• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2 Film: ‘పుష్ప 2’ రికార్డుల మోత.. ‘కేజీఎఫ్ 2’, ‘RRR’ వెనక్కి.. ‘బాహుబలి 2’కి అడుగు దూరంలో

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో వసూళ్ల సునామి సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. నార్త్‌, సౌత్‌, ఓవర్సీస్‌ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల మంచి ఆదరణ పొందుతోంది. ఆడియన్స్‌ పుష్పగాడి రూల్‌కు జై కొడుతున్నారు. దీంతో 11 రోజుల్లోనే రూ.1409 కోట్లు వసూళ్లు సాధించి ‘పుష్ప 2’ సత్తా చాటింది. రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మరి 12వ రోజున ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

    12 రోజుల కలెక్షన్స్‌.. 

    అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా వసూళ్లు రాబడుతోంది. 12 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.1450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క ఇండియాలోనే ఇప్పటివరకూ రూ.933.92 కోట్లు వసూలు చేసినట్లు తెలిపాయి. అయితే గత 11 రోజులుగా రోజుకు రూ.100 కోట్లు తగ్గకుండా వసూలు చేసిన ‘పుష్ప 2’ 12వ రోజు వసూళ్లలో కాస్త తగ్గుదల కనిపించినట్లు పేర్కొన్నాయి. అధికారిక వసూళ్లను మేకర్స్‌ అనౌన్స్‌ చేస్తే ఈ విషయంపై స్పష్టత వచ్చే ఛాన్స్‌ ఉందని అభిప్రాయపడ్డాయి. అయితే రూ.1500 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప 2’ ఈజీగానే చేరుతుందని స్పష్టం చేశాయి. 

    కలెక్షన్స్ పరంగా టాప్‌..

    పుష్ప 2’ చిత్రం ఓ అరుదైన ఘనత సాధించింది. పోస్టు కోవిడ్‌ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా తీసుకుంటే రూ.1914 – 2100 కోట్ల గ్రాస్‌తో ‘దంగల్‌’ చిత్రం తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 చిత్రం రూ.1747 కోట్లకు పైగా వసూళ్లతో సెకండ్‌ పొజిషన్‌లో కొనసాగుతోంది. ఇప్పటివరకూ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న RRR (రూ.1,387), కేజీఎఫ్‌ 2 (రూ. 1215) చిత్రాలను వెనక్కి నెట్టి ‘పుష్ప 2’ (రూ.1400+ కోట్లు) మూడో స్థానంలో నిలిచింది. అయితే ‘బాహుబలి 2’ కలెక్షన్స్‌ను బీట్‌ చేయడానికి మరో రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం పుష్పరాజ్‌ దూకుడు చూస్తుంటే ‘బాహుబలి 2’ కలెక్షన్స్‌ కూడా దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    నార్త్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు

    పుష్ప 2’ చిత్రానికి నార్త్‌లో విశేష స్పందన వస్తోంది. రోజు రోజుకు కలెక్షన్స్‌ భారీగా పెరుగుతున్నాయి. హిందీ రీజియన్‌లో 12 రోజుల వ్యవధిలో రూ.582 కోట్ల నెట్‌ వసూళ్లను ‘పుష్ప 2’ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. రెండో సోమవారం (డిసెంబర్‌ 16) హిందీలో రూ.20.50 కోట్ల నెట్‌ వసూలైనట్లు తెలిపింది. ఇప్పటివరకూ ఏ సినిమా ఇలాంటి వసూళ్లు రాబట్టలేదని తెలిపింది. హిందీలో ‘పుష్ప 2’ వచ్చిన కలెక్షన్స్ ఆల్‌టైమ్‌ రికార్డు అని వెల్లడించింది. ప్రస్తుతం హిందీలో బడా చిత్రాలు లేకపోవడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    ‘పుష్ప 2’ ఓటీటీ డేట్‌ లాక్‌

    థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప 2’ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని సినీ లవర్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ లాక్‌ అయ్యింది. వచ్చే ఏడాది జనవరి 9న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ రోజునే ఓటీటీలోకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ పట్టుబడుతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే కేవలం నెల రోజుల గ్యాప్‌తోనే ‘పుష్ప 2’ స్ట్రీమింగ్‌లోకి రానుంది. థియేటర్లలో పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఓటీటీలోనూ కొత్త రికార్డులు క్రియేట్‌ చేసే అవకాశముంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv