సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ మర్నాడే బన్నీ విడుదలవ్వగా సినీ ప్రముఖులంతా వెళ్లి ఆయన్ను పలకించారు. ఈ క్రమంలోనే ఆదివారం మామయ్య మెగస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంటికి బన్నీ స్వయంగా వెళ్లారు. ఆపై నాగబాబు (Naga babu) ఇంటికి సైతం భార్యతో సహా వెళ్లి ఆప్యాయంగా పలకించారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సైతం పుష్పరాజ్ కలవబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇన్నాళ్లు సోషల్ మీడియాలో జరిగిన అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్‌కు ఫుల్‌స్టాప్ పడినట్టేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమరావతికి వెళ్లనున్న బన్నీ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా ఫ్యామిలీ (Mega Family) మధ్య గ్యాప్ వచ్చినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే బన్నీ అరెస్టు (Allu Arjun Arrest) తర్వాత పరిస్థితులు మెుత్తం మారిపోయాయి. బన్నీ అరెస్టు వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) షూట్ క్యాన్సిల్ చేసుకొని మరి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఎక్స్ వేదికగా బన్నీని పరోక్షంగా విమర్శించిన నాగ బాబు సైతం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి వారి ఫ్యామిలీకి అండగా నిలిచారు. దీంతో బన్నీ కూడా ఆదివారం వారి ఇంటికి వెళ్లి కష్టకాలంలో అండగా నిలిచినందుకు మామలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలోనే మరో మామ, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అల్లు అర్జున్ కలవనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఉపముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి తన అరెస్టుకు సంబంధించిన పరిణామాలను తెలియజేయనున్నట్లు సమాాచారం. అరెస్టుకు దారి తీసిన పరిస్థితులు, తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును కూడా పవన్ వద్ద బన్నీ ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అటు తన అరెస్టును ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబును సైతం అల్లు అర్జున్ మర్యాదపూర్వకంగా కలుస్తారని అంటున్నారు.
ఏపీలో ‘పుష్ప 2’ బిగ్ ఈవెంట్!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను అల్లు అర్జున్ కలవడం వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం డిసెంబర్ 5న విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో అందరం చూశాం. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా అన్ని ఏరియాల్లో ఈ మూవీకి సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు ఖాతాలోకి వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను కూడా మూవీ టీమ్ నిర్వహించింది. ఈ క్రమంలోనే అటు ఏపీలోనూ భారీ ఈవెంట్ నిర్వహించాలని ‘పుష్ప 2’ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని పవన్‌ను అల్లు అర్జున్ స్వయంగా ఆహ్వానించబోతున్న స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు పవన్‌ను కలవడంతో పాటు ఈవెంట్‌కు ఆహ్వానించబోతున్నాడు బన్నీ. అదే జరిగితే పవన్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా వేదికపై మెరవనున్నారు. ఈ కలకయికతో అటు ఫ్యాన్ వార్ కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంది.
రూ.1400 కోట్ల క్లబ్‌లో..!
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ వరల్డ్ వైడ్‌గా 11 రోజుల్లో రూ.1400 (Pushpa 2 Collections) కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం పది రోజుల్లో రూ.1292 కోట్లు కొల్లగొట్టినట్లు ఆదివారం (డిసెంబర్ 15) మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన ఏకైక చిత్రంగా ప్రకటించారు. ప్రతీ రోజూ నిలకడగా రూ.100 కోట్లు పైనే వసూలు చేస్తుండటంతో 11వ రోజున ఈజీగానే రూ.1400 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప 2’ అడుగుపెట్టి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు హిందీలో ఇప్పటివరకూ రూ.561.50 కోట్ల నెట్ వసూలు చేసిందని స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. రెండో వీకెండ్‌లోనూ రూ.100 కోట్లు రాబట్టిన తొలి చిత్రంగా ‘పుష్ప 2’ మరో రికార్డు క్రియేట్ చేసిందని పేర్కొన్నారు.
‘పీలింగ్స్’ సాంగ్ రిలీజ్
‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలోని పీలింగ్స్ సాంగ్ ఏ స్థాయిలో అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాటలో బన్నీ, రష్మిక (Rashmika Mandanna) వేసిన మాస్ స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. మునుపటి బన్నీని ఈ పాటలో చూశామని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టీమ్ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘పీలింగ్స్’ వీడియో సాంగ్ (Peelings Video Song)ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేసింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ సాంగ్ వ్యూస్ పరంగా దూసుకుపోతోంది.
Celebrities Featured Articles Movie News
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్