• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత క్రికెట్ ముఖచిత్రమే మారిన రోజది!

    జూన్ 25 1983, టీమిండియా క్రికెట్ గమనాన్ని మార్చి తమ ఆగమనాన్ని చాటిన అద్భుతమైన రోజది. ఈ రోజును తలచుకుంటే క్రీడాభిమానుల్లో ఉత్తేజం ఉప్పొంగుతుంది. క్రికెటర్ల నరనరాల్లో స్ఫూర్తి రక్తం ప్రవహిస్తుంది. ఆట మొదలుపెట్టిన అర్ధశతాబ్దానికి తొలి ప్రపంచకప్ ను ముద్దాడిన మధుర గడియలవి. సవాళ్లకు ప్రతిసవాళ్లను విసురుతూ ఎంతో మంది భారతీయులను క్రికెట్ వైపు అడుగులేసేలా చేసిన క్షణాలవి. ఒక్కసారి ఆ రోజులను గుర్తుచేసుకుందాం.

    తొలి మ్యాచ్ ఆడిన 50 ఏళ్లకు సంచలన మ్యాచ్

    ఇండియా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోజు జూన్ 25, 1932. కానీ టీమిండియా క్రికెట్ ప్రస్థానం మొదలైంది మాత్రం సరిగ్గా 51 ఏళ్లకు అంటే జూన్ 25,1983. ఆ సంవత్సరం కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లింది. అంతకు ముందు 1975,79 టోర్నీల్లో కనీసం లీగ్ స్టేజ్ దాటలేదు. ఈ సారి కూడా అసలు భారత జట్టును పట్టించుకున్నవారే లేరు. కానీ గతాన్ని గాల్లో కలిపేస్తూ టీమిండియా క్రికెట్ ప్రపంచాన్నిఉలిక్కిపడేలా చేసింది. గ్రూప్ స్టేజ్ లో జింబాబ్వే, వెస్టిండీస్, ఆస్ట్రేలియాను ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెమీ ఫైనల్లో ఇంగ్లండును చిత్తు చేసి అద్భుతమైన ఫామ్ తో  ఫైనల్ చేరింది. 

    క్రికెట్ ప్రపంచమే ఉలిక్కిపడిన రోజది

    జూన్ 25, లార్డ్స్ లో ఫైనల్. గత రెండు వరల్డ్ కప్ టోర్నీల్లో గ్రూప్ స్టేజ్ దాటలేని టీమిండియా ఓ వైపు, ఆ రెండు సీజన్లలో కప్పు కొట్టిన వెస్టిండీస్ మరోవైపు. కానీ కపిల్ దేవ్ సారథ్యంలోని నాటి జట్టు  సవాళ్లకు ప్రతి సవాల్ విసిరింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాను కరీబియన్లు బుల్లెట్ బంతులతో వణికించారు. అయినా ఎదురు నిలబడి 54.4 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన విండీస్ ను మదన్ లాల్ (3/31), అమర్ నాథ్ (3/12) కుప్పకూల్చారు. వివ్ రిచర్డ్స్, ఆండీ రాబర్ట్స్, వంటి దిగ్గజ ఆటగాళ్లున్న జట్టుపై 43 పరుగుల చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. 

    అది తొలి కప్పు కాదు ఎందరో దిగ్గజాల ఆశలకు తొలి అడుగు

    1983 వరల్డ్ కప్ ఎంతో మంది ఇండియన్స్ ను క్రికెట్ వైపు నడిపించింది. అందులో ఒకరు దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ‘ కొన్ని క్షణాలు మీలో స్ఫూర్తి నింపి కలగనేలా చేస్తాయి.1983లో ఈరోజు మనం కప్పు గెలిచాం. నాకు అప్పుడే తెలుసు నేను కూడా అదే చేయాలని’ అంటూ సచిన్ ట్వీట్ చేశారు.

    మరో క్రికెట్ దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ ‘ డేట్ లో ఏముంది? జూన్ 25, ఇందులో ఒక ఆరంభం ఉంది. 51 ఏళ్ల నిరీక్షణకు తెరదించి కపిల్ పాజీ నేతృత్వంలోని బృందం ప్రపంచ కప్ ను అందించింది. ఎంతో మంది క్రీడాకారులకు తొలి అడుగుగా నిలిచింది’ అంటూ ట్వీట్ చేశారు. 

    బీసీసీఐ, ఐసీసీ సైతం ఈ రోజును గుర్తు చేస్తూ నాటి భారతజట్టుపై ప్రశంసలు కురిపించాయి. 

    అప్పటి హీరోలు వీరే:

    సునీల్ గావస్కర్, క్రిస్ శ్రీకాంత్, మోహిందర్ అమర్ నాథ్, యశ్ పాల్ శర్మ, సందీప్ పాటిల్, కపిల్ దేవ్, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, సయ్యద్ కిర్మానీ, బల్వీందర్ సాంధు

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv