కేవలం ఒకే సినిమా అది తమిళంలో రిలీజ్ అయినా తెలుగులో కాజల్ టాప్ నటిగానే ఉంది. ఆమె తర్వాతి స్థానంలో రష్మిక మంధాన, సమంత ఉన్నారు. పెళ్లి, ప్రెగ్నన్సీ అంశాల వల్ల కాజల్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తూనే వచ్చింది. కీర్తి సురేశ్ ఆరో స్థానంలో, పూజా హెగ్డే, సాయి పల్లవి ఆమె తర్వాతి స్థానాల్లో నిలిచారు. యువ నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్ పదో స్థానంలో చోటు దక్కించుకుంది. రాశి ఖన్నా, నిధి అగర్వాల్, శ్రీ లీల, రెజీనా కసాండ్రా, డింపుల్ హయతి జాబితాలో ఉన్నారు.
For English Version
The 30 top Most Searched Telugu Actresses Of 2022
For Top 50 Actors
2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు
తెలుగు ప్రేక్షకులు హీరోలను ఎంత అభిమానిస్తారో హీరోయిన్లకూ అలాగే తమ గుండెల్లో గుడి కట్టుకుంటారు. అందాల రాశి తెరపై మెరిసిందంటే తన పుట్టు పూర్వోత్తరాలు గూగుల్ చేసి బయోడేటాను భద్రంగా మనసులో దాచుకుంటారు. ఎప్పటికప్పుడు ఆమెను ఫాలో అవుతూ చిన్న అప్‌డేట్ కూడా మిస్ అవ్వకుండా కాచుకుంటారు. అలా ఈ సారి గూగుల్‌లో అందరికంటే ఎక్కువ మంది వెతికిన 30 మంది తారలు వీరే. 30 top Most Searched Telugu Actresses Of 2022
1.కాజల్ అగర్వాల్
పెళ్లి , ప్రెగ్నెన్సీతో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా ఈ ‘చందమామ’ అభిమానులు ఆమె క్రేజ్ మాత్రం తగ్గనివ్వలేదు. తెలుగులో సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా సైట్లలో కాజల్ పేరును మార్మోగించి టాప్ ప్లేస్‌లో నిలిపారు.
2.రష్మిక మంధాన
పుష్ప హిట్ హ్యాంగోవర్‌లోనే రష్మిక 2022 కూడా గడిచిపోయింది. నేషనల్ క్రష్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఫ్లాప్ అయినా, ‘సీతారామం’లో సెకండ్ హీరోయిన్ రోల్ చేసినా, కాంట్రవర్సీల్లో చిక్కుకున్నా తన ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.
3.సమంత
చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత కెరీర్ ఒక్కసారిగా ఢీలా పడినట్లు అనిపించింది. కానీ యశోదతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. వ్యక్తిగతంగానూ మయోసైటిస్ వంటి అనారోగ్య సమస్యలను దాటుకుని ఒక దృఢమైన మహిళగా వచ్చిన సమంత మన లిస్ట్‌లో మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరిలో దృశ్యకావ్యం ‘శాకుంతలం’తో పలకరించబోతోంది.
4.తమన్నా
ఈ మధ్య హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టినా ఈ పాలబుగ్గల సుందరి తెలుగు సినిమాను మాత్రం వదల్లేదు. 2022లో F3తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అలాగే ఘనిలో ప్రత్యేక గీతంలో, ‘గుర్తుందా శీతాకాలం’ అమాయకపు అమ్మాయిగా మెప్పించింది. చిరంజీవి ‘భోళా శంకర్’లో మరోసారి తెలుగు తెరపై మెరవబోతోంది.
5. అనుష్క శెట్టి
తెలుగు ప్రేక్షకుల స్వీటీ, వెండి తెరపై చివరిసారిగా 2020లో కనిపించింది. అయినా ఆమె ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. స్వీటికి సంబంధించి చిన్న వార్త వచ్చినా సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తోంది.
6.కీర్తి సురేశ్
తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నా తెలుగులోనూ దూసుకుపోతున్న నటి కీర్తి సురేశ్. 2022లో గుడ్ లక్ సఖి, సర్కారు వారి పాట సినిమాల్లో మెరిసింది.కీర్తిని టాప్‌లో నిలపడంలో ‘కళావతి’ పాట ఉంది. ప్రస్తుతం నాని ‘దసరా’తో పాటు చిరు ‘భోళా శంకర్’లో నటిస్తోంది.
7. పూజా హెగ్డే
2022లో రెండు బాక్సాఫీస్ డిజాస్టర్లు ( రాధేశ్యామ్, ఆచార్య) చూసింది. కానీ, ఈ అందాల సుందరి క్రేజ్ మాత్రం తగ్గలేదు. 2023లో మళ్లీ మహేశ్ బాబు సరసన(SSMB28) ఛాన్స్ కొట్టేసింది. అందుకే మన లిస్ట్‌లోనూ టాప్10లో చోటు దక్కించుకుంది.
8.సాయిపల్లవి
సినిమాలు చేసినా చేయకున్నా ఈ లేడి సూపర్ స్టార్ క్రేజ్ మరో దశాబ్దం పాటు ఇలాగే ఉంటుందేమో. 2022లో విరాట పర్వం, గార్గి సినిమాలతో తన మార్క్ నటనతో ప్రేక్షకుల మనసు దోచింది. సోషల్ మీడియాలో సాయి పల్లవి అంత యాక్టివ్ కాకపోయినా ఆమె పేరు మాత్రం సూపర్‌యాక్టివ్!.
9.శ్రుతి హసన్
2022లో ఒక్క సినిమాలోనూ కనిపించకపోయినా శ్రుతి టాప్‌లో ఉండటానికి కారణం 2023 సంక్రాంతి సినిమాలే. బాక్సాఫీస్ ఎవర్‌గ్రీన్ సంక్రాంతి క్లాష్ చిరంజీవి, బాలయ్య సినిమాలు రెండింటిలోనూ శ్రుతినే హీరోయిన్. ప్రభాస్ సలార్‌లోనూ నటిస్తోంది. అందుకే శ్రుతి మన లిస్ట్‌లో టాప్9లో ఉంది.
10.అనుపమ పరమేశ్వరన్
2022లో ఏకంగా 4 సినిమాల్లో మెరిసింది అనుపమ.. రౌడీబాయ్స్‌లో ఎన్నడూ లేనంత బోల్డ్‌గా నటించి ఒక్కసారిగా కుర్రాళ్ల మతులు పోగొట్టింది. బ్లాక్‌బస్టర్ కార్తికేయ-2తో ఇండియా మొత్తం అనుపమ పేరు మార్మోగింది. ఏడాది చివర్లో 18 పేజెస్‌తో ఫ్లాప్ చూసినా ఓవరాల్‌గా టాప్-10 నటీమణుల జాబితాలో మాత్రం చోటు దక్కించుకుంది.
11.రాశీ ఖన్నా
తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ రెండూ చోట్లా టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉంటోంది. థ్యాంక్ యూ, పక్కా కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా ఈ అమ్మడి క్రేజ్ పడిపోకుండా మాత్రం కాపాడగలిగాయి.
12.మృణాల్ ఠాకూర్
మరో మాట లేకుండా 2022లో తెలుగులో మార్మోగిన పేరు మృణాల్ ఠాకూర్. సోషల్ మీడియాలో మోస్ట్ గ్లామరస్, బోల్డ్ బ్యూటీగా ఉండే మృణాల్ ‘సీతారామం’లో చీరకట్టుతో అబ్బాయిలను ఫిదా చేసింది.
13.రమ్య కృష్ణ
నేటితరం హీరోయిన్ కాకపోయినా నటీమణుల జాబితాలో రమ్యకృష్ణ టాప్‌లోనే ఉంది. 2022 తొలి హిట్ బంగార్రాజులో సత్యభామగా, అలాగే డిజాస్టర్‌గా మిగిలిపోయినా ‘లైగర్’లో కరీంనగర్ బాలామణిగా అదరగొట్టింది. సోషల్ మీడియాలో ఈ తార డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ కావడంతో చాలామందే ఈ పేరును వెతికారు.
