• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hardik Pandya: బంగారం కోసం వెతుకుతుంటే బొగ్గు దొరికింది… హార్దిక్ పాండ్యాను ఏకిపారేస్తున్న నెటిజన్లు

    వెస్టిండీస్‌ చేతిలో టీమిండియా టీ20 సిరీస్‌ ఓడిపోవడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సిరీస్‌లో హార్దిక్ ఆటగాడిగా, కెప్టెన్‌గానూ విఫలమయ్యాడని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి జిడ్డు బ్యాటింగ్ చేశాడని ట్రోల్ చేస్తున్నారు. పసలేని బౌలింగ్‌తో తేలిపోయాడని విమర్శిస్తున్నారు. కెప్టెన్సీ చేతకాక చెత్త నిర్ణయాలతో జట్టు పరాజయానికి కారణమయ్యాడని విమర్శిస్తున్నారు.  హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. తిరిగి రోహిత్ శర్మకు టీ20 బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు.

    వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓటమిపై టీమిండియా ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యపై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. కీలకమైన మ్యాచ్‌లో జట్టును గెలిపించాల్సిందిపోయి.. పసలేని బ్యాటింగ్, లయ తప్పిన బౌలింగ్, చెత్త కెప్టెన్సీతో జట్టు పరాజయానికి కారణమయ్యాడని ట్రోల్ చేస్తున్నారు.

    అత్యుత్సాహం

    వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో టాస్ గెలిచిన పాండ్య.. అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ సత్తాను పరీక్షించుకునేందుకే బ్యాటింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు. అయితే పాండ్య నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో సత్తా పరీక్షించుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు?  అప్పటికే ఆకాశం మేఘావృతమై వర్షం పడుతున్న సమయంలో అత్యుత్సాహానికి పోయి.. బ్యాటింగ్ తీసుకోవడం నిజంగా తప్పుడు నిర్ణయమే అని వాదిస్తున్నారు.

    తేలిపోయిన బ్యాటింగ్

    ఇక ఈ మ్యాచ్‌లో 18 బంతులాడిన పాండ్య 14 పరుగులు చేసి ఊసురుమనిపించాడు. పాండ్యా బ్యాటింగ్ తీరుపై కూడా నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. కీలక సమయంలో బ్యాటింగ్‌‌కు వచ్చిన పాండ్య.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాల్సింది పోయి. జిడ్డుకు కెరాఫ్ అడ్రస్‌గా నిలిచాడని ఎద్దేవా చేస్తున్నారు. పాండ్య రాణించి ఉంటే మరో 15-20 పరుగులు ఎక్కువగా వచ్చేవని.. జట్టు 180కిపైగా పరుగులు చేసేదని అభిప్రాయపడుతున్నారు.

    దారళంగా పరుగులు

    ఈ మ్యాచులో బౌలింగ్‌లో కూడా హార్దిక్ తేలిపోయాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్య..  పదికిపైగా ఎకానమీతో.. 32 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇన్నాళ్లు ధోనీలాంటి బంగారం కోసం వెతికితే…  బొగ్గు దొరికిందంటూ పాండ్యాను ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా పోస్ట్ చేస్తున్నారు.

    కొంప ముంచిన నిర్ణయాలు

    కెప్టెన్‌గా పాండ్య తీసుకున్న కొన్ని నిర్ణయాలు భారత జట్టు కొంప ముంచాయని ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. అర్షదీప్‌తో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించడాన్ని తప్పుబడుతున్నారు. చాహల్ వేసిన 16 ఓవర్‌లో 12 పరుగులు, తిలక్ వర్మ వేసిన 17 ఓవర్‌లో 12 రన్స్, యశస్వి జైశ్వాల్ వేసిన 18వ ఓవర్‌లో 18 రన్స్ వచ్చాయి. చివరి ఐదు ఓవర్లలో విండీస్ విజయానికి దాదాపు బంతికో పరుగు చొప్పున అవసరం. ఈ దశలో అర్షదీప్ లాంటి బౌలర్లను దించి ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచాల్సింది పోయి.. స్పిన్నర్లతో, పార్ట్ టైమర్లతో బౌలింగ్ వేయించి ఓటమికి కారణమయ్యాడని ట్రోల్ చేస్తున్నారు.

    రోహిత్‌కు పగ్గాలు ?

    వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓటమికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యానే అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పొస్తున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌, యాటిట్యూడ్, అనవసరపు ఈగో తప్ప హార్దిక్ పాండ్యా దగ్గర ఆటలేదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి తిరిగి రోహిత్ శర్మకే టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv