ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా చేసింది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో సంచనలనాలు సృష్టిస్తోంది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే రూ.1000 కోట్ల మైలు రాయిని సైతం ‘పుష్ప 2’ అందుకుంది. తద్వారా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
అత్యంత వేగంగా..
‘పుష్ప 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా విడుదలైన అన్ని చోట్ల రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కేవలం ఆరు రోజుల్లో రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేరక్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంత వేగంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రం ఇదేనని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రం ఇంత తక్కువ సమయంలో రూ.1000 కోట్లు రాబట్టలేదని పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. ప్రస్తుతం రూ.1500 కోట్ల మైలురాయిని అందుకునే దిశగా పుష్ప 2 సాగుతోంది. అయితే భారతీయ సినీ చరిత్రలో ‘పుష్ప 2’తో పాటు మరో 7 చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
దంగల్ (Dangal)
అమీర్ ఖాన్ (Amir Khan) లీడ్ రోల్‌లో కుస్తీ నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘దంగల్’. ఫొగాట్ సిస్టర్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. దేశం కోసం గోల్డ్ తేవాలనుకునే తండ్రి తన కుమార్తెలను ఎలా తీర్చిదిద్దాడనే కథతో దంగల్ రూపొందింది. 2016లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ. 70 కోట్లు పెట్టి తీయగా వరల్డ్‌వైడ్‌గా రూ. 2000 కోట్లు సాధించింది. కలెక్షన్స్ పరంగా టాప్‌లో ఉంది.
బాహుబలి 2 (Bahubali 2)
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఫస్ట్ టైం ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ‘బాహుబలి’ (Bahubali). ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరించారో మనందరికీ తెలుసు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నతో వచ్చిన ‘బాహుబలి 2’ సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1810 కోట్లు రాబట్టింది.
RRR
రామ్‌చరణ్ (Ramcharan), జూ.ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసింది. ఇందులో రామ్ – భీమ్ చేసిన విన్యాసాలకు ప్రపంచమే సలాం కొట్టింది. ఆస్కార్‌తో అందలం ఎక్కించింది. రూ. 550 కోట్లతో ఈ తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 1,390 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.
కేజీఎఫ్ 2 (KGF 2)
కన్నడ నటుడు యష్ (Yash) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్’ (KGF: Chapter 1) చిత్రం ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్ 2’ దానికి మించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.100 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.1250 కోట్లు కొల్లగొట్టింది.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
ప్రభాస్ (Prabhas) హీరోగా, నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్స్ నటించారు. దీనికి సీక్వెల్ కూడా రూపొందనుంది.
జవాన్ (Jawan)
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన ‘జవాన్’ చిత్రం గతేడాది విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.1,148 కోట్లు రాబట్టింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా చేసింది. విజయ్ సేతుపతి విలన్‌గా అలరించాడు.
పఠాన్ (Pathan)
గతేడాది షారుక్ నటించిన మరో చిత్రం కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో నిలిచింది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1,050 కోట్లు వసూలు చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేసింది. షారుక్ ఖాన్ గెస్ట్ రోల్‌లో అలరించాడు. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’