2024 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక చరిత్రాత్మక సంవత్సరం అని చెప్పవచ్చు. పలు పెద్ద చిత్రాలు విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. తెలుగు సినిమాలు దేశం వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకుల మనసు దోచాయి. ప్రతిసారి హీరోల స్టార్ పవర్‌తోనే కాకుండా, కథనం, పాటలు, సంగీతం వంటి అంశాలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమను గ్లోబల్ మార్కెట్లో నిలిపాయి. ఈ సంవత్సరంలో పలు చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. హనుమాన్, దేవర, పుష్ప 2 వంటి చిత్రాలు ఈ జాబితాలో చేరి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఇప్పుడు 2024లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ప్రధాన తెలుగు చిత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. హనుమాన్ (Hanuman):
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, దర్శకుడు ప్రశాంత్ వర్మ సృష్టి. సంక్రాంతి సందర్భంగా విడుదలై, దేశవ్యాప్తంగా సుమారు రూ.256 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. స్టార్ హీరోల అవసరం లేకుండానే, మంచి కథ, దర్శకత్వం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది.
2. టిల్లు స్క్వేర్ (Tillu Square):
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం, ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా విడుదలైంది. చిన్న చిత్రంగా ప్రారంభమైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.
3. కల్కి 2898 AD (Kalki 2898 AD):
ప్రభాస్ ప్రధాన పాత్రలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం, జూన్‌లో విడుదలై ట్రెమండస్ రెస్పాన్స్‌తోపాటు సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఆరోవది కావడం విశేషం.
4. సరిపోదా శనివారం (Saripoda Sanivaram):
నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందింది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, నానికి మరో విజయాన్ని అందించింది.
5. దేవర (Devara):
ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం, భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ సక్సెస్‌తో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. 52 సెంటర్స్‌లో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శితమై, రూ.509 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
6. లక్కీ భాస్కర్ (Lucky Bhaskar):
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, దీపావళికి విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ పొందింది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, దుల్కర్ కెరీర్‌లో మరో విజయాన్ని నమోదు చేసింది.
7. పుష్ప 2 (Pushpa 2):
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఇటీవల విడుదలై రూ.1400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే దేశంలోనే అత్యధిక వసూళ్లు (రూ.280 కోట్లు)సాధించిన తొలి చిత్రంగా నిలిచి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
8. సలార్ (Salaar):
ప్రభాస్ నటించిన ఈ చిత్రం, 2023 డిసెంబర్‌లో విడుదలైనప్పటికీ, 2024లో కూడా గూగుల్ సెర్చ్‌లో టాప్ 10లో నిలవడం గమనార్హం. ఈ చిత్రం కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రభాస్‌కు మరో విజయాన్ని అందించింది.
9. అమరన్ (Amaran):
శివ కార్తికేయన్ మరియు సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం, తమిళనాట విడుదలై, పాన్ ఇండియావైడ్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తంగా రూ.320 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, శివ కార్తికేయన్ కెరీర్‌లో ది బెస్ట్ హిట్‌గా నిలిచింది.
10. గోట్ (G.O.A.T):
విజయ్ నటించిన ఈ చిత్రం, పలు చోట్ల మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్లలో మాత్రం రికార్డు క్రియేట్ చేసింది. రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, విజయ్‌కు మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించింది.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?