• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Heeramandi Telugu Review: ఓటీటీలో విడుదలైన ‘హీరామండి’ ఎలా ఉందంటే?

    నటీనటులు : మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సేగల్‌ తదితరులు

    దర్శకత్వం : సంజయ్‌ లీలా భన్సాలీ

    సంగీతం : సంజయ్‌ లీలా భన్సాలీ, బెనెడిక్ట్‌ టేలర్‌, నరేన్‌ చందవర్కర్‌

    సినిమాటోగ్రఫీ : సుదీప్‌ ఛటర్జీ, మహష్ లిమాయే, హున్‌స్టాంగ్‌ మహాపాత్రా, రగుల్‌ ధరుమాన్‌

    ఎడిటర్‌ : సంజయ్‌ లీలా భన్సాలీ

    నిర్మాణ సంస్థ: భన్సాలీ ప్రొడక్షన్స్‌

    ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ : నెట్ ఫ్లిక్స్‌ 

    విడుదల తేదీ : 1 మే, 2024

    గత కొన్ని రోజులుగా దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సిరీస్‌ ‘హీరామండి ; ది డైమండ్‌ బజార్‌’ (Heeramandi: The Diamond Bazaar). బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌తోనే ఆయన తొలిసారి ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు.  ఈ వెబ్‌సిరీస్‌లోబాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా (Manisha Koirala), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), రిచా చద్దా (Richa Chadha), షర్మిన్ సెగల్ (Sharmin Segal), సంజీదా షేక్‌ (Sanjeeda Sheikh)లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ సిరీస్‌ అందరి అంచనాలను అందుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.

    కథేంటి?

    ఈ సిరీస్‌ కథ బ్రిటీష్ పాలనలో 1930-1940ల మధ్య జరుగుతుంటుంది. పాకిస్తాన్‌ లాహోర్‌లోని హీరామండి ప్రాంతంలో ఓ భారీ వేశ్య గృహాన్ని మల్లికాజాన్ (మనీషా కొయిరాల) నడుపుతుంటుంది. తద్వారా ఆ ప్రాంతాన్ని ఆమె శాసిస్తుంటుంది. అయితే ఆమె మాజీ శత్రువు కూతురు ఫరీదన్ (సోనాక్షి సిన్హా).. మల్లికాజాన్‍ను దెబ్బకొట్టి హీరామండి హుజూర్‌ కావాలని ప్రయత్నిస్తుంటుంది. మరికొందరు కూడా మల్లికాజాన్‌ పీఠంపై కన్నేస్తారు. మరోవైపు దేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రంగా జరుగుతుంటుంది. మల్లికాజాన్ కూతుర్లలో ఒకరైన బిబ్బో జాన్ (అదితి రావ్ హైదరి).. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని పోరాటాలు చేస్తుంది. చిన్నకూతురు ఆలమ్‍జెబ్ (షార్మిన్ సేగల్).. ఓ నవాబు తాజ్‍దార్ (తాహా షా బాదుషా)ను ప్రేమించి.. హీరామండి నిబంధనలను బేఖాతరు చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? హీరామండిలో ఆధిపత్యం కోసం మల్లికాజాన్, ఫరీదన్ మధ్య ఎలాంటి పోరు జరిగింది? హీరామండి నాయకత్వం చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్లింది? అనేది స్టోరీ.

    ఎవరెలా చేశారంటే?

    మల్లికాజాన్‌ పాత్రలో మనీషా కోయిరాలా అదరగొట్టింది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో మెప్పించింది. పాత్రలోని గ్రేస్‌, ఆథారిటీ, కామాండింగ్‌ను తన హావాభావాలతో చూపిస్తూ ఆకట్టుకుంది. మల్లికా జాన్‌కు సవాలు విసిరే పాత్రలో సోనాక్షి సిన్హా మెరిసింది. జిబ్బోజాన్ పాత్రలో అదితిరావ్ హైదరి ఆకట్టుకుంది. హీరామండిలోని దుర్భర పరిస్థితులపై పోరాడే యువ వేశ్య పాత్రలో ఆమె మెప్పించింది. విధి నుంచి తప్పించుకోవాలనుకునే అమాయకమైన యువతి పాత్రలో షర్మిన్‌ సెగల్‌ కనిపించింది. తాహా షా, జేసన్ షా, శేఖర్ సుమన్, పర్హీద్ ఖాన్, ఇంద్రేశ్ మాలిక్ తదితరులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే?

    స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ మరోమారు ఈ సిరీస్‌ ద్వారా తన మార్క్ ఏంటో చూపించాడు. సంఘర్షణ, డ్రామా చాలా స్ట్రాంగ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా ఆయన ఎంచుకున్న పాత్రలన్నీ కథపై బలమైన ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా బ్రిటిష్‌ కాలంలో వేశ్యల స్థితిగతులు, వారి మధ్య ఆదిపత్య పోరు ఎలా ఉండేదో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. కథకు దేశ భక్తిని జోడించడం సిరీస్‌కు బాగా ప్లస్ అయ్యింది. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అక్కడక్కడ వీక్షకులు బోర్‌గా ఫీలవుతారు. 

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఈ సిరీస్‌కు మ్యూజిక్‌ బాగా ప్లస్ అయ్యింది. బెనెడిక్ట్‌ టేలర్‌, నరేన్‌ చందవర్కర్‌ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అటు సినిమాటోగ్రాఫర్ల పని తనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా చక్కటి పనితీరు కనబరిచింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • ప్రధాన తారగణం నటన
    • కథ, కథనం
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • సాగదీత సన్నివేశాలు
    • స్లో న్యారేషన్

    Telugu.yousay.tv Rating : 3/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv