• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆ సమయంలో నా కెంతో బాధేసింది: షమీ

  కేన్ విలియమ్సన్ క్యాచ్ డ్రాప్‌పై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో కీలకమైన కేన్‌ విలియమ్సన్ క్యాచ్‌ను మిస్‌ చేశానని చెప్పాడు. ఆ సమయంలో తనకెంతో బాధేసిందన్నాడు. ‘దీంతో బౌలింగ్‌లో నా వంతు కోసం ఎదురు చూశా. కివీస్‌ బ్యాటర్లు దూకుడుగా షాట్లు ఆడేస్తున్నారు. పిచ్‌ కూడా చాలా బాగుంది. కానీ, తేమ ప్రభావం వస్తుందేమోనని కంగారు పడ్డాం. ఇలాంటి సమయంలో స్లో వేసే బంతులు కూడా ప్రభావం చూపకపోవచ్చు అందుకే, నేను శైలిలోనే బంతులను సంధించా’. అని షమీ చెప్పుకొచ్చాడు.

  ‘వీళ్లకంటే రోహిత్‌ ప్రత్యేకం’

  టీమిండియా సారథి రోహిత్‌ శర్మపై మాజీ క్రికెటర్లు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. పాక్‌ దిగ్గజాలు వసీమ్‌ అక్రమ్‌, షోయబ్‌ మాలిక్‌ కూడా హిట్‌మ్యాన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ‘ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్‌ శర్మ వారందరికంటే ప్రత్యేకం. ఏ బౌలర్నీ అతడు వదిలిపెట్టలేదు. ప్రత్యర్థి ఎవరైనా కానీ.. ఎలాంటి బౌలింగ్‌ దాడైనా కానీ.. వారిని దీటుగా ఎదుర్కొంటూ చాలా తేలికగా పరుగులు రాబడతాడు’. అని పాక్ క్రికెటర్లు కొనియాడారు.

  అలా మాట్లాడేందుకు సిగ్గుండాలి: షమీ

  పాక్‌ మాజీ ఆటగాడు హసన్‌ రజా టీమిండియాపై ఆరోపణలు గుప్పించాడు. భారత్ ఆడే మ్యాచ్‌ల కోసం విభిన్న బంతులను వాడుతున్నారని విమర్శలు చేశాడు. దీంతో అతడి నోటిదురుసుపై భారత పేసర్ మహమ్మద్‌ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అలా మాట్లాడేందుకు సిగ్గుండాలి. మీ గేమ్‌ మీద దృష్టిపెట్టాలి. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం కాదు. ఇప్పటికీ అదే ధోరణిలో ఉండటం హాస్యాస్పదం. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు.’ అని షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ పెట్టాడు. ఇప్పుడదీ వైరల్‌గా మారింది.

  ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటో తెలుసు: జడ్డూ

  టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను కెప్టెన్‌గానే ఆలోచిస్తా. ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటో తెలుసు. మ్యాచ్‌పై నా ప్రదర్శనతో ప్రభావం చూపించడానికే ప్రయత్నిస్తా. ఒక క్యాచ్‌ పట్టగానే.. మైదానంలో రిలాక్స్‌ అయిపోను. మెరుగ్గా ఫీల్డింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. కొన్ని సార్లు మిస్‌ఫీల్డ్ కావచ్చు.. కానీ చివరి వరకు ప్రయత్నించడం మాత్రం ఆపను’. అని జడ్డూ చెప్పుకొచ్చాడు.

  అతడి వల్లే భారీ స్కోరు సాధించాం: రోహిత్

  దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీతో భారీ స్కోరు సాధించగలిగామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు ఎంతో కీలక పాత్ర పోషించారని తెలిపాడు. అందుకే దక్షిణాఫ్రికాపై భారత్ 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిందన్నాడు. ఇంగ్లాండ్‌తో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని మరీ విజయం సాధించామని చెప్పాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా ఆడాడని రోహిత్ కొనియాడాడు.

  నా మనసంతా అక్కడే ఉంటుంది: హార్థిక్

  గాయం కారణంగా టీమిండియా జట్టు నుంచి వైదొలగడంపై ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘వరల్డ్‌కప్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని జీర్ణించుకోవడం లేకపోతున్నా? జట్టుకు దూరంగా ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది. కష్టకాలంలో నాపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా హార్థిక్ ఆవేదనను వ్యక్తం చేశారు. వన్డే వరల్డ్‌కప్‌ నుంచి ఇలా అర్ధంతరంగా నిష్క్రమించడం బాధగా ఉందని ఉద్వేగానికి గురయ్యాడు.

  శ్రీవారిని దర్శించిన పంత్‌, అక్షర్‌

  AP: టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో ఈ ఇద్దరు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్‌లతో ఫొటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. టీటీడీ సిబ్బంది సైతం ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. దాంతో ఆలయం వెలుపల సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

  ముందే సెమీస్‌కు చేరడం ఆనందం: రోహిత్

  వన్డే ప్రపంచకప్‌లో ముందే సెమీస్‌కు చేరడం ఆనందంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తమ తొలి లక్ష్యం పూర్తయిందని తెలిపాడు.. ‘ఇక ముందున్న సవాళ్లకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. జట్టులో ప్రతి ఒక్కరూ తమ పాత్రను గొప్పగా పోషిస్తున్నారు. వరల్డ్‌ కప్‌లో మా ఆటతీరు పట్ల గర్వంగా ఉంది. ఇప్పుడు అధికారికంగా సెమీస్‌కు చేరుకోవడం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ఇక ఫైనల్స్‌పైనే గురి పెడతాం’. అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

  కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

  టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు కోహ్లీ 8 క్యాలండర్ ఇయర్లలో 1000పైగా పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో సచిన్ (7), గంగూలీ (6), సంగర్కర (6), రికీ పాంటింగ్ (6), రోహిత్ (4) ఉన్నారు.

  అది కేవలం నా ఒక్కడి ఆలోచన కాదు: రోహిత్

  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మ్యాచ్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. ‘విశ్లేషణ చేసి అందుకు తగ్గట్టుగా ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలి. జట్టు నిర్ణయాలకు కట్టుబడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లేది వారే. ఇది కేవలం కెప్టెన్‌గా నా ఒక్కడి ఆలోచనే కాదు. ఎల్లవేళలా నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తా అయితే, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరమూ ఉంది. అంతేకానీ, ఇష్టమొచ్చినట్లు బ్యాటింగ్‌ చేయలేను’. రోహిత్ చెప్పుకొచ్చాడు.