• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అదృష్టం కలిసిరాని తెలుగు స్టార్ హీరోయిన్లు… అక్కడ ఎంత తెగించినా పట్టించుకోని నిర్మాతలు

  తెలుగు తెరపై కొన్నేళ్లపాటు వెలుగువెలిగిన కొంతమంది హీరోయిన్లకు ఆఫర్లు తగ్గిపోతున్నాయి. అందం, అభినయంతో ఆకట్టుకున్నా దర్శకులు, నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొత్తదనానికే ఓటేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది పరిస్థితి కాస్త ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లెవరో? ప్రస్తుతం ఏమైనా సినిమాలు చేస్తున్నారా? అనేది చూద్దాం.

  సమంత

  అగ్రహీరోల సరసన ఎన్నో సినిమాలు చేసింది సమంత. ఒకప్పుడు ఆమె చిత్రంలో నటిస్తోంది అంటే దాదాపు హిట్ అనేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యశోద సినిమా సమయంలో ఆమెకు మయోసైటిస్ సోకటం తర్వాత చికిత్స పొందుతూనే డబ్బింగ్ చెప్పడం వంటివి జరిగాయి. ప్రస్తుతం శాకుంతలం రిలీజ్‌కు రెఢీ ఉండగా తెలుగులో విజయ్ సరసన ఖుషీ సినిమాలో మాత్రమే చేస్తోంది. బాలీవుడ్‌లో సిటాడెల్‌ అనే ప్రాజెక్ట్‌లో ఓ రోల్‌లో నటిస్తోంది సామ్.

  Courtesy Twitter: Samantha FC |

  శాకుంతలం సినిమాపైనే ఈ ముద్దుగుమ్మ గంపేడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ మీదే ఆమె అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

  పూజా హెగ్డే

  నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో పరిచయమైన పూజా హెగ్డే వరుస హిట్లు కొట్టినప్పటికీ ప్రస్తుతం అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. చివరగా రాధేశ్యామ్‌లో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపించిన ఈ పొడుగుకాళ్ల సుందరి ప్రస్తుతం మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న SSMB 28లో మాత్రమే నటిస్తోంది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో  కిసి కా భాయ్ కిసి కా జాన్ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది.

  రకుల్ ప్రీత్ సింగ్‌

  టాల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌ చేతిలోనూ పెద్దగా ఆఫర్లు లేవు. 2021లో కొండపొలం తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఈ అమ్మడు రెండేళ్లుగా తెలుగు చిత్రాలు చేయలేదు. ప్రస్తుతం కూడా తెలుగు చిత్రాలు కమిట్ అవ్వలేదు. ఇండియన్ 2తో పాటు ఓ బాలీవుడ్ చిత్రంలో చేస్తోంది. 

  Courtesy Instagram:rakul preet singh

  నిధి అగర్వాల్‌

  అందాలు ప్రదర్శించినా నిధి అగర్వాల్‌కు అవకాశాలు దక్కడం లేదు. ప్రస్తుతం ఆమె పవన్ కల్యాణ్, క్రిష్‌ కాంబోలో తెరెకెక్కుతున్న హరిహర వీరమల్లులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా హిట్‌ అయితే అవకాశాలు వస్తాయని భావిస్తోంది ఈ అమ్మడు. 

  nidhi2

  రాశీ ఖన్నా

  తెలుగులో సూపర్ హిట్లు అందుకున్న రాశీ కన్నా నాగ చైతన్య థాంక్యూ సినిమాలో చివరగా నటించింది. ప్రస్తుతం హిందీలో బిజీగా మారింది రాశీ. ఇటీవలె ఫర్జీ వెబ్ సిరీస్‌తో హిట్‌ అందుకున్నా… అవకాశాలు వరిస్తాయో లేదో చూడాలి.

  Instagram: raashiikhanna

  పాయల్ రాజ్‌పుత్

  RX 100తో ఊపేసిన పాయల్ రాజ్‌పుత్‌కి అప్పట్నుంచి మళ్లీ సరైన హిట్‌ లేదు. ఇటీవల మంచు విష్ణు జిన్నా సినిమాలో మెరిసినప్పటికీ ఫ్లాప్ అవ్వటంతో ఉపయోగం లేకుండా పోయింది. అందాల ఆరబోతకు దిగినా నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదని టాక్. ప్రస్తుతం కిరాతక అనో ఓ చిత్రంలో నటిస్తోంది పాయల్.

  Courtesy Instagram:payalrajpoot

  నివేథా థామస్

  నివేథా పరిస్థితి కూడా చాలామంది హీరోయిన్ల మాదిరిగానే ఉంది. అడపాదడపా క్యారెక్టర్లు వస్తున్నాయి. శాంకిని డాంకిని ఆమె చివరి సినిమా. ఇటీవల కొద్దిగా బొద్దుగా మారటంతో ఆఫర్లు తగ్గిపోయాయి. 

  నభా నటేష్‌

  హీరోయిన్ నభా నటేష్ దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరమయ్యింది. ఆఫర్లు లేక అని అందరూ అనుకున్నప్పటికీ యాక్సిడెంట్‌ కారణమని ఇటీవల వెల్లడించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం మళ్లీ పుంజుకుంటానని చెబుతోంది. 

  Courtesy Instagram:nabhanatesh

  కారణమిదేనా?

  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్లదే హవా నడుస్తోంది. శ్రీలీల, కృతి శెట్టి, రష్మిక వంటి వాళ్లకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. వీళ్లను కాదనుకుంటే పాన్ ఇండియా చిత్రాలు రూపొందిస్తుండటంతో బాలీవుడ్‌ నుంచి హీరోయిన్లను తీసుకుంటున్నారు. దీంతో వీళ్లకి ఆఫర్లు రావటం లేదు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv