క్రికెట్‌కు సినిమాకు మనదేశంలో అవినావభావ సంబంధం ఉందన్న సంగతి చాలా మందికి తెలిసిందే. ముఖ్యంగా క్రికెటర్లకు సినిమా హీరోయిన్లకు వీడదీయరాని బంధం ఉందని చెప్పవచ్చు. వీరి గురించి ఎప్పుడూ ఏదొక గాసిప్ ప్రచారంలో ఉంటూనే ఉంటుంది. రీసెంట్‌గా టీమిండియా క్రికెటర్ శుభమన్ గిల్ ఓ పంజాబీ టీవీ షోలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో నటి సోనమ్ బజ్వా, గిల్ పరస్పరం పలు ప్రశ్నలు సంధించుకున్నారు. ఈ క్రమంలో శుభమన్ గిల్.. సోనమ్ బజ్వాను ఎప్పుడైన క్రికెటర్లతో డేటింగ్ చేశారా? అని సరదాగా ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్‌గా మారింది.
పంజాబ్‌లో ప్రముఖ టెలివిజన్ షోగా ‘దిల్ దియాన్ గల్లాన్’కు పేరుంది. ఈ షోలో శుభమన్ గిల్, హీరోయిన్ సోనమ్ బజ్వా మధ్య ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. గిల్, ఉద్వేగభరితమైన నవ్వుతో, “మీరు ఎప్పుడైనా క్రికెటర్‌తో డేటింగ్‌కి వెళ్లారా? అని సోనమ్‌ను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సోనమ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. గిల్ సంధించిన ప్రశ్నకు అమ్మడి ముఖంలో రంగులు మారాయి. ఏం చెప్పాలో తెలియక కాసేపు తటపటాయిస్తూ ఆన్సర్ చెప్పింది. పంజాబీ, సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించిన సోనమ్, ‘ఎవరితో డేటింగ్‌కు వెళ్ల “లేదు” అని తెలివిగా సమాధానమిచ్చింది.
సోనమ్ ఆన్సర్ చెప్పిన వెంటనే హూటర్ శబ్దం పెద్దగా వినబడింది, ఇది ఆమె అబద్ధం మాట్లాడిందని సూచిస్తుంది. ఆ వెంటనే ఇద్దరు సెలబ్రిటీలు ఒకరినొకరు చూసుకుంటూ బిగ్గరగా నవ్వుకున్నారు.
నవ్వు ఆపిన కాసేపు తర్వాత మళ్లీ గిల్ నిజం చెప్పమని సోనమ్‌ను అడిగాడు. “చూడు శుభ్‌మన్, క్రికెటర్లు స్ట్రెయిట్ డ్రైవ్‌లకు ప్రసిద్ధి చెందారని నాకు తెలుసు. అయితే కొన్నిసార్లు కొన్ని రహస్యాలను దాచడంలోనే ఆనందంగా ఉంటుంది” అని సోనమ్ సమాధానం చెప్పింది. దీంతో సోనమ్ కావాలనే తనకు క్రికెటర్లతో ఉన్న డేటింగ్ చరిత్రను రహస్యంగా ఉంచిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మరికొంత మంది నెటిజన్లు.. గిల్, సోనమ్ బజ్వా ఇద్దరు డేటింగ్ చేస్తూ ఆ విషయాన్ని ఇలా ఇండైరెక్ట్‌గా బయట పెట్టారని ఊహగానాలు చేస్తున్నారు. అలాగే గిల్ అడిగిన ప్రశ్నను చూసి మనోడు మైదానంలోనే కాదు ఆఫ్ ఫీల్డ్‌లోనూ ఉక్కుపిండమేనని కామెంట్ చేస్తున్నారు. సోనమ్‌తో డేటింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్‌తోనే.. గిల్ అలాంటి ప్రశ్న అడిగాడని గుసగుసలాడుకుంటున్నారు.
మరోవైపు సచిన్ కూతురు సారతో గిల్ ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వీరిద్దరు అప్పట్లో కలిసి పబ్‌ల్లో కనిపించడం సంచలనం సృష్టించింది. ఇద్దరు డేటింగ్ కూడా చేసినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. మరి సారతో గిల్ విడిపోయాడా? అందుకే సోనమ్ బజ్వాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ఇక సోనమ్ బజ్వా గురించి మాట్లాడుకుంటే… ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలు. సుశాంత్ సరసన ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఆవకాశాలు పెద్దగా రాకపోవడంతో తమిళ్‌లో కొన్ని సినిమాల్లో నటించింది. తమిళంలో కప్పాల్, ‘పాండవుల్లో ఒకరు’ సినిమాల్లో ఈ హాట్ డాల్ తళుక్కున మెరిసింది. ప్రస్తుతం పంజాబీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
శుభమన్ గిల్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. గిల్ 1999 సెప్టెంబర్ 8న జన్మించాడు. తక్కువ వయసులో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. ఇప్పటి వరకు 58 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన గిల్.. 2748 పరుగులు చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అతిపిన్న వయస్కుడిగా గిల్ గుర్తింపు పొందాడు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోని అన్ని ఫార్మట్లలో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా ఘనత సాధించాడు.
ప్రస్తుతం శభమన్ గిల్ శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా తరఫున బరిలో ఉన్నాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 67 పరుగులు చేసి రాణించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!