తమిళ హీరోయిన్ నయనతార (Nayanthara) లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆమె జీవితంపై రూపొందిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale) డాక్యుమెంటరీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush)పై ఇటీవల నయన్ తీవ్ర విమర్శలు చేసింది. అది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా అదే డాక్యుమెంటరీకి సంబంధించి టాలీవుడ్ స్టార్ హీరోలు, తండ్రి కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.
‘వారంటే నాకెంతో గౌరవం’
లేడీ సూపర్ స్టార్‌కు సంబంధించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale) నవంబర్ 18న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు, తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో సపోర్ట్‌గా నిలిచిన వారికి తాజాగా నాయనతార ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి (Chiranjeevi), రామ్‌చరణ్ (Ram Charan) ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు. అటు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) పేరును సైతం ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. వీరితో పాటు షారుక్ భార్య గౌరీ ఖాన్, తెలుగు, మలయాళ, తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. తన డాక్యుమెంటరీ కోసం వారిని సంప్రదించినప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని నయన్ అన్నారు. నిర్మాతలు వారి వద్దకు వెళ్లినప్పుడు చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. వారందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. వీరంతా అత్యంత విలువైన క్షణాలను అందించారని కొనియాడారు. వీరిందరిపై తనకెంతో గౌరవం ఉందని నయన్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఇన్‌స్టా పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
ధనుష్‌తో గొడవ ఎందుకుంటే?
2015లో నయనతార (Nayanthara) చేసిన ‘నానుమ్ రౌడీ’ (తెలుగులో నేను రౌడీనే) చిత్రానికి ఆమె భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ధనుష్ (Dhanush) నిర్మాత. ‘నానుమ్ రౌడీ’తో నయన్‌కు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నటిగా మంచి పేరు రావడంతో పాటు ఎంతో విలువైన ప్రేమ సైతం ఆ సినిమా ద్వారానే దక్కింది. ఈ నేపథ్యంలో తన ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale)ను హైలెట్ చేయాలని నయనతార భావించింది. ఆ సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను వినియోగించుకునేందుకు ధనుష్ అనుమతి కోరింది. అయితే రెండేళ్ల నుంచి ధనుష్‌ను అడుగుతున్నా ఆయన స్పందించకపోవడం, పైగా డాక్యుమెంటరీ ప్రోమోలో 3 సెకన్ల ‘నానుమ్ రౌడీ దాన్’ కంటెంట్‌ను వాడటంపై ధనుష్ లీగల్ నోటీసులు పంపడం నయనతారను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో ధనుష్‌ను విమర్శిస్తూ బహిరంగ లేఖ రాసింది. ధనుష్ చర్యలతో తన హృదయం ముక్కలైందని పేర్కొంది. మీ మంచి తనాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని మండిపడింది.
నయనతారకు మద్దతుగా మహేష్!
ధనుష్ – నయనతార మధ్య వివాదానికి కారణమైన డాక్యుమెంటరీ (Nayanthara: Beyond the Fairy Tale)పై సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల స్పందించాడు. డాక్యుమెంటరీ చూసిన మహేష్ అందులో నయన్ – విఘేష్ లవ్ ఎపిసోడ్ చూసి చాలా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా నయన్, విఘ్నేష్, ఇద్దరు పిల్లలతో ఉన్న డాక్యుమెంటరీ పోస్టర్‌ను మహేష్ ఇన్‌స్టా స్టేటస్‌గా పెట్టాడు. మూడు లవ్ సింబల్స్‌ను దానికి జత చేశాడు. ఇది ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది. ధనుష్ – నయనతార (Nayanthara Vs Dhanush) మధ్య వివాదం కొనసాగుతున్న వేళ మహేష్ రియాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నయనతార- మహేష్ బాబు కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. వీరి జోడిని తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడ్డారు. మరి భవిష్యత్‌లోనైనా వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
దూకుడు ప్రదర్శిస్తున్న లేడీ సూపర్ స్టార్!
ప్రస్తుతం ఫిల్మ్ కెరీర్ పరంగా నయనతార దూసుకుపోతోంది. గతేడాది షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ చిత్రం చేసి తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ అమ్మడు అడుగుపెట్టింది. అదే ఏడాది ‘అన్నపూర్ణి’గా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ఈ లేడీ సూపర్‌స్టార్ బిజీ బిజీగా ఉంది. తమిళంలో ‘టెస్ట్’, ‘మన్నన్‌గట్టి సిన్స్ 1960’, ‘తని ఓరువన్ 2’, ‘ముకుతి అమ్మన్ 2’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘డియర్ స్టూడెంట్స్’ అనే చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివర, వచ్చే సంవత్సరంలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే 2022లో డైరెక్టర్ విఘ్నేశ్‌ను పెద్దల సమక్షంలో నయన్ వివాహం చేసుకుంది. వీరికి సరోగసి విధానంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్ సర్కార్ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?