• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • REVIEW: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

    విభిన్న కథలతో, చొక్కాలు చించుకునే మాస్‌ సీన్లు లేకుండా మనసుకు హత్తుకునే సినిమాలు తెరకెక్కిస్తాడు మన మోహన కృష్ణ ఇంద్రగంటి. సుధీర్‌ బాబు, కృతిశెట్టితో ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ ఇవాళ మరోసారి వెండితెర అభిమానులను పలకరించాడు. గతంలో సుధీర్‌తో ప్రేక్షకులను ‘సమ్మోహన’ పరిచాడు. మరి ఈ సారి వీరి కాంబో వర్కవుట్‌ అయిందా. చూద్దాం

    కథ:

    కథ రాసుకోవడంలో మోహన కృష్ణ భిన్నంగానే ఆలోచిస్తాడు. ఇక్కడ కూడా అంతే ‘ ఆ అమ్మాయి..’ కథ కొత్త పాయింట్‌ తో రాసుకున్నాడు. కథేంటంటే వరుసగా 5 బ్లాక్‌బస్టర్లు కొట్టిన ఓ దర్శకుడు నవీన్‌(సుధీర్‌ బాబు) తన శైలికి భిన్నంగా ఓ సినిమా చేయాలని ఆలోచిస్తాడు. ఆ సమయంలోనే అతడికి డా. అలేఖ్య తారసపడుతుంది. ఆమెతో సినిమా చేయాలని మన హీరో, సినిమాలో దర్శకుడ హీరోయిన్ వెంట పడుతుంటాడు. అయితే హీరోయిన్ ఇంట్లో సినిమా అంటేనే అసహ్యం, కోపం…దీనికి కూడా ఓ కారణముంది. మరి అలేఖ్య నవీన్‌ సినిమాలో నటించిందా? అలేఖ్య ఇంట్లో సినిమా అంటే ఎందుకంత కోపం? ఇవన్నీ తెరమీద చూడాల్సిందే.

    ఎలా ఉంది?:

    అన్ని మోహన కృష్ణ ఇంద్రగంటి లాంటి సినిమాల్లాగే ఇది కూడా ఉంది. నెమ్మదిగా సాగే ప్యాసింజర్‌ రైలు ప్రయాణంలా ఉంటుందన్న మాట. కథ బాగుంటుంది కానీ కథనం మెల్లగా సాగుతుంది. అది కొందరికి నచ్చవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. ఫస్టాఫ్‌ అయితే మరీ నెమ్మదిగా అనిపిస్తుంది. కథలోకి వెళ్లేందుకు చాలా సమయం తీసుకున్నాడు. ఒక ట్విస్ట్‌తో ఫస్టాఫ్‌ ముగించాడు. సెకండాఫ్ కాస్త బెటర్‌గా ఉంటుంది కానీ అది కూడా కాస్త స్లో అయినట్టే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య సీన్లు బాగున్నాయి. హీరో మొదట హీరోయిన్‌ను కలుసుకునే సీన్లు చిన్న చిన్న ట్విస్ట్‌లతో బాగుంటాయి.  వెన్నెల కిశోర్, రాహుల్‌ రామకృష్ణ ఎప్పటిలాగే బాగా నవ్వించారు. 

    సాంకేతికంగా…

    వివేక్‌ సాగర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగుంది. పాటలు కూడా ఫరవాలేదు. ఎడిటర్‌ మార్తాండ్‌ కే. వెంకటేశ్‌ ఇంకాస్త్ బెటర్‌గా చేయాల్సింది. కొన్నిఅనవసర సీన్లు తొలగించి ఉంటే బాగుండేది. పీజీ విందా కెమెరా పనితీరు బాగానే ఉంది. సినిమా క్వాలిటీ విషయంలో నిర్మాతలు రాజీ పడలేదు. కథ కూడా బాగుంది. కథనంపైనే కాస్త శ్రద్ధ పెట్టాల్సింది.

    నటీ నటులు:

    హీరో, హీరోయిన్లకు కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీనివాస్‌ అవసరాల నవ్వించారు. మిగతా నటులూ తమ పాత్రల మేరకు మెప్పించారు.

    ఫైనల్‌గా..

    మోహన కృష్ణ ఇంద్రగంటి గత సినిమాలు అద్భుతం అని మీకు అనిపిస్తే ఈ సినిమా కూడా పక్కాగా నచ్చుతుంది. కానీ ‘అష్టా చెమ్మా’ తప్ప ఆయన సినిమాలన్నీ నాకు బోరింగ్‌ అనుకునేవాళ్లకు ఈ సినిమా కూడా బోర్‌ కొడుతుంది. కానీ కొంచెం కొత్త కథ చూడాలనుకుంటే ఈ వీకెండ్‌లో ఓ సారి ట్రై చెయ్యొచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv