• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కలలు కన్నా..కానీ ఇది ఊహించలేదు’

    టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్‌ ప్రారంభింలో తాను ఇన్ని సెంచరీలు, పరుగులు చేస్తానని అనుకోలేదని చెప్పారు. ‘సుదీర్ఘ కెరీర్‌, ప్రదర్శనలతో ఇన్ని సాధిస్తానని అనుకోలేదు. బాగా ఆడాలని ఎప్పుడూ కలలు కన్నాను. అలాగే జరుగుతుందని ఊహించలేదు. 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఇన్ని సెంచరీలు, పరుగులు సాధిస్తానని అనుకోలేదు. క్లిష్ట పరిస్థితుల్లో విజయాలు అందించాలని భావించా. అందుకోసం కమ్రశిక్షణ, జీవనశైలికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకున్నా’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.

    నా కెరీర్ ముగిసిందనుకున్నారు: బుమ్రా

    టీమిండియా బౌలర్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌ ముందు చాలా కాలం జట్టుకు దూరమైయ్యానని తెలిపాడు. ‘ఆ సమయంలో ఇక తన కెరీర్‌ ముగిసినట్లేనని పలువురు భావించారు. నా భార్య స్పోర్ట్స్‌ మీడియాలో పనిచేస్తోంది. అందువల్ల.. నా కెరీర్‌పై వ్యక్తమైన అనేక అనుమానాలు నాకు తెలిశాయి. అయితే వాటిని నేను పట్టించుకోలేదు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చినప్పుడు నాకు జట్టులో మంచి అవకాశాలు లభించాయి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాను’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

    ‘టీమిండియాను ఓడించడం కష్టమే’

    ప్రపంచకప్‌లో టీమిండియా ‌అద్భుతంగా ఆడుతోందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ప్రశంసించాడు. టోర్నీలో ఇప్పటివరకూ ఎటువంటి కఠినమైన పోటీని భారత్‌ ఎదుర్కోలేదని పేర్కొన్నాడు. ‘ఇంగ్లాండ్‌పై 230 పరుగులు చేసిన తర్వాత టీమిండియా కష్టాల్లో పడ్డట్లు అనిపించింది. కానీ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో తేలిగ్గా విజయం సాధించింది. గత కొన్నేళ్లుగా స్వదేశంలో భారత్ బలమైన ప్రత్యర్థిగా ఉంది. సొంత గడ్డపై టీమిండియాను ఓడించడం ఎప్పుడూ కష్టమే’ అని స్మిత్ అన్నాడు.

    టీమిండియాకు మరో గుడ్‌ న్యూస్‌

    వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు మరో శుభవార్త అందింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య త్వరగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. నొప్పి నుంచి ఉపశమనం పొంది ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ కూడా ప్రారంభించినట్లు సమాచారం. లీగ్‌ దశ ముగిసేనాటికి పూర్తిగా కోలుకొని సెమీస్‌ సమయానికి జట్టుతో హార్దిక్‌ కలుస్తాడని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. హార్దిక్‌ ఇప్పటికే రెండు నెట్‌ సెషన్స్‌లో పాల్గొన్నాడని పేర్కొన్నాయి. కాగా, నవంబర్‌ 15 నుంచి వరల్డ్‌కప్‌లో నాకౌట్‌ దశ మెుదలవుతుంది.

    టీమిండియా సెమీస్‌ బెర్త్ ఖాయమైందా?

    ఇంగ్లాండ్‌పై విజయంతో టీమిండియా తన సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అయిదు ఓడిన ఇంగ్లాండ్‌ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సెమీస్‌ చేరే ఛాన్స్ లేదు. బంగ్లాదేశ్‌ కూడా 5 ఓటములతో సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది. 6 మ్యాచ్‌ల్లో 5 నెగ్గిన దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరువలో ఉంది. ఆసీస్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కివీస్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) సెమీస్ రేసులో మెరుగైన స్థితిలో ఉన్నాయి. శ్రీలంక (5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), … Read more

    ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు?

    వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈరోజు లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. హార్దిక్‌ స్ధానంలో సూర్యకుమార్‌ను కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా లక్నో వికెట్‌కు స్పిన్‌కు అనుకూలించే అవకామున్నందున మహ్మద్‌ సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చి రవిచంద్రన్‌ అశ్విన్‌ను తీసుకురానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

    ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు?

    వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. రేపు లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే రేపటి మ్యాచ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. హార్దిక్‌ స్ధానంలో సూర్యకుమార్‌ను కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా లక్నో వికెట్‌కు స్పిన్‌కు అనుకూలించే అవకామున్నందున మహ్మద్‌ సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చి రవిచంద్రన్‌ అశ్విన్‌ను తీసుకురానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

    భారత్‌తో సిరీస్‌.. ఆసీస్ జట్టు ప్రకటన

    వరల్డ్‌కప్‌ తర్వాత టీమిండియాతో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఆస్ట్రేలియా 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా మాథ్యూ వేడ్‌ను ఎంపిక చేసింది. నవంబరు 23 నుంచి సిరీస్‌ ప్రారంభం కానుంది. తుది జట్టు ఇదే.. ఆసీస్‌: మాథ్యూ వేడ్, బెహ్రెన్‌డార్ఫ్‌, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మ్యాక్స్‌వెల్‌, తన్వీర్, షార్ట్, స్మిత్, స్టోయినిస్, వార్నర్, ఆడం జంపా. Courtesy Twitter: Courtesy Twitter:

    టీమిండియా కూర్పులో గందరగోళం

    ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయంతో దూరం కావడంతో టీమిండియా కూర్పులో గందరగోళం నెలకొంది. రేపు ఇంగ్లాండ్‌తో లక్నో వేదికగా మ్యాచ్ జరగనుంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండనుండటంతో థర్డ్‌ స్పిన్నర్‌గా అశ్విన్‌ను తీసుకునే ఛాన్స్‌ కనిపిస్తోంది. అదే జరిగితే పేసర్లలో బుమ్రాకు తోడుగా షమీ లేదా సిరాజ్‌లలో ఎవర్నీ తీసుకోవాలన్న సందిగ్దం నెలకొంది. అటు బ్యాటింగ్‌లో కివీస్‌ మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్‌ను కొనసాగించాలా? లేదా ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌కు చోటివ్వాలా అన్న ప్రశ్న టీమిండియాకు ఎదురవుతోంది.

    ఇంగ్లాండ్‌ జట్టుకు మాజీ కెప్టెన్‌ చురకలు

    ఇంగ్లాండ్‌ క్రికెట్ జట్టు సభ్యులకు ఆ దేశ మాజీ కెప్టెన్ నాసిర్‌ హుస్సేన్ చురకలు అంటించాడు. జట్టును సన్నద్ధత విషయంలో భారత జట్టును చూసి ఇంగ్లాండ్ చూసి నేర్చుకోవాలని సూచించాడు. అలాగే ఈ వరల్డ్‌ కప్‌ ముందు వన్డే ఫార్మాట్‌ మ్యాచ్‌లను ఆడలేకపోవడం ఇంగ్లాండ్‌ ఓటములకు కారణం కావచ్చని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌ నుంచి గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆటతీరును చూడలేదన్నాడు. ఆల్‌రౌండర్లను ఎక్కువగా నమ్ముకున్న ఫలితం దక్కలేదని నాసిర్ పేర్కొన్నాడు.