14.అనసూయ భరద్వాజ్
పాజిటివ్‌గానో, నెగెటివ్‌గా అనసూయ పేరు వార్తల్లో మార్మోగడం, ఖిలాడీ, దర్జా వంటి సినిమాల్లో క్యారెక్టర్‌లకు కూడా బాగానే బజ్ రావడంతో ఈమె టాప్ జాబితాలోకి వచ్చేసింది. ‘ఆంటీ’ కాంట్రవర్సీ కొన్ని రోజులు సోషల్ మీడియాను షేక్ చేస్తే, పుష్ప-2లో స్పెషల్ సాంగ్ వార్త మరికొన్ని రోజులు వార్తల్లో నిలిచింది.
15. నిధి అగర్వాల్
సినిమాల్లో తక్కువగా కనిపించినా ఈ అందాల ‘నిధి’కి అభిమానులు మాత్రం ఎక్కువే. 2022లో అశోక్ గల్లా ‘హీరో’లో ‘సుబ్బు’గా సూపర్ క్యూట్‌గా కనిపించింది. సోషల్ మీడియాల తన హాట్ ఫోటోలకు ఉన్న ఫ్యాన్ బేస్ వేరే లెవెల్.
16. శ్రీలీల
ఈమె పేరు వచ్చే జాబితాలో పక్కాగా టాప్-10లోకి దూసుకుపోతుంది. ఏడాది చివర్లో వచ్చిన ‘ధమాకా’తో టాలివుడ్‌లో తన తఢాఖా ఏంటో చూపించబోతున్నానని ప్రకటించేసింది. శ్రీలీల క్యూట్ ఫేస్‌కు డ్యాన్స్‌కు మతిపోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో 2023ని ఏలబోతోంది.
17.రెజీనా కసాండ్రా
2020, 2021లో తెలుగు తెరపై కనిపించనేలేదు. 2022లో ఆచార్య, శాకిని డాకిని లాంటి ఫ్లాపులు. అయితేనేం ఈమె అందానికి దాసోహమంటున్నవారు మాత్రం తగ్గలేదు. సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా సోషల్ మీడియాలో ఈమె పేరును యాక్టివ్‌గా ఉంచి టాప్20లో నిలిపారు.
18.డింపుల్ హయతి
ఖిలాడిలో రవితేజ పక్కన నటించి మెప్పించింది. రంగు నలుపైన మత్తు కళ్లు, అదిరే వయ్యారాలతో కుర్రాళ్ల గుండెల్ని ఆగం చేస్తోంది. ఈ సుందరాంగి అందమైన వదనాన్ని చూసేందుకు కుర్రాళ్లు వెర్రెత్తిపోతున్నారంటే అతిశయోక్తి కాదు!
19.లావణ్య త్రిపాఠి
‘అందాల రాక్షసి’గా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ లావణ్యం..ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకుంది. ‘హ్యాపీ బర్త్ డే’తో గతేడాది పలకరించి నిరాశనే ఎదుర్కొన్నా, తన పాపులారిటీ మాత్రం పదిలంగానే ఉంది.
20. కేతిక శర్మ
‘రొమాంటిక్’గా సినిమాల్లోకి వచ్చిన కేతిక శర్మ ఇన్‌స్టా పేజ్ ఒక్కసారి చూశారంటే ఫాలో కొట్టాల్సిందే. అంతటి అందం ఆమె సొంతం. తెలుగులో చేసింది 3 సినిమాలే అయినా, అవీ హిట్‌లు కాకపోయినా, టాప్‌లో ఉందంటే కేవలం తన అందం వల్లే.
21.మెహ్రీన్ పిర్జాదా
2019లో వచ్చిన F2 తర్వాత మెహ్రీన్‌కు అసలు హిట్టే లేదు. F3 కాస్త ఫరవాలేదనిపించినా చెప్పుకోదగ్గ హిట్టైతే కాదు. అయినా ఈమె క్రేజ్ తగ్గకపోవడం ఆశ్చర్యకరమే. 2022లో అత్యధిక మంది శోధించిన వారిలో మెహ్రీన్ కూడా ఉంది మరి. ప్రస్తుతం స్పార్క్ అనే సినిమా చేస్తోంది.
22. కేథరిన్ థెరిస్సా
2022లో 3 సినిమాల్లో మెరిసింది. అందులో బింబిసార బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. యువరాణి ‘ఐరా’గా ప్రేక్షకుల మనసు దోచింది. క్యూట్ ఫేస్, హాట్ లుక్స్‌తో కేథరిన్ అభిమానుల మనసులో ముద్రవేస్తూ టాప్‌లో కొనసాగుతోంది.
23.పాయల్ రాజ్‌పుత్
పాయల్ రాజ్‌పుత్‌కు కుర్రాళ్లలో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RX100 తర్వాత అన్నీ ఫ్లాపులే ఉన్నా, గతేడాది ‘జిన్నా’తో మరో డిజాస్టర్ పడినా కానీ ఇవేమీ ఆమె క్రేజ్‌ను తగ్గించలేదు. పైగా అగ్ర నటీమణుల జాబితాలో చోటు కూడా పదిలంగానే ఉంది.
24.ఆవికా గోర్
ఈ చిన్నారి పెళ్లికూతురు తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. ఉయ్యాలా జంపాలా’తోనే తన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆవికా గోర్ తనకు సూటయ్యే పాత్రలు చేసుకుంటూ కెరీర్ పరుగులు పెట్టిస్తోంది. త్వరలో ‘పాప్‌కార్న్’ అంటూ ఓ న్యూ ఏజ్ కాన్సెప్ట్‌తో రాబోతోంది.
25.నేహా శెట్టి
2022లో క్లియర్ బ్లాక్‌బస్టర్ ‘డిజే టిల్లు’. అందులో రాధిక పాత్ర చుట్టే సినిమా అంతా. అమాయకమైన ఫేస్‌తో ఖిలాడీ లేడీగా అదరగొట్టిన నేహా, ఒక్కసారిగా టాప్ హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోయింది.
26.హెబా పటేల్
ఈ ‘కుమారి’ నటించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ థియేటర్లలోకి రాకపోయినా..ఓటీటీలో గట్టిగానే మార్మోగింది. పక్కా తెలంగాణ యాసలో హెబా పలికిన డైలాగులు ఇన్‌స్టా రీల్స్‌లో ట్రెండింగ్‌లోకి చేరాయి. అలాగే తనను టాప్ హీరోయిన్‌గాను నిలబెట్టాయి.
27.ఈషా రెబ్బ
తెలుగులో చెసినవి తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉన్న భామ ఈశ రెబ్బ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. గతేడాది తెలుగులో సినిమాలు ఏమి చేయకపోయినా అంతకుముందు సంవత్సరం పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీలో నటించింది.
28.కృతి శెట్టి
‘ఉప్పెన’తో అలలా ఎగిసిపడ్డ కృతి, వరుస అవకాశాలు దక్కించుకుని 2022లో బిజీ హీరోయిన్‌గా మారింది. కానీ ఆ ఏడాది మొత్తం ఫ్లాపులనే చూసింది. అందుకే జాబితాలో చివరికి వచ్చేసింది. ప్రస్తుతానికి జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటోంది. ఒక్క హిట్‌పడితే మళ్లీ లిస్ట్‌లో ముందుకు దూసుకెళ్లొచ్చు.
29.వర్ష బొల్లమ్మ
తమిళంలో బాగా పాపులర్ అయిన వర్ష బొల్లమ్మ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం తెలుగుపై పెట్టింది. గతేడాది సెల్ఫీ, స్టాండప్ రాహుల్,స్వాతి ముత్యం సినిమాలతో బిజీగా కనిపించింది. తన అందమైన స్మైలింగ్ లుక్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
30.అనన్య నాగళ్ల
తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ అనన్య నాగళ్లకు.. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. హాట్ పిక్స్ పెడుతూ ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంది. గతేడాది విడుదలైన ఊర్వశివో రాక్షసివో మూవీలో అనన్య స్పెషల్ అప్పీయరన్స్ ఇచ్చింది. ప్రస్తుతం శాకుంతలం మూవీలో నటిస్తోంది.
31.ఫరియా అబ్దుల్లా
50కి పైగా స్టేజి షోలు చేసిన ఫరియా, 2021 బ్లాక్‌బస్టర్ ‘జాతిరత్నాలు’లో చిట్టిగా మనసులు దోచింది. 2022లో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా అంతగా ఆడకపోయినా..స్పెషల్ సాంగ్స్, సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఈమెను రేసులో నిలబెట్టాయి.
For English Version
The 30 top Most Searched Telugu Actresses Of 2022
For Top 50 Actors
2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!