• TFIDB EN
  • నయనతార
    జననం : నవంబర్ 18 , 1984
    ప్రదేశం: బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
    నయనతార ప్రముఖ భారతీయ నటి. ఆమె ప్రధానంగా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె సిరియన్‌కు చెందిన క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో నయన్ 80కి పైగా చిత్రాల్లో నటించింది. లెడీ సూపర్ స్టార్‌గా పేరు సంపాదించింది. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఫొర్బ్స్ ఇండియా సెలబ్రెటీల జాబితా(2018)లో స్థానం సంపాదించిన ఏకైన దక్షిణాది హీరోయిన్ ఆమె. నయనతార కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా పలు చిత్రాలను నిర్మించారు. అనేక అవార్డులను అందుకున్న ఆమె ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.

    నయనతార వయసు ఎంత?

    నయనతార వయసు 40 సంవత్సరాలు

    నయనతార ఎత్తు ఎంత?

    5'5'' (165 cm)

    నయనతార అభిరుచులు ఏంటి?

    పుస్తకాలు చదవడం, సంగీతం వినడం

    నయనతార ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యూయేట్ ఇన్ ఇంగ్లిష్ లిటరేచర్

    నయనతార సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    మోడలింగ్ చేసేది

    నయనతార ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    BalikaMadom Girls high school, Thiruvulla

    నయనతార రిలేషన్‌లో ఉంది ఎవరు?

    నయనతార పెళ్లికి ముందు ప్రభుదేవ, హీరో శింబుతోడేటింగ్ చేసింది. కానీ వ్యక్తిగత కారణాలతో వీరిద్దరితో విడిపోయింది.

    నయనతార బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    నయనతార ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-26-34

    నయనతార Hot Pics

    Images

    Nayanthara

    Images

    Nayanthara Hot

    నయనతార In Saree

    Images

    Nayanthara Hot In Saree

    Images

    Nayanthara Hot Images In Saree

    నయనతార అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Nayanthara

    Images

    Nayanthara

    Viral Videos

    View post on X

    Nayanthara Viral Video

    Nayanthara: నయనతార టాప్‌-10 పవర్‌ ఫుల్‌ రోల్స్‌.. ఆమె నటనకు సెల్యూట్‌ చేయాల్సిందే!
    Nayanthara: నయనతార టాప్‌-10 పవర్‌ ఫుల్‌ రోల్స్‌.. ఆమె నటనకు సెల్యూట్‌ చేయాల్సిందే!]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    సెప్టెంబర్ 08 , 2023
    REVIEW: నయనతార ప్రేక్షకులతో “కనెక్ట్‌” అయ్యిందా ?]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    ఫిబ్రవరి 13 , 2023
    Nayanthara: ధనుష్‌తో వివాదం.. చిరు, రామ్‌చరణ్‌ను ఆకాశానికెత్తిన నయనతార!  తమిళ హీరోయిన్‌ నయనతార (Nayanthara) లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆమె జీవితంపై రూపొందిన ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ (Nayanthara: Beyond the Fairy Tale) డాక్యుమెంటరీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush)పై ఇటీవల నయన్‌ తీవ్ర విమర్శలు చేసింది. అది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా అదే డాక్యుమెంటరీకి సంబంధించి టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, తండ్రి కొడుకులైన మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.  ‘వారంటే నాకెంతో గౌరవం’ లేడీ సూపర్‌ స్టార్‌కు సంబంధించిన 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' (Nayanthara: Beyond the Fairy Tale) నవంబర్‌ 18న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు, తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో సపోర్ట్‌గా నిలిచిన వారికి తాజాగా నాయనతార ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి (Chiranjeevi), రామ్‌చరణ్‌ (Ram Charan) ప్రత్యేక థ్యాంక్స్‌ చెప్పారు. అటు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) పేరును సైతం ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. వీరితో పాటు షారుక్‌ భార్య గౌరీ ఖాన్‌, తెలుగు, మలయాళ, తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. తన డాక్యుమెంటరీ కోసం వారిని సంప్రదించినప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని నయన్‌ అన్నారు. నిర్మాతలు వారి వద్దకు వెళ్లినప్పుడు చాలా పాజిటివ్‌గా రిసీవ్‌ చేసుకున్నారని తెలిపారు. వారందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. వీరంతా అత్యంత విలువైన క్షణాలను అందించారని కొనియాడారు. వీరిందరిపై తనకెంతో గౌరవం ఉందని నయన్‌ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఇన్‌స్టా పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) ధనుష్‌తో గొడవ ఎందుకుంటే? 2015లో నయనతార (Nayanthara) చేసిన 'నానుమ్‌ రౌడీ' (తెలుగులో నేను రౌడీనే) చిత్రానికి ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌ (Vignesh Shivan) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ధనుష్‌ (Dhanush) నిర్మాత. 'నానుమ్‌ రౌడీ'తో నయన్‌కు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నటిగా మంచి పేరు రావడంతో పాటు ఎంతో విలువైన ప్రేమ సైతం ఆ సినిమా ద్వారానే దక్కింది. ఈ నేపథ్యంలో తన  ‘బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ (Nayanthara: Beyond the Fairy Tale)ను హైలెట్‌ చేయాలని నయనతార భావించింది. ఆ సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను వినియోగించుకునేందుకు ధనుష్‌ అనుమతి కోరింది. అయితే రెండేళ్ల నుంచి ధనుష్‌ను అడుగుతున్నా ఆయన స్పందించకపోవడం, పైగా డాక్యుమెంటరీ ప్రోమోలో 3 సెకన్ల 'నానుమ్‌ రౌడీ దాన్‌' కంటెంట్‌ను వాడటంపై ధనుష్‌ లీగల్‌ నోటీసులు పంపడం నయనతారను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో ధనుష్‌ను విమర్శిస్తూ బహిరంగ లేఖ రాసింది. ధనుష్‌ చర్యలతో తన హృదయం ముక్కలైందని పేర్కొంది. మీ మంచి తనాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని మండిపడింది.  https://twitter.com/NayantharaU/status/1857680582773551362 నయనతారకు మద్దతుగా మహేష్‌! ధనుష్‌ - నయనతార మధ్య వివాదానికి కారణమైన డాక్యుమెంటరీ (Nayanthara: Beyond the Fairy Tale)పై సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) ఇటీవల స్పందించాడు. డాక్యుమెంటరీ చూసిన మహేష్ అందులో నయన్‌ - విఘేష్ లవ్‌ ఎపిసోడ్‌ చూసి చాలా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా నయన్‌, విఘ్నేష్‌, ఇద్దరు పిల్లలతో ఉన్న డాక్యుమెంటరీ పోస్టర్‌ను మహేష్‌ ఇన్‌స్టా స్టేటస్‌గా పెట్టాడు. మూడు లవ్‌ సింబల్స్‌ను దానికి జత చేశాడు. ఇది ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది. ధనుష్‌ - నయనతార (Nayanthara Vs Dhanush) మధ్య వివాదం కొనసాగుతున్న వేళ మహేష్‌ రియాక్షన్‌ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నయనతార- మహేష్‌ బాబు కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. వీరి జోడిని తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడ్డారు. మరి భవిష్యత్‌లోనైనా వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. https://twitter.com/GulteOfficial/status/1858556384079761643 దూకుడు ప్రదర్శిస్తున్న లేడీ సూపర్ స్టార్‌! ప్రస్తుతం ఫిల్మ్‌ కెరీర్‌ పరంగా నయనతార దూసుకుపోతోంది. గతేడాది షారుక్ ఖాన్‌తో 'జవాన్‌' చిత్రం చేసి తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ అమ్మడు అడుగుపెట్టింది. అదే ఏడాది 'అన్నపూర్ణి'గా లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ఈ లేడీ సూపర్‌స్టార్‌ బిజీ బిజీగా ఉంది. తమిళంలో 'టెస్ట్‌', 'మన్నన్‌గట్టి సిన్స్‌ 1960', 'తని ఓరువన్‌ 2', 'ముకుతి అమ్మన్‌ 2' సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘డియర్‌ స్టూడెంట్స్‌’ అనే చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివర, వచ్చే సంవత్సరంలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే 2022లో డైరెక్టర్‌ విఘ్నేశ్‌ను పెద్దల సమక్షంలో నయన్‌ వివాహం చేసుకుంది. వీరికి సరోగసి విధానంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 
    నవంబర్ 21 , 2024
    Nayanthara: ‘మీరు చేసిన పనికి నా హృదయం ముక్కలైంది’.. ధనుష్‌పై నయనతార ఫైర్‌ తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి నయనతార (Nayanthara) లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆమె జీవితంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఓ డాక్యుమెంటరీని సైతం రూపొందిస్తుండటం విశేషం. అయితే ఈ డాక్యుమెంటరీకి కోలీవుడ్‌ స్టార్ ధనుష్‌ సమస్యలు సృష్టించినట్లు తెలుస్తోంది. ధనుష్‌ వల్లే డాక్యుమెంటరీ రిలీజ్ ఆలస్యమవుతోందని టాక్‌ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్‌కు ఓ బహిరంగ లేఖ రాసిన నయనతార అందులో అతడిపై విరుచుకుపడింది. ఈ వ్యవహారం కోలీవుడ్‌ సహా భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.  అసలేం జరిగిందంటే? 2015లో నయనతార చేసిన 'నానుమ్‌ రౌడీ' (తెలుగులో నేను రౌడీనే) చిత్రానికి ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నటిగా ఆమెకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాను అప్పట్లో ధనుష్‌ నిర్మించడం గమనార్హం. ప్రస్తుతం రూపొందుతున్న నయనతార డాక్యూమెంటరీ ‘బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ (Nayanthara: Beyond the Fairy Tale)లో 'నానుమ్‌ రౌడీ దాన్‌' పాటలు, ఫొటోలు, వీడియోలను వినియోగించుకోవాలని నయనతార చాలా ఆశపడింది. ఇందుకోసం ధనుష్‌కు పలుమార్లు విజ్ఞప్తులు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ధనుష్ ససేమీరా అన్నారట. దీంతో కెరీర్‌లో ఎంతో కీలకమైన సినిమాను తన డాక్యూమెంటరీలో చూపించలేకపోతుండటంతో నయనతార కోపం కట్టలు తెచ్చుకుంది. ధనుష్‌ను ఏకిపారేస్తూ బహిరంగ లేఖ రాసింది.  ‘నా హృదయాన్ని ముక్కలు చేశారు’ నటుడు ధనుష్‌ (Nayanthara Vs Dhanush)పై రాసిన బహిరంగ లేఖలో నటి నయనతార బహిరంగ విమర్శలు చేశారు. ముఖ్యంగా 'నానుమ్‌ రౌడీ దాన్‌' పాటలు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీప్రియులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మా జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరం. ఎన్‌వోసీ (NOC) కోసం దాదాపు రెండేళ్ల నుంచి మీతో ఫైట్‌ చేస్తున్నాం. మీరు పర్మిషన్‌ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన వెంటనే మీరు పంపించిన లీగల్‌ నోటీస్‌ నన్ను షాక్‌కు గురిచేసింది. అందులో మూడు సెకన్ల క్లిప్స్‌ వాడుకున్నందుకు దాదాపు రూ.10 కోట్లు డిమాండ్‌ చేయడం విచారకరం. ఇక్కడే మీ క్యారెక్టర్‌ ఏమిటనేది తెలిసిపోతుంది. దేవుడే దీనికి సమాధానం చెబుతాడు’ అని రాసుకొచ్చింది.  https://twitter.com/NayantharaU/status/1857680582773551362 ‘ఆసూయ పడకండి’ 'నానుమ్‌ రౌడీ' సినిమాను (Nayanthara Vs Dhanush) ప్రస్తావిస్తూ మరిన్ని విషయాలను లేఖలో నయన్‌ పంచుకుంది. ‘సినిమా విజయం సాధించిన తర్వాత మీ అహం బాగా దెబ్బతిందని సినీవర్గాల నుంచి తెలుసుకున్నా. ఈ లేఖతో నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోండి. ఈ ప్రపంచం అందరిది. ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేని సాధారణ వ్యక్తులు ఇండస్ట్రీలో పైకి వచ్చినా తప్పు లేదు. ఈ విషయంలో కొన్ని కట్టుకథలు అల్లి, పంచ్‌ డైలాగులు చేర్చి తదుపరి ఆడియో విడుదలలో మీరు మాట్లాడవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఇతరుల స్టోరీల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చనే ఉద్దేశంతో మా కథను డాక్యుమెంటరీగా రూపొందించాం. మీరు కూడా దీనిని చూడండి. మీ మంచి తనాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అని నయనతార పేర్కొంది.  నవంబర్‌ 18న స్ట్రీమింగ్‌.. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ (Nayanthara: Beyond the Fairy Tale) అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించింది. నవంబరు 18న నెట్‌ఫ్లిక్‌ వేదికగా ఇది విడుదల కానుంది. ఇటీవల ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు స్టార్ హీరో నాగార్జునతో పాటు రానా, ఉపేంద్ర, రాధిక, డైరెక్టర్ అట్లీ వంటి వారు నయనతారతో తమకున్న బంధాన్ని, ఆమెపై ఉన్న అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీలో నయనతార ఫిల్మ్‌ జర్నీతో పాటు డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో ఆమె ప్రేమ, పెళ్లి గురించి చూపించనున్నారు. ఇదిలా ఉంటే నయనతార - విఘ్నేష్‌ కలిసి తొలిసారి ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ చిత్రానికి పనిచేశారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. డాక్యుమెంటరీలో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా విశేషాలు చూపించాలని వీరు భావించగా చిత్ర నిర్మాత అయిన ధనుష్‌ దానికి అంగీకరించలేదు. ఫుల్‌ స్వింగ్‌లో నయనతార ప్రస్తుతం ఫిల్మ్‌ కెరీర్‌ పరంగా నయనతార (Nayanthara Vs Dhanush) దూసుకుపోతోంది. గతేడాది షారుక్ ఖాన్‌తో 'జవాన్‌' చిత్రం చేసి తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ అమ్మడు అడుగుపెట్టింది. అదే ఏడాది 'అన్నపూర్ణి'గా లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ఈ లేడీ సూపర్‌స్టార్‌ బిజీ బిజీగా ఉంది. తమిళంలో 'టెస్ట్‌', 'మన్నన్‌గట్టి సిన్స్‌ 1960', 'తని ఓరువన్‌ 2', 'ముకుతి అమ్మన్‌ 2' సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘డియర్‌ స్టూడెంట్స్‌’ అనే చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివర, వచ్చే సంవత్సరంలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే 2022లో డైరెక్టర్‌ విఘ్నేశ్‌ను పెద్దల సమక్షంలో నయన్‌ వివాహం చేసుకుంది. వీరికి సరోగసి విధానంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 
    నవంబర్ 16 , 2024

    నయనతార తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    నయనతార తల్లిదండ్రులు ఒమనా కురియన్, కురియన్ కొడియట్టు( విశ్రాంత ఎయిర్ ఇండియా అధికారి).

    నయనతార‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    నయనతాారకు ఒక సోదరుడు ఉన్నాడు అతని పేరు లేను కురియన్

    నయనతార పెళ్లి ఎప్పుడు అయింది?

    నయనతార తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను 2022 జూన్ 9న మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్‌లో పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి షారుక్ ఖాన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు.

    నయనతార కు పిల్లలు ఎంత మంది?

    నయన్, విఘ్నేష్ దంపతులు సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లల(ఉయిర్, ఉలగం)కు జన్మనిచ్చారు.

    నయనతార Family Pictures

    Images

    Nayanthara

    Images

    Nayanthara Family Pics

    నయనతార ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    చంద్రముఖి, వల్లవన్ వంటి సినిమాల ద్వారా గుర్తింపు సాధించింది.

    నయనతార లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో నేరుగా ఆమె నటించిన తొలి చిత్రం లక్ష్మి, అయితే అంతకు ముందు తమిళం నుంచి తెలుగుకు డబ్ అయిన చంద్రముఖి, గజనిసినిమాల ద్వారా సుపరిచమైంది.

    తెలుగులో నయనతార ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    నయనతార కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    బిల్లాచిత్రంలో సాషా, శ్రీరామ రాజ్యం చిత్రంలో సీత క్యారెక్టర్ ఆమెకు మంచి గుర్తింపు అందించాయి.

    నయనతార బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Nayanthara best dialogues

    నయనతార రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

    నయనతార కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నార్త్ ఇండియన్ ఫుడ్

    నయనతార కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నయనతార కు ఇష్టమైన నటి ఎవరు?

    నయనతార ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లిష్

    నయనతార ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్

    నయనతార వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    ఆడీ క్యూ7, BMWX5, BMW 7 సిరీస్

    నయనతార ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    నయనతారకు దేశవ్యాప్తంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పలు నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.200 కోట్లు.

    నయనతార ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    8.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

    నయనతార సోషల్‌ మీడియా లింక్స్‌

    నయనతార కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నంది అవార్డు - 2011

      శ్రీరామరాజ్యం చిత్రానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది.

    • సైమా పురస్కారం - 2011

      శ్రీరామరాజ్యం చిత్రానికిగాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది.

    నయనతార కు సంబంధించిన వివాదాలు?

    నయనతాార, శింబు విడిపోయిన తర్వాత వీరిద్దరు ముద్దు పెట్టుకున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అలాగే అన్నపూర్ణి చిత్రంలో హిందూ దేవతలను అవమానించారని నయన్‌పై కొంతమంది కేసు పెట్టారు.

    నయనతార కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    స్కిన్‌కేర్ బ్రాండ్ 9స్కిన్, శానిటరీ నాప్‌కిన్‌ల బ్రాండ్ Femi9, సూపర్ ఫుడ్స్ బ్రాండ్ ది డివైన్ ఫుడ్స్‌ వంటి వ్యాపారాల్లో నయనతార పెట్టుబడి పెట్టింది
    నయనతార వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నయనతార కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree