• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 20 నుంచి ఓటీటీలో ‘మామా మశ్చీంద్ర’

  యంగ్ హీరో సుధీర్‌బాబు నటించిన ‘మామా మశ్చీంద్ర’ మూవీ ఈ నెల 20 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఆహాలో సైతం స్ట్రీమ్ కానున్నప్పటికీ ఎప్పటి నుంచి అనేది ఖరారు కాలేదు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో థియేటర్లలో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది. నటుడు, రచయిత అయిన హర్షవర్ధన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి తేజ తదితరులు నటించారు.

  ఇలా చేస్తే సుధీర్‌బాబుతో పార్టీ చేసుకోవచ్చు

  యంగ్ హీరో సుధీర్ బాబు తన తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ స్పీడ్ పెంచారు. ఏప్రిల్‌ 14న టీజర్ విడుదల చేస్తుండగా.. ఫ్యాన్స్‌ కోసం ఆసక్తికరమైన పోటీని పెట్టారు. సినిమాకు మామా మశ్చింద్ర అనే టైటిల్ ఎందుకు పెట్టారో కనుక్కుంటే.. పెద్ద పార్టీ ఇస్తానని చెబుతోంది చిత్రబృందం. ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల అయ్యింది. టీజర్ విడుదలైన రోజున కనుగొన్న 10 మందికి సుధీర్‌బాబు, హర్షవర్ధన్‌ను కలిసే అవకాశం దక్కుతుంది. చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. Guess why the movie is … Read more

  హంట్‌ సినిమాతో సుధీర్‌ బాబు హిట్ కొట్టాడా?

  విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే సుధీర్‌ బాబు ఈ సారి థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఎంట్‌టైనర్‌తో ముందుకొచ్చాడు. చాలా రోజులుగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌బాబుకి విజయం దక్కిందా ? ఈ చిత్రంతో హిట్ ట్రాక్‌ ఎక్కాడో లేదో చూద్దాం.  కథ మలయాళ చిత్రం ముంబయి పోలీస్‌ రీమేక్ ఇది. గతం మర్చిపోయిన పోలీస్ అధికారి, తన గతాన్ని తెలుసుకుంటూ ఓ కీలక కేసును ఎలా చేధిస్తాడనేది కథ. ఇందులో భరత్, శ్రీకాంత్‌ల పాత్ర ఏమిటి ? సుదీర్ బాబు ఎందుకు గతం మర్చిపోయాడు … Read more

  అదిరిపోయిన సుధీర్‌ బాబు హంట్ ట్రైలర్

  యంగ్ హీరో సుధీర్‌ బాబు నటిస్తున్న హంట్ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. భరత్ నివాస్, శ్రీకాంత్ మేక కీలక పాత్రలు పోషించారు. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఏ కేసునైతే ఆ అర్జున్ మెుదలుపెట్టి పరిష్కరించలేకపోయాడో.. అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ పరిష్కరించాలంటూ శ్రీకాంత్ వాయిస్ ఓవర్ ఇవ్వటం ఆసక్తిని పెంచుతోంది. సినిమాను భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

  మీ అభిమానం గొప్పది: మహేశ్ బాబు

  నాన్న తనకెంతో ఇచ్చారని, అన్నింటికన్నా గొప్పది ఫ్యాన్స్ అభిమానమని మహేశ్ బాబు వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ పరమదించి 13రోజులు పూర్తయిన నేపథ్యంలో వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ‘నాన్నెంతో ఇచ్చారు. వాటిల్లో గొప్పనైనది మీ అభిమానం. ఆయనకు ఎంతో రుణపడి ఉంటాను. మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. నాన్న మన గుండెల్లోనే ఉంటారు. మన మధ్యే ఉంటారు’ అని మహేశ్‌బాబు చెప్పారు. మళ్లీ జన్మలో కూడా ఆయన అల్లుడిగానే పుట్టాలని నటుడు సుధీర్ బాబు ఎమోషనల్ … Read more

  ‘హరోం హర’ అంటున్న సుధీర్‌బాబు

  టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు ‘హరోం హర’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ [వీడియో](url)ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు జ్ణానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్నారు. 1989లో కుప్పం ప్రాంతంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. Just in case you missed it, here's … Read more

  REVIEW: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

  విభిన్న కథలతో, చొక్కాలు చించుకునే మాస్‌ సీన్లు లేకుండా మనసుకు హత్తుకునే సినిమాలు తెరకెక్కిస్తాడు మన మోహన కృష్ణ ఇంద్రగంటి. సుధీర్‌ బాబు, కృతిశెట్టితో ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ ఇవాళ మరోసారి వెండితెర అభిమానులను పలకరించాడు. గతంలో సుధీర్‌తో ప్రేక్షకులను ‘సమ్మోహన’ పరిచాడు. మరి ఈ సారి వీరి కాంబో వర్కవుట్‌ అయిందా. చూద్దాం కథ: కథ రాసుకోవడంలో మోహన కృష్ణ భిన్నంగానే ఆలోచిస్తాడు. ఇక్కడ కూడా అంతే ‘ ఆ అమ్మాయి..’ కథ కొత్త పాయింట్‌ తో … Read more

  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. విశ్వ‌క్ ఏమ‌న్నాడంటే

  యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ గురించి మాట్లాడాడు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌ని సినిమా వాళ్ల గురించి కొంత‌మందికి ఉండే ఆ చిన్న‌చూపు అంశాన్ని లేవ‌నెత్తార‌ని చెప్పాడు. ఈ పాయింట్‌ను క‌రెక్ట్‌గా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ చెప్పి ఉంటాడ‌ని అనుకుంటున్నా అన్నాడు. సెప్టెంబ‌ర్ 16న అంద‌రూ త‌ప్ప‌కుండా ఈ సినిమాను థియేట‌ర్ల‌లో చూడాల‌ని కోరాడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించారు.

  ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ రిలీజ్

  సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ఈ ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఒక అమ్మాయిని క‌ష్ట‌ప‌డి సినిమాలో న‌టించేందుకు డైరెక్ట‌ర్‌ ఒప్పిస్తాడు. కానీ ఆమె తండ్రికి అది ఇష్టం లేక‌పోవ‌డంతో సినిమా మ‌ధ్య‌లో ఆగిపోతుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అత‌డి సినిమా క‌ల నేర‌వేరిందా లేదా అనే క‌థాంశంతో సినిమా తెర‌కెక్కిన‌ట్లుగా తెలుస్తుంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెప్టెంబ‌ర్ … Read more

  ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సాంగ్ రిలీజ్

  సుధీర్‌బాబు, కృతిశెట్టి జంట‌గా న‌టిస్తున్న మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ మూవీ నుంచి కొత్త‌కొత్త‌గా అనే రొమాంటిక్ సాంగ్‌ను నేడు విడుద‌ల చేశారు. వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను సింగ‌ర్స్ చైత్ర‌, అభ‌య్ క‌లిసి పాడారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. సెప్టెంబ‌ర్ 16న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.