ఆ హీరోలపై తమిళ ఇండస్ట్రీ నిషేధం?
హీరోలు శింబు, విశాల్, ధనుష్, అధర్వలకు కోలీవుడ్ నిర్మాతల మండలి షాకిచ్చింది. తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వారిపై తమిళ పరిశ్రమ నుంచి నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ హీరోలకు రెడ్ కార్డులు కూడా చేరి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒప్పుకున్న చిత్రాలు చేయకుండా మరో సినిమాలు చేయడం, చిత్రీకరణకు రాకపోవడం లాంటి పలు కారణాలతో వారిపై నిర్మాతల మండలి చర్యలకు తీసుకునేందుకు సిద్దమైందని తెలుస్తోంది.