. ఉద్యోగం కోసం ఎదురు చూసే యువకుడిగా రవితేజ అదరగొట్టాడు. వీరిద్దరూ కలిసి ఒకే వేదికపైకి వచ్చిన తర్వాత ఏం జరిగబోతోందనే సస్పెన్స్‌తో ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్‌గా శ్రీలల మరోసారి అలరించింది. కాగా, ఈ సినిమాను త్రినాథరావు నక్కిన తెరకెక్కించగా.. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

    ధమాకా నుంచి మరో పాట విడుదల

    రవితేజ హీరోగా డ్యుయల్ రోల్‌లో వస్తున్న చిత్రం ‘ధమాకా’. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘డు..డు..వీడు ల్యాండుమైను లెక్క’ అంటూ సాగే ఈ పాటను పృథ్వీ చంద్ర ఆలపించారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. కాగా, ఈ సినిమాలోని మిగతా పాటలకు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. డిసెంబరు 23న మూవీ రిలీజ్ కానుంది.

    ఆకట్టుకుంటున్న ‘ధమాకా’ సాంగ్

    మాస్ మహారాజా హీరోగా నటించిన ‘ధమాకా’ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. ‘వాట్స్ హ్యాపెనింగ్’ పాటను మూవీ మేకర్స్ విడుదల చేయగా, శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ విడుదల చేయడంతో రవితేజ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లోని మాస్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించగా, డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు.