• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సచిన్ రికార్డు బ్రేక్ కానుందా?

    వన్డేల్లో విరాట్‌ కోహ్లీ మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్‌ రికార్డు బ్రేక్‌ కానుంది. మరో సెంచరీ చేస్తే సచిన్‌ సెంచరీ(49)లను కోహ్లీ సమం చేయనున్నాడు. 463 మ్యాచ్‌ల్లో 49 సెంచరీలు చేసిన సచిన్… కేవలం 285 మ్యాచుల్లోనే కోహ్లీ 48 శతకాలు చేశాడు. ఈ వరల్డ్‌ కప్‌లోనే కోహ్లీ ఆ ఫీట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అటు కోహ్లీ టెస్టులు, వన్డేలు కలిపి మొత్తం 78 సెంచరీలతో సచిన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.

    World Cup: వన్డే ప్రపంచకప్‌లో భారత ప్లేయర్ల రికార్డులు.. ఓ లుక్కేయండి!

    క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌ గురువారం ప్రారంభం కానుంది.  అక్టోబర్ 5న ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీ నవంబర్‌ 19 వరకు 46 రోజుల పాటు సాగనుంది. 2020-2023 వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన భారత్‌, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా నేరుగా వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించాయి. క్వాలిఫయింగ్‌ పోటీల్లో సత్తా చాటిన శ్రీలంక, నెదర్లాండ్స్‌ ఈ మహా సమరంలో చేరాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ జరిగిన వన్డే … Read more

    సచిన్‌కు అరుదైన గౌరవం

    భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను వన్డే ప్రపంచకప్ 2023 గ్లోబల్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. అక్టోబర్ 5 నుంచి ఇండియాలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ప్రపంచకప్ టోర్నీతో కనిపించనున్నాడు. ఈనెల 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో వరల్డ్ కప్ ట్రోఫీతో మైదానంలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో అధికారికంగా టోర్నీ ఆరంభమవుతోంది. సచిన్‌తో పాటు గ్లోబల్ అంబాసిడర్లుగా ఇయాన్ మోర్గాన్, ఏబీ డివిలీయర్స్ ఇతర మాజీ క్రికెట్లను ఐసీసీ ప్రకటించింది.

    సచిన్ ఇంట్లో గణేశ్‌ నిమజ్జన వేడుకలు

    క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్ త‌న ఇంట్లో గణేశ్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. స‌చిన్ త‌న సిబ్బందితో క‌లిసి గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలను సచిన్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం’ అంటూ రాసుకొచ్చాడు.అయితే ఈ వీడియోలో సచిన్ భార్య అంజలితో పాటు పిల్ల‌లు అర్జున్ టెండూల్కర్, సారా ఎక్కడా కూడా కనిపించలేదు. Ganpati Bappa Morya!पुढच्या वर्षी लवकर या! pic.twitter.com/4TBwqqAK1r — Sachin Tendulkar (@sachin_rt) … Read more

    సచిన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ఇవాళ్టితో 13 ఏళ్లు

    [VIDEO: ](url)క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మైదానంలో పరుగుల వరద పారించిన సచిన్‌ తన పేరిట ప్రపంచ రికార్డులను లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ప్రపంచ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్‌ నిలిచాడు. 2010లో సరిగ్గా ఇవాళ్టి రోజునే దక్షిణాప్రికాపై 200 పరుగులు సాధించి సచిన్‌ రికార్డు సృష్టించాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. టీమ్‌ఇండియా తరపున సచిన్‌ సాధించిన ఘనతను గుర్తు చేసుకుంది. ?️ #OnThisDay in 2010? … Read more

    హైవేపై చాయ్ తాగిన సచిన్

    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ రిటైరయ్యాక చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వినూత్న రుచుల కోసం బెలగాం- ముంబయి హైవేపై అన్వేషిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఓ దాబా వద్ద ఆగి.. చాయి, టోస్ట్ తీసుకున్నారు. అవి తింటుండగా తనవైపే చూస్తున్న తనయుడు అర్జున్‌‌ని పిలిచి కావాలా అని అడిగారు. ఈ ఛాయ్, టోస్ట్ ఎంతో బాగుందని సచిన్ సంతృప్తి చెందారు. అనంతరం దాబా యజమానితో ఓ సెల్ఫీ తీసుకుని అక్కడినుంచి పయనమయ్యారు. తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో సచిన్ ఈ [వీడియో](url)ను పోస్ట్ చేయగా.. నెట్టింట … Read more

    యువతలో స్ఫూర్తి నింపే సచిన్ వీడియో

    యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌ గా ఉన్న సచిన్ టెండుల్కర్ యువతలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఈమేరకు ఫుట్ బాల్ క్రీడలో రాణిస్తున్న ఇద్దరు మహిళా ప్లేయర్లను ఇంటర్వ్యూ చేశారు. వారిలో ఒకరు భారత ఫుట్ బాల్ క్రీడాకారిణి అన్షు కాగా, మరొకరు బంగ్లాదేశ్ ఫుట్ బాల్ కెప్టెన్ మరియా. వారి జీవిత లక్ష్యాలను తెలుసుకున్నారు.మనం మన లక్ష్యాలను నిశ్చయించుకున్నప్పుడు, మనల్ని ఆపగలిగే శక్తి ఏది ఉండదు అంటూ వారితో సంభాషించారు. కోవిడ్ సమయంలో తమ రంగంలో ఈ ఇద్దరు క్రీడాకారిణీలు గొప్పగా … Read more

    భారత క్రికెట్ ముఖచిత్రమే మారిన రోజది!

    జూన్ 25 1983, టీమిండియా క్రికెట్ గమనాన్ని మార్చి తమ ఆగమనాన్ని చాటిన అద్భుతమైన రోజది. ఈ రోజును తలచుకుంటే క్రీడాభిమానుల్లో ఉత్తేజం ఉప్పొంగుతుంది. క్రికెటర్ల నరనరాల్లో స్ఫూర్తి రక్తం ప్రవహిస్తుంది. ఆట మొదలుపెట్టిన అర్ధశతాబ్దానికి తొలి ప్రపంచకప్ ను ముద్దాడిన మధుర గడియలవి. సవాళ్లకు ప్రతిసవాళ్లను విసురుతూ ఎంతో మంది భారతీయులను క్రికెట్ వైపు అడుగులేసేలా చేసిన క్షణాలవి. ఒక్కసారి ఆ రోజులను గుర్తుచేసుకుందాం. తొలి మ్యాచ్ ఆడిన 50 ఏళ్లకు సంచలన మ్యాచ్ ఇండియా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోజు … Read more

    కోహ్లీ సెంచరీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న క్రీడాలోకం.. ఇప్పుడదో జాతీయ సమస్య..

    విరాట్ కోహ్లీ ఈ పేరు వింటే చాలు ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. టీమిండియా బ్యాటింగ్ లైనప్ మొత్తం ఒక వైపు, విరాట్ కోహ్లీ మరో వైపు అనేలా చూసేవారు. అలాగే ప్రణాళికలు కూడా రచించేవారు. కానీ కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అతడి బ్యాటు నుంచి పెద్ద ఇన్నింగ్స్‌లు రావడం తగ్గిపోయింది. దీంతో ప్రత్యర్థులు కూడా విరాట్ కోహ్లీని తేలిగ్గా తీసుకోవడం స్టార్ట్ చేశారనే భావన ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.  కోహ్లీ సెంచరీ అదో జాతీయ సమస్య.. రన్ … Read more