శాకుంతలం విడుదల వాయిదా?
డైరెక్టర్ గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో వస్తున్న ‘శాకుంతలం’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రబృందం ప్రకటించింది. అయితా, సినిమా పనులు ఇంకా సంపూర్తి కాకపోవడం వల్ల విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. ఈ ఏడాది వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. శకుంతలగా సమంత నటించింది. ఇదివరకే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. మణిశర్మ సంగీతం అందించగా.. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించారు.