ఇటీవల విడుదలైన ముఫాసా: ది లయన్ కింగ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ లభించడం విశేషం. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన ముఫాసాకు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడం ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మహేష్ బాబు మాత్రమే కాకుండా, ఇతర పాత్రలకు కూడా ప్రముఖ నటులు తమ గొంతుతో ప్రాణం పోశారు. టాకా పాత్రకు సత్యదేవ్, పుంబా పాత్రకు బ్రహ్మానందం, అలాగే టిమోన్ పాత్రకు అలీ వాయిస్ ఓవర్ అందించారు. ఈ విశేషమైన కాంబినేషన్ ప్రేక్షకుల్లో విశేషమైన ఉత్సాహాన్ని కలిగించింది.
ప్రస్తుతం, ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ నెట్టింట్లో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకుంటున్నాయి. అభిమానులు వాటిని సేకరించడానికి పెద్దఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ముఫాసా: ది లయన్ కింగ్ లోని కొన్ని ఐకానిక్ డైలాగ్స్ ఇప్పుడు అందరికీ మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
సింబా డైలాగ్
ఆత్మీయులారా.. ఈ రాజ్యం ఒకప్పుడు మా నాన్న కన్న కళ..ఆయన ఆశించినట్టే..ఒకరి మీద ఒకరం అభిమానంతో బతుకుతున్నాం. ముందు తరాలు కూడా ఇలాగే కొనసగాలని కోరుకుంటూ నేను, నాలా జీవన చక్రంలోని తర్వాత అధ్యాయనంలోకి అడుగు పెడుతున్నాం.
తుపాను వచ్చేటప్పుడు యువరాణి కియరా భయపడుతుంటే రఫికీ చెప్పే డైలాగ్
ఓరోజు పెద్ద తుఫాను వచ్చింది. మీ నాయన సింబా భయపడి మీ తాతయ్య ముఫాసా వెనకాలా దాక్కున్నాడు. అప్పుడు మీ తాతయ్య తనతో పాటు మీ నాయనను సింహాసనం పైకి తీసుకెళ్లి, తనతో పాటు ఈ ప్రపంచానికి వినపడేలా గట్టిగా గర్జించమని చెప్పినాడు. ఆరోజు సింబా మహారాజుతో కలిసి చేసిన సింహ గర్జన భయాల చీకట్లను చీల్చుకుంటా పోయినాది.
కియరాకు తన తాత ముఫాసా చరిత్ర గురించి చెప్పే డైలాగ్
రఫీకీ: ఆ చిట్టి సింహం రాజ వంశంలో పుట్టకపోయినా కూడా.. మనందరి జీవితాలను మార్చిన రారాజు కథ.
ఈ కథ పర్వతాల అంచున చీకటీ లోయలు దాటిన చోట మొదలవుతుంది. సూర్యుడి వెలుగు పడని చోటు అది. ఆ ప్రదేశంలో జీవాలు దాహంతో అలమటించేవి. ఏడాదిలో 300 రోజులు చుక్క నీరు కూడా దొరికేది. అక్కడ ఆకాశం మెరిసినప్పుడు.. ఒక కొత్త శకం మొదలైనాది..
ముఫాసా- మహేష్ బాబు డైలాగ్స్
అప్పుడప్పుడూ ఈ చల్లని గాలి మా ఇంటిని గుర్తు చేస్తున్నట్లు అనిపిస్తుంది… అంతలోనే అవి మాయమవుతాయి.
టాకా తల్లిదండ్రులను చంపి..తెల్ల సింహాల రాజు ‘హిరోషి’ వెంబడిస్తున్నప్పుడు.. ముఫాసా(మహేష్ బాబు), టాకా( సత్య దేవ్) మధ్య వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి
ముఫాసా: తిరిగి వెనక్కి వెళ్లిపోదాం
టాకా: ఈదుకుంటూ వెళ్లాల్సిందే..
ముఫాసా: లేదు మనం ఎలాగైనా పోరాడుదాం..
టాకా:పోరాడితే.. పోతాం..
ముఫాసా: ఈదడం కన్నా.. ఎదురెళ్లడమే మంచిది
టాకా: సరే, నువ్ నా మాటా వినేలా లేవు, ఈదమని ఆజ్ఞాపిస్తున్నాను
ముఫాసా: ఏంటి, ఏమిస్తున్నావ్..
టాకా: విధేయుడిగా ఉంటానన్నావ్ కదా..రాజుగా ఆదేశిస్తున్నా
ముఫాసా: టాకా నాటకాలు ఆడకు..నాకు కాలుతుంది.
టాకా: వాళ్లు వెంటే వస్తున్నారు.. ఇప్పుడేం చేద్దాం.
ముఫాసా: ఇప్పుడు చెయ్యడానికి ఒక్కటే మిగిలింది.
టాకా: ఇంకేం మిగిలింది, ముందు చూస్తే శత్రువులు, వెనకేమో నీళ్లు
ముఫాసా: ఎక్కువ ఆలోచించకుండా మనమే ఆ రాజును చంపేద్దాం.
టాకా: ముఫాసా మనం బతికాం.. నావల్లే, నేనే కాపాడాను
ముఫాసా: ఇందాక ఏదో అన్నావే.
రఫీకీ డైలాగ్స్
నేను వెళ్లాలి భవిష్యత్ కోసం..
మనసుతో చూసిన దాన్ని కళ్లు ఎప్పటికీ మరచిపోవు
కొన్నిసార్లు కలలే నేస్తాలు.. మన గతాన్ని దాచే గదులు
సింహానివే కానీ నీళ్లంటే భయం, నువ్ చూసుకోవడానికి భయం,ఆఖరికి నిద్రపోవడానికి భయం, కళ్లు మూస్తే ఏం కనిపిస్తోందో అని..!
కలలు కనడానికి కూడా భయపడుతావు ముఫాసా, ఆ కలల్లో కనిపించే నిజాన్ని తట్టుకోలేవు.
ముఫాసా: నేను కనులు మూసిన ప్రతిసారి మా అమ్మనాన్నలే కనిపిస్తారు.
రఫీకీ: కనిపించకుండా ఎలా ఉంటారు.వాళ్లు ఎప్పటికీ నీతో ఉంటారు
ముఫాసా: చిన్నప్పుడు మా అమ్మ చెబుతుండేది, మనం మిలేలేకు వెళ్తున్నామని, కానీ ఆ మాటలు కలగానే మిగిలి పోయింది.
రఫీకీ: నీ ప్రయాణం కలగాదు ముఫాసా.. నీ తల్లి నీకు మార్గం చూపిస్తోంది.. నీ వెళ్లబోయే చోట నీ కుటుంబం ఎదురు చూస్తోంది.
ముఫాసా: నువ్ కలల్ని నమ్ముతావా ముఫాసా
రఫీకీ: కలల్ని కాదు, నా మనసును నమ్ముతా..
ముఫాసా: నీకోకటి చేయాలని ఉంటుంది, కానీ నీ మనసు ఇంకోటి చెబుతుంది. అప్పుడు నువ్ ఏం చేస్తావ్
మీలెలే అక్కడ ఉంది.. అది నాకు ఇక్కడ తెలుస్తోంది. నేను చెప్పేది ఏమిటంటే.. నీ మనసు నీకు ఏం చెబుతుందో నువ్ అదే చేయ్
క్లైమాక్స్‌లో మహేష్ బాబు డైలాగ్స్
నా పేరు ముఫాసా.. మీలాగే నాకు ఏ రాజ్యం లేదు
కానీ, మీ ముందు తలెత్తుకుని ధైర్యంగా నిలబడ్డాను
మీరు భయపడుతున్నారని తెలుసు, నన్ను నమ్మండి
మీ ముందు నేనుంటాను,
మన స్వార్థం కోసం పక్కవాడు ఏమైన పట్టించుకోకపోతే..మన పతనాన్ని మనమే రాసుకున్నట్లు అవుతుంది.
ఈరోజు వాళ్లు సింహాలను మాత్రమే చంపాలని చూస్తుండొచ్చు.
కానీ ఈ రాజ్యం ఒక్కసారి వాళ్ల సొంతమైతే
రేపు మిమ్మల్ని ఎవర్ని ఇక్కడ ప్రాణాలతో ఉండనివ్వరు
మీలో సింహాలకంటే పెద్దవైన ఏనుగులు ఉన్నాయ్
బలమైన అడవి దున్నలు ఉన్నాయ్
వేగమైన చిరుతలున్నాయ్, ఎత్తైన జిరాఫీలున్నాయ్
మనమంతా తలుచుకుంటే ఎంత బలవంతమైన శత్రువునైనా చిటికెలో మట్టి కరిపించవచ్చు.
ఒక్కసారి ఆలోచించండి
నా ఊపిరే మీ ఊపిరి.. మీ పోరాటమే.. నా పోరాటం
శత్రువుకు నేను తలవంచను, చావును మీ దగ్గరికి రానియ్యను
నాన్ సింగోనియా భవ గీతి
పుంబా- టిమోన్ డైలాగ్స్
పుంబా: రాజు గారి బాడిగార్డ్స్ వచ్చేస్తున్నారోయ్
టిమోన్: మమ్మళ్ని ఎవరు తినొద్దు.. మేము ఎవర్ని తినం
పుంబా: అందరు మంచి ఆకలి మీదున్నారు.
తిండి గిండి అంటే. మనల్నిద్దర్ని మింగేస్తారు రా..
టిమోన్: ఇద్దరం అనకు, నువ్వు ఒక్కడివి చాలు ఊరికి సరపోతావు.
మీ బాడీ గార్డ్స్ డ్యూటీ ఎక్కారు.. మా నమస్కారాలు అందుకోండి మాహారాజా
పుంబా: మా సలాములు అందుకోండి.. నువ్వు వంగవేమిరా..
టిమోన్: నేను జిబ్రా లాగా తలెత్తుకుని ఉంటా
పుంబా: ఆ మూడు కాళ్ల నాన్ గాడిలాగానా….
టిమోన్: వాడికి నాకు పొలిక ఏంట్రా కుఫిలీ.. వాడికి మూడే కాళ్లు
నాకు నాలుగు కాళ్లు
పుంబా: చేతులు కూడా కాళ్లు అనుకుంటున్నావా
టిమోన్: పంజా విసురుతా చూస్తావా
పుంబా: పంజా విసరడానికి నువ్వు ఏమైనా సింహానివా
సింబా: ఇక ఆపుతారా.. నేను తిరిగొచ్చే వరకు కియరాను జాగ్రత్తగా చూసుకోండి,
పుంబా: మరి చులకనగా చూడకు, మమ్మల్ని బాడీ గార్డ్స్ అనుకున్నావా.. పిల్లల్ని ఆడించే ఆయమ్మలు అనుకున్నా
టిమోన్: దీని గురించి కాస్త డిస్‌కస్ చేయాలి పుంబా.. పిల్లలంటే పరమ చిరాకు నాకు
సింబా: అంకుల్స్ ఇద్దరు బాగా చూసుకుంటారని కియరాకు మాటిచ్చాను
టిమోన్: మాకు పెళ్లిళ్లు కాకుండానే అంకుల్స్ చేసేసావా? ఆడ పిళ్లైన అన్ని సాధించొచ్చని ఆశలు కల్పించి ఉంటాడు
పుంబా: కల్పించే ఉంటాడు వీడు.
సింబా: ఇంకా మీరిద్దరు ఈ పనికి మాలిన మాటలు ఆపితే మంచిది. కియారాను భయపెట్టవద్దు. ముఖ్యంగా కథలు చెప్పొద్దు.
పుంబా: ఏంటీ కథలు చెప్పొద్దా..
సింబా: ముఖ్యంగా మీ పగటి కలలను కథలుగా చెప్పొద్దు.. మీరెంటో నాకు తెలియదా..
పుంబా: మా కథలు వింటూ పెరిగి.. మమ్మల్నే అంటావా? ఇక మేము ఎవరికి కథలు చెప్పం
టిమోన్: ఏంటీ కథలు చెప్పమా..?
పుంబా: అంటాం అంతే, మనం మాట మీద నిలబడతామా ఏంటి?
సాడిస్ట్ స్టోరీలు ఎన్నో విన్నాం కానీ ఫ్యామిలీని వదిలేసిన సాడిస్ట్ స్టోరీ ఇదేరా రఫీకీ
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!