• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • UI Movie Review: ఉపేంద్ర వన్‌ మ్యాన్‌ షో.. ‘యూఐ’తో మెప్పించాడా?

    నటీనటులు: ఉపేంద్ర, రీష్మా, మురళి శర్మ, అచ్యుత్‌ కుమార్‌, రవిశంకర్‌, సాధు కోకిల, నిధి సుబ్బయ్య తదితరులు

    దర్శకత్వం: ఉపేంద్ర

    సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌

    సినిమాటోగ్రాఫర్‌: హెచ్‌.సి. వేణుగోపాల్‌

    ఎడిటింగ్‌: విజయ్‌ రాజ్‌

    నిర్మాతలు: జి. మనోహరన్‌, శ్రీకాంత్‌ కె.పి, భౌమిక్‌

    విడుదల తేదీ: డిసెంబర్‌ 20, 2024

    కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూఐ’ (UI). ఈ ఫాంటసీ చిత్రాన్ని జి.మనోహరన్‌, శ్రీకాంత్‌, భౌమిక్‌ సంయుక్తంగా నిర్మించారు. ఆయన గతంలో తీసిన ‘ఏ’, ‘ఉపేంద్ర’ వంటి వినూత్న కంటెట్‌ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘యూఐ’ అదే తరహాలో కొత్త కంటెట్‌తో రూపొందించినట్లు ఉపేంద్ర తెలిపారు. డిసెంబర్‌ 20న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఉపేంద్రకు సాలిడ్‌ సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. 

    కథేంటి

    కథలోకి వెళ్తే (UI Movie Review).. ఉపేంద్ర దర్శకత్వం వహించిన ‘యూఐ‘ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ) థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని నేరుగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

    ఎవరెలా చేశారంటే

    ఉపేంద్ర మరోసారి (UI Movie Review) తన నటనతో ఆకట్టుకున్నాడు. సత్య, కల్కి, ఉపేంద్ర అనే మూడు పాత్రల్లో కనిపించి వేరియేషన్స్‌ చూపించాడు. కథ మెుత్తాన్ని తన భుజాలపై మోస్తూ వన్‌ మ్యాన్‌ షో చేశాడు. ఆద్యంతం ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌ రీష్మ పాత్రకు ఇందులో ప్రాధాన్యం లేదు. సాంగ్స్ కోసమే ఆమెను తీసుకున్నట్లు అనిపిస్తుంది. గ్లామర్‌ పరంగా మాత్రం రీష్మ ఆకట్టుకుంది. సాయికుమార్ సోదరుడు రవిశంకర్‌ పాత్ర ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఉపేంద్ర తర్వాత రవిశంకర్ పాత్రనే హైలెట్‌ అని చెప్పవచ్చు. మిగతా పాత్ర దారులంతా కన్నడవారే. తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    దర్శకుడు ఉపేంద్ర తనదైన శైలిలో ‘యూఐ‘ చిత్రాన్ని మెుదలుపెట్టాడు. ‘మీరు తెలివైనవాళ్లు అయితే థియేటర్ నుంచి వెళ్లిపోండి. మూర్ఖులైతేనే చూడండి’ అంటూ టైటిల్స్ సమయంలోనే సినిమా కొత్తగా ఉండబోతుందన్న హింట్‌ ఇచ్చేశాడు. సినిమాలోనే ‘యూఐ’ సినిమాను మెుదలు పెట్టడం, దాన్ని చూసి ప్రేక్షకులు మెంటలెక్కిపోవడం కొత్తగా అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే  కల్కి భగవాన్ వర్సెస్ సత్య ట్రాక్, వింటేజ్‌ ఉపేంద్ర సీన్స్‌, డైలాగ్స్‌, మ్యానరిజమ్స్‌ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఉపేంద్ర మార్క్‌ స్క్రీన్‌ప్లే, కథనం ఆకట్టుకుంటుంది. 2040లో జాతీ, మతం భావాలు ఎంతగా హద్దుమీరతాయే కూడా తనదైన శైలీలో ఉపేంద్రం కళ్లకు కట్టాడు. తిండికే కష్టమైన రోజుల్లో క్రికెట్‌, బిగ్‌బాస్‌ వంటి షోలను ప్రజలు ఆదరించడాన్ని సెటైరికల్‌గా చూపించాడు. ఉపేంద్ర ఐడియాలజీకి కనెక్ట్‌ అయ్యేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సాధారణ సినిమాగా చూద్దామని వెళ్తే మాత్రం గందరగోళంతో బయటకు రావడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు. 

    సాంకేతికంగా

    సాంకేతిక అంశాలకు (UI Movie Review) వస్తే సినిమా ఉన్నతంగా ఉంది. సాంగ్స్‌ ఆకట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ మాత్రం నెక్స్ట్‌ లెవల్లో ఉంది. విజువల్స్‌ చాలా వైవిధ్యంగా చూపించారు. గ్రాఫిక్స్‌ మాత్రం పేలవంగా ఉన్నాయి. ఎడిటింగ్‌ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథలో కొత్తదనం
    • ఉపేంద్ర నటన
    • కామెడీ

    మైనస్‌ పాయింట్స్‌

    • లాజిక్స్‌కు అందని సీన్స్‌
    • పేలవమైన గ్రాఫిక్స్‌
    Telugu.yousay.tv Rating : 3/5
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv