• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సమంతకు గుడి కడుతున్న వీరాభిమాని: ఏపీలోనే?

    స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అభిమాని గుడి కడుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఏపీలోని బాపట్లకు చెందిన సందీప్.. హీరోయిన్ సమంతకు వీరాభిమాని. ఈ క్రమంలో ఆమె మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకోవాలని గతంలో చెన్నై, తిరుపతి, నాగపట్నంలో మొక్కుబడి యాత్ర చేశాడు. ఇప్పుడు ఏకంగా కోవెల కడుతున్నాడు. ఆలపాడులోని తన స్వగృహంలో ఈ గుడి నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 28న సమంత బర్త్‌డే సందర్భంగా ఈ గుడిని ఓపెన్ చేస్తున్నాడు.

    సమంత ధరించిన నెక్లెస్ ఎంతో తెలుసా?

    స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ మూవీకి ఆశించిన ఫలితం రాలేదు. దీంతో సమంత ప్రస్తుతం విదేశాల్లో బిజీగా ఉంది. ‘సిటాడెల్’ వెబ్ సీరీస్ కోసం సామ్ లండన్ వెళ్లింది. ఈ సందర్భంగా సమంత ధరించిన ఆభరణాలు హాట్ టాపిక్‌గా మారాయి. సమంత మెడలో ధరించిన స్నేక్ పీస్ నెక్లెస్ ధర అక్షరాలా రూ.2.9 కోట్లు అని సమాచారం. ఆమె చేతికి పెట్టుకున్న బ్రాస్‌లెట్ ధర రూ.2.6 కోట్లు అని తెలుస్తోంది. సామ్ లండన్‌లో జరుగుతున్న సిటాడెల్ సీరీస్ షూటింగ్‌లో బిజీగా … Read more

    సమంతకు అనారోగ్యం..అదే కారణం

    హీరోయిన్ సమంత అనారోగ్యానికి గురైంది. వారం రోజులుగా శాకుంతలం ప్రమోషన్లలో విరామం లేకుండా పాల్గొనడంతో తాను జ్వరంతో బాధపడుతున్నట్లు సామ్ ట్వీట్ చేసింది. ప్రమోషన్లలో మాట్లాడి మాట్లాడి తన గొంతు బొంగురు పోయినట్లు వెల్లడించింది. మాట్లాడేందుకు గొంతు సహకరించడం లేదని పేర్కొంది. ఈ వారం అంతా అభిమానుల మధ్య ఉండి సినిమాను ప్రమోట్ చేస్తూ ఫ్యాన్స్ ప్రేమలో మునిగితేలినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సాయంత్రం జరగనున్న శాకుంతలం ఈవెంట్‌లో అభిమానులు పాల్గొనాలని సమంత విజ్ఞప్తి చేసింది. (1/2)I was really excited to … Read more

    ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యా: సమంత

    తన జీవితంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎదురైనా.. ధైర్యంగా ముందుకెళ్తున్నానని స్టార్ హీరోయిన్ సమంత పేర్కొంది. ‘‘ఒకప్పుడు నా జీవితం హ్యాపీగా గడిచిపోయేది. కానీ ఆ తర్వాత కొన్ని కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితుల నుంచి బయటపడి మరింత స్ట్రాంగ్‌గా తయారయ్యా. నాకు నేను ప్రత్యేకం అనుకోవడం లేదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అవి నా జీవితాన్ని నాశనం చేయకూడదని ముందుకెళ్తున్నా.’’ అంటూ సామ్ చెప్పుకొచ్చింది.

    అఖిల్‌కు సమంత బర్త్‌డే విషెస్; రిప్లై ఇస్తాడా?

    టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్‌కు స్టార్ హీరోయిన్ సమంత బర్త్‌డే విషెస్ చెప్పింది. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఏజెంట్ మూవీ 28న రాబోతోంది. చూస్తుంటే ఫైర్‌లా ఉంది. లాట్స్ ఆఫ్ లవ్.’’ అంటూ హార్ట్ ఎమోజీని జత చేస్తూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామ్ షేర్ చేసిన పోస్ట్‌కు అఖిల్ రిప్లై ఇస్తాడా.. ఇవ్వడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్నా.. అక్కినేని కుటీంబీకులతో మంచి రిలేషన్ కొనసాగిస్తోంది. … Read more

    నేనెప్పుడూ అలా చెప్పలేదే: సమంత

    చైతన్య, శోభిత ధూళిపాళ్ల మధ్య వస్తున్న రిలేషన్‌షిప్ వార్తల గురించి తాను వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న పుకార్లను సమంత తిప్పికొట్టింది. తాను అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని స్పష్టం చేసింది. చైతు, శోభిత డేటిగ్ రూమర్ల గురించి మాట్లాడుతూ.. ‘ఎవరు ఎవరితో రిలేషన్‌లో ఉన్నా నేను బాధపడను. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుంటే అందరికీ మేలు జరుగుతుంది’ అని సమంత చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. వీటిని కోట్ చేస్తూ సామ్ [ట్విటర్](url) వేదికగా క్లారిటీ … Read more

    సమంత మూవీని రష్మిక చేజిక్కించుకుందా?

    నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో ‘రెయిన్‌బో’ చిత్రం తెరకెక్కుతోంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నిజానికి ఈ సినిమాకు ముందుగా సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ సడెన్‌గా సామ్ స్థానంలో రష్మిక వచ్చి చేరింది. దీనిపై ‘రెయిన్‌బో’ నిర్మాత ప్రభు స్పందించారు. ‘‘స్క్రిప్ట్‌కు ఎవరు సరిపోతారో వారినే సెలెక్ట్ చేసుకుంటాం. కంటెంట్, కర్మ అలా జరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు’’. అంటూ వ్యాఖ్యానించారు. Screengrab Instagram: samantharuthprabhuoffl Screengrab Instagram: rashmika_mandanna

    విజయ్ నెక్ట్స్ మూవీలో సమంత!

    త్వరలో తమిళ్ స్టార్ హీరో విజయ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ మూవీలో దళపతికి జోడీగా హీరోయిన్ సమంతను ఎంపిక చేసినట్లు టాక్. సమంత ఇంతకుముందు విజయ్‌తో ‘కత్తి’, ‘మెర్సల్’, ‘తెరి’ చిత్రాల్లో నటించింది. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మరోవైపు విజయ్ తనకు అచ్చొచ్చిన హీరోయిన్లతోనే నటించాలని అనుకుంటున్నారట. అందుకే ఈ మూవీలో సమంతను రిపీట్ చేశారని టాక్. విజయ్ ప్రస్తుతం ‘లియో’ మూవీలో నటిస్తున్నాడు.

    ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు; సమంత

    తన వైవాహిక బంధానికి స్వస్తి పలికిన రోజులను స్టార్ హీరోయిన్ సమంత మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘‘క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు చీకటి రోజులు చూశా. అప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి ముందుడుగు వేశా. ఆ తర్వాతే నా ధైర్యం పెరిగింది. అయినా ఆ బాధ నుంచి నేను ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం ఆ చీకటి రోజులు కొంత తగ్గాయనే నమ్ముతున్నా.’’ అంటూ సామ్ చెప్పుకొచ్చింది.

    నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి; సమంత

    వైవాహిక బంధంలో తాను నిజాయతీగా ఉన్నానని.. కానీ అది ఉపయోగపడలేదని స్టార్ హీరోయిన్ సమంత పేర్కొన్నారు. ‘‘ చైతూతో విడాకులు తీసుకున్న వెంటనే ‘పుష్ప’ మూవీలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. నువ్వు ఇంట్లో కూర్చో చాలు.. విడిపోయిన వెంటనే ఐటెమ్ సాంగ్స్ చేయడం బాగోదు అని కొంతమంది సలహా ఇచ్చారు. కానీ నేను వాళ్ల సలహాను అంగీకరించలేదు. నేనే నేరం చేయలేదు. మరి అలాంటప్పుడు ఇంట్లోనే ఎందుకు కూర్చుని ఉండాలి.’’ అంటూ సామ్ చెప్పుకొచ్చారు.