తెలుగులో అత్యంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతికొద్దిమంది హీరోల్లో మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా… తనకంటూ ప్రత్యేకమైన శైలీ, యాక్టింగ్ నేచర్‌తో అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్నో సేవకార్యక్రమాలు చేస్తూ.. రియల్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. మరి అలాంటి సూపర్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
మహేష్ బాబు పుట్టినరోజు ఎప్పుడు?
మహేష్ బాబు ఆగస్టు 9న చెన్నైలే జన్మించారు. నటుడు కృష్ణ, ఇందిరలకు జన్మించిన ఐదుగురు పిల్లలలో అతను నాల్గవవాడు.
మహేష్ బాబు ఎవరు?
మహేష్ బాబు ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత.
మహేష్ బాబు ఎత్తు ఎంత?
6 అడుగులు
మహేష్ బాబు హీరోగా ఎన్ని సినిమాలు ఆడాడు?
సూపర్ స్టార్ మహేష్ నీడ (1979) చిత్రంలో బాల నటుడిగా తన నట జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత, అతను బాల నటుడిగా బాల నటుడిగా 9 సినిమాలు చేసాడు. మేయిన్ హీరోగా ఇప్పటి వరకు 28 చిత్రాలకు పనిచేశాడు.
మహేష్ బాబుకు పెళ్లయిందా?
మహేష్ బాబు.. మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్‌ను ఫిబ్రవరి 10, 2005న వివాహం చేసుకున్నాడు. వంశీ చిత్రంలో మహేష్ సరసన నమ్రత కలిసి నటించారు.
మహేష్ బాబు ఎక్కడ నివసిస్తున్నారు?
మహేష్ బాబు నికర ఆస్తుల విలువ రూ.150 కోట్లు. భారతదేశంతో పాటు విదేశాలలో అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నాడు. అతను తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఒక విలాసవంతమైన ఎస్టేట్‌లో నివసిస్తున్నాడు.
మహేష్ బాబు కొత్త సినిమా ఏమిటి?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో కలిసి # SSMB29లో నటిస్తున్నాడు.
మహేష్ బాబుకి ఇష్టమైన ఆహారం, పుస్తకాలు మరియు అభిరుచులు?
ప్రిన్స్ మహేష్ బాబుకి ఇష్టమైన వంటలలో హైదరాబాదీ బిర్యానీ ఒకటి. మహేష్‌కు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం.”ఎమోషనల్ ఇంటెలిజెన్స్” మహేష్‌కి ఇష్టమైన పుస్తకం.
మహేష్ బాబుకి ఫిల్మ్ అవార్డ్స్
మహేష్ బాబు ఎనిమిది ప్రతిష్టాత్మక నంది అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, మూడు సిని’మా’ అవార్డులు, మూడు సంతోషం ఫిల్మ్ అవార్డులు, నాలుగు SIIMA అవార్డులు అందుకున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!