• TFIDB EN
  • సిద్ధు జొన్నలగడ్డ
    జననం : ఫిబ్రవరి 07 , 1988
    ప్రదేశం: హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
    సిద్ధు జొన్నలగడ్డ తెలుగు సినిమా నటుడు. ఆయనకు నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి కబడ్డీ జట్టు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు.
    Read More

    సిద్ధు జొన్నలగడ్డ వయసు ఎంత?

    సిద్ధు జొన్నలగడ్డ వయసు 37 సంవత్సరాలు

    సిద్ధు జొన్నలగడ్డ ముద్దు పేరు ఏంటి?

    టిల్లు

    సిద్ధు జొన్నలగడ్డ ఎత్తు ఎంత?

    5'7"(173cm)

    సిద్ధు జొన్నలగడ్డ అభిరుచులు ఏంటి?

    సినిమాలు చూడటం, కథలు రాయడం

    సిద్ధు జొన్నలగడ్డ ఏం చదువుకున్నారు?

    బీటెక్

    సిద్ధు జొన్నలగడ్డ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసాడు. హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో B. Tech చదివాడు.

    సిద్ధు జొన్నలగడ్డ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. అయితే ఆమె పేరు మాత్రం రివీల్ కాలేదు. ఆ హీరోయిన్ పవన్ కళ్యాణ్‌ సినిమాలో నటించినట్లు తెలిసింది.

    సిద్ధు జొన్నలగడ్డ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    సిద్ధు జొన్నలగడ్డ In Sun Glasses

    Images

    Hero Siddhu Jonnalagadda Outfits

    Images

    Siddhu Jonnalagadda Stylish Images

    సిద్ధు జొన్నలగడ్డ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Siddhu Jonnalagadda

    Images

    Siddhu Jonnalagadda

    సిద్ధు జొన్నలగడ్డ అన్‌ కేటగిరైజ్డ్ వీడియోలు

    Siddhu Viral Video

    తెలుగులో ‘మిక్స్‌ అప్‌’ మాదిరి బోల్డ్ కంటెంట్ చిత్రాలుEditorial List
    తెలుగులో ‘మిక్స్‌ అప్‌’ మాదిరి బోల్డ్ కంటెంట్ చిత్రాలు
    సిద్ధు జొన్నలగడ్డ టాప్ హిట్ చిత్రాలుEditorial List
    సిద్ధు జొన్నలగడ్డ టాప్ హిట్ చిత్రాలు
    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్ తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. డీజే టిల్లు సినిమా సక్సెస్‌తో యూత్‌లో మంచి గుర్తింపు పొందాడు. తనదైన స్లాంగ్, మెనరిజంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. సిద్ధు జొన్నల గడ్డ అసలు పేరు? సిద్ధార్థ జొన్నలగడ్డ సిద్ధు జొన్నల గడ్డ ఎత్తు ఎంత? 5’.7” (175 cms) సిద్ధు జొన్నలగడ్డ తొలి సినిమా? జోష్ చిత్రం ద్వారా సిద్ధు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.  హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'పెళ్లికి ముందు జీవితం'  సిద్ధు జొన్నలగడ్డ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన తేదీ ఎప్పుడు? 1992 సిద్ధు జొన్నలగడ్డకు వివాహం అయిందా?  ఇంకా కాలేదు సిద్ధు జొన్నల గడ్డ ఫెవరెట్ హీరోయిన్? అనుష్క శెట్టి సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన సినిమా? అర్జున్ రెడ్డి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అల వైకుంఠపురములో సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో? వెంకటేష్ సిద్ధు జొన్నలగడ్డ తొలి హిట్ సినిమా? గుంటూరు టాకీస్ చిత్రం సిద్ధు జొన్నలగడ్డకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే డిజే టిల్లు చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన కలర్? బ్లాక్ సిద్ధు జొన్నలగడ్డ తల్లిదండ్రుల పేర్లు? శారద, సాయి కుమార్ జొన్నలగడ్డ సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ప్రదేశం? హైదరాబాద్ సిద్ధు జొన్నలగడ్డ ఏం చదివాడు? ఇంజనీరింగ్, MBA సిద్ధు జొన్నలగడ్డ అభిరుచులు బైక్ రైడింగ్, మోడలింగ్ సిద్ధు జొన్నలగడ్డ ఎన్ని సినిమాల్లో నటించాడు? సిద్ధు 2024 వరకు 13 సినిమాల్లో నటించాడు.  సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ఆహారం? బిర్యాని సిద్ధు జొన్నలగడ్డ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7కోట్లు సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సిద్ధు ఒక్కో సినిమాకి దాదాపు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటాడు . సిద్ధు జొన్నలగడ్డకు స్మోకింగ్ అలవాటు ఉందా? చాలా సందర్భాల్లో స్మోకింగ్ అలవాటు ఉందని చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ మద్యం తాగుతాడా?  అవును, వీక్లీ వన్స్ తాగుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సిద్దు జొన్నలగడ్డ నిక్‌ నేమ్‌ ఏంటి? స్టార్‌ బాయ్‌ సిద్ధూ సిద్ధు జొన్నలగడ్డకు తోబుట్టువులు ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నారు. ‌అతని పేరు చైతన్య జొన్నల గడ్డ సిద్ధు జొన్నలగడ్డ రైటర్‌గా పనిచేసిన చిత్రాలు? సిద్ధు మంచి నటుడే కాకుండా రైటర్‌, సింగర్, లిరికిస్ట్‌, ఎడిటర్‌ కూడా. 'క్రిష్ణ అండ్‌ హీస్‌ లీలా', 'మా వింత గాధ వినుమా', ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు.  సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా పాడిన పాటలు ఏవి? గుంటూరు టాకీస్‌ ‘టైటిల్‌ ట్రాక్‌’, నరుడా ఢోనరుడా సినిమాలో 'కాసు పైసా', 'పెళ్లి బీటు' పాటలను సిద్ధు పాడాడు. అలాగే మా వింత గాధ వినుమాలో ‘షయార్‌-ఈ-ఇష్క్‌’, డీజే టిల్లులో 'నువ్వలా' సాంగ్స్ పాడి అలరించాడు.  సిద్ధు జొన్నలగడ్డ రాసిన పాటలు ఏవి? జాణ (మా వింత గాధ వినుమ), ఓ మై లిల్లీ (టిల్లు స్క్వేర్‌) సిద్దు జొన్నలగడ్డ ఇప్పటివరకూ చేసిన ఏకైక వెబ్‌సిరీస్‌? 2018లో వచ్చిన 'గ్యాంగ్‌స్టర్స్‌' సిరీస్‌లో సిద్ధు నటించాడు. అది అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ తర్వాత సిద్ధు ఏ వెబ్‌సిరీస్‌లో చేయకపోవడం గమనార్హం. సిద్ధు జొన్నలగడ్డకు గర్ల్‌ ఫ్రెండ్ ఉందా? గతంలో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపాడు. అయితే అది మధ్యలోనే బ్రేకప్‌ అయినట్లు తెలిపాడు. ప్రస్తుతం సిద్దూ ఎవరితోనూ రిలేషన్‌లో లేడు.  సిద్ధు జొన్నలగడ్డ ఫేవరేట్‌ బాలీవుడ్‌ హీరో ఎవరు? రణ్‌బీర్‌ కపూర్‌ సిద్ధు జొన్నలగడ్డ హెయిల్ కలర్‌ ఏంటి? నలుపు సిద్ధు జొన్నలగడ్డ ఫేమస్‌ హెయిర్‌ స్టైల్‌ ఏది? డీజే టిల్లు కోసం అతడు యూనిక్‌ హెయిర్‌ స్టైల్‌ చేయించుకున్నాడు. దీన్ని తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్‌ అని అంటున్నారు. టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్‌ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.  సిద్ధు జొన్నలగడ్డ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఏవి? 'జాక్‌', 'తెలుసు కదా', 'టిల్లు క్యూబ్‌'.. సిద్ధు జొన్నలగడ్డ చేసిన టిల్లు పాత్ర ఎలా పుట్టింది? టిల్లు పాత్ర కల్పితం. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, చిలకలగూడ, వారాసిగూడ, సికింద్రాబాద్‌ ఏరియాల్లో ఉన్నప్పుడు తన అనుభవాలు, ఎదురైన వ్యక్తుల నుంచి ఈ డీజే టిల్లు పాత్ర పుట్టిందని సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ చేసిన మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్‌ ఏవి? సిద్ధు కెరీర్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి గుంటూరు టాకీస్‌లోని ‘నీ సొంతం’ సాంగ్‌. ఇందులో యాంకర్‌ రష్మీతో కలిసి సిద్ధు చేసే రొమాన్స్‌ అప్పట్లో కుర్రకారును ఫిదా చేశాయి. అలాగే టిల్లు స్క్వేర్‌లోనూ సిద్ధూ జొన్నలగొడ్డ రెచ్చిపోయాడు. ‘ఓ మై లిల్లీ’ సాంగ్‌లో హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌తో కలిసి లిప్‌ కిస్‌ సీన్లలో నటించాడు. ఆ రెండు సాంగ్స్‌పై ఓ లుక్కేయండి. https://www.youtube.com/watch?app=desktop&v=mw9Jn_BsPZE&vl=hi https://www.youtube.com/watch?v=QiKd8Iegu5g సిద్దు జొన్నలగడ్డ బెస్ట్‌ డైలాగ్స్‌ డీజే టిల్లులో రాధిక హత్య చేసిన వ్యక్తిని.. టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) పాతిపెట్టే క్రమంలో వచ్చే డైలాగ్స్‌ ది బెస్ట్ అని చెప్పవచ్చు.  రాధిక: హేయ్‌.. అక్కడ రాయి ఉంది చూస్కో టిల్లు: ఐ హావ్‌ వన్‌ సజిషన్‌ ఫర్‌ యూ.. పోయి కారులో ఏసీ ఆన్‌ చేసుకొని రిలాక్స్‌గా స్విగ్గీ ఓపెన్ చేసి ఓ ఫ్రెష్‌ వాటర్‌ మిలాన్‌ జ్యూస్‌ ఆర్డర్‌ చేసుకొని రిలాక్స్‌గా నువ్వు.  “మనం చేసేదే లంగా పని పైగా కాంట్రిబ్యూషన్‌ లేదు నీది. పైగా ఉప్పర్‌ సే బొంగులో కరెక్షన్స్ అన్ని చెబుతున్నావ్‌” “ ప్లీజ్‌ నువ్వేళ్లి రిలాక్స్‌ గా. నాకు అలవాటే ఈ శవాలు పాతిపెట్టుడు. నేను రోజూ చేసే పనే ఇది. ఫినిష్‌ చేసుకొని వస్తా.  కొద్దిసేపటి తర్వాత.. టిల్లు : ఏం చేస్తాడు ఇతను (చనిపోయిన వ్యక్తి).. సాఫ్ట్‌వేరా? రాధిక: ఫొటోగ్రఫీ.. టూ మూవీస్‌కు కెమెరామెన్‌గా పనిచేశాడు టిల్లు: చాలా అన్‌ఫార్చ్యూనెట్లీ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువే. హీ నెవర్‌ సీ సక్సెస్‌ బీకాజ్‌ ఆఫ్‌ యూ https://youtu.be/11iKluNP0rs?si=YoSXNG65ACZWI-zt టిల్లు స్క్వేర్‌లో సిద్దు జొన్నలగడ్డ చెప్పిన టాప్‌ డైలాగ్స్‌ ఏవి? ఈ సినిమాలో టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే.. డైలాగ్‌ టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్‌ ఏస్టేట్ ఐకూన్‌ టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది https://twitter.com/i/status/1774992506087944622 డైలాగ్‌ ఓ సీన్‌లో...... లిల్లీ (అనుపమా పరమేశ్వరన్‌) మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్‌ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.  టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ.. https://twitter.com/i/status/1773542640488784015 డైలాగ్‌ లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు? టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి  https://twitter.com/i/status/1773655054655856994 డైలాగ్‌ లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్‌ చెప్పు రాధిక. లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ  టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది. అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.  నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8 టాలీవుడ్‌ సెలబ్రిటీలతో సిద్దు జొన్నలగడ్డ దిగిన ఫొటోలు సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్‌ స్టైలిష్‌ ఫొటోలు సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ  కారు కలెక్షన్స్‌సిద్ధు ప్రస్తుతం రేంజ్‌ రోవర్‌ కారు వినియోగిస్తున్నాడు. ఈ కారులోనే తన సినిమా ఫంక్షన్లకు హాజరవుతున్నాడు.  https://www.youtube.com/watch?v=8CM-HSifLsY https://www.youtube.com/watch?v=i817fCTiZ3g
    ఏప్రిల్ 27 , 2024
    Tollywood: సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్‌ సేన్‌లకు అండగా బాలయ్య, ఎన్టీఆర్‌.. దాని వెనక మాస్టర్‌ ప్లాన్‌ ఉందా? యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ, విష్వక్‌ సేన్‌ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కుర్ర హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఇద్దరి స్టార్స్‌కి నందమూరి ఫ్యామిలీ నుంచి విశేష మద్దతు లభిస్తోంది. బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌కు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే కుర్ర హీరోలను సీనియర్లు ప్రోత్సహించడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్‌. ఇండస్ట్రీలో చాలా మంది యువ నటులు ఉండగా సిద్ధు, విష్వక్‌లను తారక్‌, బాలయ్య ప్రోత్సహించడం వెనక చాలా బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.  కుర్ర హీరోలతో క్లోజ్‌గా.. కుర్ర హీరోలను ప్రోత్సహించడంలో మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ చేరారు. యువ విష్వక్‌ సేన్‌, సిద్ధు జొన్నలగడ్డను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇద్దరి హీరోలతో తారక్‌ ప్రత్యేక ఇంటర్యూ నిర్వహించారు. దర్శకుడు కొరటాల శివ, తారక్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఇంటర్యూకు భలే హైప్‌ వచ్చింది. అంతకుముందు సిద్దు హీరోగా నటించిన టిల్లు స్క్రేర్‌ సక్సెస్‌ మీట్‌కు తారక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు విష్వక్‌ కూడా హాజరవ్వగా వారిద్దరితో తారక్‌ ఫొటోలు దిగి హల్‌చల్‌ చేశాడు. మరోవైపు రీసెంట్‌గా బాలకృష్ణను సైతం ఈ ఇద్దరు హీరోలు కలిశారు. విజయవాడ వరదల నేపథ్యంలో ప్రకటించిన సొమ్మును బాలయ్యతో కలిసి ముఖ్యమంత్రికి అందజేశారు. అంతకుముందు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన బాలకృష్ణ.. విశ్వక్‌ తాను కవలలమంటూ ఆకాశానికి ఎత్తారు. ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా సిద్ధు, విష్వక్‌లకు తారక్‌, బాలయ్య అండగా నిలుస్తున్నారు.  మాస్టర్‌ ప్లాన్ ఉందా? ఇండస్ట్రీలో విజయ్‌ దేవరకొండ, అడివి శేష్‌, నవీన్‌ పొలిశెట్టి, నిఖిల్‌, కిరణ్ అబ్బవరం వంటి కుర్ర హీరోలు ఉండగా విష్వక్‌, సిద్ధులనే బాలకృష్ణ, తారక్‌ ఎంకరేజ్‌ చేయడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉందంటూ నెట్టింట కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ మెగా, నాన్‌-మెగా అనే రెండు వర్గాలుగా విడిపోయిందని సినీ వర్గాల టాక్‌. మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. పైగా ఈ జనరేషన్‌ హీరోల్లో చాలామంది తాము మెగాస్టార్‌కు పెద్ద అభిమానులమని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే స్టార్‌ హీరోలుగా ఎదుగుతున్న విష్వక్‌, సిద్ధులను ఎంకరేజ్‌ చేయడం ద్వారా తమకంటూ ఒక గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకున్నట్లు ఉంటుందని నందమూరి ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోలు తాము నందమూరి ఫ్యామిలీకి వీరాభిమానులమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్నారు. ముఖ్యంగా తారక్‌ అంటే తమకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారిని ఎంకరేజ్‌ చేసేందుకు తారక్‌, బాలకృష్ణ ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది.  అల్లు అర్జున్‌కు పోటీగా..! విజయ్‌ దేవరకొండ సోదరులకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మెుదటి నుంచి తన మద్దతు తెలియజేస్తున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమా అప్పటి నుంచి విజయ్‌తో బన్నీ అనుబంధం కొనసాగుతూ వస్తోంది. గతేడాది విజయ్‌ దేవరకొండ సోదరుడు తీసిన బేబీ ప్రమోషన్ ఈవెంట్‌కు కూడా బన్నీ హాజరయ్యారు. బేబీ వివాదంలో విష్వక్‌ చిక్కుకున్నప్పుడు అతడి గురించి పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో విష్వక్‌ చాలా ఒత్తిడి ఫేస్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తారక్‌ మద్దతుతో విష్వక్‌ దాని నుంచి బయటపడినట్లు సమాచారం. అయితే తారక్‌, బన్నీ ఎంతో స్నేహంగా ఉంటారు. కాకపోతే తమకంటూ ఓ గ్రూప్ ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికివారు వ్యక్తిగతంగా యంగ్ హీరోలను ప్రోత్సహించుకుంటూ, గ్రూపులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. విష్వక్‌, సిద్ధు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం విష్వక్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్‌ సాంగ్‌ కూడా రిలీజై ఆకట్టుకుంది. అలాగే ‘లైలా’ చిత్రంలోనూ విష్వక్‌ నటిస్తున్నాడు. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విష్వక్‌ అమ్మాయిగా కనిపించనున్నాడు. ఇవి కాకుండా ‘VS13’, ‘VS14’ ప్రాజెక్ట్స్‌ను త్వరలో పట్టాలెక్కించనున్నాడు. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ చేతిలోనూ ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత 'టిల్లు క్యూబ్‌' కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది. 
    సెప్టెంబర్ 25 , 2024
    EXCLUSIVE: టిల్లు స్కేర్ అడల్ట్ సినిమా కాదు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్కేర్ పట్ల అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. DJ టిల్లు హిట్‌ తర్వాత ఏర్పడిన అంచనాలను మించి ఈ సినిమా చొచ్చుకెళ్తోంది. ఈ మూవీ ప్రస్తుతం సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తోంది. ఈ సినిమాను పలువురు సెలబ్రెటీలు ప్రశంసిస్తున్నారు.  తాజాగా టిల్లు స్కేర్(Tillu square) చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) స్పందించారు. టిల్లు స్కేర్ చిత్రం తాను చూశానని చాలా బాగుందని ప్రశంసల వర్షం కురిపించారు. అందరూ అనుకుంటున్నట్లు అడల్ట్ సినిమాగా ఈ చిత్రాన్ని చూడవద్దని యూనివర్సిల్‌గా యాక్సెప్ట్‌డ్ కంటెంట్ ఈ చిత్రంలో ఉందని వెళ్లడించారు. ఈక్రమంలో టిల్లు స్కేర్ చిత్ర బృందాన్ని ఇంటికి పిలిపించుకుని చిరంజీవి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." టిల్లు స్కేర్ సినిమా చూశాను. టిల్లు వన్ నాకు బాగా నచ్చిన సినిమా. ఆ సినిమా తర్వాత ముచ్చటేసి రా అని ఇంటికి పిలిపించుకున్నాను. సిద్ధు అంటే ఇంట్లో అందరికి ఫేవర్. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత  టిల్లు స్కేర్ చేశాడు చూశాను. వావ్ చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ సినిమా చేసిన తర్వాత సెకండ్ సినిమా ఆ అంచనాలను మీట్ అవడమనేది రేర్ ఫీట్. ఆ అంచనాలను డైరెక్టర్ మల్లిక్ అండ్ హోల్ టీమ్ సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగారు.  ఉత్కంఠతోటి అదే సరదా తోటి ఈ టిల్లు స్కేర్ అంత ఎంజాయ్ చేశాను. ఇప్పుడు చెబుతున్నాను.. దీనికోసం ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో సినిమాను చూస్తే అర్థం అవుతుంది.  దీని వెనుకాలా ఒక్కడై ఉండి, ఈ స్క్రిఫ్ట్ ఇంత బాగా రావడానికి ప్రయత్నించిన మా సిద్ధు జొన్నలగడ్డకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఈ సినిమాలో చాలా మంది ఏదో అడల్ట్ అని యూత్ అని ఏవెవో అంటున్నారు. ఇది యూనివర్సల్‌గా అంగీకరించదగిన కంటెంట్ ఉన్నా సినిమా ఇది. కాబట్టి నేనైతే ఎంజాయ్ చేశాను. అందరు తప్పక చూడండి" అంటూ చెప్పుకొచ్చారు.   https://twitter.com/AlwaysPraveen7/status/1774701740287578526?s=20 మరోవైపు టిల్లు స్కేర్ కలెక్షన్ల పరంగా బాలీవుడ్ చిత్రం 'క్రూ'(CREW)ని బీట్ చేసింది. టబు, కరీనా కపూర్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.62.53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. టిల్లు స్కేర్ మూడు రోజుల్లో రూ.68.1కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఆయా భాషల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్నాయి.  అటు టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా 'టిల్లు క్యూబ్' ఉంటుందని మేకర్స్‌ ప్రకటించారు. థియేటర్లలో అల్రెడీ క్లైమాక్స్ సీన్‌లో దీనికి సంబంధించిన ప్రకటన వస్తోంది. తొలుత టిల్లు స్కేర్‌తో సీక్వెల్ ముగించాలని మేకర్స్ అనుకున్నప్పటికీ... ప్రేక్షకుల నుంచి వచ్చిన డిమాండ్ దృష్ట్యా సీక్వెల్ ఉంటుందని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు.
    ఏప్రిల్ 01 , 2024
    Tillu Cube: టిల్లు గాడికి జోడీగా స్టార్‌ హీరోయిన్‌ లాక్‌! యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), టిల్లు స్క్వేర్‌ (Tillu Square) చిత్రాలు టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. ముఖ్యంగా సిద్ధు నటన, వాయిస్‌ మాడ్యూలేషన్‌కు తెలుగు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ముఖ్యంగా టిల్లు పాత్రకు యూత్‌ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ చిత్రాల్లో హీరోతో పాటు హీరోయిన్లు పాత్రలు కూడా అంతే క్రేజ్‌ను సంపాదించాయి. ఫస్ట్‌ మూవీలో రాధిక పాత్రలో నేహా శెట్టి మెస్మరైజ్‌ చేయగా.. సీక్వెల్‌లో లిల్లీలో పాత్రలో అనుపమా కనిపించి మెప్పించింది. దీంతో తర్వాతి చిత్రం టిల్లు క్యూబ్‌లో ఎవరు నటిస్తారన్న దానిపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే మూడో పార్ట్‌లో సిద్ధూకు జోడీగా స్టార్‌ హీరోయిన్‌ను లాక్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  సిద్ధూకి జోడీగా బుట్టబొమ్మ! ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్‌ (Tillu Square) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. రూ.125 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి అదరగొట్టింది. ఇందులో హీరోయిన్‌గా చేసిన అనుపమా.. తన హాట్‌షోతో అదరగొట్టింది. కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు క్యూబ్‌ రూపొందించనున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే లెటేస్ట్‌ బజ్‌ ప్రకారం మూడో పార్ట్‌లో ‘పూజా హెగ్డే’ (Pooja Hegde)ను హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్‌ ఆమె వద్దకు కూడా వెళ్లిందని అంటున్నారు. హిట్ సిరీస్ కావడం, తన రోల్​కు మంచి ఇంపార్టెన్స్ ఉండటంతో పూజ కూడా వెంటనే ఓకే చేసిందనే టాక్ నడుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.  సమంత, తమన్నా లేనట్లే! ‘టిల్లు స్క్వేల్‌’ భారీ సక్సెస్‌తో మూడో పార్ట్‌ను పెద్ద ఎత్తున నిర్మించాలని మేకర్స్‌ భావించారు. ఇందులో భాగంగా టిల్లు క్యూబ్‌ సినిమా కోసం తొలుత ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సమంత (Samantha), తమన్నా (Tamannaah) పేర్లను పార్ట్ -3 కోసం పరిశీలిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. వీరిలో ఒకరు దాదాపు ఖరారవుతారంటూ కూడా ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, చివరకూ ‘పూజా హెగ్డే’ వైపే చిత్ర యూనిట్ మెుగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధు జొన్నలగడ్డ, పూజా పెయిర్‌ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో మెుదలైంది.  పూజాకు మంచి ఛాన్స్! ఒకప్పుడు బ్లాక్‌ బాస్టర్ హిట్స్‌తో దూసుకెళ్లిన పూజా హెగ్డేకు గత కొంతకాలంగా టైమ్‌ అసలు కలిసి రావడం లేదు. ఈ భామ నటింటిన వరుస సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో సినిమాలకు కాస్త  బ్రేక్‌ ఇచ్చిన ఈ అమ్మడు.. ఫ్యామిలీతో ఖాళీ సమయాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. అదే సమయంలో ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో పూజా హెగ్డేకు ‘టిల్లు క్యూబ్‌’లో ఆఫర్‌ రావడం నిజంగా లక్కీ అనే చెప్పాలి. పూజా ఈ మూవీలో నటిస్తే కెరీర్‌ పరంగా ఆమెకు తప్పకుండా ప్లస్‌ అవుతుంది. సిద్ధు పక్కన రాధికగా నటిస్తే తిరిగి యూత్‌లో క్రేజ్‌ సంపాదించే అవకాశం ఉంది.  టిల్లు క్యూబ్‌ కథ అదే! డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌ చిత్రాలకు ఇంచుమించు ఒకే తరహా కథతో రూపొందాయి. తొలి భాగం.. ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్‌ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌లో కూడా అదే పాయింట్‌తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది యాడ్‌ చేశారు. ఈసారి టిల్లు క్యూబ్‌ మాత్రం మరో లెవల్‌లో ఉంటుందట. టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ మీద కథ ఉండబోతుందని కథానాయకుడు సిద్ధూ స్వయంగా తెలిపాడు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా  మొదలుపెడతానని గతంలో స్పష్టం చేశాడు.
    మే 03 , 2024

    సిద్ధు జొన్నలగడ్డ తల్లిదండ్రులు ఎవరు?

    శారద, సాయి కుమార్ జొన్నలగడ్డ

    సిద్ధు జొన్నలగడ్డ Family Pictures

    Images

    Siddhu Jonnalagadda Family

    సిద్ధు జొన్నలగడ్డ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    సిద్ధు జొన్నలగడ్డ స్వాగ్, సహజమైన నటన అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా డిజే టిల్లు, గుంటూరు టాకీస్ చిత్రాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది.

    సిద్ధు జొన్నలగడ్డ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సిద్ధు జొన్నలగడ్డ తొలి చిత్రం ఏది?

    సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    డిజే టిల్లు సినిమాలో టిల్లు క్యారెక్టర్ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది.

    సిద్ధు జొన్నలగడ్డ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Siddhu Jonnalagadda best stage performance

    సిద్ధు జొన్నలగడ్డ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Siddhu Jonnalagadda best dialogues

    సిద్ధు జొన్నలగడ్డ రెమ్యూనరేషన్ ఎంత?

    సిద్ధు జొన్నలగడ్డ ఒక్కో చిత్రానికి రూ.2.5కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    సిద్ధు జొన్నలగడ్డ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్‌వెజ్

    సిద్ధు జొన్నలగడ్డ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    సిద్ధు జొన్నలగడ్డ కు ఇష్టమైన నటి ఎవరు?

    సిద్ధు జొన్నలగడ్డ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌

    సిద్ధు జొన్నలగడ్డ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్

    సిద్ధు జొన్నలగడ్డ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్

    సిద్ధు జొన్నలగడ్డ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    ధోని, విరాట్ కొహ్లీ

    సిద్ధు జొన్నలగడ్డ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    987K ఫాలోవర్లు ఉన్నారు

    సిద్ధు జొన్నలగడ్డ సోషల్‌ మీడియా లింక్స్‌

    సిద్ధు జొన్నలగడ్డ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సిద్ధు జొన్నలగడ్డ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree