• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2: ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్‌లో ఈ యాడ్స్ గమనించారా? ఫొటోలు వైరల్

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో వసూళ్ల సునామి సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ రూ.1400 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌లో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది దీనిని గమనించకపోవచ్చు. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 

    సాంగ్స్‌లో యాడ్స్..

    పుష్ప 2’ చిత్రంతో పాటు అందులోని టైటిల్‌ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ‘పుష్ప.. పుష్ప..’ అంటూ సాగే ఈ పాటలో బన్నీ తన మ్యానరిజంతో మెస్మరైజ్‌ చేశాడు. అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సాంగ్‌లో మనం గమనించాల్సిన అంశం మరోటి కూడా ఉంది. దర్శకుడు సుకుమార్‌ పాట మధ్యలో వచ్చే సీన్స్‌లో పలు బ్రాండెడ్‌ కంపెనీలను ప్రమోట్‌ చేశారు. ఓ లారిపై జేకే టైర్స్‌, కజారియా (Kajaria Ceramics), షాప్‌ డోర్స్‌పై కల్యాణ్‌ జ్యూయలర్స్‌, అంబూజ సిమెంట్స్‌, టాటా చక్రా గోల్డ్ (బన్నీ తాగే టీ గ్లాస్‌పై) వంటి కంపెనీ పేర్లు దర్శనమిచ్చాయి. అలాగే ‘పీలింగ్స్‌’ పాటలో ‘అస్ట్రాల్‌’ అనే ప్రముఖ పైపుల కంపెనీ పేరు ఓ సీన్‌లో కనిపించింది. దీంతో సుకుమార్‌ సాంగ్స్‌ను అడ్వర్‌టైజ్‌మెంట్స్‌ కోసం కూడా ఉపయోగించుకున్నాడని నెటిజన్లు అంటున్నారు. 

    డబ్బుల కోసమేనా!

    సాధారణంగా ఒక పాటలో ఇలా కంపెనీ బ్రాండ్స్‌ను దర్శక నిర్మాతలు ఉపయోగించారు. ఓపెన్‌ ప్లేస్‌లో సాంగ్‌ షూట్‌ చేసే క్రమంలో ఒరిజినల్‌ పేర్లకు బదులుగా వాడుకలో లేని పేర్లను వినియోగిస్తుంటారు. ఉచిత ప్రమోషన్స్‌ ఇవ్వడం ఎందుకు? అన్న ఉద్దేశ్యంతో మేకర్స్ ఇలా చేస్తుంటారు. మరి ‘పుష్ప 2’ వంటి నేషనల్‌ వైడ్‌ బజ్‌ ఉన్న సినిమాలో ఇలా పలు కంపెనీ బ్రాండ్ల పేర్లు కనిపించడం ఆసక్తి రేపుతోంది. అయితే సుకుమార్‌ కావాలనే వాటిని పెట్టారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అలా పెట్టడం ద్వారా ఆయా కంపెనీల నుంచి మేకర్స్‌ కొంత మెుత్తంలో వసూలు చేసి ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం నుండి క్లారిటీ రావాల్సి ఉంది. 

    కొత్త ట్రెండ్‌ షురూ!

    పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌లో ప్రముఖ కంపెనీల ప్రొడక్ట్స్‌ను ఇలా ప్రమోట్‌ చేయడం ద్వారా దర్శకుడు సుకుమార్‌ కొత్త ట్రెండ్‌ను సృష్టించారని చెప్పవచ్చు. కొత్త వ్యాపార అవకాశాన్ని టాలీవుడ్‌ మేకర్స్‌కు ఆయన అందించారు. ఇకపై ఇలా పబ్లిక్‌ సాంగ్స్‌ చేసేటప్పుడు ప్రముఖ బ్రాండ్లకు అడ్వర్‌టైజింగ్‌ చేసే అవకాశాన్ని దర్శక నిర్మాతలు పరిశీలించే ఛాన్స్ ఉంది. తద్వారా కొంత మెుత్తాన్ని సినిమా కోసం సమకూర్చుకునే వెసులుబాటు ఉంటుంది. మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, తారక్‌ వంటి బడా హీరోల చిత్రాలకైతే కోట్లలో యాడ్స్‌ రూపంలో వసూలు చేసే అవకాశం లభిస్తుంది. మరి నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి. 

    ‘పుష్ప 2’ రెండు వారాల కలెక్షన్స్‌..

    పుష్ప 2’ (Pushpa 2) చిత్రం విడుదలై బుధవారంతో (డిసెంబర్‌ 18) సరిగ్గా రెండు వారాలు (14 రోజులు) పూర్తయింది. ఈ క్రమంలో ‘పుష్ప 2’ రూ.1450 కోట్ల మైలురాయి (Pushpa 2 Box Office Collections)ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు ఇంకో రూ.50 కోట్ల దూరంలో మాత్రమే పుష్పరాజ్‌ ఉన్నాడని పేర్కొన్నారు. రేపో, మాపో ఆ ఘనత కూడా ‘పుష్ప 2’ ఖాతాలో వచ్చి చేరుతుందని తెలిపారు. సంక్రాంతి వరకూ పెద్ద హీరోల చిత్రాలు లేకపోవడంతో పుష్పరాజ్ జైత్రయాత్ర ఇలాగే కొనసాగే ఛాన్స్ ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ప్రస్తుతం ‘పుష్ప 2’  మూడో స్థానంలో కొనసాగుతోంది. దంగల్‌ (రూ. 2,051 కోట్లు), బాహుబలి 2 (రూ.1,810.60) చిత్రాలు ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv