తెలుగు సినిమాలు హిట్ కావాలంటే ఆ చిత్రాల్లో ఎంతో కొంత గ్లామర్ కంటెంట్ ఉండాల్సిందే. సినిమా అంటేనే నవ రసాల కలయిక. అందులోనూ శృంగార రసం చాలా మంది ప్రేక్షకులు కోరుకునే ప్రధానమైన ఎలిమెంట్. అయితే మన తెలుగు హీరోయిన్లు కేవలం సినిమాల్లోనే కాకుండా.. ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులను ఆకర్షిస్తుంటారు. అలాంటి టాప్ 50 గ్లామర్ డాల్స్ తెలుగులో ఎవరో ఓసారి చూద్దాం.
కాజల్ అగర్వాల్
పెళ్లి , ప్రెగ్నెన్సీతో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా ఈ ‘చందమామ’ అభిమానులు ఆమె క్రేజ్ మాత్రం తగ్గనివ్వలేదు.తెలుగులో సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా సైట్లలో కాజల్ పేరును మార్మోగించి టాప్ ప్లేస్‌లో నిలిపారు.
రష్మికా మంధానా
పుష్ప హిట్ హ్యాంగోవర్‌లోనే రష్మిక 2022 కూడా గడిచిపోయింది. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఫ్లాప్ అయినా, ‘సీతారామం’లో సెకండ్ హీరోయిన్ రోల్ చేసినా, కాంట్రవర్సీల్లో చిక్కుకున్నా తన ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.
సమంత
చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత కెరీర్ ఒక్కసారిగా ఢీలా పడినట్లు అనిపించింది. కానీ యశోదతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. వ్యక్తిగతంగానూ మయోసైటిస్ వంటి అనారోగ్య సమస్యలను దాటుకుని ఒక దృఢమైన మహిళగా వచ్చిన సమంత మన లిస్ట్‌లో మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరిలో దృశ్యకావ్యం ‘శాకుంతలం’తో పలకరించబోతోంది.
తమన్నా
ఈ మధ్య హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టినా ఈ పాలబుగ్గల సుందరి తెలుగు సినిమాను మాత్రం వదల్లేదు. 2022లో F3తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అలాగే ఘనిలో ప్రత్యేక గీతంలో, ‘గుర్తుందా శీతాకాలం’ అమాయకపు అమ్మాయిగా మెప్పించింది. చిరంజీవి ‘భోళా శంకర్’లో మరోసారి తెలుగు తెరపై మెరవబోతోంది.
పాయల్ రాజ్‌పూత్
అందాల ఆరబోతకు పెట్టింది పేరు పాయల్. తన ప్రియుడితో రోమాన్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి రచ్చలేపింది. దీంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ప్రస్తుతం ఈ హాట్ డాల్ ఏజెంట్, కిరాతక సినిమాల్లో నటిస్తోంది.
అనసూయ
అందంతో అభినయంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది అనసూయ. సోషల్ మీడియాలో వివాదాలు, ఆమె పెట్టే కామెంట్లు ఎప్పుడు అనసూయను వార్తల్లో నిలుపుతున్నాయి. పుష్ప సినిమా భారీ విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్
తెలుగులో అవకాశాలు తగ్గడంతో హీందీ బాట పట్టింది. రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో చివరగా కొండపొలం మూవీలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇండియన్2, అక్టోబర్ 31 నైట్ చిత్రాల్లో నటిస్తోంది
శ్రద్దా దాస్
బాలీవుడ్ హాట్ క్వీన్ తెలుగుతో అడపాదడపా గ్లామర్ రోల్స్ చేస్తూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంది. చివరగా ఏక్ మినీ కథ సినిమాలో నటించిన ఈ గ్లామర్ డాల్.. ప్రస్తుతం తెలుగులో నిరీక్షణ చిత్రంలో నటిస్తోంది
ప్రగ్యాజైశ్వాల్
అఖండ మూవీలో బాలకృష్ణ సరసన నటించి ప్రగ్యాజైశ్వాల్ అందరి దృష్టిలో పడింది. ఈ సినిమా హిట్ అయినా తెలుగులో ప్రగ్యాకు మాత్రం అవకాశాలు రావడం లేదు.
