• TFIDB EN
  • కల్కి 2898 ఎ.డి (2024)
    UATelugu
    కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్‌ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    ఇన్ ( Telugu, Malayalam, Kannada, Tamil )
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflix
    ఇన్ ( Hindi )
    Watch
    2024 Aug 223 months ago
    కల్కి2898AD చిత్రం నేటి(ఆగస్టు 22) నుంచి అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
    2024 June 295 months ago
    కల్కి2898 ఏడి నుంచి కాంప్లెక్స్ ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది.
    2024 June 255 months ago
    కల్కి 2898 ఏడి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
    మరింత చూపించు
    రివ్యూస్
    YouSay Review

    Kalki 2898 AD Review: ఇండియన్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ‘కల్కి’.. సినిమా ఎలా ఉందంటే?

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్‌ ఉంది. ఎపిక్‌ సైన్స్‌ ఫి...read more

    How was the movie?

    @prudhvi

    Great movie

    Great Tollywood movie feel like watching Hollywood movie with Hindu mythology

    5 months ago

    తారాగణం
    ప్రభాస్
    భైరవ మరియు కర్ణ
    అమితాబ్ బచ్చన్
    అశ్వత్థామ
    కమల్ హాసన్
    సుప్రీం యాస్కిన్
    దీపికా పదుకొనే
    SUM-80 అలియాస్ సుమతి
    దిశా పటాని
    రాక్సీ
    రాజేంద్ర ప్రసాద్
    శోభన
    మరియం
    సస్వతా ఛటర్జీ
    కమాండర్ మానస్
    బ్రహ్మానందం
    రాజన్
    పశుపతి
    వీరన్
    అన్నా బెన్కైరా
    మాళవిక నాయర్
    ఉత్తరా
    హర్షిత్ మల్గిరెడ్డి
    విజయ్ దేవరకొండ
    అర్జునుడు
    మృణాల్ ఠాకూర్
    దివ్య
    దుల్కర్ సల్మాన్
    భైరవ సంరక్షకుడు
    ఎస్ఎస్ రాజమౌళి
    ఒక వేటగాడు మరియు భైరవ ప్రత్యర్థి
    రామ్ గోపాల్ వర్మ
    అనుదీప్ కెవి
    కాంప్లెక్స్‌లో ఒక నర్తకి
    శ్రీనివాస్ అవసరాల
    భైరవ ప్రతిపాదిత కొనుగోలుదారు
    సిబ్బంది
    నాగ్ అశ్విన్
    దర్శకుడు
    సి. అశ్వని దత్
    నిర్మాత
    నాగ్ అశ్విన్రచయిత
    సంతోష్ నారాయణన్
    సంగీతకారుడు
    జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్సినిమాటోగ్రాఫర్
    కోటగిరి వెంకటేశ్వరరావు
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్‌.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
    Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్‌.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఎ.డి (Kalki 2898 AD). బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ మూవీలో అమితాబ్‌ అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పురణాల్లో ఆ పాత్రకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకునేందు ఆడియన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు.  అశ్వత్థామ ఎవరంటే? ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నట్లు తెలిసినప్పటీ నుంచి ఆయన పోషిస్తున్న పాత్రపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పురణాల్లోని ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తారని లీక్స్‌ కూడా వచ్చాయి. అందుకు తగ్గట్లే ఆయన ‘అశ్వత్థామ’ పాత్రలో నటించనునట్లు మూవీ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ పాత్రపై బజ్‌ ఏర్పడింది. పురణాల ప్రకారం.. మహాభారతంలో అశ్వత్థామ ద్రోణుని కుమారుడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేత అశ్వత్థామ శపించబడతాడు. ప్రపంచం అంతమయ్యే వరకు అశ్వత్థామ.. తనకి ఉన్న గాయాలతో రక్తం, చీము కారుతూ, నిత్యం రగులుతూ బ్రతికే ఉండాలని శపిస్తాడు. ఈ శాపంతో అశ్వత్థామ ఇప్పటికి బ్రతికే ఉన్నాడని, గాయాలు నుంచి శ్రవించే రక్తం కనిపించకుండా ఒంటి నిండా బట్ట చుట్టుకొని ఉంటాడని సనాతన ధర్మ గురువులు చెబుతుంటారు. తాజాగా విడుదలైన అమితాబ్‌ లుక్స్‌ అచ్చం అలాగే ఉండటం గమనార్హం. గ్లింప్స్‌లో ఏముంది? కల్కిలో అశ్వత్థామను పరిచయం చేస్తూ ఆదివారం ఓ ఆసక్తికర వీడియోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ‘నీకు మరణం లేదా? నువ్వు దేవుడివా? నువ్వు ఎవరు?’ అంటూ ఓ చిన్నారి అమితాబ్‌ను ప్రశ్నిస్తాడు. అప్పుడు అమితాబ్‌ తన పాత్రను పరిచయం చేస్తాడు. ‘అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. నేను గురు ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ’ అని బాలుడితో చెప్పి బిగ్ బి అదృశ్యం అవుతాడు. కాగా, ఈ గ్లింప్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని పేర్కొంటున్నారు. కాగా, అమితాబ్‌ గ్లింప్స్‌కు సంతోష్ నారాయణన్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. https://twitter.com/i/status/1782338404421927223 రాజమౌళిని ఫాలో అవుతున్న నాగ్‌! అశ్వత్థామ పాత్ర తరహాలోనే రానున్న రోజుల్లో ‘కల్కి 2898 ఏడీ’లోని ఇతర కీలక రోల్స్‌కు సంబంధించిన పరిచయ వీడియోలు కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమా సమయంలో దర్శకధీరుడు రాజమౌళి అనుసరించిన ఫార్మూలనే కల్కీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ అనుసరించబోతున్నట్లు సమాచారం. బాహుబలి సమయంలో ప్రభాస్‌, రానా (భల్లాలదేవ), అనుష్క (దేవసేన) పాత్రలను రాజమౌళి ఓ ప్రత్యేక గ్లింప్స్‌ రూపంలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఈ తరహాలోనే నాగ్‌ అశ్విన్‌ కూడా అమితాబ్‌ బచ్చన్‌ రోల్‌ను పరిచయం చేశారు. త్వరలోనే ప్రభాస్‌ ‘భైరవ’ టీజర్‌ కూడా వస్తుందట. అలాగే దీపికా పదుకొనే, కమల్‌హాసన్‌ తదితరుల పాత్రలను కూడా ఇంట్రడ్యూస్‌ చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.   దీపికా, కమల్‌ పాత్రలు అవేనా?  ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేస్తున్న రోల్స్ అవేనంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్‌ హాసన్‌.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరి పాత్రలకు సంబంధించి కూడా వీడియో రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటి ఇవ్వాల్సి ఉంది.  నిరాశలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌! ‘కల్కి 2898 ఏడీ’ విడుదల తేదీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. వాస్తవానికి మే 9న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్‌ ప్రకటించారు. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ఈ సినిమా విడుదల కావడం లేదు. ఈ క్రమంలోనే కొత్త తేదీని మేకర్స్‌ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమితాబ్‌ పాత్రను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించడంతో ‘అశ్వత్థామ వీడియో గ్లింప్స్‌’లోనే విడుదల తేదీని రివీల్‌ చేస్తారని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ భావించారు. అయితే ఎలాంటి డేట్‌ను లాక్‌ చేయకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారు. 
    ఏప్రిల్ 22 , 2024
    <strong>Kalki 2898 AD Trending Posts: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న ‘కల్కి’.. డైరెక్టర్ కాళ్లు మెుక్కుతున్న నెటిజన్లు!</strong>
    Kalki 2898 AD Trending Posts: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న ‘కల్కి’.. డైరెక్టర్ కాళ్లు మెుక్కుతున్న నెటిజన్లు!
    ప్రభాస్‌ కల్కి (Kalki 2898 AD) చిత్రంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇన్ని రోజుల నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కిందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానులు అంటున్నారు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్‌ రికార్డులు అన్ని చెరిగిపోవడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం #Kalki2898AD హ్యాష్‌ ట్యాగ్‌ నెట్టింట విపరీతంగా ట్రెండింగ్‌ అవుతోంది. సినిమా చూసిన ఆడియన్స్‌ సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తమ ఫీలింగ్స్‌ను ఆసక్తికరమైన వీడియోల రూపంలో తెలియజేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆ పోస్టులు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘కల్కి 2898 ఏడీ’ చూసిన ఓ అభిమాని నెట్టింట ఆసక్తికర పోస్టు పెట్టాడు. సినిమా లవర్స్‌.. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాళ్లు మెుక్కి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఓ వీడియోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/saidevendla/status/1806199250327359793 కల్కి సూపర్‌ హిట్‌ టాక్‌ చూసి.. మూవీ యూనిట్‌ మెుత్తం ఫుల్‌ జోష్‌లో ఉన్నట్లు అర్థం వచ్చేలా ఒక నెటిజన్‌ ఓ ఆసక్తిర వీడియోను పంచుకున్నాడు. ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాత అశ్వనిదత్‌ చిందులు వేస్తునట్లుగా మాస్టర్‌ సినిమాలోని డ్యాన్స్‌ క్లిప్‌ను ఎడిటింగ్‌ చేసి పంచుకున్నాడు. https://twitter.com/i/status/1806199186813288713 ప్రభాస్‌కు ఈ స్థాయి సక్సెస్‌ను అందించినందుకు రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ అందరూ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌కు మెుక్కుతున్నట్లు ఉన్న ఓ వీడియో పెద్ద ఎత్తున ట్రెండింగ్‌ అవుతోంది. ఖలేజా సినిమాలో ఓ సీన్‌ను ఎడిట్‌ చేసి పోస్టు చేశారు.&nbsp; https://twitter.com/i/status/1806199040368910540 ప్రభాస్‌ గత చిత్రం ‘సలార్‌’ కేవలం యూత్‌కు మాత్రమే నచ్చిందని.. కానీ, కల్కి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ముఖ్యంగా మూవీలోని మహాభారతం ఎపిసోడ్‌కు పునకాలు వచ్చినట్లు పేర్కొన్నారు.&nbsp; https://twitter.com/SALAARSURYAA/status/1806198851164066271 పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకిరా నందన్‌ కూడా కల్కి థియేటర్‌ వద్ద సందడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లోకి అకిరా వెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; https://twitter.com/i/status/1806198649107755236 కల్కి.. రెగ్యులర్‌ చిత్రం లాంటింది కాదని.. కచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన మూవీ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.&nbsp; https://twitter.com/btrsir/status/1806056337714864288?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1806056337714864288%7Ctwgr%5E340e81c546b0e7d2540bbcb78327e8a93b350cf2%7Ctwcon%5Es1_&amp;ref_url=http%3A%2F%2Fnewsroom.etvbharat.org కల్కి సెకండాఫ్‌ ఒక మాస్టర్‌ పీస్‌ అని, చివరి 45 నిమిషాలు గూస్‌ బంప్స్‌ తెప్పించాయని ఓ అభిమాని పోస్టు పెట్టాడు. ప్రభాస్‌, అమితాబ్‌ తమ నటనతో థియేటర్లను షేక్‌ చేశారని చెప్పుకొచ్చాడు.&nbsp; https://twitter.com/SivaHarsha_23/status/1806175733125132706 కల్కి సినిమా సక్సెస్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది. దీనికి అర్థం పట్టేలా ఓ అభిమాని షేర్‌ చేసిన వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/i/status/1806134805542941036
    జూన్ 27 , 2024
    <strong>Kalki 2898 AD Story: మూడు ప్రపంచాల సంగ్రామమే ‘కల్కి’.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్‌ చేసిన డైరెక్టర్‌!</strong>
    Kalki 2898 AD Story: మూడు ప్రపంచాల సంగ్రామమే ‘కల్కి’.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్‌ చేసిన డైరెక్టర్‌!
    యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం విడుదలకు ఇంకా ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పార్ట్‌ - 1 జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబయిలో గ్రాండ్‌గా కల్కి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సైతం నిర్వహించారు. సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్యూచరిక్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా? అన్న ప్రశ్న గత కొంతకాలంగా ప్రతీ సినీ అభిమానిలోనూ ఉంది. దీంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. 'కల్కి' కథను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్పెషల్‌ వీడియోను ఎక్స్‌ వేదికగా రిలీజ్‌ చేశారు.&nbsp; త్రీ వరల్డ్స్‌ స్టోరీ ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీ కథ.. మూడు ప్రపంచాల మధ్య తిరుగుతుందని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ లేటెస్ట్‌ వీడియోలో స్పష్టం చేశారు. కాశీ, కాంప్లెక్స్‌ (కాశీ పైన ఉన్న పిరమిడ్‌ లాంటి సిటీ), శంబాలా నగరాల చుట్టూ ప్రధానంగా కల్కి స్టోరీ తిరగనుందని తెలియజేశారు. ‘పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీ లేదా వారణాసి ఈ ప్రపంచంలో మొదటి నగరమని అనేక పుస్తకాలు, శాసనాల్లో ఉంది. నాగరికత పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెబుతారు. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే చివరి నగరమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది’ అని నాగ్‌ అశ్విన్‌ తెలిపారు.&nbsp; https://twitter.com/i/status/1803649632041419033 కాంప్లెక్స్‌కు వెళ్లడమే లక్ష్యం 3000 ఏళ్ల తర్వాత కాశీ నగరం ఎలా ఉంటుంది? గంగ పూర్తిగా ఎండిపోయి ప్రజలు ఎలాంటి దుర్భర పరిస్థితులు అనుభవిస్తారు? అని ఊహించి రీసెర్చ్‌ చేసి మరి కల్కిలో కాశీ నగరాన్ని సృష్టించినట్లు నాగ్‌ అశ్విన్‌ చెప్పారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్‌ ఆకారంలో ఉండే 'కాంప్లెక్స్‌'.. ఆకాశంలో కిలో మీటర్‌ మేర ఉండి స్వర్గాన్ని తలపిస్తుంటుందని పేర్కొన్నారు. 'కాంప్లెక్స్‌లో లభించని వస్తువు, పదార్థమంటూ ఉండదు. ఒక ముక్కలో చెప్పాలంటే అదొక స్వర్గం. నీరు, ఆహారం, పచ్చదనం ఇలా ప్రతిదీ అక్కడ ఉంటుంది. కాశీ ప్రజలు ఎప్పటికైనా కాంప్లెక్స్‌కు వెళ్లి అన్నింటినీ ఆస్వాదించాలనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉండటంతో అవి కాశీ ప్రజలకు అందకుండా కొందరు నియంత్రిస్తుంటారు. కాంప్లెక్స్‌లోకి వెళ్లాలంటే మిలియన్ల కొద్దీ యూనిట్స్‌ (ధనం) కలిగి ఉండాలి. ఒకరకంగా అక్కడ అడుగు పెట్టడమంటే జీవితాన్ని పణంగా పెట్టడమే' అని నాగ్‌ అశ్విన్‌ పేర్కొన్నారు. శంబాలా.. ఒక శరణార్థి క్యాంపు కల్కిలోని మూడో ప్రపంచమైన 'శంబాలా' గురించి కూడా తాజా వీడియోలో నాగ్‌ అశ్విన్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘వివిధ సంస్కృతుల్లో శంబాలా పేరును వినియోగించారు. టిబెటిన్‌ కల్చర్‌లో దీన్ని షాంగ్రిలా అని పిలిచారు. శంబాలా నుంచే విష్ణు చివరి అవతారం వస్తుందని పురణాలు చెబుతున్నాయి. కాబట్టి శంబాలా ప్రజలు దేవుడి రాక ఇక్కడి నుండి ఉంటుందన్న నమ్మకంతో జీవిస్తుంటారు. అయితే శంబాలా అనేది అతి పెద్ద శరణార్థి క్యాంపులాంటిది. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, సంస్కృతులకు చెందిన వాళ్లు.. కాంప్లెక్స్‌ సభ్యులు వేటాడి హతమార్చగా మిగిలిన వాళ్లు తలదాచుకునే ప్రదేశం. వీరిలోనే రెబల్స్‌ కూడా ఉంటారు. కాంప్లెక్స్‌ సభ్యులతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. ఇలా ఈ మూడు ప్రపంచాల మధ్యే నడిచే కథ వాటి మధ్య ఏర్పడే సంఘర్షణలే కల్కి కథ’ అని నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చారు. ‘కల్కి’ రన్‌టైమ్‌ ఎంతంటే? గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ రన్ టైమ్​ గురించి చర్చ నడుస్తోంది. తాజాగా ఇప్పుడు అధికారికంగా రన్ టైమ్​ బయటకి వచ్చింది. ఈ సినిమాను చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు.. మూవీకి యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చారు. రన్​​ టైమ్​ 180.55 నిమిషాల నిడివితో రానున్నట్లు పేర్కొన్నారు. అంటే ఈ సినిమాను మేకర్స్ 3 గంటల 55 సెకన్లకు కట్ చేశారు. మరి ఈ భారీ ట్రీట్​ను థియేటర్స్​లో ప్రేక్షకుల ఎలా ఆదరిస్తారో చూడాలి. కాగా, సినిమాలో అమితాబ్​ బచ్చన్​, కమల్​ హాసన్​, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.
    జూన్ 20 , 2024
    <strong>Kalki 2898 AD Review: ఇండియన్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ‘కల్కి’.. సినిమా ఎలా ఉందంటే?</strong>
    Kalki 2898 AD Review: ఇండియన్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ‘కల్కి’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, దుల్కర్ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, దిశా పటాని, రానా దగ్గుబాటి, అన్నా బెన్‌ తదితరులు రచన, దర్శకత్వం : నాగ్‌ అశ్విన్‌ సంగీతం : సంతోష్‌ నారాయణన్‌ ఎడిటింగ్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాతలు : అశ్విని దత్‌, ప్రియాంక దత్‌, స్వప్న దత్‌ నిర్మాణ సంస్థ : వైజయంతీ మూవీస్‌ మేకర్స్ విడుదల తేదీ : 27 జూన్‌, 2024 ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్‌ ఉంది. ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పీక్స్‌కు వెళ్లాయి. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌ రూపొందిన ఈ చిత్రం.. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు అంచనాలను అందుకుందా? ప్రభాస్‌ ఖాతాలో మరో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి 'కల్కి 2898 ఏడీ' కథ.. మహాభారతంలో ధర్మరాజు ఆడిన అబద్దం నుంచి మెుదలవుతుంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. మరోవైపు కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం అతడికి 1 మిలియన్‌ యూనిట్లు అవసరం అవుతాయి. అయితే సుమతిని పట్టుకుంటే ఆ మెుత్తం లభిస్తుందని భైరవ తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? అతనికి సుమతి ఎందుకు కావాలి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? కాశీ, శంబాలా ప్రజలు ఎందుకు కష్టాల్లో మునిగిపోయారు? విజయ్‌ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌ పాత్రలు ఏంటి? అన్నది తెలియాలంటే కల్కి సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన విశ్వరూపం చూపించాడు. భైరవ పాత్రలో అదరగొట్టాడు. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో మరోమారు తన మార్క్‌ ఏంటో చూపించాడు. తొలి అర్ధభాగంలో అతడి పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌ చేశాడు. బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అశ్వత్థామ పాత్రలో ఆయన నెవర్‌ బీఫోర్‌ నటనతో మెప్పించారు. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేనంత బాగా నటించారు అమితాబ్‌. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. విలన్‌గా కమల్‌ హాసన్‌ నెక్స్ట్‌ లెవెల్‌ పర్‌ఫార్మెన్స్‌తో అదరహో అనిపించారు. దీపికా, దిశా పటాని పాత్రలు ఆకట్టుకున్నాయి. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, రాజమౌళి, రానా, ఆర్జీవీ క్యామియో మెప్పిస్తాయి. మిగిలిన పాత్రదారులు అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పేరు.. కల్కితో గ్లోబల్ స్థాయిలో మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి అతిపెద్ద బలం నాగ్‌ అశ్విన్‌ రాసుకున్న కథ. నాగ్ అశ్విన్‌ టేకింగ్‌, విజన్‌, ప్రెజంటేషన్‌కు నూటికి నూరు శాతం మార్కులు ఇవ్వాల్సిందే. తొలి 40 నిమిషాలు కథ స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా ఎక్కడా బోర్‌ కొట్టకుండా నాగ్‌ అశ్విన్‌ జాగ్రత్త పడ్డారు. ఇక ఆ తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. క్లైమాక్స్‌ వరకూ ఒకే ఇంటెన్సిటీతో సినిమాను నడిపించారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్‌ సీన్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఫ్యూచరిక్‌ వెహికల్స్‌, ఆయుధాలు, సెట్స్‌ విజువల్‌ వండర్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు నెక్స్ట్‌ లెవల్లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశారు దర్శకుడు. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్‌ కాస్త తడబడినట్లు కనిపిస్తోంది. కొన్ని సన్నివేశాలు మరీ సాగదీతలా అనిపిస్తాయి. మాస్‌ ఆడియన్స్‌కు అలరించే అంశాలు లేకపోవడం మైనస్‌. దీపికా డబ్బింగ్‌ విషయంలోనూ నాగ్‌ అశ్విన్‌ కాస్త జాగ్రపడి ఉంటే బాగుండేది. అయితే మెుత్తంగా నాగ్‌ అశ్విన్‌.. డైరెక్టర్‌గా సూపర్‌ సక్సెస్‌ అయినట్లు చెప్పవచ్చు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు అత్యుత్తమ పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఎక్కువ మార్కులు ఇవ్వాల్సిందే. సినిమాటోగ్రాఫర్‌ అద్భుత పనితీరు కనబరిచారు. సంతోష్‌ నారాయణన్‌ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా నేపథ్యం సంగీతం యాక్షన్‌ సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో వారు ఎక్కడా రాజీపడలేదు. ప్రతీ సీన్‌ చాలా రిచ్‌గా ఉంది.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథ, దర్శకత్వంప్రభాస్‌&nbsp;ప్రధాన తారాగణం నటనహాలీవుడ్‌ రేంజ్‌ విజువల్స్‌కురుక్షేత్రం ఎపిసోడ్‌ మైనస్‌ పాయింట్స్‌ తొలి 40 నిమిషాల ఎపిసోడ్‌దీపికా డబ్బింగ్‌ఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 4/5&nbsp;&nbsp; Public Talk On Kalki 2898 AD ప్రభాస్‌ కల్కి (Kalki 2898 AD) చిత్రంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇన్ని రోజుల నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కిందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానులు అంటున్నారు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్‌ రికార్డులు అన్ని చెరిగిపోవడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు.&nbsp; కల్కి సినిమాను పెద్ద సక్సెస్‌ చేసినందుకు కృష్ణంరాజు రెండో భార్య శ్యామలా దేవి ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో ప్రభాస్‌ను చూస్తే 1000 రెబల్‌ స్టార్లు కలిసినట్లు ఉందని పేర్కొన్నారు. https://twitter.com/i/status/1806243116405723294 కల్కి సినిమాలో విజయ్‌ దేవరకొండ.. ఓ ముఖ్యపాత్రలో కనిపించడంపై రౌడీ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. విజయ్‌ పాత్రకు సంబంధించిన క్లిప్‌ను నెట్టింట ట్రెండ్‌ చేస్తున్నారు. కల్కి లాంటి బ్లాక్ బాస్టర్‌ తమ హీరో భాగస్వామి అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1806146620867912015 అటు దుల్కర్‌ సల్మాన్ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఈ సినిమాలో దుల్కర్‌ క్యామియో అద్భుతంగా ఉందంటూ అతడి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1806187132450406624 కల్కిలో రాజమౌళి పాత్ర కూడా తమను ఎంతో సర్‌ప్రైజ్‌ చేసిందని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అతడి ఎంట్రీకి తాము ఫిదా అయినట్లు చెబుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1806177761280578043 ‘కల్కి 2898 ఏడీ’ చూసిన ఓ అభిమాని నెట్టింట ఆసక్తికర పోస్టు పెట్టాడు. సినిమా లవర్స్‌.. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాళ్లు మెుక్కి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఓ వీడియోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/saidevendla/status/1806199250327359793 కల్కి సూపర్‌ హిట్‌ టాక్‌ చూసి.. మూవీ యూనిట్‌ మెుత్తం ఫుల్‌ జోష్‌లో ఉన్నట్లు అర్థం వచ్చేలా ఒక నెటిజన్‌ ఓ ఆసక్తిర వీడియోను పంచుకున్నాడు. ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాత అశ్వనిదత్‌ చిందులు వేస్తునట్లుగా మాస్టర్‌ సినిమాలోని డ్యాన్స్‌ క్లిప్‌ను ఎడిటింగ్‌ చేసి పంచుకున్నాడు. https://twitter.com/i/status/1806199186813288713 ప్రభాస్‌కు ఈ స్థాయి సక్సెస్‌ను అందించినందుకు రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ అందరూ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌కు మెుక్కుతున్నట్లు ఉన్న ఓ వీడియో పెద్ద ఎత్తున ట్రెండింగ్‌ అవుతోంది. ఖలేజా సినిమాలో ఓ సీన్‌ను ఎడిట్‌ చేసి పోస్టు చేశారు.&nbsp; https://twitter.com/i/status/1806199040368910540 ప్రభాస్‌ గత చిత్రం ‘సలార్‌’ కేవలం యూత్‌కు మాత్రమే నచ్చిందని.. కానీ, కల్కి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ముఖ్యంగా మూవీలోని మహాభారతం ఎపిసోడ్‌కు పునకాలు వచ్చినట్లు పేర్కొన్నారు.&nbsp; https://twitter.com/SALAARSURYAA/status/1806198851164066271 పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకిరా నందన్‌ కూడా కల్కి థియేటర్‌ వద్ద సందడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లోకి అకిరా వెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; https://twitter.com/i/status/1806198649107755236 కల్కి.. రెగ్యులర్‌ చిత్రం లాంటింది కాదని.. కచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన మూవీ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.&nbsp; https://twitter.com/btrsir/status/1806056337714864288?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1806056337714864288%7Ctwgr%5E340e81c546b0e7d2540bbcb78327e8a93b350cf2%7Ctwcon%5Es1_&amp;ref_url=http%3A%2F%2Fnewsroom.etvbharat.org కల్కి సెకండాఫ్‌ ఒక మాస్టర్‌ పీస్‌ అని, చివరి 45 నిమిషాలు గూస్‌ బంప్స్‌ తెప్పించాయని ఓ అభిమాని పోస్టు పెట్టాడు. ప్రభాస్‌, అమితాబ్‌ తమ నటనతో థియేటర్లను షేక్‌ చేశారని చెప్పుకొచ్చాడు.&nbsp; https://twitter.com/SivaHarsha_23/status/1806175733125132706 కల్కి సినిమా సక్సెస్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది. దీనికి అర్థం పట్టేలా ఓ అభిమాని షేర్‌ చేసిన వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/i/status/1806134805542941036
    జూన్ 27 , 2024
    Prabhas: 9 పార్టులుగా ‘కల్కీ 2898AD?... ఇక హాలీవుడ్‌ పని అయినట్లే!
    Prabhas: 9 పార్టులుగా ‘కల్కీ 2898AD?... ఇక హాలీవుడ్‌ పని అయినట్లే!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై అంచనాలు చాలా హైరేంజ్‍లో ఉన్నాయి. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ బజ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; 9 పార్ట్‌లుగా కల్కీ! ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. హీరో ప్రభాస్‌ తన ఫోకస్‌ మెుత్తం ఈ చిత్రంపైనే పెట్టాడు. అయితే ఈ సినిమాపై వచ్చిన లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘కల్కీ 2898 ఏడీ’ 9 భాగాలుగా రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని, బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు కనీసం 9 పార్ట్స్‌గా తీయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్‌ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.&nbsp; https://twitter.com/MilagroMovies/status/1759613635327107364 ‘నేను ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్‌’ డార్లింగ్ ప్రభాస్‌కు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని పలు వేదికలపై వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ప్రభాస్‌పై తనకున్న అభిమాన్ని చాటుకున్నాడు. మెగా హీరోల తర్వాత తనకు నచ్చిన కథానాయకుడు ప్రభాస్ అని వరుణ్‌ తెలిపాడు. సూపర్ స్టార్ కావాలని ప్రభాస్ ఎప్పుడు అనుకోలేదని.. అతడి శ్రమ, కృషి డార్లింగ్‌ను ఈ స్థాయికి చేర్చాయని ప్రశంసించాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1759574622213947537 షమీ ఫేవరెట్‌ స్టార్లు వీరే టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) కూడా తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో తాను ప్రభాస్‌ ఫ్యాన్‌ అంటూ ప్రకటించాడు. సౌత్‌ ఇండియాలో మీకు నచ్చిన స్టార్స్ ఎవరని షమీని జర్నలిస్టు ప్రశ్నిస్తుంది. ఇందుకు షమీ సమాధానం ఇస్తూ.. సౌత్‌ సినిమాలు చాలా బాగుంటాయని.. తనకు ప్రభాస్‌తో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను కూడా ప్రభాస్‌, తారక్‌ ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు. https://twitter.com/i/status/1759506059331338533 ఛత్రపతి శివాజీగా ప్రభాస్‌! మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిన్న (ఫిబ్రవరి 19) దేశ వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ మెుదలైంది. ఛత్రపతి శివాజీ బయోపిక్‌ను సినిమాగా తీస్తే ప్రస్తుత ఇండియన్‌ స్టార్‌ హీరోల్లో ఆ పాత్రకు ఎవరు సరిపోతారన్న ప్రశ్న తలెత్తింది. దీంతో మెజారిటీ నెటిజన్లు ఛత్రపతి శివాజీ పాత్రకు ప్రభాస్ అయితేనే బాగుంటుందని బదులిచ్చారు. శివాజీ పాత్రకు ప్రభాస్ ఒక్కడే ఛాయిస్ అని పేర్కొన్నారు. https://twitter.com/i/status/1759409716114190363 ప్రభాస్‌కు హనుమాన్‌ ఎలివేషన్‌ ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన సమాచారం #Prabhas హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఎడిటింగ్‌ వీడియో ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. హనుమాన్‌ సినిమాలో ఆంజనేయుడి శక్తిని వివరిస్తూ నటుడు సముద్రఖని చెప్పే డైలాగ్‌ను ఆ వీడియోలో ప్రభాస్‌కు ‌అన్వయించారు. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలను సముద్రఖని డైలాగ్స్‌కు మ్యాచ్‌ చేస్తూ వీడియోను ఎడిట్‌ చేశారు.&nbsp; https://twitter.com/i/status/1759832540071027104 మే 9న ఫ్యాన్స్‌కు పండగే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9వ తేదీన గ్లోబల్ రేంజ్‌లో విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్‍ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍‍లో కూడా క్రేజ్ ఉంది. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలకపాత్రలు చేస్తున్నారు.
    ఫిబ్రవరి 20 , 2024
    <strong>Prabhas Upcoming Movies: </strong><strong>ఇండియాలోని టాప్‌ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌!</strong>
    Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్‌ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌!
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ లైనప్‌ (Prabhas Upcoming Movies) లో పెడుతూ ‌అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో సాలిడ్‌ హిట్‌ అందుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాజాసాబ్‌’ షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవల హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అదే విధంగా ‘స్పిరిట్‌’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్ట్స్‌ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు సాలిడ్‌ ప్రాజెక్ట్స్‌కు ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా లాంగ్వేజ్‌కు ఒక స్టార్‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌ తన సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేయనున్న చిత్రాలు ఏవి? ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌తో.. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’, ‘మాస్టర్‌’, ‘లియో’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు తెరకెక్కించి లోకేష్‌ కనగరాజ్‌ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. త్వరలోనే వీరి ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ టాప్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో 'కూలీ' అనే చిత్రాన్ని లోకేష్ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనంతరం హీరో కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కించనున్నాడు. దాని తర్వాతనే ప్రభాస్‌-లోకేష్‌ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. హిందీ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీతో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీ (Rajkumar Hirani)తో సినిమా చేయడం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్‌ (Prabhas Upcoming Movies) ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్‌ కల అతి త్వరలోనే నెరవేరే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజ్‌కుమార్‌ హిరానీ - ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘త్రీ ఇడియట్స్‌’,’ పీకే’, ‘సంజు’, ‘డుంకీ’ వంటి బ్లాక్‌ బాస్టర్ చిత్రాలకు రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వం వహించారు. హిందీలో ఆయన సినిమాలకు సెపరేట్‌ ఫ్యాన్ బేస్ ఉంది. అటు ప్రభాస్‌కు సైతం దేశ, విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీరి కాంబోలో సినిమా పడితే అన్ని రికార్డులు గల్లంతు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.&nbsp; కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో.. కన్నడ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ప్రభాస్‌ మరో చిత్రం (Prabhas Upcoming Movies) చేయనునున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘సలార్‌’ (Salaar) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రభాస్‌ కటౌట్‌ తగ్గ యాక్షన్‌ సీన్స్‌తో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమాకు సీక్వెల్‌గా ‘సలార్‌ 2’ రానున్నట్లు గతంలోనే ప్రశాంత్‌ నీల్‌ ప్రకటించారు. సలార్‌ మూవీ ఎండింగ్‌లో సెకండ్‌ పార్ట్‌కు సంబంధించిన లింక్‌ కూడా చూపించారు. అయితే ఇటీవల తారక్‌ - ప్రశాంత్ నీల్‌ కాంబోలో 'NTR 31' ప్రాజెక్ట్ లాంచ్‌ అయ్యింది. త్వరలోనే షూటింగ్‌ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత 'సలార్‌ 2'ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రశాంత్‌ వర్మ యూనివర్స్‌లోకి ప్రభాస్‌! ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రంతో యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించాడు. అటువంటి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ (Prabhas Upcoming Movies)&nbsp; ఓ సినిమా చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ వర్మ చెప్పిన కథకి ప్రభాస్‌ పచ్చజెండా ఊపడంతో ఈ కలయికలో సినిమా రావడం కన్ఫార్మ్‌ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ ఈ మూవీని నిర్మించేందుకు రంగం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుంత ప్రశాంత్‌ వర్మ చేతిలో రెండు బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘జై హనుమాన్‌’ (Jai Hanuman)తో పాటు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మనే డైరెక్ట్‌ చేయనున్నారు. ఈ రెండింటి తర్వాత ప్రభాస్‌తో సినిమా ఉంటుందని సన్నిహిత చెబుతున్నాయి.
    నవంబర్ 05 , 2024
    Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. సెట్స్‌పై సీక్వెల్‌ సినిమాలు.. లిస్ట్‌ చాలా పెద్దదే!
    Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. సెట్స్‌పై సీక్వెల్‌ సినిమాలు.. లిస్ట్‌ చాలా పెద్దదే!
