• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లుక్ టెస్టు ఫొటోలు

    ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ లుక్ టెస్టు నిర్వహించారు. మార్చి 28 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. Courtesy Twitter:@PawanKalyanFan Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

    ‘SSMB 28’ కొత్త షూటింగ్‌ షెడ్యూల్ ప్రారంభం!

    సూపర్‌ స్టార్‌ మహేశ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కుతున్న ‘SSMB 28’ మూవీ కొత్త షూటింగ్‌ షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఇవాళ్టి నుంచి కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. హీరోయిన్లు పూజా హెగ్డే, శ్రీలీల ఇద్దరూ షూట్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలపై ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లోనే షూట్‌ చేయనున్నారు.కాగా ఆగస్టు 11న ‘SSMB 28’ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఆ తేదీకి కాకుండా అక్టోబర్ 18న విడుదల చేయాలని … Read more

    దసరా చిత్రం నుంచి మేకింగ్ వీడియో

    నేచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా చిత్రబృందం ప్రమోషన్ల జోరు పెంచింది. సినిమాలోని ఓరి వారి పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. మార్చి 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాని లుక్‌ ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్‌ పేలుతున్నాయి. మాస్‌ సినిమా కావటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాని సరసన కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.

    చార్మినార్ వద్ద RC15 షూటింగ్

    రామ్‌చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుపై మరో అప్డేట్ వచ్చేసింది. RC15 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మరో షెడ్యూల్ హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ప్రారంభమైంది. కొన్ని చారిత్రక ఘట్టాల కోసం చార్మినార్ వద్ద చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ చేయనున్నట్లు టాక్. ఈ మేరకు చార్మినార్ వద్ద డైరెక్టర్ శంకర్ నిలబడి ఉన్న ఫొటో సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని రామ్‌చరణ్ పుట్టినరోజు(మార్చి 27)న విడుదల చేసే … Read more

    ‘NBK108’ షూటింగుకి శ్రీకారం

    సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో పట్టాలెక్కించనున్న సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర షూటింగ్ నేడు లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరాను ఆన్ చేశారు. ఈ ప్రారంభోత్సవానికి హీరో బాలకృష్ణతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. NBK108 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు … Read more

    నయన్ మేకింగ్ వీడియో చూశారా

    మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా అక్టోబరు 5న దసరా కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నయనతార నటించింది. ఇందులో సత్య ప్రియా జయదేవ్‌ పాత్రను ఈ బ్యూటీ పోషించింది. అయితే, ఈ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నయన్, చిరు మధ్య సన్నివేశాలున్నాయి. సీఎం కుమార్తెగా, చిరుకి సోదరిగా ఈ సినిమాలో నయన్ వ్యవహరించనుంది.

    ‘కృష్ణ వ్రింద విహారి’ మేకింగ్ వీడియో

    నాగశౌర్య, షేర్లీ జంటగా నటించిన కృష్ణ వ్రింద విహారి మూవీ మేకింగ్ వీడియో విడుదలైంది. వీడియోలో హీరో నాగశౌర్య బ్లాక్ కలర్ డ్రెస్సులో వచ్చి గేటప్ మార్చుకున్న తర్వాత లుక్, హీరోయిన్ ఎంట్రీ అదిరిపోయింది. మరోవైపు సినిమాలో భాగంగా షూట్ చేసిన పలు సీన్లు తెరకెక్కించిన విధానం ఫన్నీగా అనిపించింది. లోకేషన్లు కూడా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. సెప్టెంబర్ 23న విడుదలైన ఈ మూవీకి అనీశ్‌ ఆర్‌.దర్శకత్వం వహించారు. మహతి స్వర సాగర్‌ మ్యూజిక్ అందించారు.

    నాగ‌శౌర్య రొమాంటిక్ సాంగ్ మేకింగ్ చూశారా?

    నాగ‌శౌర్య హీరోగా న‌టించిన ‘కృష్ణ వ్రింద విహారి’ నుంచి వర్షంలో వెన్నెల సాంగ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సాంగ్ మేకింగ్ వీడియోను తాజాగా విడుద‌ల చేశారు. రొమాంటిక్ సీన్స్ చేసేట‌ప్పుడు హీరో, హీరోయిన్ ఎంత ఇబ్బంది ప‌డ్డారో ఇందులో చూడ‌వ‌చ్చు. అదేవిధంగా షూటింగ్ కోసం వెళ్లిన అంద‌మైన‌ లొకేష‌న్ల‌ను మొత్తం చూపించారు. శెర్లీ సేతియా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. అనీశ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెప్టెంబ‌ర్ 23న మూవీ విడుద‌ల కానుంది.

    ‘సీతారామం’ మేకింగ్ వీడియో

    హను రాఘవ పూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. ఈనెల 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ మేకింగ్ వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. కాశ్మీర్‌లో గడ్డకట్టే చలిలో మూవీ యూనిట్ షూటింగ్ నిర్వహించింది. రష్మిక మందాన, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

    ‘సీతా రామం’ మేకింగ్ వీడియో

    దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన ‘సీతా రామం’ మూవీ రేపు థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం నేడు మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 2, 2021 లో క‌శ్మీర్‌లో -17°Cలో మంచులో షూటింగ్ చేశారు. సినిమా కోసం ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డారో ఈ ఒక్క నిమిషం వీడియ‌లో చూడ‌వ‌చ్చు. మృణాల్ ఠాకూర్ దుల్క‌ర్‌కు జంట‌గా న‌టించింది. ర‌ష్మిక కీల‌క పాత్ర‌లో న‌టించింది. యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌గా వ‌స్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని పెంచింది. మ‌రి ఈ టీమ్ చేసిన కృషికి … Read more