యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఇటీవల పెద్ద ఎత్తున టాలీవుడ్‌లో మార్మోగింది. తెలుగులో ఆమె ఫస్ట్ ఫిల్మ్ ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ బాగ్యశ్రీ ప్రదర్శన మాత్రం మెప్పించింది. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. తాజాగా మరో బంపరాఫర్ కొట్టేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టాలీవుడ్‌లో చిన్నగా గేర్లు మారుస్తూ టాప్ హీరోయిన్ స్థాయికి భాగ్యశ్రీ ఎదుగుతోందంటూ ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
రామ్ సరసన హీరోయిన్‌గా..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఓ సినిమాను ప్లాన్ చేస్తోంది. ‘RAPO22’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty) డైరెక్టర్ మహేష్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపికచేసినట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. ’రీసెంట్ సెన్సేషన్ భాగ్య శ్రీ తమ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం వల్ల ఈ చిత్రానికి మరింత అందం వచ్చింది’ అని సదరు సంస్థ పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను గురువారం (నవంబర్ 21) వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. గురువారం (నవంబర్ 21) పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
రామ్ ఆశలన్నీ ‘RAPO22’ పైనే!
‘RAPO22’ రామ్ 22వ చిత్రంగా రానుంది. గురువారం(నవంబర్ 21) పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మెుదలుపెట్టనున్నారు. హై ఎనర్జీ న్యూ ఏజ్ స్టోరీగా ఇది రాబోతోన్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్‌లు దీన్ని నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే మూవీ సక్సెస్‌పైనే రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొంత కాలంగా రామ్‌కు సాలిడ్ హిట్ పడలేదు. ఆయన గత చిత్రాలు ‘రెడ్’, ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్ ‘బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచాయి. దీంతో ‘RAPO22’తోనైనా హిట్ కొట్టి ఫ్యాన్స్‌ను సంతోష పెట్టాలని ఈ ఎనర్జటిక్ స్టార్ భావిస్తున్నారు. మరోవైపు ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ నేపథ్యంలో భాగ్యశ్రీకి (Bhagyashri Borse) ఈ సినిమా సక్సెస్ కీలకం కానుంది.
ఫ్లాప్ వచ్చినా ఏమాత్రం తగ్గని క్రేజ్!
‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. ఇటీవల ‘కాంత’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే రామ్ సరసన మరో క్రేజీ ఆఫర్ దక్కించుకొని ఆశ్చర్యపరిచింది.
దుల్కర్‌కి జోడీగా పాన్ ఇండియా ఫిల్మ్
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (Kaantha). ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగా కొన్ని వారాల క్రితం పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందంగా చీరకట్టుకొని మరి భాగ్యశ్రీ హాజరయ్యింది. ఆమె లుక్స్‌కు మరోమారు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మంచి ఛాన్స్ కొట్టేశారంటూ పోస్టులు పెట్టారు. వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
విజయ్ దేవరకొండతోనూ..
విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న ‘VD12’ చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయ్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో ‘VD12’ రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ఉంది.
భాగ్యశ్రీ ప్రేమలో పడిందా?
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఓ వ్యక్తితో ప్రేమలో పడినట్లు ఇతర వార్తలు వచ్చాయి. ‘ప్రేమ.. ఎలాంటి హెచ్చరిక లేకుండా పుడుతుంది’ అంటూ గతంలో ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తనకు బాగా దగ్గరైన వ్యక్తి ఇచ్చిన పూల బొకేను షేర్ చేస్తూ దానికి లవ్ సింబల్‌ను కూాడా ఈ అమ్మడు జత చేసింది. మంచుతో నిండిన కొండలోయలను ఇష్టమైన వాడితో వీక్షిస్తూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. తాము ప్రేమ పక్షులం అని అర్థం వచ్చేలా రెండు బర్డ్స్ ఉన్న ఫొటోను షేర్ చేసి ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చింది. ఓ వ్యక్తితో కలిసి సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చివరిగా ‘ఈ వీక్‌లో కొంత భాగం’ అంటూ లవ్ ఎమోజీ, ఓ పక్షి ఫొటోను పెట్టింది. దీంతో భాగ్యశ్రీ ప్రేమలో పడిపోయిందంటూ నెటిజన్లు జోరుగా పోస్టులు పెట్టారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!