    ఓ సినిమా హిట్‌ అయితే దానికి సీక్వెల్‌ తెరకెక్కించడం ఇటీవల అన్ని ఇండస్ట్రీలలో కామన్‌ అయిపోయింది. ఈ ట్రెండ్‌ని టాలీవుడ్‌ కూడా బాగా అలవరుచుకుంది. గతంలో అరకొరగా సీక్వెల్స్‌ వచ్చే టాలీవుడ్‌లో ఇప్పుడు అదే ఓ సిద్ధాంతంగా మారింది. హీరోలు సైతం తమ సూపర్‌ హిట్‌ సినిమాలను రెండో పార్ట్‌గా మలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో డైరెక్టర్లు చకా చకా కథను సిద్దం చేసి సీక్వెల్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సీక్వెల్స్‌ అంకుర దశలో ఉండగా, మరికొన్ని శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఇంకొన్ని త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; పుష్ప 2 అల్లుఅర్జున్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బన్నీని పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ ‘పుష్ప 2’ (Pushpa 2) కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో పుష్ప2ను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ జరుపుతున్నారు.&nbsp; ఆర్‌ఆర్‌ఆర్‌ - 2&nbsp; దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌ హిట్ అయింది. ఇందులో రామ్‌చరణ్, తారక్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రానుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రవర్మ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని రాజమౌళి కాకుండా వినూత్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. కానీ అందులో వాస్తవం లేదని సినీ వర్గాలు స్ఫష్టం చేశాయి. మరి, ఈ భారీ ప్రాజెక్టుని ఎవరికి అప్పగిస్తారో చూడాలి. డబల్‌ ఇస్మార్ట్‌ రామ్‌పోతినేని హీరోగా పూరి జగన్నాద్‌ డైరెక్షన్‌‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఇందులో రామ్.. ఊరమాస్‌ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘డబల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. 2024 మార్చి 8న మూవీ రిలీజ్‌ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.&nbsp; గూఢచారి 2 యంగ్‌ హీరో అడివి శేష్ కెరీర్‌లో ‘గూఢచారి’ (Goodachari) చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. ఈ షూటింగ్‌ను ‘G2’ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘G2’ మూవీ పోస్టర్‌, ప్రీ లుక్‌ టీజర్‌ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాయి. ఆల్ఫ్‌ పర్వతాల చుట్టూ ఈ సీక్వెల్‌ పార్ట్‌ తిరగనుందని సమాచారం.&nbsp; హిట్‌ 3 తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్‌ ఫ్రాంచైజీ చిత్రం హిట్‌ (HIT). తొలి భాగమైన ‘ది ఫస్ట్‌ కేస్‌’లో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించగా.. హిట్‌-2 (HIT 2)లో అడవిశేష్‌ కథానాయకుడిగా చేశాడు. ఇక హిట్‌-3 (HIT 3) కూడా రానున్నట్లు సెకండ్‌ పార్ట్‌ ఎండింగ్‌లో డైరెక్టర్‌ శైలేష్‌ కొలను హింట్‌ ఇచ్చేశారు. ఇందులో అర్జున్‌ అనే పోలీసు ఆఫీసర్‌ పాత్రను నాని పోషించనున్నాడు.&nbsp; ప్రతినిధి-2 యంగ్‌ హీరో నారా రోహిత్‌ ప్రస్తుతం ప్రతినిధి-2 (Prathinidhi-2) చిత్రంలో నటిస్తున్నాడు. 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాకు ఇది సీక్వెల్‌. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ మూవీని డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.&nbsp; టిల్లు స్క్వేర్‌ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు చిత్రం గతేడాది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, పాట రిలీజయ్యాయి. సెప్టెంబర్‌ 15న టిల్లు స్క్వేర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.&nbsp; బింబిసార 2 గతేడాది విడుదలైన ‘బింబిసార’ (Bimbisara) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరో కళ్యాణ్‌ రామ్‌.. మగధ సామ్రాజ్యనేత బింబిసారుడిగా నటించాడు. సినిమా విడుదల సమయంలోనే బింబిసార-2 కూడా ఉంటుందని చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.&nbsp; సలార్‌&nbsp; ప్రభాస్‌, ప్రశాంత్ నీల్‌ కాంబోలో సలార్‌ (Salaar) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే సలార్‌ రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు చిత్ర యూనిట్‌ టీజర్‌లో కన్ఫర్మ్ చేసేసింది. అందుకే పార్ట్ 1కి ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’ అనే ట్యాగ్ లైన్ జోడించింది. దీన్ని బట్టి రెండో పార్ట్‌ కచ్చితంగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాజెక్ట్‌ K ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K (Project K) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానునట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
    ఆగస్టు 02 , 2023
    <strong>Indian Oscar Entry 2025: ఆస్కార్‌ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!</strong>
    Indian Oscar Entry 2025: ఆస్కార్‌ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!
    ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ ఏడాది మన దేశం తరుపున ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరూ భావించారు. అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో రూపొందిన ఈ చిత్రం భారత్‌ తరపున ఆస్కార్‌ బరిలో నిలవడం లాంఛనమేనని అనుకున్నారు. అయితే అనూహ్యంగా హిందీ చిత్రం ‘లాపతా లేడీస్‌’ 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపికైంది. దీంతో గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో కావాలని కల్కి టీమ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; ‘కల్కి’కి అన్యాయం జరిగిందా? కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌’ (Laapataa Ladies For Oscars) 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 12 మందితో కూడిన జ్యూరీ ఈ సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేసింది. దీనికి అస్సామీ దర్శకుడు జాహ్ను బారువా నేతృత్వం వహించారు. మెుత్తం 29 చిత్రాలు భారత్‌ తరపున నామినేట్‌ అయ్యేందుకు పోటీలో నిలిచాయి. అందులో టాలీవుడ్‌ నుంచి ‘కల్కి 2898 ఏడీ’, ‘హనుమాన్’, ‘మంగళవారం’ చిత్రాలు ఉన్నాయి. అయితే గ్లోబల్‌ స్థాయిలో సక్కెస్‌ అయినా కల్కిని కాదని లాపతా లేడీస్‌ను భారత్‌ తరపున ఎంపిక చేయడంపై సినీ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆస్కార్‌ సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు జరిగిన అన్యాయమే ‘కల్కి’కి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాటలో కల్కి! గతేడాది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో భారత్‌ తరపున ‘ఆర్ఆర్‌ఆర్‌’కు చోటుదక్కలేదు. దీంతో దర్శకధీరుడు రాజమౌళి జనరల్‌ కేటగిరిలో ఆస్కార్‌ను నామినేషన్స్‌ పంపించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులు, ఉత్తమ డైరెక్టర్‌ సహా 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌కు పంపారు. ఈ క్రమంలో ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో షార్ట్‌ లిస్ట్‌ అయ్యి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు కల్కి టీమ్‌ కూడా భారత్‌ తరపున అధికారికంగా కాకపోయిన జనరల్‌ చిత్రాల కేటగిరిలో ఆస్కార్‌ బరిలో నిలవాలని భావిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరహాలోనే వివిధ కేటగిరీల కింద నామినేషన్స్‌ పంపాలని చిత్ర యూనిట్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఆస్కార్‌ కమిటీ కల్కి పంపిన నామినేషన్స్‌ను పరిగణలోకి తీసుకొని షార్ట్‌ లిస్ట్‌ చేస్తే అధికారికంగా పోటీలో నిలుస్తుంది. అటు ‘హనుమాన్‌’ టీమ్‌ కూడా జనరల్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేషన్స్‌ పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.&nbsp; ‘లాపతా లేడీస్‌’ ఎంపికకు కారణం ఇదే లాపతా లేడీస్‌ చిత్రాన్ని భారత్‌ తరపున అధికారికంగా ఆస్కార్‌ బరిలో నిలపడానికి గల కారణాలను ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌, అస్సామి దర్శకుడు జాహ్ను బారువ వెల్లడించారు. ‘జ్యూరీ అన్ని రంగాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సరైన చిత్రాలను చూడాలి. ముఖ్యంగా లాపతా లేడీస్‌ భారతదేశ సామాజిక వ్యవస్థలు, నైతికతను చాటిచెప్పింది. భారతీయతను గొప్పగా చూపారు. అందుకే నామినేట్‌ అయిన 29 చిత్రాల్లో మేము దీన్ని ఎంపిక చేశాం. ఇది కేవలం ఒక్కరోజులో ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు. 8 రోజుల పాటు జ్యూరీ సభ్యులందరం చర్చించుకొని లాపతా లేడీస్‌ను ఎంపిక చేశాం’ అని జాహ్ను బారువా తెలిపారు. ఇక ఈ సినిమా ఆస్కార్‌కు ఎంపిక కావడంపై దర్శకురాలు కిరణ్‌రావు కూడా ఆనందం వ్యక్తంచేశారు. ‘అద్భుతమైన కథకు ప్రాణం పోయడంలో ఎంతగానో శ్రమించిన టీమ్‌, వారి హార్డ్‌వర్క్‌కు దక్కిన గుర్తింపు ఇది. భారత్‌లో ప్రేక్షకులు ఏవిధంగా మా చిత్రాన్ని ఆదరించారో.. ప్రపంచస్థాయిలోనూ అదే విధంగా అభిమానిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు. సౌత్‌ నుంచి పోటీ పడ్డ చిత్రాలు ఇవే! ఆస్కార్‌ అవార్డుల రేసులో భారత్‌ తరపున బరిలోకి దిగేందుకు మెుత్తం 29 చిత్రాలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. అస్కార్‌ కోసం ఈసారి ఎక్కువగా సౌత్‌ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్‌ నుంచి మూడు కాగా, కోలివుడ్‌ నుంచి 6 చిత్రాలు నామినేట్‌ లిస్ట్‌లో చోటు సంపాదించాయి. వాటిలో విజయ్‌ సేతుపతి నటించిన ‘మహారాజా’, విక్రమ్‌ హీరోగా నటించిన ‘తంగలాన్‌’, సూరి ప్రధాన పాత్ర పోషించిన ‘కొట్టుక్కాళి’, లారెన్స్‌ - ఎస్‌.జే. సూర్య నటించిన ‘జిగర్తండా డబుల్‌ ఎక్స్‌’, మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్‌ హీరోగా చేసి దర్శకత్వం వహించిన ‘జమ’ చిత్రాలు ఉన్నాయి. మలయాళం నుంచి ‘ఆట్టం’, ‘ఆడుజీవితం’ (ది గోట్‌ లైఫ్‌), ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’, ‘ఉళ్ళోజుక్కు’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్‌ నుంచి 13 సినిమాలు ఆస్కార్‌ కోసం నామినేట్‌ అయ్యాయి. అయితే భారత్‌ నుంచి ‘లాపతా లేడిస్‌’ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన రానుంది.&nbsp; లాపతా లేడీస్‌ ప్రత్యేకత ఏంటి? సినిమాకి కథే హీరో అని ‘లాపతా లేడీస్‌’ చిత్రం మరోసారి నిరూపించింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. మరి ఆ తర్వాత వారి జీవితాలు ఎలా సాగాయి? వాళ్ల భర్తల దగ్గరికి ఎలా చేరుకున్నారు? అనేది ఇందులో చూపించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఓ వైపు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే మరోవైపు సమాజంలోని మహిళల గుర్తింపు గురించి ప్రశ్నలు లేవనెత్తేలా తీర్చిదిద్దారు. పితృస్వామ్య వ్యవస్థపై తీసిన వ్యంగ్య చిత్రమిది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధోబీ ఘాట్‌’కు దర్శకత్వం వహించిన కిరణ్‌, 13 ఏళ్ల గ్యాప్‌ తర్వాత తెరకెక్కించిన చిత్రమిది. బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనా ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.&nbsp;
    సెప్టెంబర్ 24 , 2024
    <strong>NTR 31: ట్రెండ్‌ బ్రేక్ చేసిన తారక్‌-ప్రశాంత్‌ నీల్‌.. ఎలాగంటే?&nbsp;</strong>
    NTR 31: ట్రెండ్‌ బ్రేక్ చేసిన తారక్‌-ప్రశాంత్‌ నీల్‌.. ఎలాగంటే?&nbsp;
    ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్‌ అంతా తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు. తద్వారా తమ మూవీ కలెక్షన్స్‌ను అమాంతం పెంచుకుంటున్నారు. అదే సమయంలో సీక్వెల్స్‌ మీద సీక్వెల్స్‌ తీస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ‘బాహుబలి’తో మెుదలైన ఈ పరంపర ప్రస్తుతం పీక్స్‌కు చేరుకుంది. ‘పుష్ప’, ‘సలార్‌’, హనుమాన్‌, ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ వంటి చిత్రాలు రెండు పార్ట్స్‌గా రాబోతున్నాయి. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ సైతం రెండు భాగాలుగా రాబోతోంది. అయితే ఈ సీక్వెల్‌ ఫార్ములాకు జూ.ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబో చెక్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; సింగిల్ పార్ట్‌గా.. ‘దేవర’ (Devara: Part 1) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr NTR), ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్‌ నీల్‌ నుంచి సినిమా వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌ కూడా రెండు భాగాలుగా వస్తుందని అంతా భావించారు. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్‌’ రెండు భాగాలుగా రాగా, ‘సలార్‌’కు సీక్వెల్ కూడా ఉండనుండటంతో ఈ అభిప్రాయానికి వచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘NTR 31’ సింగిల్‌ పార్ట్‌గా తీసుకురావాలని ప్రశాంత్ నీల్‌ నిర్ణయించారట. సింగిల్‌ పార్ట్‌లోనే కంప్లీట్‌ చేయాలని ఆయన భావిస్తున్నారట. అంతేకాదు మరీ లెంగ్తీగా కాకుండా రన్‌ టైమ్‌ విషయంలోనూ తారక్‌-ప్రశాంత్‌ నీల్‌ జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.&nbsp; సీక్వెల్స్‌ అవసరమా! దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ (Baahubali) చిత్రంతో ఈ సీక్వెల్స్‌కు పునాది వేశారు. అప్పటినుంచి తెలుగులో వరుసపెట్టి సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. ముందుగా చెప్పుకున్నట్లు ‘పుష్ప’, ‘సలార్‌’, హనుమాన్‌, ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ వంటి చిత్రాలు ఈ కోవకు చెందినవే. అయితే కథ పెద్దగా ఉండి సింగిల్‌ పార్ట్‌లో చెప్పడానికి వీలుకానప్పుడు సీక్వెల్స్‌ ప్లాన్‌ చేయడంలో తప్పు లేదు. ప్రేక్షకులు సైతం దీనిని స్వాగతిస్తారు. కానీ కథలో దమ్ము లేకుండా అధిక కలెక్షన్స్‌ రాబట్టాలన్న ఉద్దేశ్యంతో సీక్వెల్స్‌కు ప్లాన్‌ చేస్తే అసలుకే మోసం వస్తుంది. దేవర విషయంలో ఇదే జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కథ పరంగా చూస్తే రెండు పార్టులుగా తీసేంత స్టఫ్‌ అందులో లేదని తొలి రోజు నుంచి నెటిజన్లు చెబుతూ వచ్చారు. తారక్‌ వన్‌ మ్యాన్‌ షో, అనిరుధ్‌ మ్యూజిక్‌తో సినిమా కలెక్షన్స్‌ పరంగా బాగా నెట్టుకొచ్చిందని పేర్కొన్నారు. కానీ తమ డబ్బులకు మాత్రం న్యాయం జరగలేదన్న ఫీలింగ్‌లో మెజారిటీ ఆడియన్స్ ఉన్నారు. ఇది గమనించిన ‘NTR 31’ ఆ రిస్క్‌ తీసుకోవద్దని భావించినట్లు సమాచారం.&nbsp; ఎదురుచూపులకు చెక్‌ సాధారణంగా భారీ సక్సెస్ అందుకున్న చిత్రాలకే దర్శకులు సీక్వెల్స్‌ తీస్తుంటారు. రెండో పార్ట్‌కు సంబంధించిన సర్‌ప్రైజింగ్‌ లింక్‌ను తొలి భాగం ఎండ్‌లో పెట్టడం ద్వారా సీక్వెల్‌పై భారీగా అంచనాలు పెంచేస్తారు. ‘బాహుబలి’ నుంచి ఇది అందరూ చూస్తూ వచ్చిందే. అయితే కథను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆడియన్స్‌లో సదరు సినిమాపై పూర్తి సంతృప్తి అనేది వస్తుంది. ప్రస్తుతం సీక్వెల్స్ పరంపర కొనసాగుతుండటంతో రెండో భాగం చూస్తేనే అసలు కథ అంటే ఆడియన్స్‌కు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో పార్ట్‌ కోసం వారు నెలలు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలా ఎదురు చూసి చూసి ఓ దశలో ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురయ్యే ప్రమాదం ఉంది. సెకండ్‌ పార్ట్స్‌ చూడాలన్న ఆసక్తి తమలో సన్నగిల్లుతున్నట్లు ఆడియన్స్ నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే&nbsp; ‘NTR 31’ విషయంలో తారక్‌- ప్రశాంత్‌ నీల్‌ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.&nbsp; నవంబర్‌లో షూటింగ్‌! NTR 31కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కథ కూడా ఆమ్‌మౌస్ట్‌ పూర్తైనట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుందని అంటున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో తారక్ మూవీ షూటింగ్‌లో జాయిన్‌ అవుతారని తెలుస్తోంది. 2026 జనవరిలో 9న ఈ మూవీని లాంచ్‌ చేయాలని ప్రశాంత్ నీల్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్‌. అందుకు తగ్గట్లు శరవేగంగా ఈ చిత్రాన్ని ఆయన ఫినిష్‌ చేస్తారని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.&nbsp; బంగ్లాదేశ్‌ నేపథ్యంలో.. తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; ఆ మూవీస్‌ తర్వాత సెట్స్‌పైకి! తారక్‌ బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తారక్‌ నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లోనూ తారక్‌ పాల్గొన్నాడు. ఈ సినిమాలో తన కోటా షూటింగ్‌ పూర్తి చేసి ఆ తర్వాత ‘NTR 31’ను పట్టాలెక్కించాలని తారక్‌ భావిస్తున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ పూర్తయితే ఇక పూర్తిస్థాయిలో ప్రశాంత్‌ నీల్‌కు డేట్స్‌ అడ్డస్ట్‌ చేయవచ్చని తారక్‌ అనుకుంటున్నారట. ఇక ‘వార్‌ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp;
    అక్టోబర్ 09 , 2024
    <strong>Google Most Searched Movies 2024: టాప్ 10 చిత్రాల్లో 3 తెలుగు సినిమాలే.. ప్రభాస్ డబుల్ ధమాకా!</strong>
    Google Most Searched Movies 2024: టాప్ 10 చిత్రాల్లో 3 తెలుగు సినిమాలే.. ప్రభాస్ డబుల్ ధమాకా!
    గూగుల్ ట్రెండ్స్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్‌ చేసిన టాప్‌ 10 భారతీయ సినిమాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలకు చెందిన చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.&nbsp; Stree 2 అత్యధికంగా సెర్చ్‌ చేసిన భారతీయ సినిమాల్లో బాలీవుడ్ మూవీ ‘స్త్రీ 2’ మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ₹600 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయం సాధించింది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక స్త్రీ 2 సినిమా స్టోరీ విషయానికొస్తే... చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగింది అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (ఆపర్ శక్తి ఖురానా)తో కలిసి ఓ భూతం (శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది? అన్నది స్టోరీ. Kalki 2898 AD రెండో స్థానంలో నిలిచిన ‘కల్కి 2898 AD’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకోణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ వంటి ప్రముఖులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹1200 కోట్లకు పైగా వసూళ్లు చేసి పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్‌గా నిలిచింది. ఇక కల్కి స్టోరీ విషయానికొస్తే…కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్‌ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ. 12th Fail మూడో స్థానంలో ‘12వ ఫెయిల్‌’ నిలవడం విశేషం. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను దోచుకుని మంచి వసూళ్లు సాధించింది. స్ఫూర్తివంతమైన కథనం ఈ సినిమాను సూపర్ హిట్ చేసింది.&nbsp; ఇక స్టోరీ విషయానికొస్తే…మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. Laapataa Ladies ఆస్కార్ రేసులో భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన ‘లపాటా లేడీస్‌’ నాలుగో స్థానంలో ఉంది, ఇది మహిళల సెంట్రిక్ కథతో సక్సెస్‌ సాధించింది. Hanu-Man తెలుగు సినీ ప్రియులకు గర్వకారణంగా, ‘హనుమాన్’ ఐదో స్థానంలో నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలై అనేక రికార్డులను తిరగరాసింది. ₹300 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సూపర్ హీరో సినిమా, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఘన విజయాన్ని అందుకుంది.&nbsp; ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే…సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ. Maharaja ఆరవ స్థానంలో విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం ‘మహారాజా’, ఏడో స్థానంలో నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే… మ‌హారాజా ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకొని ఊరి చివర కూతురితో జీవిస్తుంటాడు. ఒక రోజు మ‌హారాజా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్తాడు. ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి దాడి చేశార‌ని చెప్తాడు. త‌న బిడ్డను కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తాడు ఇంతకీ ఆ ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? విలన్లపై హీరో ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది కథ. Manjummel Boys మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్‌’, ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. The Greatest of All Time తమిళ్ సూపర్ విజయ్ నటించిన ‘గోట్‌’&nbsp; 8వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విన్నర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్‌ (విజయ్‌) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? అన్నది స్టోరీ. Salaar ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి భారీ విజయం సాధించింది.&nbsp; ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే………ఖాన్సార్‌ సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్‌ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఖాన్సార్‌కు రూలర్‌ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌) సాయం కోరతాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ. Aavesham &nbsp;మలయాళం నుంచి ఫహాద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ పదవ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కల్కి 2898 AD మరియు హనుమాన్ వంటి తెలుగు చిత్రాలు టాప్‌ 10లో చోటు దక్కించుకోవడం ఆశ్చర్యకరం కాదు. ఈ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన హైప్‌ అలాంటిది. హనుమాన్ సంక్రాంతి సమయంలో విడుదలై పాత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ₹300 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా గూగుల్ ట్రెండ్స్ జాబితాలో ఈ ఏడాది మూడు తెలుగు సినిమాలు, మూడు హిందీ చిత్రాలు, రెండు తమిళ సినిమాలు, రెండు మలయాళ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. 2024 సంవత్సరానికి మరింత ఆసక్తికరమైన సినిమాల జాబితా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
    డిసెంబర్ 12 , 2024
    Kalki 2898 AD Record: ప్రభాస్‌ వేట.. ‘కల్కి’ దెబ్బకు ‘ఆర్ఆర్‌ఆర్‌’ రికార్డు గల్లంతు!
    Kalki 2898 AD Record: ప్రభాస్‌ వేట.. ‘కల్కి’ దెబ్బకు ‘ఆర్ఆర్‌ఆర్‌’ రికార్డు గల్లంతు!
    ప్రస్తుతం దేశంలో 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) ఫీవర్‌ నడుస్తోంది. గ్లోబల్‌ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. ట్రైలర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌, గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ హాలీవుడ్‌ రేంజ్‌ను తలపించాయి. ఇక ఏమాత్రం వేచి ఉండలేమన్న స్థాయిలో ట్రైలర్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా అమెరికాలో ఈ చిత్రం ప్రీ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా అక్కడ కల్కి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు బద్దలు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ'.. జూన్‌ 27న (Kalki Release Date) వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండంతో అమెరికాలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్‌ను ఓపెన్‌ చేశారు. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. అమెరికా ప్రీ బుకింగ్స్‌ హిస్టరీలో సరికొత్త చరిత్రను కల్కి క్రియేట్‌ చేసింది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డును బద్దలు కొట్టింది. అమెరికా ప్రీ బుకింగ్స్‌లో అతి తక్కువ సమయంలో వన్‌ మిలియన్ కలెక్షన్స్‌ క్రాస్‌ చేసిన తొలి భారతీయ చిత్రంగా కల్కి సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. గతంలో ఈ రికార్డు 'ఆర్‌ఆర్‌ఆర్‌' పేరిట ఉండేది. ప్రస్తుతం ప్రీ బుకింగ్ అయిన టికెట్ల సంఖ్య గంట గంటకు గణనీయంగా పెరుగుతున్నట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.&nbsp; దిశా పటానీ.. క్యారెక్టర్‌ రివీల్‌ కల్కి సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Hassan), దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పటాని (Disha Patani).. ఇలా పలువురు స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్స్ క్యారెక్టర్ల పేర్లను పోస్టర్ల రూపంలో చిత్ర యూనిట్‌ రివీల్‌ చేసింది. తాజాగా దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.&nbsp; నేడు దిశా పటాని పుట్టిన రోజు కావడంతో మూవీలోని ఆమె పాత్ర పేరును కల్కి టీమ్‌ రివీల్‌ చేసింది. క్యారెక్టర్ పేరు ‘రాక్సీ’ అని పరిచయం చేస్తూ.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో దిశా గోడకు ఆనుకొని తన నడుము అందాలు చూపిస్తూ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; బుజ్జిని నడిపిన ఆనంద్‌ మహీంద్ర ‘కల్కి’లో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన బుజ్జి(వాహనం)ని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా బుధవారం నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పంచుకుంది. డ్రైవ్‌ చేసిన అనంతరం ఆనంద్‌ మహీంద్ర బుజ్జితో ఫొటోలు దిగారు. కాగా, బుజ్జి వెహికల్‌ తయారీకి.. 'మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ' టీమ్‌ సహాయపడినట్లు ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ వాహనం రెండు మహీంద్ర ఇ-మోటర్లతో నడుస్తుందని చెప్పారు. నాగ్ అశ్విన్‌, అతడి టీమ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఆయన ప్రశంసించారు.&nbsp; https://www.youtube.com/watch?v=wS0gKXgO_AA&amp;t=25s
    జూన్ 13 , 2024
    Kalki 2898 AD: ‘కల్కి’ రన్‌టైమ్‌ లాక్‌.. సినిమా బడ్జెట్‌పై ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
    Kalki 2898 AD: ‘కల్కి’ రన్‌టైమ్‌ లాక్‌.. సినిమా బడ్జెట్‌పై ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తున్న లేటెస్ట్ సైన్‌ ఫిక్షన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో దిగ్గజ నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, కల్కి సినిమా విడుదలకు ఇంకా నాలుగు వారాలే గడువు ఉండటంతో మేకర్స్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులపై ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే రన్‌ టైమ్‌ను లాక్‌ చేసినట్లు ఓ బజ్‌ బయటకొచ్చింది. మరోవైపు ఈ సినిమా బడ్జెట్‌పై హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; కల్కి రన్‌టైమ్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రాన్ని జూన్‌ 27న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మూవీలోని పాత్రలను ఒక్కొక్కరిగా రివీల్‌ చేస్తున్నారు. ఈ కోవలోనే ప్రభాస్‌ (భైరవ), అమితాబ్‌ బచ్చన్‌ (అశ్వత్థామ), బుజ్జి (రోబోటిక్‌ వెహికల్‌) పాత్రలు బయటకొచ్చాయి. అయితే తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ మూవీ రన్‌టైమ్‌ను కూడా మేకర్స్ ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినినా నిడివిని 3.10 గం.లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే రన్‌టైమ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; దాని వల్లే కల్కి బడ్జెట్ పెరిగింది: ప్రభాస్‌ కల్కి సినిమా ప్రమోషన్స్‌ భాగంగా హీరో ప్రభాస్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ నేషనల్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్‌పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి చిత్రాన్ని దేశ ప్రజలతో పాటు వరల్డ్‌ వైడ్‌గా ఉన్న సినీ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు చెప్పారు. ఈ క్రమంలో బడ్జెట్‌ భారీగా పెరిగిందని అన్నారు. గ్లోబల్‌ రేంజ్‌ సినిమా కావడం వల్ల కల్కిలోని పాత్రల పేర్లు కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పారు. డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ మాట్లాడుతూ.. కల్కి సినిమా చూశాక ప్రేక్షకులు మరో కొత్త ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావనలోకి వెళ్తారని అన్నారు. అవతార్‌ చూశాక పొందిన కొత్త అనుభూతినే కల్కి తర్వాత ప్రేక్షకులు పొందుతారని హామి ఇచ్చారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లీషుతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా కల్కి విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. చెన్నై వీధుల్లో బుజ్జి సందడి కల్కి చిత్రంలో కీలకమైన బుజ్జి వాహనాన్ని ఇటీవల చిత్ర యూనిట్‌ ఆవిష్కరించింది. ఆ మూవీని పలు నగరాల్లో తిప్పుతూ చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ చేస్తోంది. తాజాగా చెన్నై వీధుల్లో బుజ్జి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తన ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది. కాగా, ఇప్పటికే ఈ వాహనాన్ని టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ చైతన్య డ్రైవ్‌ చేశారు. మరోవైపు బుజ్జిని నడపాలంటూ టెస్లా, స్పెస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్‌ కోరారు.&nbsp; https://twitter.com/i/status/1795776188931305863 31న స్పెషల్‌ వీడియో! కల్కి సినిమాలో బుజ్జి - భైరవ (ప్రభాస్‌) ప్రయాణం ఎలా సాగిందో తెలియజేసేందుకు మే 31న ఓ స్పెషల్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేయబోతున్నారు. 'బుజ్జి అండ్‌ భైరవ' (Bujji And Bhairava) పేరుతో రూపొందిన ఈ ప్రత్యేక వీడియో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. చిన్నారులను ఎంటర్‌టైన్‌ చేసే ఉద్దేశ్యంతో ఓ కార్టూన్‌ రూపంలో వీడియోను రూపొందించినట్లు ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో ఏముందో తెలియాలంటే స్పెషల్‌ వీడియో వచ్చేవరకూ ఆగాల్సిందే.&nbsp; https://twitter.com/i/status/1795100292314186235 తెలుగులో అత్యధిక రన్‌టైమ్‌ చిత్రాలు కల్కి తరహాలోనే ఇప్పటివరకూ అత్యధిక రన్‌టైమ్‌ కలిగిన చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఈ క్రింది లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://telugu.yousay.tv/tfidb/list/Animal_Runtime_3.21_Hours:_Do_You_Know_the_Longest-Running_Telugu_Movie$$7660d6ac-0846-43e3-b679-c28804e28ed4
    మే 30 , 2024
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్‌ సాధించడం వెనక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ (Vyjayanthi Movies) బ్యానర్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్‌ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్‌ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు బడ్జెట్‌ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్‌ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.&nbsp; [toc] వైజయంతీ మూవీస్‌ ప్రస్థానం అశ్వనీ దత్‌.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్‌ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్‌ చేశాయి? ఇప్పుడు చూద్దాం.&nbsp; అగ్నిపర్వతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ డబుల్‌ రోల్స్‌ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్‌ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్‌ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.&nbsp; https://www.youtube.com/watch?v=FaJqLrjanQM జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతీ మూవీస్‌ రొటిన్‌ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్‌ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం.&nbsp; రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్‌.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.&nbsp; శుభలగ్నం జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’. గోవిందా గోవిందా నాగార్జున - రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ సక్సెస్‌ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్‌ ఎంతగానో మిస్మరైజ్‌ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ రాజకుమారుడు వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ ద్వారానే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన రాజ్‌.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్‌ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.&nbsp; ఇంద్ర మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ. స్టూడెంట్‌ నెంబర్‌ 1 దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్‌ నెం.1' అశ్వనీదత్‌ నిర్మాత. వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయి స్వప్న సినిమాస్‌ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.&nbsp; మహర్షి మహేష్‌ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్‌ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్‌ నామినేట్‌ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్‌) ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్‌ రవి&nbsp; చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్‌ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ సీతారామం 2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్‌ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ ఆమె ఎవ‌రు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?’ అనేది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ &amp; హాట్‌స్టార్‌ కల్కి 2898 ఏడీ నిర్మాత అశ్వని దత్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ &amp; ఫ్యూచరిక్‌ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్‌ హాసన్‌ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్స్‌లో వచ్చిన హిట్‌ చిత్రాలు బాణం అశ్వని దత్‌ కుమార్తె ప్రియాంక దత్‌.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్‌ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ. సారొచ్చారు ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్‌&nbsp; రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్‌ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : హాట్‌స్టార్‌ &amp; ఆహా Sir Ocharu Movie Posters TollywoodAndhra.in ఎవడే సుబ్రహ్మణ్యం కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్‌ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ మహానటి అశ్వని దత్‌ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్‌ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.&nbsp; ఓటీటీ వేదిక :&nbsp; అమెజాన్‌ ప్రైమ్‌ జాతి రత్నాలు వైజయంతి మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ. ఓటీటీ వేదిక :&nbsp; అమెజాన్‌ ప్రైమ్‌
    అక్టోబర్ 25 , 2024
    <strong>Kalki 2898 AD Story: </strong><strong>సోషల్‌ మీడియాలో ‘కల్కి’ ఫుల్‌ స్టోరీ లీక్‌.. ఊహకందని ట్విస్టులతో మైండ్‌ బ్లాక్‌!</strong>
    Kalki 2898 AD Story: సోషల్‌ మీడియాలో ‘కల్కి’ ఫుల్‌ స్టోరీ లీక్‌.. ఊహకందని ట్విస్టులతో మైండ్‌ బ్లాక్‌!
    ప్రస్తుతం దేశంలో ‘కల్కి’ ఫీవర్‌ నడుస్తోంది. ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD).. గురువారం (జూన్‌ 27) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా.. నిమిషాల వ్యవధిలోనే టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా,&nbsp; ఇందులో ప్రభాస్‌ మహా విష్ణువు అవతారమైన ‘కల్కి’ పాత్రలో కనిపిస్తారని తొలుత జోరుగా ప్రచారం జరిగింది. కానీ, కల్కి ఫస్ట్ ట్రైలర్‌ చూశాక.. ప్రభాస్‌ ‘కల్కి’ కాదని తెలిసి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేసే ట్విస్ట్‌ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కల్కి పూర్తి స్టోరీ ఇదేనంటూ ఓ కథ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; స్త్రీలపై కలి ప్రయోగాలు! 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో మెుత్తం మూడు ప్రపంచాలు ఉంటాయని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఇప్పటికే ఓ స్పెషల్‌ వీడియా ద్వారా తెలియజేశారు. ఇందులో ఒకటి ‘కాశీ’ కాగా, మిగిలినవి ‘శంబాల’, ‘కాంప్లెక్స్‌’. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. శంబాలాలో అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) ఉంటారు. కాంప్లెక్స్‌లో విలన్ అయిన కలి (కమల్‌ హాసన్) ఉంటారు. కాశీ, శంబాలాలో ఉండే ప్రజల జీవితాలు మారాలంటే కల్కి రావాల్సిందే. అయితే కల్కి సాధారణంగా పుట్టే వరకూ ఆగలేక కలి.. తన ల్యాబ్‌లో స్త్రీలపై ప్రయోగాలు చేస్తుంటాడట. కల్కి శక్తులను తన వశం చేసుకొవాలన్నది కల్కి ప్లాన్‌ అన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ నుంచి ఓ మహిళ (దీపిక పదుకొణె) పారిపోయి శంబాలకు వస్తుంది. కల్కి ఆమెకే పుడతాడని గ్రహించిన అశ్వత్థామ.. ఆమెకు రక్షణ కల్పిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది.&nbsp; అశ్వత్థామ vs భైరవ మరోవైపు కాశీలో ఉండే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే అందుకు యూనిట్స్ అవసరమవుతాయి. ఈ క్రమంలోనే కాంప్లెక్స్‌ నుంచి తప్పించుకున్న మహిళను పట్టుకుంటే పెద్ద మెుత్తంలో యూనిట్స్‌ (నగదు) అందిస్తామని కాంప్లెక్స్ ప్రతినిధులు ఆఫర్‌ ఇస్తారు. దీంతో మహిళను అప్పగించి ఎలాగైన మిలియన్‌ యూనిట్స్‌తో కాంప్లెక్స్‌లో సెటిల్‌ అవ్వాలని భైరవ భావిస్తాడు. ఈ క్రమంలోనే ఆ మహిళకు రక్షణగా ఉన్న అశ్వత్థామతో యుద్ధానికి దిగుతాడు. భైరవ యుద్ధం చేసే క్రమంలో అతడి సత్తా ఏంటో అశ్వత్థామకు అర్థమై అతడు ఆశ్చర్యపోతాడని వైరల్ అవుతున్న స్టోరీని బట్టి తెలుస్తోంది.&nbsp; కల్కిగా ప్రభాస్‌! భైరవ, అశ్వత్థామ మధ్య బీకర పోరు జరుగుతున్న సమయంలోనే కల్కిని కడుపులో మోస్తున్న దీపికకు గాయమవుతుందని లేటెస్ట్ బజ్‌ ప్రకారం తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కడుపులోని బిడ్డకు సైతం ప్రమాదం జరుగుతుందని అంటున్నారు. మరోవైపు అశ్వత్థామతో యుద్ధం చేసే క్రమంలోనే కలి చేస్తున్న అన్యాయాల గురించి భైరవకు తెలుస్తుందట. దీంతో అతడిలో మార్పు వస్తుందట. అలా అశ్వత్థామ.. కల్కి శక్తులను భైరవకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారని అంటున్నారు. ఈ ప్రక్రియతో తొలి భాగం ముగుస్తుందని సమాచారం. ఇక కల్కి సెకండ్‌ పార్ట్‌లో.. 'కలి vs కల్కి'గా కథ మారిపోతుందని సమాచారం. ఇది విన్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తున్నారు. ఈ స్టోరీనే నిజమైతే బొమ్మ బ్లాక్‌బాస్టర్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; లాజిక్‌ మిస్‌..! కల్కి స్టోరీ ఇదేనంటూ వైరల్ అవుతున్న కథ.. కొంచెం కన్విన్సింగ్‌గానే ఉన్నప్పటికీ ఒకటి మాత్రం లాజిక్‌కు అందడం లేదు. దీపికా పదుకొణె గర్భంలో ఉన్న కల్కి పుట్టకముందే చనిపోతాడన్నది లాజిక్‌లెస్‌గా ఉంది. కల్కి అనేది శ్రీ మహావిష్ణువు 10వ అవతారం. అలాంటి కల్కి పాత్రను కడుపులోనే చనిపోయినట్లు చూపించడం పురాణాలను తప్పుబట్టినట్లు అవుతుంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కూడా పురాణాలతో డిఫర్‌ అయ్యేలా కల్కి కథను రాసుకునే ఛాన్స్ లేదని సినీ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. మరి కల్కి పాత్రలో కనిపించబోయేది ఎవరు? అన్నదానిపై స్పష్టత రావాలంటే జూన్‌ 27 వరకూ ఆగాల్సిందే.&nbsp;
    జూన్ 24 , 2024
    Kalki 2898 AD: రామ్‌చరణ్‌ కూతురికి కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్‌.. డైరెక్టర్‌ ప్లాన్‌ అదేనా?
    Kalki 2898 AD: రామ్‌చరణ్‌ కూతురికి కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్‌.. డైరెక్టర్‌ ప్లాన్‌ అదేనా?
    పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) డైరెక్షన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రంపై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ జోరు ఒక్కసారిగా పెంచింది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన AI వెహికల్‌.. బుజ్జిని ప్రముఖ నగరాల్లో తిప్పుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ను బుజ్జి వెహికల్‌ను నడపాలని కోరి వరల్డ్‌ వైడ్‌గా సినిమాపై అటెన్షన్‌ తీసుకొచ్చింది. ఇక తాాజాగా మరో కాన్సెప్ట్‌తో సరికొత్త ప్రమోషన్స్‌ను మేకర్స్‌ షురూ చేశారు.&nbsp; క్లింకారకు స్పెషల్‌ గిఫ్ట్‌ సరికొత్త ప్రమోషన్స్‌కు కల్కి టీమ్‌ నాంది పలికింది. ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీల పిల్లలకు&nbsp; గిఫ్ట్‌లు పంపుతోంది. తాజాగా రామ్‌ చరణ్‌ కుమార్తె క్లీంకారకు (Klinkaara) మూవీ యూనిట్‌ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి - భైరవ స్టికర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ ఉన్నాయి. క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. కల్కి టీమ్‌కు థ్యాంక్స్‌, ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా వీటిని పంపనున్నట్లు తెలుస్తోంది.&nbsp; చిన్నారులపై ఫోకస్‌ సాధారణంగా ఏ సినిమా మేకర్స్‌ అయినా రిలీజ్‌ సందర్భంగా యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తుంటారు. అయితే కల్కి టీమ్‌ ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. ఓ వైపు పెద్దలను ఆకర్షిస్తూనే చిన్నారులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం చిన్నారులపైనే ఫుల్‌గా ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. ఇటీవల కిడ్స్‌ను టార్గెట్‌ చేస్తూ 'బుజ్జి అండ్‌ భైరవ' (Bujji And Bhairava) పేరుతో సరికొత్త యానిమేషన్‌ సిరీస్‌ను తీసుకొచ్చారు. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా ఈ సిరీస్‌ రెండు ఎపిసోడ్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది చిన్నారులను ఎంటగానో ఆకర్షిస్తోంది. అటు పెద్దల నుంచి సైతం సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా స్పెషల్‌ గిఫ్ట్స్‌ ప్రోగ్రామ్‌ను కూడా పిల్లల కోసమే లాంచ్ చేశారు.&nbsp; కారణం ఇదేనా! ‘కల్కి 2898 ఏడీ’ సైంటిఫిక్‌ అండ్‌ ఫ్యూచరిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన బుజ్జి, భైరవ సిరీస్‌, గ్లింప్స్‌ను పరిశీలిస్తే కల్కి చిత్రం సూపర్‌ హీరోల కాన్సెప్ట్‌ను తలపిస్తోంది. సాధారణంగా ఈ తరహా చిత్రాలు.. పెద్దల కంటే పిల్లలనే ఎక్కువగా అట్రాక్ట్‌ చేస్తుంటాయి. ఇప్పటికే హాలీవుడ్‌లో వచ్చిన అవెంజర్స్, మార్వెల్‌ సిరీస్‌ చిత్రాలు ఈ విషయాన్నే రుజువు చేశాయి. కాబట్టి కల్కి టీమ్‌ కూడా ఆ పాయింట్‌నే పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముందుగా పిల్లల్లో కల్కి సినిమాపై ఆసక్తి రగిలిస్తే ఆటోమేటిక్‌గా తల్లిదండ్రులను కూడా థియేటర్లకు రప్పించవచ్చని మూవీ టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం. అటు యూత్‌, టీనేజర్స్‌ను ఆకర్షించడానికి ప్రభాస్ ఉండనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ వ్యూహాత్మంగా ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది.&nbsp; కల్కి రన్‌టైమ్‌ లాక్‌? 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రన్‌ టైమ్‌ ఫిక్స్ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రీసెంట్‌ సోషల్‌ మీడియా బజ్‌ ప్రకారం.. ఈ సినిమా నిడివిని 3.10 గం.లుగా మేకర్స్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని ప్రచారం జరుగుతోంది. అయితే రన్‌టైమ్‌పై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా చేశారు. దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp;
    జూన్ 03 , 2024
    Kalki 2898 AD Sequel: ప్రభాస్‌ ‘కల్కి’ రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానుందా? నెట్టింట ఆసక్తికర చర్చ!
    Kalki 2898 AD Sequel: ప్రభాస్‌ ‘కల్కి’ రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానుందా? నెట్టింట ఆసక్తికర చర్చ!
    ప్రస్తుతం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా.. మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో భారీగా&nbsp; అంచనాలు ఉన్నాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ బజ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; రెండు కంటే ఎక్కువ భాగాలుగా! ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరకు వస్తుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ సైతం మెుదలు పెట్టింది. ఇప్పటికే విడుదలైన భైరవ (ప్రభాస్‌) బుజ్జి వీడియో అభిమానులకు సర్‌ప్రైజ్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన ఓ అప్‌డేట్‌ సైతం ఫ్యాన్స్‌ను మరింత ఖుషి చేస్తోంది. దీని ప్రకారం కల్కి చిత్రం రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.&nbsp; కారణం ఇదేనట! ‘కల్కి 2898 ఏడీ’ కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు టాక్‌. బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు రెండు కంటే ఎక్కువ భాగాలు అవసరం అవుతాయని మేకర్స్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మెుదట కల్కీకి సంబంధించి ఓ సీక్వెల్‌ ప్లాన్‌ చేయాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. సీక్వెల్‌లోనూ కథ చెప్పలేకపోతే మిగతా పార్ట్స్‌ గురించి ఆలోచించాలని మేకర్స్‌ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్‌ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. అయితే ఈ&nbsp; ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.&nbsp; నేడు బిగ్ ఈవెంట్‌ ‘కల్కి’ సినిమాకు సంబంధించి ఇవాళ (మే 22) రామోజీ ఫిల్మ్‌ సిటీలో పెద్ద ఈవెంట్‌ను చిత్ర యూనిట్‌ నిర్వహించనుంది. ఇప్పటికే స్టేజీ సిట్టింగ్‌ కూడా రెడీ అయ్యింది. సా. 5 గంటలకు ఈ వేడుక మెుదలకానుంది. కల్కి సినిమా మెుదలు పెట్టిన తర్వాత భారత్‌లో చేస్తున్న తొలి ఈవెంట్‌ కావడంతో దీనిపై అందరిలోనూ హైప్‌ ఏర్పడింది. ఈ ఈవెంట్‌కు ప్రభాస్‌తో పాటు మూవీ యూనిట్ అంతా వస్తారని సమాచారం. కల్కి సినిమాలో భైరవ (ప్రభాస్), బుజ్జి మధ్య రిలేషన్‌ ఏంటో ఈ ఈవెంట్‌లో చెప్పనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేశారు.&nbsp;
    మే 22 , 2024
    <strong>Kalki 2898 AD: జపాన్‌లో ‘కల్కి’ ఫీవర్‌.. ప్రభాస్‌ ల్యాండింగ్‌కు కౌంట్‌డౌన్‌ ఆరంభం!</strong>
    Kalki 2898 AD: జపాన్‌లో ‘కల్కి’ ఫీవర్‌.. ప్రభాస్‌ ల్యాండింగ్‌కు కౌంట్‌డౌన్‌ ఆరంభం!
    ప్రభాస్‌ హీరోగా నటించిన రీసెంట్‌ సైన్స్ ఫిక్షన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌తో పాటు దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాస్‌న్‌ ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, ఎస్‌.ఎస్‌ రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ వంటి స్టార్స్‌ స్పెషల్‌ క్యామియోస్‌ ఇచ్చారు. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ సత్తా చాటిన ఈ మూవీని త్వరలో జపాన్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జపాన్‌ భాషలో ట్రైలర్‌ (Kalki 2898 AD Japanese Trailer)ను విడుదల చేశారు.&nbsp; జపాన్‌ భాషలో ట్రైలర్‌.. ప్రభాస్‌ హీరోగా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌లో విడుదల కాబోతోంది. అలాగే అక్కడ జరిగే షోగాట్స్‌ ఫెస్టివల్‌లో ఈ మూవీని గ్రాండ్‌గా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ప్రకటించింది. జపాన్‌ భాషలో డబ్‌ చేసిన ట్రైలర్‌ (Kalki 2898 AD Japanese Trailer)ను సైతం తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది.&nbsp; https://www.youtube.com/watch?v=V2j7iD0yHB0 నెలాఖరులో ప్రమోషన్స్‌ ‘బాహుబలి 2’ సినిమా జపాన్ రిలీజ్ సమయంలో యూనిట్‌ సభ్యులు అక్కడకు వెళ్లి ప్రమోట్‌ చేశారు. అదే విధంగా ‘కల్కి’ (Kalki 2898 AD) టీమ్‌ సైతం సినిమాను ప్రమోట్‌ చేయడం కోసం జపాన్‌ వెళ్లనుందట. మేకర్స్‌, అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చర్చించి జపాన్‌లో మూడు రోజుల పాటు ప్రమోషన్స్‌కి ఏర్పాట్లు చేస్తున్నారట. డిసెంబర్‌ మూడు లేదా నాల్గో వారంలో ప్రభాస్‌ అండ్‌ టీమ్‌ జపాన్‌లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. https://twitter.com/Kalki2898AD/status/1864988575688757539 కల్కి టార్గెట్‌ ఎంతంటే? జపాన్‌లో ‘RRR’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా 5 మిలియన్‌ డాలర్ల వసూళ్లను రాబట్టింది. అంతకుముందు వచ్చిన ‘బాహుబలి 2’ దాదాపుగా 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేసింది. ఇప్పుడు ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD Japanese Trailer)టార్గెట్‌ 5 మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ స్థాయిలో వసూళ్లు సాధించాలంటే ప్రభాస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా కచ్చితంగా అక్కడ ల్యాండ్ అవ్వాల్సిందే.&nbsp; ట్రెండింగ్‌లోకి కల్కి ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD Japanese Trailer) చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్‌ చేస్తుండటంతో పాటు ట్రైలర్‌ను సైతం రిలీజ్‌ చేయడంతో చాలా రోజుల తర్వాత ఈ చిత్రం ట్రెండింగ్‌లోకి వచ్చింది. #Kalki2898AD మరోమారు వైరల్ అవుతోంది. జపాన్‌ ప్రేక్షకులను సైతం ‘కల్కి’ మెప్పిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారతీయ సినిమాలకు జపాన్‌లో మంచి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో ‘కల్కి 2898 ఏడీ’ అక్కడ కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.&nbsp; https://twitter.com/NetflixIndia/status/1826982726550896953 కల్కి రికార్డు గల్లంతు ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ (Kalki 2898 AD) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లను కొల్లగొట్టింది. తన వసూళ్ల సునామీతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. తొలి రోజున రూ.191.5&nbsp; కోట్లు రాబట్టి హైయస్ట్‌ డే 1 గ్రాసర్‌ చిత్రాల్లో టాప్‌లో నిలిచింది. తాజాగా విడుదలైన ‘పుష్ప 2’ రూ.296 కోట్ల వసూళ్లతో కల్కిని బీట్‌ చేసింది. తొలి స్థానంలో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రూ.223 కోట్లు) సైతం రెండో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది.&nbsp;
    డిసెంబర్ 06 , 2024
    <strong>Kalki 2898 AD OTT: ‘కల్కి 2898 ఏడీ’ స్ట్రీమింగ్‌ డేట్‌ లాక్? ఏకంగా రెండు ఓటీటీల్లో ప్రసారం!</strong>
    Kalki 2898 AD OTT: ‘కల్కి 2898 ఏడీ’ స్ట్రీమింగ్‌ డేట్‌ లాక్? ఏకంగా రెండు ఓటీటీల్లో ప్రసారం!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం రెండు వారాలుగా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా జోరు ఇప్పటికీ కొనసాగుతోంది. అగ్రకథానాయకులు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ నటనతో పాటు యంగ్‌ హీరోలైన విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ క్యామియోలు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ‘కల్కి’ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ఈ మూవీ రెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ రెండు ఓటీటీల్లోకి.. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి థియేటర్లో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే థియేటర్‌లో చూసినప్పటికీ ఓటీటీలోనూ మరోమారు కల్కి చిత్రాన్ని వీక్షించాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌, డిజిటల్‌ ప్రీమియర్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కల్కి ఓటీటీ విడుదలకు సంబంధించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెండు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime), నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) సంస్థలు ‘కల్కి’ ఓటీటీ హక్కులను కొనుగోలు చేశాయి. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల హక్కులను అమెజాన్‌ దక్కించుకోగా, హిందీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో ఈ రెండింటిలో కల్కి స్ట్రీమింగ్‌ అవుతుందని తెలుస్తోంది. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 'కల్కి'ని థియేట్రికల్ రిలీజ్‌కు 7 లేదా 8 వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. దీని ప్రకారం ఆగస్టు 15న ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశముందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. స్వాతంత్ర దినోత్సవం కానుకగా కల్కిని స్ట్రీమింగ్‌ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనల్లో స్ట్రీమింగ్ సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి కల్కిని ఓటీటీలో చూడాలని భావించేవారికి ఇంకో నెల రోజులు ఎదురుచూపులు తప్పకపోవచ్చు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; రూ.1000 కోట్లు వచ్చినట్లేనా? కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లు వసూలు చేసినట్లు సోమవారం (జులై 8) చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రూ.100 కోట్ల దూరంలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే కల్కి కలెక్షన్స్‌కు సంబంధించి అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చి రెండ్రోజులు అవుతుంది. సోమ, మంగళవారం వసూళ్లు ఈ రూ.900&nbsp; కోట్లకు యాడ్‌ కావాల్సి ఉంది. అయితే ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం ఈ రెండు రోజుల వసూళ్లు కలుపుకుంటే కల్కి రూ.1000 కోట్ల క్లబ్‌లో అలవోకగా చేరిపోనుంది. దీనిపై అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావడమే తరువాయి అన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.&nbsp; హిందీలో వసూళ్ల ప్రభంజనం 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి బాలీవుడ్‌ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్‌లో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు తోడు మహాభారతం కాన్సెప్ట్‌తో కల్కి రావడంతో అక్కడి ఆడియన్స్‌ విశేష ఆదరణ కనబరుస్తున్నారు. ఫలితంగా కల్కి హిందీ వెర్షన్‌ వసూళ్లు నేటితో (జులై 10) రూ.200 కోట్ల మార్క్‌ను అందుకుంటాయని ప్రముఖ ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవాళ కల్కి చిత్రం రూ.225 కోట్ల (GROSS) మైల్‌స్టోన్‌ను అందుకుంటుందని బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతాలో ఓ స్పెషల్‌ పోస్టును పెట్టారు.&nbsp; https://twitter.com/taran_adarsh/status/1810940499227742667
    జూలై 10 , 2024
    <strong>Kalki 2898 AD Day 2 Collections: రెండో రోజు 80% మేర పడిపోయిన ‘కల్కి’ వసూళ్లు.. షాక్‌లో ఫ్యాన్స్‌!</strong>
    Kalki 2898 AD Day 2 Collections: రెండో రోజు 80% మేర పడిపోయిన ‘కల్కి’ వసూళ్లు.. షాక్‌లో ఫ్యాన్స్‌!
    ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా హోస్‌ఫుల్‌ బోర్డులతో సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఓపెనింగ్ రోజే ఈ సినిమా ఏకంగా రూ.191.50 కోట్లు వసూల్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో రెండో రోజు కలెక్షన్లపై అందరి దృష్టి పడింది. మరి రెండో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; డే 2 కలెక్షన్స్ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' రెండో రోజు వసూళ్లను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. తొలి రోజు రూ.191.5 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.298.5 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. మేకర్స్‌ లెక్కల ప్రకారం.. కల్కి వరుసగా రెండో రోజు కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజు కల్కి ఖాతాలో మరో రూ.107 కోట్లు (GROSS) వచ్చి చేరాయి. అయితే తొలి రోజు కలెక్షన్స్‌తో పోలిస్తే రెండో రోజు వసూళ్లు భారీగా పడిపోయాయి. కలెక్షన్స్‌లో 80% మేర కోత పడింది. దీంతో తొలి రెండు రోజుల్లో ఈజీగా రూ.350 కోట్ల మార్క్‌ దాటుతుందనుకున్న కల్కి.. కనీసం రూ.300 కోట్లు కూడా అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.&nbsp; తొలి రోజు ఆల్‌టైమ్‌ రికార్డు ప్రభాస్‌ ‘కల్కి’ సినిమా నార్త్‌ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రతారల నటనకు అక్కడి ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నార్త్‌ అమెరికాలో కల్కి ఆల్‌టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేసింది. తొలి రోజున నార్త్‌ అమెరికా ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లో కల్కి ఏకంగా 3.8 మిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలో ఒక ఇండియన్‌ చిత్రం ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ (3.46 మిలియన్లు), ‘సలార్‌’ (2.6 మిలియన్లు), ‘బాహుబలి2’ (2.45 మిలియన్లు) ఉన్నాయి. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ సేఫ్‌! ట్రేడ్‌ వర్గాలు లెక్కలను బట్టి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డును 'కల్కి 2898 ఏడీ' బీట్‌ చేయలేకపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తొలిరోజు రూ.223 కోట్లు (GROSS) రాబట్టి అత్యధిక డే1 వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రంగా టాప్‌లో ఉంది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం 'కల్కి 2898 ఏడీ' రూ.180 కోట్ల వద్దే ఆగిపోవడంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ అలాగే భద్రంగా ఉంది. ఆ తర్వాత 'బాహుబలి 2' రూ.217 కోట్లతో రెండో స్థానంలో నిలించింది. అయితే రెండింటి రికార్డులను కల్కి బ్రేక్‌ చేయలేకపోయింది. కానీ, కేజీఎఫ్ 2 (రూ.164.5 కోట్లు), సలార్ (రూ.158 కోట్లు), ఆదిపురుష్ (136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసి టాప్‌-3లో నిలిచింది.&nbsp; కలెక్షన్లపై మ్యాచ్ ఎఫెక్ట్! 'కల్కి 2898 ఏడీ' సినిమాను ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాల మాదిరిగా ప్రమోట్ చేయడంలో చిత్రబృందం వెనుకబడింది. ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అటు ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లపై టీ-20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడింది. గురువారం (జూన్‌ 27) సాయంత్రం జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపడం కొంత మైనస్‌గా మారింది. దీనికి తోడు గురువారం వర్కింగ్‌ డే కావడం కూడా కల్కి కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. ఇవాళ (జూన్‌ 29) వరల్డ్‌ కప్ ఫైనల్ ఉండటంతో కల్కి మూడో రోజు కలెక్షన్స్‌పై ఎఫెక్ట్‌ పడే అవకాశం ఉంది.&nbsp;
    జూన్ 29 , 2024
    <strong>Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!</strong>
    Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్‌ రేంజ్‌ విజువల్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నటీనటుల గెటప్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయి సక్సెస్‌ కల్కి టీమ్‌కు అంత ఈజీగా రాలేదు. దీని వెనక అంతులేని శ్రమ దాగుంది. కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ (Secrets of Kalki 2898 AD) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; 40 ఏళ్ల తర్వాత.. కల్కి సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ (KALKI 2898 AD Hidden Truth) ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాష్కిన్‌ అనే ప్రతినాయకుడి పాత్రలో కమల్‌హాసన్‌ కనిపించారు. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారట. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ అనే సినిమాలో చివరిగా అమితాబ్, కమల్‌ నటించారు. ఆ తర్వాత మళ్లీ కల్కిలోనే వీరిద్దరు కలిసి పనిచేశారు.&nbsp; కమల్‌ లుక్‌ కష్టాలు.. ‘కల్కి 2898 ఏడీ’ కమల్‌ హాసన్‌ చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. ఈ లుక్‌ ఫైనల్‌ చేసే క్రమంలో ఎన్నో గెటప్‌లను పరిశీలించారట. దేనితోనూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సంతృప్తి చెందలేదట. చివరకు లాస్‌ ఏంజెల్స్ వెళ్లి అక్కడ హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసే మేకప్‌ నిపుణులను కల్కి టీమ్‌ సంప్రదించట. అలా కమల్‌ హాసన్‌ ప్రస్తుత లుక్‌ బయటకొచ్చిందని సినీ వర్గాలు తెలిపాయి.&nbsp; మేకప్‌కు కోసం 5 గంటలు కల్కి సినిమాలో అశ్వత్థామ గెటప్‌ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 81 ఏళ్ల వయసున్న అమితాబ్‌ బచ్చన్‌&nbsp; (Amitabh Bachchan) ఈ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. అయితే అశ్వత్థామ మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇక తీయడానికి మరో 2 గంటలు పట్టేదట. దీంతో అమితాబ్‌ మేకప్‌ కోసమే అచ్చంగా 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బుజ్జి కోసం రూ.4 కోట్లు ‘కల్కి’లో ప్రభాస్‌ రైడ్‌ చేసిన ‘బుజ్జి’ (KALKI 2898 AD Hidden Truth) అనే ఫ్యూచరిక్‌ వెహికల్‌ను ఎంతో కష్టపడి చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. బుజ్జి తయారీకి మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్‌ సహకారం అందించింది. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.&nbsp; 700VFX షాట్స్‌ కల్కి సినిమాలో కాశీ, శంబల, కాంప్లెక్స్‌ అనే మూడు ఫ్యూచరిక్‌ ప్రపంచాలను డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ క్రియేట్‌ చేశారు. కాశీని నిర్జీవంగా.. శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. పుష్కలమైన వనరులను కలిగినట్లు కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. ఇలా చూపించేందుకు మెుత్తం వీఎఫ్‌ఎక్స్‌నే ఉపయోగించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉపయోగించినట్లు సమాచారం.&nbsp; హాలీవుడ్‌ యంత్రాంగం ‘కల్కి 2898 ఏడీ’ విజువల్‌ వండర్‌గా ఉందంటూ పెద్ద ఎత్తున టాక్‌ వస్తోంది. హాలీవుడ్‌ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణం. ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాలైన హ్యారీ పోటర్‌, ఇంటర్‌స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన VFX టీమ్‌ ‘కల్కి’ కోసం పనిచేసింది. రికార్డు స్థాయి బడ్జెట్‌ భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ (KALKI 2898 AD Hidden Truth)తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చు కంటే.. నాణ్యమైన విజువల్స్‌, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ కోసమే ఎక్కువ మెుత్తం ఖర్చు చేశారట. https://telugu.yousay.tv/kalki-2898-ad-review-kalki-which-raised-the-level-of-indian-cinema-immensely-how-is-the-movie.html#google_vignette
    జూన్ 27 , 2024

    @2021 KTree