• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Top 10 Popular Actresses: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టిన సమంత.. సామ్‌తో అంత ఈజీ కాదు..!

  దేశంలో సినిమా సెలబ్రిటీలకు ఉన్నంత క్రేజ్‌ ఇంకెవరికీ ఉండదు. కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ తారలను సమాజం ఎప్పుడూ ప్రత్యేకంగా చూస్తుంటుంది. వారికి సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటుంది. ఈ క్రమంలో హీరో, హీరోయిన్ల గురించి నెట్టింట తెగ సెర్చ్‌ చేస్తుంటారు ఫ్యాన్స్‌. అభిమాన తారల విషయాలను తెలుసుకొని సంతోషిస్తుంటారు. ఇదిలా ఉంటే జూన్‌ నెలలో బాగా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ల జాబితాను ఓర్‌మ్యాక్స్‌(Ormax) మీడియా సంస్థ తాజాగా విడుదల చేసింది. సినీ ఇండస్ట్రీలో పాపులారిటీ, క్రేజ్, ఫాలోయింగ్, సినిమాలు … Read more

  ఆథ్యాత్మిక చింతనలో సమంత

  స్టార్ హీరోయిన్ సమంత ఆథ్మాత్మిక చింతనలో మునిగిపోయింది. యోగా గురువు సద్గురు నిర్వహించిన యోగా కార్యక్రమంలో సామ్ పాల్గొంది. ఈ సందర్భంగా సమంత ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఎలాంటి ఆలోచనలు, కదలికలు లేకుండా కూర్చోవడం అసాధ్యం అనిపించింది. ధ్యానం అనేది ప్రశాంతతకు మూలం అని ఈ రోజే తెలిసింది. సింపుల్‌గా ఉండే ధ్యానం ఇంత పవర్‌ఫుల్ కూడా ఉంటుందని ఎవరూ అనుకోరు.’’ అంటూ సామ్ రాసుకొచ్చింది. కాగా త్వరలోనే వైద్యం కోసం సమంత విదేశాలకు వెళ్లనుంది.

  విదేశాలకు సమంత: అతడు ఎమోషనల్

  స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ విషయాన్ని నిజం చేస్తూ సామ్ హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘గడిచిన రెండేళ్లు ఎండా వాన లెక్కచేయకుండా పని చేశాం. నవ్వులు, బాధలు, కష్టాలు అన్ని చిరునవ్వుతో భరించాం. ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుని అద్భుత జర్నీ చేశాం. చికిత్స తీసుకుంటున్న సమయంలో నీకు మరింత బలం, శక్తి రావాలి. మళ్లీ మిమ్మల్ని కలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నా.’’ అంటూ పోస్ట్ చేశాడు.

  CITADEL: సమంత రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

  స్టార్ హీరోయిన్ సమంత వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉంది. ఓ వైపు టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషీ’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో ‘సిటాడెల్’ వెబ్‌సీరీస్‌లో నటిస్తోంది. కాగా ఈ వెబ్‌సీరీస్‌లో నటించడానికి సమంతం ఏకంగా రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే హాలీవుడ్ మూవీలో కూడా సామ్ నటిస్తోంది. ఆ చిత్రానికి కూడా భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.

  ఈ ఏడాది కలసి రాలేదు: సమంత

  స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వార్త వైరల్‌గా మారింది. మయోసైటిస్ బారిన పడి ఏడాదైన సందర్భంగా ఈ పోస్ట్ పెట్టింది. ‘‘వ్యాధి నిర్ధారణ అయ్యి ఏడాది గడిచింది. ఈ ఏడాది బలవంతంగా ముగించా. నా శరీరంతో ఎన్నో పోరాటాలు చేశా. ఉప్పు, కారం లేని ఫుడ్ తిన్నా. మత్తుతో కూడిన మందులు వేసుకున్నా. కెరీర్ పరంగా కూడా ఈ ఏడాది పరాజయాలు చవిచూశా. ప్రస్తుతం దేవుడిని ప్రార్థిస్తున్నాను. బహుమతులు కాదు.. ధైర్యం, బలాన్ని ఇవ్వమని వేడుకున్నాను.’’ అంటూ రాసుకొచ్చింది. Screengrab Instagram: … Read more

  హాలీవుడ్ మూవీలో సమంత

  స్టార్ హీరోయిన్ సమంత ఓ హాలీవుడ్ మూవీలో కథానాయికగా నటించనుంది. ‘చెన్నై స్టోరీ’ అనే హాలీవుడ్ సినిమాలో సామ్ నటిచబోతుంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు వివేక్ కల్రా హీరోగా నటిస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా సమంత ప్రస్తుతం తెలుగులో ‘ఖుషీ’ మూవీలో నటిస్తోంది. హిందీలో ‘సిటాడెల్’ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

  ఆ క్రికెటర్ నాకు స్ఫూర్తి: సమంత

  టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీనే తనకు స్ఫూర్తి అని స్టార్ హీరోయిన్ సమంత తెలిపింది. హీరో విజయ్ దేవరకొండతో కలసి సమంత ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘‘కొద్ది రోజుల క్రితం కోహ్లీ ఫామ్ కోల్పోయి ముప్పేట విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత తిరిగి పుంజుకున్న తీరు అద్వితీయం. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న సమయంలో కోహ్లీ తన 71వ సెంచరీ చేశాడు. అప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు.’’ అంటూ సామ్ చెప్పుకొచ్చింది.

  హైదరాబాద్‌లో మరో ఇల్లు కొన్న సమంత: ఎంతంటే?

  స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్‌లో మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. రంగారెడ్డి జిల్లాలోని జయభేరి ఆరెంజ్ కౌంటీలో డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీని విలువ సుమారు రూ.7.8 కోట్లని టాక్. కాగా ఇంతకుముందు కూడా సమంత ముంబైలో ఓ లగ్జరీ హౌజ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ముంబై సముద్రతీరంలో రూ.15 కోట్ల విలువ చేసే అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది.

  సమంత చాలా మంచిదని చెప్పిన నాగచైతన్య.. సామ్ రిప్లై ఇదే

  సమంతతో విడాకులపై హీరో నాగచైతన్య స్పందించాడు. ‘‘సమంత చాలా మంచిది. సామ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మేము ఇద్దరం చట్టప్రకారం విడాకులు తీసుకున్నాం. మేము మా జీవితాల్లో వేర్వేరుగా ముందుకు సాగుతున్నాం. కానీ మా ఇద్దరి జీవితాలపై రూమర్స్ రావడం బాధ పెడుతోంది. ఇప్పటికీ మా విడాకుల గురించి అడగటం చిరాకు తెప్పిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో ఇటీవల కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. త్వరలోనే మేము విజయాల బాట పడతాం.’’ అంటూ చైతూ చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో.. కస్టడీ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంగ్లిష్ పత్రికకు … Read more

  మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా సమంత

  పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో స్టార్ హీరోయిన్ సమంత అగ్ర స్థానంలో నిలిచింది. గతంలో తొమ్మిదో స్థానంలో ఉన్న సామ్ ప్రస్తుతం మొదటి స్థానానికి చేరుకుందని ఇండియన్ మూవీ డేటాబేస్ తెలిపింది. తాజాగా పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాను ఐఎండీబీ ప్రకటించింది. కాగా సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషీ’ చిత్రంలో నటిస్తోంది. ‘సిటాడెల్’ వెబ్ సీరీస్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. సామ్ నటించిన ‘శాకుంతలం’ మూవీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.