• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Prabhas: చికిత్స కోసం జర్మనీకి ప్రభాస్‌? రాజాసాబ్‌ రిలీజ్‌ డౌటే!

    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నాడు. వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజనుకు పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం అతడు ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ప్రభాస్‌ నుంచి రానున్న మూవీ కావడంతో ‘రాజాసాబ్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తన కాలుకు గాయమైనట్లు ప్రభాస్ సోమవారం (డిసెంబర్‌ 16) స్వయంగా ప్రకటించడంతో ఈ సినిమా రిలీజ్‌పై అనుమానాలు ఏర్పడ్డాయి. 

    జర్మనీలో చికిత్స

    హీరో ప్రభాస్ (Rebel Star Prabhas) చికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చికిత్స అనంతరం కొంతకాలం పాటు ప్రభాస్‌ విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. అయితే తొలుత ప్రభాస్‌ కాలు బెణికిందని మాత్రమే వార్తలు వచ్చాయి. ప్రభాస్‌ సైతం స్వల్పగాయమే అంటూ స్పెషల్‌ నోట్‌లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే గాయం తీవ్రత పెద్దదిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. 

    రాజాసాబ్‌ వాయిదా?

    ప్రభాస్‌ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab) చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం వేగంగా షూటింగ్‌ కూడా జరుపుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌ కాలికి గాయం కావడం షూటింగ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ప్రభాస్‌, కమెడియన్‌ సత్య మధ్య చాలా వరకూ సీన్స్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ జనవరి చివరి వారంలో తిరిగి షూటింగ్‌లో జాయిన్‌ అయ్యే ఛాన్స్‌ ఉందంటున్నారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్‌ సైతం పెండింగ్‌ ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘రాజాసాబ్‌’ చెప్పిన టైమ్‌కు వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాయిదా పడేందుకే ఎక్కువ ఛాన్స్ ఉందని ఫిల్మ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    గాయంపై ప్రభాస్‌ ఏమన్నారంటే?

    ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ‘ (Kalki 2898 AD) జపాన్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే కాలికి గాయం కావడం వల్ల ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతున్నట్లు ప్రభాస్ ఓ పోస్టు రిలీజ్‌ చేశారు. ‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ, మీరు నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్‌లో నా కాలికి స్వల్ప గాయమవడంతో రాలేకపోతున్నా’ అని ప్రభాస్‌ పేర్కొన్న పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘కల్కి 2898 ఏడీ’ 2025 జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది.

    నయన్‌ స్పెషల్‌ సాంగ్‌

    ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్‌’ చిత్రంలో మాళవిక మోహన్‌, రిద్ది కుమార్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లేటెస్ట్ బజ్‌ ప్రకారం వీరితో పాటు నయనతార (Nayanthara) కూడా సినిమాలో యాడ్ అయినట్లు తెలుస్తోంది. నయన్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌పై ఉన్న అభిమానంతోనే ఈ స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు లేడీ సూపర్‌ స్టార్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్‌ – నయనతార కలిసి ‘యోగి’ (Yogi) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వారిద్దరు సిల్వర్‌ స్క్రీన్‌పై మెరవబోతున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv