సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటాయి. విలన్ నటన బట్టి ఆ పాత్రనూ ఆదరించేవారు ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రేజ్‌తో సంబంధం లేకుండా సైడ్ పాత్రలు కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటాయి. తెరపై ఆ పాత్ర సాగుతున్నంతసేపు తమ వెంటే ప్రేక్షకుల అటెన్షన్‌ను తీసుకువెళ్తుంటాయి. టాలీవుడ్‌లో మరో పదేళ్లు గడిచినా ఆ పాత్రలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ పాత్రలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి?
Contents
సత్యరాజ్ (బాహుబలి)
బాహుబలిలో ప్రభాస్, రాణా పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్ కట్టప్ప. దర్శకుడు రాజమౌళి ఈ పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. కట్టప్ప పాత్ర లేకుండా బాహుబలి చిత్రాన్ని అసలు ఊహించలేము. సీనియర్ నటుడు సత్యరాజ్ (Sathyaraj) ఆ పాత్రలో పరాకయప్రవేశం చేసి మరి నటించాడు.
ప్రకాష్ రాజ్ (అతడు)
మహేష్ కెరీర్‌లో వచ్చిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. ఇందులో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునే పాత్ర ప్రకాష్ రాజ్‌ది. సీబీఐ ఆఫీసర్‌గా అతడి అందరినీ అలరించాడు. కేసు దర్యాప్తు సందర్భంగా ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
సుకుమారి (మురారి)
మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మురారి’ (Murari) చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని శబరి పాత్రలో సీనియర్ నటి మెప్పించింది. మహేష్ జాతకంలో ఉన్న గండం వల్ల అతడికి ఏం జరుగుతుందో అని భయపడుతూ సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. హీరో కోసం చివర్లో ప్రాణ త్యాగం చేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.
శ్రీకాంత్ (శంకర్‌దాదా MBBS)
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన ‘శంకర్ దాదా MBBS’ చిత్రం అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది. ఇందులో ‘ఏటీఎం’ అనే పాత్ర ఎంతో కీలకమైనది. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఈ పాత్రలో కనువిందు చేశాడు. చిరుకి రైట్‌గా ఉంటూ సందర్భానుసరంగా వచ్చే సీన్లలో నవ్వులు పూయించాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘శంకర్ దాదా జిందాబాద్’లోనూ శ్రీకాంత్ ఈ తరహా పాత్రనే చేసి అదరగొట్టాడు.
రాజేంద్ర ప్రసాద్ (ఆ నలుగురు)
డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదని నిరూపించిన చిత్రం ‘ఆ నలుగురు’ (Aa Naluguru). ఇందులో రఘు రామయ్య పాత్రలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) నటించాడు. నైతిక విలువలు కలిగిన ఓ పత్రికా ఎడిటర్‌గా, ఎంత కష్టం వచ్చినా న్యాయంగా వ్యవహరించే ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు.
శ్రీహరి (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)
సిద్ధార్థ్ – త్రిష జంటగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో నటుడు శ్రీహరి (Srihari)కి మంచి పాత్ర దక్కింది. హీరోయిన్‌కు అన్నగా ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు. అన్న అంటే ఎలా ఉండాలో ఈ పాత్ర ద్వారా తెలియజేశారు. క్లైమాక్స్‌లో హీరో చేసిన హత్యను తనపైన వేసుకొని జైలుకు వెళ్లే దృశ్యాలు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.
గొల్లపూడి మారుతిరావు (లీడర్)
దిగ్గజ నటుడు గొల్లపూడి మారుతిరావు (Gollapudi Maruti Rao).. ‘లీడర్’ సినిమాలో ఓ అద్భుతమైన క్యామియో చేశారు. సీనియర్ పొలిటిషన్‌గా హీరో రాణాతో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడతాయి. ఆ సీన్‌పై మీరు ఓ లుక్కేయండి.
అభినవ్ గోమఠం (ఈ నగరానికి ఏమైంది)
తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హాస్య నటుల్లో అభినవ్ గోమఠం ఒకరు. ఈ నగారానికి ఏమైంది చిత్రం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కౌషిక్ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.
సుహాసిని (నువ్వు నాకు నచ్చావ్)
వెంకటేష్ – ఆర్తి అగర్వాల్ జంటగా చేసిన ఈ చిత్రంలో సీనియర్ నటి సుహాసిని (Suhasini) హీరోయిన్‌కు అత్తగా మెప్పించింది. అత్తింటిలో కొందరి ఆడవారి కష్టాలు ఎలా ఉంటాయో తన డైలాగ్స్ ద్వారా కళ్లకు కట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరోయిన్ తండ్రిని పెళ్లికి ఒప్పించే సీన్ అదరహో అనిపిస్తుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!