మెహ్రీన్ పిర్జాదా
2019లో వచ్చిన F2 తర్వాత మెహ్రీన్‌కు అసలు హిట్టే లేదు. F3 కాస్త ఫరవాలేదనిపించినా చెప్పుకోదగ్గ హిట్టైతే కాదు. అయినా ఈమె క్రేజ్ తగ్గకపోవడం ఆశ్చర్యకరమే. 2022లో అత్యధిక మంది శోధించిన వారిలో మెహ్రీన్ కూడా ఉంది మరి. ప్రస్తుతం స్పార్క్ అనే సినిమా చేస్తోంది.
మేఘా ఆకాశ్
స్టన్నింగ్ ఐస్‌తో కిర్రెక్కించే అందాల తార మేఘా ఆకాశ్, లై సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు చెప్పకోదగ్గ విజయాన్ని తెలుగులో నమోదు చేయలేదు. అయితేనేం అమ్మడి అందానికి సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. ప్రస్తుతం తెలుగులో రావణసుర, ప్రొడక్షన్ నం.1 చిత్రాల్లో నటిస్తోంది.
అమల పాల్
తెలుగులో ఇద్దరు అమ్మాయిలతో చిత్రం తర్వాత అమలపాల్‌కు మళ్లీ అంత పెద్ద బ్రేక్ రాలేదు. చివరగా తెలుగులో పిట్టకథలు చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో అప్పుడప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది.
2022లో ఏకంగా 4 సినిమాల్లో మెరిసింది అనుపమ.. రౌడీబాయ్స్‌లో ఎన్నడూ లేనంత బోల్డ్‌గా నటించి ఒక్కసారిగా కుర్రాళ్ల మతులు పోగొట్టింది. బ్లాక్‌బస్టర్ కార్తికేయ-2తో ఇండియా మొత్తం అనుపమ పేరు మార్మోగింది. ఏడాది చివర్లో 18 పేజెస్‌తో ఫ్లాప్ చూసినా ఓవరాల్‌గా టాప్-10 నటీమణుల జాబితాలో మాత్రం చోటు దక్కించుకుంది.
ఈష రెబ్బ
తెలుగులో చెసినవి తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉన్న భామ ఈశ రెబ్బ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. గతేడాది తెలుగులో సినిమాలు ఏమి చేయకపోయినా అంతకుముందు సంవత్సరం పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీలో నటించింది.
రితికా సింగ్
తెలుగులో గురు సినిమాతో పరిచయమైన అందాల సోయగం రితికా సింగ్. బాక్సర్ పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళ్‌లో శివలింగ సినిమాతో ఫేమస్ అయింది. ఆతర్వాత తెలుగులో నీవెవరో సినిమాలో నటించింది. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్యాన్స్‌ను మాత్రం బాగానే సంపాదించుకుంది.
మాళవిక మోహన్
విజయ్ సరసన మాస్టర్ సినిమాలో నటించిన మాళవిక మోహన్ స్టార్‌గా ఎదిగిపోయింది. తెలుగులో తనకు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని గతంలో ఈ ముద్దుగుమ్మ తన మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా డిలక్స్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో సైకియాట్రిస్ట్ రోల్ చేస్తోంది.
అదా శర్మ
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు అదాశర్మ. హార్ట్ ఎటాక్ సినిమాలో తన గ్లామర్‌తో అభిమానులకు హార్ట్ ఎటాక్ తెప్పించింది. ఇక అదాకు చేతి నిండా సినిమాలు లేకపోయినా.. ఎపుడు ఏదో ఒక ఫోటో షూట్‌తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ధరమ్ తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ఆది సాయి కుమార్‌తో ‘గరం’, అడివి శేష్‌తో ‘క్షణం’, రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమాల్లో నటించింది.
డింపుల్ హయతి
ఖిలాడిలో రవితేజ పక్కన నటించి మెప్పించింది. రంగు నలుపైన మత్తు కళ్లు, అదిరే వయ్యారాలతో కుర్రాళ్ల గుండెల్ని ఆగం చేస్తోంది. ఈ సుందరాంగి అందమైన వదనాన్ని చూసేందుకు కుర్రాళ్లు వెర్రెత్తిపోతున్నారంటే అతిశయోక్తి కాదు!
హన్సికా మోట్వాని
దేశముదురు సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ హన్సికా మోట్వాని. కందిరీగ, దేనికైనా రెడీ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఆతర్వాత చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. అయినా ఈ అమ్మడికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ఇంపైన అందాలతో కుర్రకారు గుండెల్లో ఎప్పుడూ గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో మై నేమ్ ఈజ్ శృతి సినిమాలో నటిస్తోంది.
శాలిని పాండే
తొలి సినిమా అర్జున్ రెడ్డి విజయంతో అందరి దృష్టిని ఆకర్షించింది అర్జున్ రెడ్డి. విజయ్‌తో రొమాన్స్ పండించి ఔరా అనిపించింది. సోషల్ మీడియాలో కుర్రాళ్ల ఫాలోయింగ్‌ను పెద్దఎత్తున పెంచుకుంది. తన కేరీర్‌లో అర్జున్ రెడ్డి తర్వాత ఆ స్థాయి విజయాలు లేకపోయాయి. ప్రస్తుతం మహారాజ అనే హిందీ సినిమాలో నటిస్తోంది.
అనన్య నాగళ్ల
తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ అనన్య నాగళ్లకు.. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. హాట్ పిక్స్ పెడుతూ ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంది. గతేడాది విడుదలైన ఊర్వశివో రాక్షసివో మూవీలో అనన్య స్పెషల్ అప్పీయరన్స్ ఇచ్చింది. ప్రస్తుతం శాకుంతలం మూవీలో నటిస్తోంది.
శృతిహాసన్
2022లో ఒక్క సినిమాలోనూ కనిపించకపోయినా శ్రుతి టాప్‌లో ఉండటానికి కారణం 2023 సంక్రాంతి సినిమాలే. బాక్సాఫీస్ ఎవర్‌గ్రీన్ సంక్రాంతి క్లాష్ చిరంజీవి, బాలయ్య సినిమాలు రెండింటిలోనూ శ్రుతినే హీరోయిన్. ప్రభాస్ సలార్‌లోనూ నటిస్తోంది.
రుహాని శర్మ
హిట్, చిలసౌ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది రుహాని శర్మ. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫొటోలు షేర్ చేయడంలో తగ్గేదేలే అంటుంది.
పూజా హెగ్డే
2022లో రెండు బాక్సాఫీస్ డిజాస్టర్లు ( రాధేశ్యామ్, ఆచార్య) చూసింది. కానీ, ఈ అందాల సుందరి క్రేజ్ మాత్రం తగ్గలేదు. 2023లో మళ్లీ మహేశ్ బాబు సరసన(SSMB28) ఛాన్స్ కొట్టేసింది. అందుకే మన లిస్ట్‌లోనూ టాప్10లో చోటు దక్కించుకుంది.
కీర్తి సురేష్
తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నా తెలుగులోనూ దూసుకుపోతున్న నటి కీర్తి సురేశ్. 2022లో గుడ్ లక్ సఖి, సర్కారు వారి పాట సినిమాల్లో మెరిసింది. పక్కించి అమ్మాయిలా కనపడుతూ ఫ్యాన్ బేస్‌ను తెలుగులో భారీగా పెంచుకుంది. ప్రస్తుతం నాని ‘దసరా’తో పాటు చిరు ‘భోళా శంకర్’లో నటిస్తోంది.
రాశిఖన్నా
తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ రెండూ చోట్లా టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉంటోంది. థ్యాంక్ యూ, పక్కా కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా ఈ అమ్మడి క్రేజ్ పడిపోకుండా మాత్రం కాపాడగలిగాయి.
రితు వర్మ
తెలుగులో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రితూ వర్మ. పెళ్లి చూపులు, వరుడు కావలెను, టక్ జగదీష్ వంటి హిట్లు అందుకొని ఫ్యాన్స్ గుండెల్లో చోటు సంపాదించింది. తొలినాళ్లలో గ్లామర్‌కు దూరంగా ఉన్న ఈ భామ ప్రస్తుతం గ్లామర్ డోస్ అమాంతం పెంచేసింది.
లావణ్య త్రిపాఠి
‘అందాల రాక్షసి’గా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ లావణ్యం..ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకుంది. ‘హ్యాపీ బర్త్ డే’తో గతేడాది పలకరించి నిరాశనే ఎదుర్కొన్నా, తన పాపులారిటీ మాత్రం పదిలంగానే ఉంది.
నివేతా థామస్
నిన్నుకోరి, జైలవకుశ సినిమాలతో ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ తెలుగువారికి బాగా దగ్గరైంది. రీసెంట్‌గా శాకిని డాకిని డిఫరెంట్ రోల్‌లో నటించి మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో నివేథా పెట్టే హాట్ పోస్టులకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు.
ఇలియానా
సినిమాలకు దూరమైన ఇలియానా డిక్రూజ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాల ఆరబోతతో అభిమానులను ఆకర్షిస్తోంది. తెలుగులో అనేక బ్లాక్ బాస్టర్ మూవీల్లో నటించిన ఈ గోవా బ్యూటీ బాలీవుడ్‌లోకి వెళ్లి సక్సెస్ కాలేక పోయింది. జతకాడు అండ్రూతో విడిపోయి ప్రస్తుతం వేరుగా ఉంటోంది.
నభ నటేష్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టిన గ్లామర్ డాల్ నభ నటేష్ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది. అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.ఇక సోషల్ మీడియాలో హాట్ క్లీవేజ్ షోతో ఎప్పుడు ఈ భామ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
ఐశ్వర్య రాజేష్
తమళంలో ఎక్కువ సినిమాల్లో చేసినప్పటికీ ఐశ్వర్య రాజేష్ తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించింది. కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫెమస్ లవర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. రీసెంట్‌గా రీలిజైన డ్రైవర్ జమునలోనూ యాక్టింగ్ పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.
సాయి పల్లవి
సినిమాలు చేసినా చేయకున్నా ఈ లేడి సూపర్ స్టార్ క్రేజ్ మరో దశాబ్దం పాటు ఇలాగే ఉంటుందేమో. 2022లో విరాట పర్వం, గార్గి సినిమాలతో తన మార్క్ నటనతో ప్రేక్షకుల మనసు దోచింది. సోషల్ మీడియాలో సాయి పల్లవి అంత యాక్టివ్ కాకపోయినా ఆమె పేరు మాత్రం సూపర్‌యాక్టివ్!.
ఫరియా అబ్దుల్లా
50కి పైగా స్టేజి షోలు చేసిన ఫరియా, 2021 బ్లాక్‌బస్టర్ ‘జాతిరత్నాలు’లో చిట్టిగా మనసులు దోచింది. 2022లో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా అంతగా ఆడకపోయినా..స్పెషల్ సాంగ్స్, సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఈమెను రేసులో నిలబెట్టాయి.
హెబ పటేల్
ఈ ‘కుమారి’ నటించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ థియేటర్లలోకి రాకపోయినా..ఓటీటీలో గట్టిగానే మార్మోగింది. పక్కా తెలంగాణ యాసలో హెబా పలికిన డైలాగులు ఇన్‌స్టా రీల్స్‌లో ట్రెండింగ్‌లోకి చేరాయి. అలాగే తనను టాప్ హీరోయిన్‌గాను నిలబెట్టాయి.
రెజినా కసాండ్రా
2020, 2021లో తెలుగు తెరపై కనిపించనేలేదు. 2022లో ఆచార్య, శాకిని డాకిని లాంటి ఫ్లాపులు. అయితేనేం ఈమె అందానికి దాసోహమంటున్నవారు మాత్రం తగ్గలేదు. సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా సోషల్ మీడియాలో ఈమె పేరును యాక్టివ్‌గా ఉంచి టాప్20లో నిలిపారు.
అంజలి
నితిన్ హీరోగా నటించిన మాచర్లనియోజకవర్గం సినిమాలో “రా రా రెడ్డి ఐయామ్ రెడీ” ఐటెమ్ సాంగ్‌లో నటించి అందాల ఆరబోతకు తెరలేపింది అంజలి. కేరీర్ తొలినాళ్లలో సంప్రదాయబద్దమైన పాత్రలు చేసిన అంజలి ఇప్పుడు దేనికైనా రెడీ అంటూ హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోతోంది.
తాప్సి
ప్రస్తుతం తాప్సికి పెద్దగా తెలుగులో అవకాశాలు లేనప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.సొట్టబుగ్గల అందాలతో గిలిగింతలు పెడుతూనే ఉంటుంది.
అలియా భట్
RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటి అలియా భట్. సీతా పాత్రలో ఒదిగిపోయి అందర్ని మెప్పించింది. ఆ తర్వాత బ్రహ్మస్త్రలో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు పెట్టే గ్లామర్ ఫొటోలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.
అను ఇమ్మాన్యుయేల్
అందం ఉన్నా అదృష్టం లేని అతి తక్కువ మంది హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు.పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి..అల్లు అర్జున్ నా పేరు సూర్య లాంటి సినిమాలు కూడా చేసింది. కానీ లక్ కలిసి రాక అలాగే మిగిలిపోయింది. తాజాగా అల్లు శిరీష్ సరసన నటించిన ఊర్వశివో.. రాక్షసివో చిత్రంలో అందాల ఘాటును అమాంతం పెంచింది. అవకాశాల కోసం తగ్గేదేలే అంటూ నిర్మాతలకు హింట్ ఇచ్చింది.
కృతి శెట్టి
‘ఉప్పెన’తో అలలా ఎగిసిపడ్డ కృతి, వరుస అవకాశాలు దక్కించుకుని 2022లో బిజీ హీరోయిన్‌గా మారింది. కానీ ఆ ఏడాది మొత్తం ఫ్లాపులనే చూసింది. అందుకే జాబితాలో చివరికి వచ్చేసింది. ప్రస్తుతానికి జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటోంది. ఒక్క హిట్‌పడితే మళ్లీ లిస్ట్‌లో ముందుకు దూసుకెళ్లొచ్చు.
చాందిని చౌదరి
ఇండస్ట్రీలోకి రాకముందు పలు షార్ట్ ఫిల్మ్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ 2020లో సుహాస్ సరసన కలర్ ఫోటో సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సమ్మతమే సినిమాలో నటించిన చాందిని గ్లామర్ షోతో రెచ్చిపోయింది. కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్, బొంభాట్, సూపర్ ఓవర్ చిత్రాలతో బాగా పాపులల్ అయింది.
నిత్యామీనన్
అందాల తార నిత్యమీనన్ అటు అభినయంతో పాటు తన గ్లామర్‌తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. నిత్యా మీనన్ ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా తగ్గించినప్పటికీ, వెబ్ సిరీస్‌లలో మాత్రం దూసుకెళ్తోంది. భీమ్లానాయక్ తర్వాత ప్రస్తుతం తెలుగులో కుమారి శ్రీమతి మూవీలో నటిస్తోంది.
రుక్సర్ ధిల్లాన్
కృష్ణార్జున యుద్ధం చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది రుక్సర్ ధిల్లాన్ . ఆ తర్వాత అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ నటించి మెప్పించింది. ఈ సినిమాలో ఆమె నటన, అందంకు ఫాన్స్ ఫిదా అయ్యారు.ప్రస్తుతం రుషి అనే హిందీ సినిమాలో ఈ హాట్ బ్యూటీ నటిస్తోంది.
అనన్య పాండే
లైగర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది అనన్య పాండే. ఆ సినిమా ఫలితం తేడా కొట్టడంతో తెలుగులో స్టార్‌గా ఎదుగుదాం అనుకున్న ఆమె ఆశలు బెడసి కొట్టాయి. అయితేనేం.. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. హాట్ హాట్ పొట్టి డ్రెస్సుల్లో పిక్స్ షేర్ చేస్తూ అందాల విందు చేస్తూనే ఉంది.
నివేతా పేతురాజ్
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరితో బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ ముద్దుగుమ్మ వెలుగులోకి వచ్చింది. సపోర్టింగ్ రోల్ అయ్యినప్పటికీ తన మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ తర్వాత ‘అలా వైకుంఠపురం లో’, ‘బ్రోచేవారు ఎవరురా’, ‘రెడ్’ ‘పాగల్’ వంటి హిట్ చిత్రాలలో నటించింది నివేత పేతు రాజ్. నటనతోనే కాకుండా గ్లామర్ పరంగాను ప్రేక్షకులను మెప్పిస్తోంది.
హనీరోజ్
వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన హనీ రోజ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన వంపు సొంపులతో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎప్పుడూ హాట్ జోష్‌తో కవ్విస్తూ ఉంటుంది.
మీనాక్షి చౌదరి
‘ఇచట వాహనాలు నిలుపరాదు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హర్యానా అందం మీనాక్షి చౌదరి. మొదట కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ భామ అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్ 2’లో హీరోయిన్‌గా నటించి హిట్ కొట్టింది.
అషిక రంగనాథ్
అమిగోస్ చిత్రం ద్వారా తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది కన్నడ సోయగం అషిక రంగనాథ్. ఇప్పటికే విడుదలైన ‘ఎన్నో రాత్రులు వస్తాయి గానీ’ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఆ సాంగ్‌లో అషిక పండించిన హాట్ అందాలు వెరే లెవల్. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.
శ్రీలీల
గతేడాది చివర్లో వచ్చిన ‘ధమాకా’తో టాలివుడ్‌లో తన తఢాఖా ఏంటో చూపించింది శ్రీలీల. నాజుకైన అందాలతో గ్లామర్ షో చేసిందీ కర్ణాటక సోయగం. శ్రీకాకుళం కండక్టర్ డ్యాన్స్‌తో పెద్దఎత్తున ఫ్యాన్స్‌ను సంపాందించుకుంది. ఈ ఏడాది వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్