• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బేబమ్మను వేధిస్తోన్న హీరో కొడుకు: క్లారిటీ

  ఉప్పెన బ్యూటీ కృతిశెట్టిని ఓ స్టార్ హీరో కుమారుడు వేధిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బేబమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడలా వెంబడించి వేధిస్తున్నట్లు సమాచారం. తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి కృతిని ఆహ్వానించి.. ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చాడట. కానీ ఈ వదంతులపై కృతి శెట్టి స్పందించింది. అసలు ఏమాత్రం సెన్స్ లేని పుకారు ఇది. లైట్ తీసుకుందాం అనుకున్నా. కానీ హద్దులు దాటుతుండడంతో స్పందించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

  అలాంటి వాడినే పెళ్లాడుతా: కృతిశెట్టి

  టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన ‘కస్టడీ’ విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో బేబమ్మ తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పేసింది. ‘‘నాకు కాబోయే భర్త అందంగా ఉండక్కర్లేదు. ఆస్తి కూడా పెద్దగా లేకపోయినా ఫర్వాలేదు. మంచి మనసున్న వాడై ఉంటే చాలు. నిజాయితీ కలిగి ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. కాస్త బొద్దుగా ఉన్నా ఫర్వాలేదు.’’ అంటూ తనకు కాబోయేవాడి గురించి చెప్పుకొచ్చింది.

  ‘కస్టడీ’ కోసం జిమ్నాస్టిక్స్ చేశా: కృతిశెట్టి

  నాగచైతన్య అక్కినేని హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లలో కృతిశెట్టి మీడియాతో మాట్లాడింది. ‘‘ఈ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. నా క్యారెక్టర్ నిడివి కూడా ఎక్కువే. ఈ సినిమా కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశా. రెండువారాలపాటు అండర్ వాటర్ సీక్వెన్స్ చేశాం. ఐదు రోజులపాటు కంటిన్యూగా నీటిలోనే ఉన్నా.’’ అంటూ అమ్మడు చెప్పుకొచ్చింది.

  అదృష్టం కలిసిరాని తెలుగు స్టార్ హీరోయిన్లు… అక్కడ ఎంత తెగించినా పట్టించుకోని నిర్మాతలు

  తెలుగు తెరపై కొన్నేళ్లపాటు వెలుగువెలిగిన కొంతమంది హీరోయిన్లకు ఆఫర్లు తగ్గిపోతున్నాయి. అందం, అభినయంతో ఆకట్టుకున్నా దర్శకులు, నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొత్తదనానికే ఓటేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది పరిస్థితి కాస్త ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లెవరో? ప్రస్తుతం ఏమైనా సినిమాలు చేస్తున్నారా? అనేది చూద్దాం. సమంత అగ్రహీరోల సరసన ఎన్నో సినిమాలు చేసింది సమంత. ఒకప్పుడు ఆమె చిత్రంలో నటిస్తోంది అంటే దాదాపు హిట్ అనేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యశోద సినిమా సమయంలో ఆమెకు మయోసైటిస్ సోకటం తర్వాత చికిత్స పొందుతూనే … Read more

  REVIEW: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

  విభిన్న కథలతో, చొక్కాలు చించుకునే మాస్‌ సీన్లు లేకుండా మనసుకు హత్తుకునే సినిమాలు తెరకెక్కిస్తాడు మన మోహన కృష్ణ ఇంద్రగంటి. సుధీర్‌ బాబు, కృతిశెట్టితో ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ ఇవాళ మరోసారి వెండితెర అభిమానులను పలకరించాడు. గతంలో సుధీర్‌తో ప్రేక్షకులను ‘సమ్మోహన’ పరిచాడు. మరి ఈ సారి వీరి కాంబో వర్కవుట్‌ అయిందా. చూద్దాం కథ: కథ రాసుకోవడంలో మోహన కృష్ణ భిన్నంగానే ఆలోచిస్తాడు. ఇక్కడ కూడా అంతే ‘ ఆ అమ్మాయి..’ కథ కొత్త పాయింట్‌ తో … Read more

  ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ రిలీజ్

  సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ఈ ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఒక అమ్మాయిని క‌ష్ట‌ప‌డి సినిమాలో న‌టించేందుకు డైరెక్ట‌ర్‌ ఒప్పిస్తాడు. కానీ ఆమె తండ్రికి అది ఇష్టం లేక‌పోవ‌డంతో సినిమా మ‌ధ్య‌లో ఆగిపోతుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అత‌డి సినిమా క‌ల నేర‌వేరిందా లేదా అనే క‌థాంశంతో సినిమా తెర‌కెక్కిన‌ట్లుగా తెలుస్తుంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెప్టెంబ‌ర్ … Read more

  ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సాంగ్ రిలీజ్

  సుధీర్‌బాబు, కృతిశెట్టి జంట‌గా న‌టిస్తున్న మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ మూవీ నుంచి కొత్త‌కొత్త‌గా అనే రొమాంటిక్ సాంగ్‌ను నేడు విడుద‌ల చేశారు. వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను సింగ‌ర్స్ చైత్ర‌, అభ‌య్ క‌లిసి పాడారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. సెప్టెంబ‌ర్ 16న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

  Macherla Niyojakavargam Review

  నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఒక క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయ‌ని చిత్ర‌బృందం మొద‌టినుంచి చెప్తుంది. కృతిశెట్టి, క్యాథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రేష్ఠ్ మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కథేంటంటే.. సిద్ధార్థ్‌ రెడ్డి(నితిన్‌) ఒక ఐఏఎస్ ఆఫీస‌ర్‌. అత‌డికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా పోస్టింగ్ వ‌స్తుంది. అక్క‌డ రాజ‌ప్ప అనే బ‌డా రౌడీ, రాజ‌కీయ‌నాకుడితో సిద్ధార్త్ రెడ్డికి వైరం ఏర్ప‌డుతుంది. మ‌రి … Read more

  ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మేకింగ్ వీడియో

  నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మూవీ ఆగ‌స్ట్ 12న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. క్యాథ‌రిన్, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా న‌టించారు. అయితే తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. యాక్ష‌న్ సీన్ల‌కు సంబంధించిన షూటింగ్, డ్యాన్స్ ప్రాక్టీస్ వంటివి ఇందులో చూడ‌వ‌చ్చు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించాడు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్, పాట‌లు మూవీపై అంచ‌నాల‌ను పెంచుతున్నాయి.

  దుమ్ములేపిన నితిన్ మాచర్ల నియోజకవర్గం ట్రైలర్

  టాలీవుడ్ హీరో నితిన్ మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్లో నితిన్ మాస్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు ఫైట్స్ లెవల్, డైలాగ్స్ తో హీరో దుమ్ములేపాడు. ఇక ఈ చిత్రం ఆగస్ట్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ సరసన కేథరిన్ త్రెసా, కృతి శెట్టి నటించారు. ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సముద్రఖని ప్రధాన విలన్‌గా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి చిత్రాన్ని నిర్మించారు.