పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన పెండింగ్ ప్రాజెక్ట్స్ హరి హర వీరమల్లు, ఓజీ (OG Movie) చిత్రాలను ఫినిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. హరి హర వీరమల్లు షూటింగ్ ఈ వీకెండ్‌తో పూర్తవుతుందన్న వార్తలు సైతం వచ్చాయి. మరోవైపు యంగ్ డైరెక్టర్ సుజీత్ సైతం ‘ఓజీ’ శరవేగంగా ఫినిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ లేని సన్నివేశాలను చకా చకా షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఓజీ’ సంబంధించి దిమ్మతిరిగే బజ్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే థియేటర్లు బద్దలవ్వడం ఖాయమని చెప్పవచ్చు.
‘ఓజీ’లో ప్రభాస్..?
పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ (OG Movie) చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ అందుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ప్రభాస్‌కు సంబంధించి కళ్లు చెదిరే క్యామియో ఉంటుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని కూడా ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఇదే నిజమైతే ‘ఓజీ’పై ఉన్న అంచనాలు తారా స్థాయికి వెళ్లడం ఖాయం. ప్రభాస్, పవన్‌ను ఒకే స్క్రీన్‌పై చూడటం కన్నుల పండగా ఉంటుందని చెప్పవచ్చు.
‘సాహో’తో కనెక్షన్ ఉందా?
‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ చేసిన సాహో (Saaho) చిత్రానికి కూడా యంగ్ డైరెక్టర్ సుజీత్ (Director Sujeeth) దర్శకత్వం వహించారు. అందులో ప్రభాస్‌ను చూపించిన విధానం, మేకింగ్స్ స్కిల్స్ ఆడియన్స్‌ను చాలా ఇంప్రెస్ చేశాయి. అయితే ప్రభాస్ ‘ఓజీ’తో ‘సాహో’కి కనెక్షన్ ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘సాహో’లోని ప్రభాస్ పాత్ర ‘ఓజీ’లో కనిపించొచ్చని చర్చించుకుంటున్నారు. కాగా, ఆ సినిమాలో ప్రభాస్ సైతం గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. ఫస్టాఫ్ మెుత్తం పోలీసు ఆఫీసర్‌గా కనిపించి తోటి అధికారులను బురిడి కొట్టిస్తాడు. సెకండాఫ్‌లో అతడి ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ రోల్‌ను దర్శకుడు సూజీత్ చూపించాడు. ఓజీలోనూ పవన్ గ్యాంగ్‌స్టర్ గానే చేస్తుండటంతో ఆ పరంగా ‘సాహో’తో ఏమైనా లింక్ ఉండే అవకాశముందని నెటిజన్లు భావిస్తున్నారు.
బ్యాంకాక్‌లో కలుస్తారా?
‘ఓజీ’ (OG) షూటింగ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ బయట కొచ్చింది. బ్యాంకాంక్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్‌తో పవన్ (Pawan Kalyan) షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్ వచ్చేవారంలో బ్యాంకాంక్ వెళ్లి ఓజీ షూట్‌లో జాయిన్ అవుతారని సమాచారం. ప్రస్తుత అప్‌డేట్స్ ప్రకారం హీరో ప్రభాస్ సైతం బ్యాంకాక్ షూట్‌లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. అదే జరిగితే ప్రభాస్, పవన్‌లను భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో చూసే అవకాశం దక్కుతుంది. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
అకీరానందన్ సైతం!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కుమారుడు అకీరానందన్ (Akira Nandan) ఫిల్మ్ ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీతోనే అకీరా తెరంగేట్రం చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సర్‌ప్రైజింగ్‌గా అకీరా నందన్‌పై షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అకీరానందన్ ఎంట్రీ వందశాతం ‘ఓజీ’తోనే ఉండనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వచ్చింది. అయితే అకీరా తెరంగేట్రాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచనున్నారట. అతడి ఎంట్రీ నేరుగా తెరపై చూడాల్సిందేనని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ‘ఓజీ’లో అకీరా ఏ పాత్రలో కనిపిస్తాడనేది మాత్రం ఎక్కడా రివీల్ కాలేదు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