• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hanuman Jayanti 2024: దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలు ఇవే!
    Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!
    Cyclone Biporjoy : ఆఫీసులు, స్కూళ్లు అన్నీ బంద్.. ముంచుకొస్తున్న మహా ముప్పు!
    AAA Cinemas: అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు తెలుసా?
    See More

    ప్రభాస్‌ బర్త్‌డేకు ఫ్యాన్స్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌

    HYD: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద కటౌట్‌గా అది రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలో 230 అడుగుల ఎత్తైన ప్రభాస్‌ కటౌట్‌ను ఫ్యాన్స్‌ పెట్టారు. ‘సలార్’లోని స్టిల్‌తో ఉన్న ఈ కటౌట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌ ఈ కటౌట్‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. కాగా, సలార్‌ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. Ni puttina Roju Maku Pandaga la Undhi … Read more

    భర్తను రూ.5 లక్షలకు అమ్మేసిన భార్య

    పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను మరో మహిళకు భార్య అమ్మెసిన ఘటన కర్ణాటకలోని మాండ్యలో జరిగింది. స్థానికంగా ఉండే ఓ మహిళతో ఆ గృహిణి భర్త సన్నిహితంగా ఉండేవాడు. ఓ రోజు స్థానిక మహిళతో తన భర్త పడకగదిలో ఉండటం గృహిణి గుర్తించింది. ఇద్దర్ని పంచాయతీకి లాగింది. తన దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడని వాటిని తిరిగిస్తే అతన్ని అప్పగిస్తానని మహిళ తెలిపింది. దీనికి ఒప్పుకోని గృహిణి ఆ రూ.5 లక్షలు తనకే మనోవర్తిగా ఇస్తే తన భర్తను వదిలిపెడతానని తెలిపింది. దీనికి … Read more

    ఐమాక్స్ థియేటర్‌లో అర్ధరాత్రి రచ్చ

    హైదరాబాద్ – ఐమాక్స్‌ థియేటర్‌లో అర్ధరాత్రి ప్రేక్షకులు రచ్చ చేశారు. టైగర్ ష్రాప్ నటించిన గణపత్ సినిమా నిన్న రాత్రి 11.15 గంటలకు చివరి షోగా ప్రారంభమైంది. షో స్టార్ట్ అయిన కొద్దిసేపటికే.. హాలులో భరించలేని దుర్గందం వ్యాపించింది. దుర్వాసన ఎంతకీ తగ్గకపోవడంతో బయటకు వచ్చిన ప్రేక్షకులు మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ప్రేలు కొట్టిన దుర్వాసన తగ్గకపోవడంతో హాలులో రచ్చ రచ్చ చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పడంతో ప్రేక్షకులు శాంతించారు.

    కానిస్టేబుల్‌ను తొక్కుకుంటూ వెళ్లిన కారు

    హైదరాబాద్ – రోడ్డుపై వాహనలు తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు దూసుకెళ్లిన ఘటన చిలకలగూడలో జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 18న రాత్రి వాహన తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేష్.. అటుగా వస్తున్న ఓ కారును ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. https://x.com/TeluguScribe/status/1715211924110262641?s=20

    కూలీ అకౌంట్లో రూ.200 కోట్లు జమ

    యూపీలోని బతానియా గ్రామానికి చెందిన దినసరి కూలి శివప్రసాద్ ఉన్నట్టుండి కోటీశ్వరుడయ్యాడు. అతని ఖాతాలో ఏకంగా రూ.200కోట్లు జమ అయ్యాయి. ఇటీవల తన పాన్ కార్డు పొగొట్టుకున్నట్లు చెప్పిన ఆయన.. డబ్బులు ఎవరు జమ చేశారో తనకు తెలియదన్నారు. అయితే భారీ డబ్బు జమ కావడంతో ఇన్‌కం ట్యాక్స్ కట్టాలని శివప్రసాద్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆయన ఖాతా నుంచి పన్ను కింద రూ.4.58 లక్షలు డెబిట్ అయ్యాయి. దీంతో శివప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    ఐఫోన్ పొగొట్టుకున్న ఊర్వశి రౌటేలా

    పాకిస్థాన్- ఇండియా మ్యాచ్ సందర్భంగా బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటేలా తన గోల్డ్ ఐఫోన్‌ను పొగొట్టుకుంది. శనివారం మ్యాచ్ చూసేందుకు మోదీ స్టేడియానికి వెళ్లింది. ఇండియా- పాక్ మ్యాచ్ వీక్షిస్తున్న మోజులో ఐఫోన్‌ను పొగొట్టుకుంది. ఆ ఐఫోన్ తనకు ఎంతో ప్రత్యేకమైందిగా చెప్పుకొచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్‌తో ఐఫొన్ తయారైందని దయచేసి ఎవరికైనా దొరికితే ఇవ్వాల్సిందిగా సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులకు ట్యాగ్ చేసింది.

    హృదయాలను కదిలిస్తున్న వీడియో

    యూపీ: ప్రతి రోజూ ఆహారం పెట్టే వ్యక్తి మరణాన్ని ఒక కోతి తట్టుకోలేకపోయింది. ఆయన దేహం వద్ద రోధించింది. మృతదేహం వెన్నంటే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్రోహా జిల్లాకు చెందిన రామ్‌కున్వర్‌ సింగ్‌ ప్రతి రోజూ వానరానికి అన్నం పెట్టేవారు. రోజులో చాలా సమయం కోతితోనే గడిపే వారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ వీడియోను చేసి నెటిజన్లు చలించిపోతున్నారు. इससे बड़ी निःस्वार्थ प्रेम की … Read more

    రేపు ఆకాశంలో అద్భుతం

    రేపు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఎన్నో ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం శనివారం ఏర్పడనుంది. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. రేపు సా.4.30 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమవుతోంది. ఈ గ్రహణం అమెరికా, మెక్సికో, దక్షిణ మధ్య అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో కనిపించనుంది. భారత్‌లో ఇది పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. సూర్యగ్రహణం ఏర్పడటాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. చివరి సారిగా రింగ్‌ ఆఫ్ ఫైర్ 2012లో కనిపించింది.

    ‘పాక్-ఇండియా మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి’

    సోషల్ మీడియాలో #BoycottIndoPakMatch ట్రెండింగ్‌లో ఉంది. మన సైనికుల జీవితాల ముందు క్రికెట్ నథింగ్. శత్రువులు ఎప్పటికీ శత్రువులే. పాక్ క్రికెటర్లకు మహిళలతో డ్యాన్స్‌లు చేయిస్తూ స్వాగతం పలికాం.. కానీ అదే రోజు మన సైనికులను పాక్ టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారు. పుల్వామా వంటి ఘటనలను ఇంకా దేశ ప్రజలు మరిచిపోలేదు. పాక్ క్రికెటర్లను బాయ్ కాట్ చేయాలి. బీసీసీఐ టెర్రరిస్టులకు మద్దతుగా నిలుస్తోంది అని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ట్రాఫిక్ పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ

    రాంగ్ రూట్‌లో వస్తున్న వాహనాన్ని అడ్డుకున్నందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. కానిస్టేబుల్ సంయమనం పాటించినప్పటికీ విరుచుకుపడింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. మిథిలేష్ అనే మహిళా నెంబర్ ప్లేట్ లేకుండా రాంగ్ రూట్‌లో రోడ్డు మీదకు వచ్చింది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆమెను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ ట్రాఫిక్ పోలీసుతో వాగ్వాదానికి దిగి చెప్పుతో కొట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. https://x.com/TeluguScribe/status/1712361640732369311?s=20