అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్ చేస్తోంది. గురువారం (డిసెంబర్ 5) విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ బన్నీ యాక్టింగ్ చూసి ఊగిపోతున్నారు. తాము ఊహించిన దాని కంటే అల్లు అర్జున్ నటన బాగుందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘పుష్ప 2’పై జాతీయ స్థాయిలో బజ్ ఉండటంతో పాటు, సూపర్ హిట్ టాక్ లభించడంతో తొలి రోజు (Pushpa 2 Movie Box Office Collection) అన్ని చోట్లా భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇండియన్ హిస్టరీలో ఏ సినిమా సాధించని విధంగా తొలి రోజు రూ.294 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే సెకండ్ డే వచ్చేసరికి పుష్ప 2 కలెక్షన్స్‌లో భారీ కోత పడినట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రెండో రోజు కలెక్షన్స్..
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం గురువారం (డిసెంబర్ 5) వరల్డ్ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. దీనికితోడు బ్లాక్ బాస్టర్ టాక్ లభించడంతో ఈ మూవీకి రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.417.5 కోట్ల గ్రాస్ (Pushpa 2 Day 2 Collection Worldwide) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రెండో రోజు వరల్డ్ వైడ్‌గా రూ.134.6 కోట్లు రాబట్టినట్లు తెలిపాయి. అయితే తొలి రోజు కలెక్షన్స్ (రూ.282 కోట్లు)తో పోలిస్తే రెండో రోజు వసూళ్లు భారీగా పడిపోయినట్లు స్పష్టమవుతోంది. 54 శాతం మేర ‘పుష్ప 2’ వసూళ్లలో కోత పడిందని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.
కోతకు కారణమిదే!
అయితే తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్స్ (Pushpa 2 Day 2 Collection Worldwide) తగ్గడానికి ఓ కారణం ఉంది. డిసెంబర్ 5 ‘పుష్ప 2’ రిలీజ్ కాగా ముందు రోజు చాలా ఏరియాల్లో ప్రీమియర్స్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4 రా. 9:30, ఒంటి గంట తర్వాత స్పెషల్ షోస్ వేశారు. ఈ ప్రీమియర్స్‌కు ఒక్కో టికెట్‌ను రూ.1200కు పైగా విక్రయించారు. ఈ క్రమంలో డే 1 కలెక్షన్స్‌లో ఈ ప్రీమియర్స్ వసూళ్లను సైతం కలపడం వల్ల వసూళ్లు పెద్ద మెుత్తంలో కనిపించాయి. ఇక సెకండ్ డేకు వచ్చే సరికి టికెట్ల రేట్లు ప్రీమియర్స్‌తో పోలిస్తే తగ్గటం కూడా కలెక్షన్స్‌లో కోతకు కారణమైంది.
డే 1 కలెక్షన్స్ ఏరియాల వారీగా..
పుష్ప 2 చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.294 కోట్ల గ్రాస్ వసూలైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయస్ట్ ఓపెనింగ్స్ అని ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా, ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే రూ.190 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.92.36 కోట్లు, తమిళనాడు రూ. 10.71, కర్ణాటక రూ.17.89 కోట్లు, కేరళ రూ. 6.56 కోట్లు వసూలైనట్లు చెప్పాయి. హిందీ బెల్ట్‌లో ఏకంగా రూ. 87.24 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లో తొలి రోజు రూ.68.15 కోట్లు ఖాతాలో వేసుకున్నట్లు వివరించాయి.
రాజమౌళి రికార్డులకు పాతర
తొలి రోజు కలెక్షన్స్‌తో ‘పుష్ప 2’ (Pushpa 2 Day 2 Collection Worldwide) చరిత్ర తిరగరాసింది. ఇప్పటిదాకా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 223 కోట్ల ఓపెనింగ్ సాధించి టాప్‌లో ఉంది. ‘బాహుబలి 2’ రూ.217 కోట్లు కొల్లగొట్టి రెండోస్థానంలో కొనసాగుతోంది. ‘పుష్ప 2’ ఆ రెండు చిత్రాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. రూ.294 కోట్ల గ్రాస్‌తో భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. రాజమౌళి రికార్డులను పాతరేసి కొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. అటు నార్త్‌లోనూ ‘పుష్ప 2’ చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హిందీలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా రూ. రూ.72 కోట్లకు పైగా నెట్ వసూళ్లను ‘పుష్ప 2’ రాబట్టినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా బాలీవుడ్ హీరోలకు సైతం బన్నీ కొత్త టార్గెట్ ఇచ్చాడు.
కథేంటి
ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్ బయలుదేరగా సీఎంతో ‘ఓ ఫొటో తీసుకొని రా’ అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!