మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాచకొండ సీపీ వార్నింగ్‌తో కాస్త సద్దుమణిగిన ఈ వివాదం శనివారం (డిసెంబర్ 14) మరోమారు రాజుకుంది. పోలీసులు హెచ్చరించినా విష్ణు తనను తన కుటుంబాన్ని వేదిస్తున్నాడని మనోజ్ ఆరోపించాడు. ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో ఇన్‌వర్టర్‌లో షుగర్ వేసి పవర్ కట్స్‌కు కారణమయ్యాడని ప్రెస్‌నోట్ విడుదల చేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీనిపై మోహన్‌బాబు రెండో భార్య, మనోజ్ కన్నతల్లి నిర్మల తాజాగా స్పందించారు. మంచు మనోజ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.
‘విష్ణు గొడవ చేయలేదు’
మోహన్‌బాబు (Mohan Babu) ఫ్యామిలీ గొడవపై ఆయన భార్య నిర్మల (Manchu Nirmala) మెుదటిసారి రియాక్ట్ అయ్యారు. శనివారం నాడు మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వచ్చిన వార్తలపై స్పష్టతనిచ్చారు. ఈ మేరకు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు. ‘డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్‌పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. అయితే ఈ విషయంపై విష్ణు మీద మంచు మనోజ్ అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు. ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉంది. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా మేమిక్కడ పనిచేయలేమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదు’ అని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు.
మనోజ్ ప్రెస్‌నోట్‌లో ఏముందంటే?
తన తల్లి నిర్మల పుట్టినరోజు సందర్భంగా శనివారం విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్ ఆదివారం (డిసెంబర్ 15) ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశాడు. ‘నేను సినిమా షూటింగ్‌లో ఉన్నాను. కుమారుడి స్కూల్‌లో ఈవెంట్‌కు నా సతీమణి హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో నా సోదరుడు విష్ణు తన అనుచరులు, బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడు. జనరేటర్లలో షుగర్ పోయించాడు. దాంతో రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇంట్లో అమ్మ, తొమ్మిది నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. జనరేటర్లకు సమీపంలో వాహనాలు, గ్యాస్ కనెక్షన్ ఉంది. విష్ణు టీమ్ ఇంటి నుంచి వెళ్లిపోతూ నా వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేసింది. నేను, నా కుటుంబం భయంతో బతుకుతున్నాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా’ అని మనోజ్ తన ప్రకటనలో తెలియజేశాడు. అలాగే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.
పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
ఇదిలా ఉంటే సినీ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ఆయన చేరబోతున్నారంటూ ప్రధాన మీడియాల్లో కథనాలు ప్రసారమయ్యాయి. తన అత్త శోభా నాగిరెడ్డి జయంతి నేపథ్యంలో మనోజ్ సోమవారం భార్య, పిల్లలతో ఆళ్లగడ్డకు వచ్చారు. ఈ ఉదయం ఆళ్లగడ్డ సమీపంలోని అహోబిలం లక్ష్మీ నరసింహా స్వామిని మనోజ్ దంపతులు సందర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. దైవ దర్శనం అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. తనను ఆదరిస్తున్న ఆళ్లగడ్డ ప్రజలు, ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ క్రమంలో జనసేనలో చేరికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘నో కామెంట్స్’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. అయితే రాజకీయ ఎంట్రీని ఖండించకపోవడంతో త్వరలోనే ఆయన జనసేనలో చేరే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్