• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మనకు మంచే జరుగుతుంది: ధోని

    వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రదర్శనపై మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌ ధోని తొలిసారి స్పందించాడు. ‘ఇప్పుడు వరల్డ్‌ కప్‌లో ఆడుతున్న టీమ్‌ఇండియా బాగుంది. అన్ని విభాగాలూ సమతూకంగా, పటిష్ఠంగా ఉన్నాయి. ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌నూ గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పను. కచ్చితంగా మనకు శుభం జరుగుతుందనే నమ్మకం ఉంది. 2019లో కొద్దిలో ఓడిపోయి సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టడం బాధించింది’ అని అన్నాడు.

    టీమిండియా కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌!

    వరల్డ్‌కప్‌ తర్వాత ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా కోచ్‌గా V.V.S లక్ష్మణ్‌ వ్యవహిరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కోచ్‌ ద్రవిడ్‌ పదవికాలం వరల్డ్‌కప్‌తో ముగియనుంది. నిబంధనల ప్రకారం చీఫ్‌ కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది. అయితే తీవ్ర ఒత్తిడితో కూడుకున్న చీఫ్‌ కోచ్‌ పదవికి 51 ఏళ్ల ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌ ఆసీస్‌తో సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉన్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

    గెలుపు కోసం సమిష్టిగా పోరాడాలి: రోహిత్

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో పొరపాట్లకు తావులేకుండా జట్టు విజయాలు సాధిస్తుందని చెప్పాడు. ‘టీమిండియా గెలుపు కోసం ఒకరిద్దరు కాదు జట్టు సమిష్టిగా పోరాడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ పాత్రకు న్యాయం చేస్తేనే ముందుకు వెళ్లగలుగుతాం. ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

    వందశాతం నా నైపుణ్యాన్ని ఎవరూ చూడలేదు: గిల్

    టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు చేసిన ప్రదర్శన 90 శాతమేనని ఇంకా వందశాతం ఎవరూ చడలేదన్నాడు. ‘మన్ముందు మరింత నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తా? ఇది కేవలం భారీ స్కోరు గురించే కాకుండా నా ఆటతీరు వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ఏ మ్యాచ్‌లోనైనా మంచి ఇన్నింగ్స్ ఆడితే దాని వల్ల జట్టుకు కలిగే ఉపయోగం ఏంటనేది కూడా ఆలోచించాలి. ఆ తర్వాత ఫలితంపై ప్రభావం తప్పకుండా ఉంటుంది’. అని గిల్ చెప్పుకొచ్చాడు.

    టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ!

    చీలమండ గాయంతో కివీస్‌తో మ్యాచ్‌కు దూరమైన భారత ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య మరో రెండు మ్యాచ్‌లకు సైతం అందుబాటులో ఉండడని సమాచారం. 29న ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడని తొలుత వార్తలు వచ్చాయి. కానీ, తాజా అప్‌డేట్‌ ప్రకారం ఇంగ్లాండ్‌తోనే కాకుండా ఆ తర్వాత శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు సైతం హార్దిక్‌ దూరమవుతాడని తెలుస్తోంది. ప్రస్తుతం హార్దిక్‌ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. అతడు వేగంగా కోలుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

    అతనిలా బౌలింగ్ వేయాలనుకున్నా కానీ.. : కులదీప్

    టీమిండియా బౌలర్ కులదీప్ యాదవ్ తన బౌలింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘నాకు వసీం అక్రమ్ బౌలింగ్ అంటే ఇష్టం. ఆయనలాగే బౌలింగ్ వేయాలని అనుకున్నా. కానీ మా కోచ్ సూచనల ప్రకారం లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్నర్‌గా మారాను. ఇప్పుడు షేన్ వార్న్ అనుసరిస్తున్నాను. ఆయనలాగే బౌలింగ్ వేయడానికి ఇష్టపడుతాను. బౌలింగ్‌లో ఎమైన అనుమానాలు ఉంటే వార్న్ పాత వీడియోలు చూస్తుంటాను. బ్యాటర్లను ఏవిధంగా బోల్తా కొట్టించాడు వంటివి పరిశీలిస్తుంటాను’ అని చెప్పుకొచ్చాడు.

    షమీ ఐదు వికెట్లు పడగొట్టిన వీడియో చూశారా?

    నిన్నటి న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత బౌలర్ షమీ ఐదు కికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/54) సంచలన స్పెల్ వేశాడు. కివీస్ మొదట 300కి పైగా పరుగులు చేసేలా కనిపించినా షమీ కట్టడి చేయడంతో 273 పరుగులకే పరిమితమైంది. అయితే షమీ తీసిన వికెట్లకు సంబంధించిన వీడియో మీరూ చూడండి. https://www.instagram.com/reel/CytbY_Uviys/?utm_source=ig_embed&ig_rid=b889ea0f-8fb0-483d-ab55-3339ea6fd103

    షమీ ఐదు వికెట్లు పడగొట్టిన వీడియో చూశారా?

    నిన్నటి న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత బౌలర్ షమీ ఐదు కికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/54) సంచలన స్పెల్ వేశాడు. కివీస్ మొదట 300కి పైగా పరుగులు చేసేలా కనిపించినా షమీ కట్టడి చేయడంతో 273 పరుగులకే పరిమితమైంది. అయితే షమీ తీసిన వికెట్లకు సంబంధించిన వీడియో మీరూ చూడండి. https://www.instagram.com/reel/CytbY_Uviys/?utm_source=ig_embed&ig_rid=b889ea0f-8fb0-483d-ab55-3339ea6fd103

    భారత మాజీ కెప్టెన్ మృతి

    టీమిండియా మాజీ కెప్టెన్‌ బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. వయసు రిత్యా అనారోగ్యం కారణంగా ఆయన మరణించారు. బిషన్ 1967 నుంచి 1979 మధ్య కాలంలో భారత క్రికెట్‌లో కీలక ఆటగాడిగా కొనసాగారు. 67 టెస్టులు ఆడిన బేడి.. 266 వికెట్లు పడగొట్టారు. 22 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా ఆయన వ్యవహరించారు. భారత స్పిన్ బౌలింగ్‌లో సరికొత్త విప్లవానికి బేడీ నాంది పలికారు. భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ఆయన నిలిచారు.

    కోహ్లీపై యువరాజ్ ప్రశంసలు

    టీమిండియా క్రికెటర్‌ కోహ్లీపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. కివీస్‌తో మ్యాచ్‌లో కోహ్లీ అద్భత ఇన్నింగ్స్ ఆడాడంటూ కొనియాడాడు. ‘అతడు సంచరీ చేయకపోయినా అంతకంటే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఇలాంటి ఆటతీరును ప్రదర్శించడం అద్భుతం అందుకే నువ్వు G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా మంచి భాగస్వామ్యం అందించాడు. చివరి వరకు గ్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. షమీ సూపర్ స్పెల్‌తో అదరగొట్టాడు’. అని యువీ చెప్పుకొచ్చాడు.