• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా

    భారత జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా రికార్డు సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి బంగారు పతకం సాధించాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరి అదరగొట్టాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నీరజ్‌ చరిత్ర సృష్టించాడు. పాక్‌ క్రీడాకారుడు అర్షద్‌ నదీమ్‌ 87.82 మీటర్లు విసిరి రజతం అందుకోగా చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్‌ వడ్లెచ్‌ 86.67 మీటర్ల విసిరి కాంస్యం గెలుచుకున్నాడు. … Read more

    పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్

    చెల్లి పెళ్లిలో శ్రీలంక స్టార్ క్రికెటర్ హసరంగ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చెల్లి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుందని ఆయన తీవ్రభావోద్వేగానికి గురైయ్యాడు. కన్నీరు పెట్టుకుంటూ తన సోదరిని బాగా చూసుకోవాలని అత్తింటి సభ్యులను కోరాడు. చెల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. హసరంగ చెల్లి కూడా భోరున విలపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. Wanindu Hasaranga gets emotional at his sister's wedding. pic.twitter.com/OEuHgm7eSX — Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2023

    బైక్‌పై ధోని రైడ్‌.. వీడియో వైరల్

    క్రికెట‌ర్ ఎం.ఎస్ ధోనీ.. రాంచీలో రైడింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవ‌ల వింటేజ్ కార్ల‌లో తిరుగుతున్న‌ట్లు క‌నిపించిన అత‌డు.. తాజాగా హోండా రెప్సాల్ 150 మోట‌ర్ బైక్‌లో రైడింగ్ చేశాడు. త‌న ఇంటి వ‌ద్దకు చేరుకున్న స‌మ‌యంలో ఓ అభిమాని త‌న మొబైల్ ఫోన్‌తో వీడియో షూట్ చేశాడు. ఓ ఫోటో దిగేందుకు ఛాన్స్ ఇవ్వాలంటూ అభిమానులు వేడుకున్నారు. కానీ ధోనీ త‌న బైక్‌తో ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే రాంచీలో ఉన్న ఫామ్‌హౌజ్‌లో ధోనీకి చాలా బైక్‌లు … Read more

    Hardik Pandya: బంగారం కోసం వెతుకుతుంటే బొగ్గు దొరికింది… హార్దిక్ పాండ్యాను ఏకిపారేస్తున్న నెటిజన్లు

    వెస్టిండీస్‌ చేతిలో టీమిండియా టీ20 సిరీస్‌ ఓడిపోవడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సిరీస్‌లో హార్దిక్ ఆటగాడిగా, కెప్టెన్‌గానూ విఫలమయ్యాడని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి జిడ్డు బ్యాటింగ్ చేశాడని ట్రోల్ చేస్తున్నారు. పసలేని బౌలింగ్‌తో తేలిపోయాడని విమర్శిస్తున్నారు. కెప్టెన్సీ చేతకాక చెత్త నిర్ణయాలతో జట్టు పరాజయానికి కారణమయ్యాడని విమర్శిస్తున్నారు.  హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. తిరిగి రోహిత్ శర్మకు టీ20 బాధ్యతలు అప్పగించాలని … Read more

    బైకర్స్‌ను అడ్రస్‌ అడిగిన ధోని

    మహేంద్ర సింగ్ ధోని తన స్నేహితుడితో కలిసి రాంచీ వెళ్తూ ఓ వ్యక్తిని అడ్రస్‌ అడిగాడు. అతడి ఫ్రెండ్ వాహనం నడుపుతుండగా మహీ ముందు సీట్లో కూర్చొని ఉన్నాడు. తాను వెళ్లాల్సిన మార్గం గురించి బైకర్స్‌ను అడిగి తెలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అడ్రస్‌ తెలుసుకున్న అనంతరం ధోని భైకర్స్‌కు సెల్ఫీ ఇచ్చాడు. ఆపై కరచాలనం చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ధోనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ధోని సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. This man is so … Read more

    Tilak Varma: ఎన్నో ప్రశ్నలకు సమాధానం తిలక్ వర్మ.. భారత్‌కు మరో తెలుగు బ్యాటర్ దొరికినట్లే..!

    వెస్టిండీస్‌తో సిరీస్‌లో అంతర్జాతీయ కెరీర్‌కి ఎంట్రీ ఇచ్చాడు తిలక్ వర్మ. గతేడాది నుంచి ఐపీఎల్‌లో స్థిరంగా రాణించడంతో సెలక్టర్ల కంట పడ్డాడు. దీంతో వెస్టిండీస్ సిరీస్‌కి తిలక్‌ ఎంపికయ్యాడు. అటు, ఐర్లాండ్‌తో 3 టీ20ల సిరీస్‌కి కూడా సెలక్ట్ అయ్యాడు. అయితే, చాలా మంది అరంగేట్ర సిరీస్‌లో కంగారు పడిపోతుంటారు. ఒత్తిడిలో గొప్పగా రాణించలేక పోతుంటారు. కా నీ, తిలక్ వర్మ ఇందుకు విరుద్ధం. వచ్చీ రావడంతోనే తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. వరుసగా 3 టీ20ల్లో సాధికారిక ఇన్నింగ్స్‌లు ఆడి తన స్థానాన్ని … Read more

    ఆరంభంలోనే ఆకట్టుకున్న తిలక్ వర్మ

    హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 22 బంతుల్లో 39 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లుగా ఉత్తమంగా రాణిస్తున్న తిలక్.. జాతీయ జట్టులోనూ ఫామ్‌ని కొనసాగించాడు. బ్యాటింగ్‌కి వచ్చి తొలి 3 బంతుల్లోనే 2 సిక్సర్లు బాదాడు. దీన్ని బట్టి మనోడి ఆటతీరు ఎలా ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్‌లో తిలక్ ఒక్కడే సాధికారిక బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ ఓడినా తిలక్ వర్మపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Takes a blinder.Hits back to back … Read more

    1980 మోడల్‌ కారుతో ధోని చక్కర్లు

    టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి కార్లు, బైక్‌లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ధోనీ 1980 మోడల్‌ బ్లూ కలర్ రోల్స్ రాయిస్‌ కారులో రాంచీ రోడ్లపై ప్రయాణించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 43 ఏళ్ల క్రితంనాటి కారును ధోని స్వయంగా డ్రైవ్‌ చేస్తూ వెళ్లాడు. పక్క సీట్లో కూతురు జీవా కూర్చుని ఉంది. ఈ వీడియాపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ధోని స్టైలే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. https://www.instagram.com/reel/CvHTnFeJxpu/?utm_source=ig_embed&ig_rid=8dd9f46c-e554-4356-8ed9-a8434dcdf446

    స్లిప్‌లో రహానె అద్భుత క్యాచ్

    అజింక్య రహానె ఫీల్డింగ్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, స్లిప్‌లో ఈ టీమిండియా ఫీల్డర్ పనితనం ఎంతో చురుగ్గా ఉంటుంది. తక్కువ ఎత్తులో వచ్చే బంతుల్ని ఒక్క చేత్తోనే ఒడిసి పట్టుకోవడంలో దిట్ట. తాజాగా, వెస్టిండీస్ మ్యాచ్‌లోనూ ఇది నిరూపితమైంది. జడేజా వేసిన బంతిని బ్యాటర్ బ్లాక్‌వుడ్‌ డిఫెండ్ చేయబోయాడు. కానీ, ఎడ్జ్‌కి తగిలి స్లిప్ దిశగా దూసుకెళ్లింది. కీపర్‌ని దాటుకుని వెళ్తుండగా ఆఫ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రహానె ఎడమచేత్తో ఒడిసి పట్టాడు. Marvelous Ajinkya Rahane in … Read more

    మిస్ వరల్డ్‌తో భారత కుర్రాళ్ల రచ్చ

    మిస్ వరల్డ్ ట్రినిడాడ్@టొబాగో అషె అబ్రహామ్స్‌తో టీమిండియా కుర్రాళ్లు సందడి చేశారు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం అషె అబ్రహామ్స్ విచ్చేసింది. ఈ సందర్భంగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్‌లతో ఆ ముద్దుగుమ్మ కాసేపు ముచ్చటించింది. అనంతరం వారితో ఫొటోలు దిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘భారత్ నుంచి వచ్చిన మా బ్రదర్స్‌ను కలిసినందుకు సంతోషంగా ఉంది.’’ అంటూ పోస్ట్ పెట్టింది. Miss World Aché Abrahams of Trinidad … Read more