2024 సంవత్సరంలో భారతదేశం అనేక రంగాల్లో సంచలనమైన వార్తలతో నిండిపోయింది. రాజకీయాలు, క్రీడలు, వినోదం, సంస్కృతి వంటి విభాగాల్లో చోటుచేసుకున్న ఈ సంఘటనలు ప్రజలలో చర్చనీయాంశంగా నిలిచాయి. రాజకీయ కల్లోలాలు, చట్టపరమైన పోరాటాలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన సంఘటనలు, క్రీడా విజయాలు ఇవన్నీ భారతీయుల దృష్టిని ఆకర్షించాయి.
ముఖ్యంగా, సెలబ్రిటీ వివాహాలు, వైరల్ వీడియోలు, సంస్కృతికి సంబంధించిన కీలక ఘట్టాలు భారతీయులను మంత్రముగ్ధులను చేశాయి. 2024లో భారతదేశంలో టాప్ 10 వైరల్ వార్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. రాధిక-అనంత్ అంబానీ వివాహం
ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మెర్చంట్ల వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రముఖులు, భారీ అతిథి జాబితా, అద్భుతమైన ప్రదర్శనలు, వంటకాలు ఇవన్నీ ఈ వివాహాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. యూట్యూబ్‌లో ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు కోట్ల సంఖ్యలో వ్యూస్ సాధించాయి.
2. IPL 2024 & T20 ప్రపంచ కప్
2024లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మరో మైలురాయిగా నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లు, అలాగే ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో జరిగిన ఉత్కంఠభరిత క్షణాలు అభిమానులను తెగ ఉత్సాహపరిచాయి. క్రికెట్ వీడియోలు బిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని వైరల్‌గా మారాయి.
3. ‘మోయే మోయే’ పాట
సెర్బియన్ ఆర్టిస్ట్ మోయే మోయే పాడిన ఈ హాస్యభరితమైన, ఆకర్షణీయమైన పాట ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంది. భారతీయులు ఈ పాటను తమ వీడియోల్లో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌గా ఉపయోగించి విపరీతమైన క్రియేటివ్ కంటెంట్‌ను తయారుచేశారు. ఈ వీడియోలు పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి.
4. దిల్జీత్ దోసాంజ్ ప్రదర్శనలు
గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ 2024లో సోషల్ మీడియాలో ప్రభావాన్ని చూపించాడు. అతని సంగీత కచేరీలు, సినిమాలు, మరియు సోషల్ మీడియా పోస్టులు ప్రజల్ని ఆకట్టుకొని అతనిని ట్రెండింగ్ పర్సనాలిటీగా నిలిపాయి.
5. కల్కి 2898 AD & పుష్ప2 సినిమాలు
ఈ స్టార్ స్టడెడ్ మిథాలజికల్ మూవీ విడుదల.. 2024లో భారీ చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటీనటుల ప్రదర్శన, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ గురించి అభిమానులు పెద్ద ఎత్తున చర్చించారు. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పర్ఫామెన్స్ గురించి ఎక్కువగా చర్చించుకున్నారు. అలాగే ఈ ఇయర్ ఎండింగ్లో వచ్చిన పుష్ప2 చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ అన్ని రికార్డులను తన పేరిట లిఖించుకుంటోంది.
6. 2024 లోక్‌సభ ఎన్నికలు
2024 ఎన్నికలు దేశ రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టం. ప్రధాన పార్టీలు తమ విధానాలు ప్రజల ముందు ఉంచుతూ హోరాహోరీ ప్రచారం చేయడంతో రాజకీయ చర్చలు విపరీతమైన ఉత్సాహాన్ని కలిగించాయి. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ వంటి నాయకుల ప్రసంగాలు పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి.
7. రతన్ టాటా మృతి
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా అక్టోబర్ 9న మరణించారు. ఈ వార్త దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఆయన సేవల పట్ల దేశమంతా నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో సంస్మరణలు పంచుకున్నారు.
8. అజ్జు భాయ్ (టోటల్ గేమింగ్) కంటెంట్
యూట్యూబ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన గేమర్ అజ్జు భాయ్ తన క్రియేటివ్ గేమింగ్ స్ట్రీమ్స్ ద్వారా 2024లో కూడా ట్రెండింగ్‌లో కొనసాగాడు. అతని వీడియోలు యువతలో విపరీతమైన ఆదరణ పొందాయి.
9. భారత రాజ్యాంగంపై బీజేపీ-కాంగ్రెస్ చర్చలు
రాహుల్ గాంధీ, కిరణ్ రిజిజు వంటి నాయకులు భారత రాజ్యాంగంపై విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో రాజకీయం వేడెక్కింది. ఈ చర్చలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
10. క్రీడా ప్రపంచంలో వైరల్ క్షణాలు
2024లో భారతదేశం అనేక అంతర్జాతీయ, జాతీయ క్రీడా విజయాలను ఆస్వాదించింది. ముఖ్యంగా వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్‌ను 18 ఏళ్ల వయసులోనే గుకేష్ దొమ్మరాజు గెలవడం పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది.
Celebrities Featured Articles Movie News
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్