‘RRR’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈ క్రేజీ కాంబో చిత్రం ఎప్పుడు మెుదలవుతుందా? అని యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన అప్‌డేట్స్ సైతం ఫ్యాన్స్‌ను తెగ ఖుషి చేశాయి. గత కొన్ని రోజులుగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ఆగిపోయాయి. దీంతో ‘SSMB 29’ పెద్దగా ఎక్కడా చర్చ జరగలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్స్ సంబంధించి బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ముహోర్తం ఫిక్స్!
మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం చిత్రబృందం దృష్టంతా #SSMB29కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉంది. ఏడాది కాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి నిమగ్నమై ఉన్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఏప్రిల్, 2025 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలవుతుందని నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఆలోపు మూవీ లోకేషన్స్, నటీనటులు, టెక్నికల్ టీమ్‌ను రాజమౌళి ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్, విలన్ షురూ!
మహేష్ – రాజమౌళి సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. హిందీ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి టీమ్ ఆమెతో చర్చలు జరిపిందని, నటించేందుకు ప్రియాంక కూడా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ప్రియాంక ప్రిపరేషన్ కూడా షురూ చేసిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు విలన్‌గా మలయళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఫిక్స్ అయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ హీరోగా చేసిన ‘సలార్’తో పృథ్వీరాజ్ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. అందులో అద్భుత నటన కనబరిచి ఆకట్టుకున్నాడు.
జర్మనీలో ఫస్ట్ షెడ్యూల్!
‘SSMB 29‘ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై డా. కె.ఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఆయనతో పాటు మరికొందరు బడా నిర్మాతలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ అంచనాలతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మెుదటి షెడ్యూల్ జర్మనీలో మెుదలుకానుందని సమాచారం. 18వ శతాబ్దం నాటి కథతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన నవలల ఆధారంగా మహేష్ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం ఉంది.
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌పై అప్‌డేట్
‘మహా భారతం’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి ఇప్పటికే పలు వేదికలపై చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విడుదలైన ‘ఆర్‌ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీలో జక్కన్న స్పందించారు. తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం చేసేందుకు RRR అనేది ఒక్క అడుగు దూరంలోకి తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘మహాభారతం’ తీసేందుకు RRR ప్రాజెక్ట్ తనలో స్థైర్యాన్ని నింపిందని రాజమౌళి చెప్పకనే చెప్పారు. దీంతో ‘SSMB 29‘ ప్రాజెక్ట్ తర్వాత ‘మహాభారతం’ మెుదలుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే మహేష్ – రాజమౌళి చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్