• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kumari Aunty: నాని, NTR భార్య భయపడ్డారు.. కన్నీళ్లు పెట్టుకున్న కుమారి అంటీ!

    గత కొన్ని రోజులుగా కుమారి ఆంటీ (Kumari Aunty) పేరు సోషల్‌ మీడియాలో మార్మోగుతూ వస్తోంది. హైదరాబాద్‌లో రోడ్డు పక్కన ఫుడ్‌ అమ్ముకునే ఈ మహిళ యూట్యూబ్‌ ఛానెళ్ల రంగ ప్రవేశంతో వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతో ఇటీవల ఆమె ఫుడ్‌ సెంటర్‌ను క్లోజ్‌ చేయాలని పోలీసులు ఆదేశించారు. సీఎం రేవంత్‌ రెడ్డి రంగ ప్రవేశం చేసి యథావిధిగా కొనసాగించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆమె రాష్ట్రస్థాయిలో పాపులర్‌ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన వ్యాఖ్యలు వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    కన్నీరు పెట్టిన కుమారి ఆంటీ!

    ఫుడ్‌ స్టాల్‌ మూతపడకుండా సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఆదేశాలు ఇవ్వడంపై కుమారి ఆంటీ సంతోషం వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో కన్నీరు పెట్టుకున్నారు. సీఎం స్థాయి వ్యక్తి తమను గుర్తించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

    ఆ స్టార్లు క్రౌడ్‌ చూసి భయపడ్డారు!

    ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ చేసిన ఇంటర్యూలో కుమారి ఆంటీ (Kumari Aunty) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో నాని (Hero Nani), తారక్‌ (Jr NTR) భార్య లక్ష్మి ప్రణితి (Lakshmi Pranathi) కూడా తన వద్ద భోజనం చేసేందుకు వచ్చారని తెలిపారు. అయితే ఇక్కడ ఉన్న క్రౌడ్‌ చూసి భయపడి వారు వెళ్లిపోయారు చెప్పారు. ఈ వీడియో కూడా #KumariAunty హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అవుతోంది. 

    ‘ఆ ప్రచారాలు.. అబద్దాలే’

    తనకు రూ.కోటి రూపాయల ఇల్లు, ప్లాటు ఉందని బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కుమారి ఆంటీ స్పష్టం చేశారు. నవంబర్‌లో జగన్‌ అన్న ఇచ్చిన ప్రభుత్వ ఇల్లు ఒక్కటే తన పేరిట ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైసీపీ వర్గాలు వైరల్ చేస్తున్నాయి.

    ‘కులం చూడం.. మతం చూడం’

    ఏపీలోని తెలుగుదేశం, వైసీపీ పార్టీలకు సంబంధించి కుమారి ఆంటీ (Kumari Aunty) చేసిన భిన్న వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్‌ ‌అవుతోంది. ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె తాను ఇప్పటివరకూ టీడీపీకే ఓటు వేస్తూ వచ్చానని తెలిపారు. మరో వీడియోలో జగన్ ఇల్లు ఇచ్చారని చెప్పారు. దీన్ని వైసీపీ వర్గాలు అనుకూలంగా మార్చుకొని ప్రచారం చేసుకుంటున్నాయి. కులం, మతం, పార్టీలు చూడకుండా సీఎం జగన్ (Jagan Mohan Reddy) ఇల్లు ఇచ్చారని తమ నాయకుడ్ని ప్రశంసిస్తున్నారు. 

    కుమారి ఆంటీ పేరుతో స్లోగన్స్‌!

    ఇదిలా ఉంటే కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ వద్ద (#KumariAunty) రోజు రోజుకి రద్దీ పెరిగిపోతోంది. ఆమె క్రేజ్‌ను చూసిన కొందరు యువకులు తమదైన స్లోగన్స్‌తో ఆమె పట్ల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. 

    ‘ఎవరూ డిజప్పాయింట్‌ అవ్వొద్దు’

    పెద్ద సంఖ్యలో ఫుడ్‌ లవర్స్‌ కుమారి ఆంటీ స్టాల్‌కు (#KumariAunty) వెళ్తుండటంతో విపరీతమైన అక్కడ విపరీతమైన తాకిడి ఉంటోంది. దీంతో చాలా మంది తినకుండానే వెనుదిరుగుతున్నారు. దీని గురించి ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఆమె వద్ద ప్రస్తావించగా ఎవరూ డిజాప్పాయింట్ అవ్వొద్దని చెప్పారు. తనలాగే పక్కన చాలా ఫుడ్‌ కోర్ట్స్‌ ఉన్నాయని వారి వద్ద తినాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv