క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ గురువారం ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీ నవంబర్ 19 వరకు 46 రోజుల పాటు సాగనుంది. 2020-2023 వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా నేరుగా వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించాయి. క్వాలిఫయింగ్ పోటీల్లో సత్తా చాటిన శ్రీలంక, నెదర్లాండ్స్ ఈ మహా సమరంలో చేరాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ జరిగిన వన్డే ప్రపంచకప్‌లలో భారత ప్లేయర్లు పలు ఘనతలు సాధించారు. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు? వారు నెలకొల్పిన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యధిక పరుగుల వీరుడు
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వన్డే ప్రపంచకప్‌లోనూ తన పేరిట ఓ రికార్డు నమోదు చేశాడు. వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డు సృష్టించాడు. సచిన్ ఈ మెగా టోర్నీలో 2,278 పరుగులు చేయడం విశేషం.
అత్యధిక సిక్సర్లు
మన దేశం తరపున వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ ఓవరాల్‌గా 23 సార్లు సిక్స్‌లు బాదాడు. ప్రస్తుతం రోహిత్ సారథ్యంలోని టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమైంది.
అత్యధిక వరల్డ్‌కప్‌లు
క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్రపంచకప్‌లు ఆడిన ప్లేయర్లు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు సచిన్ టెండూల్కర్ కాగా, ఇంకొకరు పాక్ క్రికెటర్ జావెద్ మియాందాద్. ఇద్దరూ చెరో ఆరు టోర్నీలు ఆడారు.
కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు
భారత్ తరపున వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌గా అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడింది మహ్మద్ అజహరుద్దీన్. అతడు 23 మ్యాచ్‌లు ఆడగా అందులో టీమ్‌ఇండియా పదింట గెలిచింది. 12 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
అత్యధిక క్యాచ్‌లు
ఈ మెగా టోర్నీలో భారత్ తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు. అతడు మెుత్తంగా 14 క్యాచ్‌లు పట్టాడు. స్పిన్నర్‌గానూ జట్టు విజయాల్లో కుంబ్లే కీలకపాత్ర పోషించాడు.
అత్యధిక స్టంపౌట్లు
వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా తరపున అత్యధిక స్టంపౌట్ల ఘనత మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉంది. అతడు 29 మ్యాచుల్లో 42 మంది బ్యాటర్లను ఔట్ చేశాడు.
అత్యధిక వికెట్లు
భారత్ తరపున ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జహీర్‌ఖాన్. మెుత్తం 44 మందిని జహీర్ తన బౌలింగ్‌తో పెవిలియన్‌కు పంపాడు.
వరల్డ్‌కప్ టైటిల్
భారత్ ఇప్పటివరకూ రెండుసార్లు వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది. తొలిసారి (1983) కపిల్ నాయకుడు కాగా, రెండోసారి (2011) ధోని సారథ్యంలో కైవసం చేసుకుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం